
బనశంకరి: బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన గనులు, భూవిజ్ఞాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ ప్రతిమ (40) హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. చామరాజనగర జిల్లా మహదేశ్వరబెట్టలో దాగిన అతన్ని బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీసులు గాలించి నిర్బంధించారు. ఉద్యోగం నుంచి తీసేశారనే ద్వేషంతో ఆమె మాజీ కారుడ్రైవరు కిరణ్ ఈ హత్యకు పాల్పడినట్లు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద సోమవారం తెలిపారు.
కిరణ్ (32) స్వస్థలం బెంగళూరు కోణనకుంటె. కొన్ని సంవత్సరాలుగా ప్రతిమ ఆఫీస్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల కిందట ఒక యాక్సిడెంట్ చేయడంతో పాటు అక్రమ గనులపై దాడుల సమాచారం ముందుగానే గనుల యజమానులకు లీక్ చేసేవాడు. దీంతో ప్రతిమ అతడిని 10 రోజుల కిందటే ఉద్యోగం నుంచి తీసేయించారు.