
కరోనా మహమ్మారి తర్వాత నుంచి ఆన్‌లైన్ షాపింగ్ అలవాటు పడిపోయారు జనాలు. అంతకు ముందు కూడా చేశారు గానీ. ఆ మహమ్మారి తర్వాత నుంచి ఆన్‌లైన్ షాపింగ్ మహా ఎక్కువయ్యింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇలానే ఓ మహిళ కొడుకు బ్లింకిట్ నుంచి పెద్ద మొత్తంలో కూరగాయాలు కొనుగోలు చేశాడు. డెలివరీ అయ్యాక బిల్ చూసి తల్లి షాకయ్యింది. ఏంటిది ఇంత మొత్తంలో కూరగాయాలు కొన్న కొత్తిమీరకు కూడా బిల్లు వేస్తారా అని విస్తుపోయింది.
ఈ విషయమై తన కొడుకుతో చెప్పింది. తన తల్లి ఆలోచననను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ..'నేను బ్లింకిట్ (Blinkit)లో కూరగాయలు కొనుగోలు చేశా. అందులో కొత్తిమీరకు కూడా డబ్బులు చెల్లించడం చూసి మా అమ్మకు బాధ కలిగింది. ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు కొత్తిమీర ఉచితంగా ఇస్తే బాగుంటుంది కదా! అని ఆమె భావిస్తోంది.' అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీన్ని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధింద్సాకి ట్యాగ్ చేశారు.
వినియోగదారుడు సోషల్ మీడియా పోస్ట్‌కి రెస్పాండ్ అయిన అల్మిందర్ ధింద్సా దీని గురించి పరిశీలిస్తామని చెప్పారు. ఆ తర్వాత జస్ట్ నాలుగు గంటల్లోనే ఫాలో అప్ పోస్ట్‌లో ధింద్సా ఫ్రీగా కొత్తిమీర ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అందరూ అంకిత్ సావంత్ తల్లిగారికి కృతజ్ఞతలు చెప్పండి. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను మరింత అప్‌డేట్ చేస్తాం అని ధింద్సా పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇలా ఓసామన్య వినియోగదారుడి పోస్ట్‌పై సీఈవో సత్వరమే స్పందించడంపై ప్రశంసల జల్లు కురిపించారు నెటిజన్లు. అంతేగాదు మరిన్నింటిని ఉచితంగా ఇవ్వొచ్చు అంటూ సలహలు ఇస్తూ పోస్టులు పెట్టారు.
It’s live! Everyone please thank Ankit’s mom 💛
We will polish the feature in next couple of weeks. https://t.co/jYm2hGm67a pic.twitter.com/5uiyCmSER6— Albinder Dhindsa (@albinder) May 15, 2024
(చదవండి: ఘోస్ట్ మ్యారేజ్‌లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్‌లో)