బ్యాంక్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ అలెర్ట్‌ | Sbi Warn Customers About Banking Frauds | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ అలెర్ట్‌

Published Tue, May 21 2024 1:48 PM | Last Updated on Tue, May 21 2024 2:51 PM

Sbi Warn Customers About Banking Frauds

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్‌. రీడమ్‌ పాయింట్ల పేరుతో ఖాతాదారుల్ని మోసం చేసేందుకు సైబర్‌ నేరస్తులు ప్రయత్నిస్తున్నారని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సదరు బ్యాంకులు ఖాతాదారుల్ని హెచ్చరిస్తున్నాయి. 

డిజిటల్‌ బ్యాంకింగ్‌ వినియోగం పెరిగే కొద్ది సైబర్‌ నేరుస్తులు తమ పంథాను మారుస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా బ్యాంక్‌ ఖాతాదారుల బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు.  

ఈ తరుణంలో ఎస్‌బీఐతో పాటు పలు ప్రైవేట్‌ బ్యాంక్‌లు కస్టమర్లను అలెర్ట్‌ చేస్తున్నాయి. పెరిగిపోతున్న స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎస్‌బీఐ ఖాతాదారుల్ని సైబర్‌ నేరస్తులు మోసం చేసేందుకు రివార్డ్‌ పాయింట్లను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ట్వీట్‌ చేసింది. 

 

ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసే నెపంతో వినియోగదారులకు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్ ఫైల్‌ను( APK ) పంపిస్తున్నారు. అలాంటి వాటి పట్ల ఖాతాదారులు అప్రత్తంగా ఉండాలని కోరింది.

రీడీమ్ చేసుకోవాలంటూ మోసగాళ్లు ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌ ద్వారా ఏపీఏకే ఫైల్స్‌, మెసేజెస్‌ పంపిస్తారు. వాటిని క్లిక్‌ చేయొద్దని కోరింది. ఇలాంటి ఏపీకే ఫైల్స్‌ పట్ల  ఎస్‌బీఐతో పాటు ఏఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులు మోసపోతున్నారని, వాటి జోలికి పోవద్దని తెలిపాయి.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement