
ప్రముఖ బాలీవుడ్ నటుడు 'విక్కీ కౌశల్' ముంబైలోని జుహు ప్రాంతంలోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అపార్ట్‌మెంట్ లీజును పునరుద్ధరించారు. నెలవారీ అద్దె ఇంతకు ముందు చెల్లిస్తున్నదాని కంటే ఎక్కువైంది.
ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్‌సైట్ ద్వారా స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. విక్కీ కౌశల్ నెలవారీ అద్దె రూ. 17.01 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మూడు సంవత్సరాల లీజు లావాదేవీ అధికారికంగా ఏప్రిల్ 2025లో నమోదు నమోదు చేశారు.
జనవరి 2025 నుంచి ప్రారంభమయ్యే ప్రస్తుత మూడు సంవత్సరాల లీజు ఒప్పందంలో.. మొదటి, రెండవ సంవత్సరాలకు నెలవారీ అద్దె రూ.17.01 లక్షలు ఉంటుంది. మూడో సంవత్సరంలో ఇది రూ.17.86 లక్షలకు పెరుగుతుంది. లీజు వ్యవధిలో,విక్కీ కౌశల్ చెల్లించే మొత్తం అద్దె సుమారు రూ.6.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. దీనిపై విక్కీ కౌశల్ అధికారికంగా స్పందించలేదు.
ఇదీ చదవండి: సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం
2021 జులైలో నెలవారీ అద్దె రూ.8 లక్షల నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు అద్దె రెట్టింపు అయింది. లీజుకు సంబంధించిన నివేదికల ప్రకారం, విక్కీ కౌశల్ అపార్ట్‌మెంట్ రాజ్ మహల్‌లో ఉంది. ఇది ఒక రెడీ-టు-మూవ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. స్క్వేర్ యార్డ్స్ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. అపార్ట్‌మెంట్ 258.48 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. దీనితో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు లభిస్తాయి. ఈ లావాదేవీలకు నటుడు రూ. 1.69 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రూ. 1,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రూ. 1.75 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ వంటివి చెల్లించినట్లు సమాచారం.