
ఖగారియా: బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్(Ram Vilas Paswan) కుటుంబ కలహాలు మరోమారు రోడ్డునపడ్డాయి. గతంలో అతని కుమారుడు చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పరాస్‌ల మధ్య జరిగిన రాజకీయ యుద్ధం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు కుటుంబ ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది.
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్(Union Minister Chirag Paswan) పెద్ద తల్లి అంటే దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ మొదటి భార్య రాజకుమారి దేవి తన గదికి తాళం వేశారని ఆరోపించారు. రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్,రామచంద్ర పాశ్వాన్ భార్య తనను ఇంటి నుండి వెళ్ళగొట్టారని ఆమె ఆరోపించారు. ఖగారియాలోని అలౌలి బ్లాక్‌లోని షహర్‌బన్నీలో ఉన్న తమ ఇంటికి తాళం వేశారన్న విషయం కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌కు కూడా తెలిసింది. కాగా ఈ ఉదంతంపై ఏ పోలీస్ స్టేషన్‌లోనూ ఇంతవరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.
దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి వివాహం రాజకుమారి దేవితో జరగగా, రెండవ వివాహం రీనా శర్మతో జరిగింది. పశుపతి కుమార్ పరాస్ కుటుంబ సభ్యులు షహర్బానీ నివాసంలోని కొన్ని గదులకు తాళాలు వేసి, ఇంటికి తామే హక్కుదారులమని వాదిస్తున్నారని సమాచారం. ఈ ఘటనతో కలత చెందిన రాజకుమారి దేవి.. వీరు ఇప్పటికే తమ అన్ని ఆస్తులను ఆక్రమించుకున్నారని, అయినా తాము ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అయితే ఇప్పుడు తమకు ఆస్తిలో వాటా కావాలని కోరుతున్నామన్నారు. ఇంతముందు వారు రామ్‌విలాస్‌ను అన్నయ్యా అని పిలిచేవారని, ఇప్పుడు తల్లిని ఇంటి నుండి గెంటేశారని ఆమె ఆరోపించారు.
ఈ ఘటనను బీహార్ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ సంజయ్ పాశ్వాన్(Bihar Principal General Secretary Sanjay Paswan) ఖండించారు. మాజీ కేంద్ర మంత్రి పరాస్ తన సోదరుడు రామ్ విలాస్ పాశ్వాన్‌ను దేవునిగా భావించేవారని, ఇప్పుడు ఆయనే స్వయంగా వదినను ఇంటి నుండి వెళ్ళగొట్టారని ఆరోపించారు. ఇది దురదృష్టకరమని, సొంత వదినకు అండగా నిలవలేనివారు బీహార్‌ను ఎలా ఏకంచేయగలరని ప్రశ్నించారు. ఈ ఉదంతంపై లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ ప్రతినిధి రాజేష్ భట్ మాట్లాడుతూ, పార్టీ వ్యవస్థాపకులు దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ భార్య రాజకుమారి దేవిని వారి స్వస్థలమైన బాని గ్రామంలోని వారి ఇంట్లో బంధించారని, దీనిని కేంద్ర మాజీ మంత్రి పశుపతి కుమార్ పరాస్ కుటుంబం ప్రభుత్వ అంగరక్షకుల సహాయంతో చేసిందని ఆరోపించారు. ఆమెను నిరాశ్రయురాలిని చేయడానికి కుట్ర పన్నారని, ఆమె విషయంలో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. గతంలో రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తరువాత, పార్టీ విభజనకు సంబంధించి అతని సోదరుడు పశుపతి పరాస్, చిరాగ్ పాశ్వాన్ మధ్య వివాదం జరిగింది. పశుపతి పార్టీలోని అందరు ఎంపీలను కూడగట్టి, తన పంచన చేర్చుకున్నారు. అయితే చిరాగ్ పాస్వాన్ అధైర్యపడక రాజకీయాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: ఏప్రిల్ 19 నుంచి కట్రా- శ్రీనగర్ ‘వందేభారత్’