కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం | Telidevara Bhanumurthy Satire on Chandrababu Naidu Crying Scene | Sakshi

కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం

Published Fri, Nov 25 2022 2:24 PM | Last Updated on Fri, Nov 25 2022 2:26 PM

Telidevara Bhanumurthy Satire on Chandrababu Naidu Crying Scene - Sakshi

నువ్వు నేను గల్సి జెనం తాన్కి ఏడ్సు కుంటబోదాం. మోదీని బత్మిలాడు. గాయినను గుడ్క మనతోని గల్సి రమ్మను.

జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్‌ దీస్కొని బొందల గడ్డ కాడ్కి బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. విక్రమార్కుడు మోటరాపి హారన్‌ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. ఎన్క సీట్ల ఆరాంగ గూసుండు. విక్రమార్కుడు మోటర్‌ నడ్ప బట్టిండు. గప్పుడు బేతాలుడు–

‘‘ఎండ గొడ్తున్నా, ఆనదంచి గొడ్తున్నా, సలి వొన్కిస్తున్నా తాతీల్‌ దీస్కోకుంట దినాం వొస్తవు. గుంతలు, ఎత్తుగడ్డలని సూడకుంట మోటర్‌ నడ్పుతవు. ఎవడన్న నీ మోటర్కు అడ్డం రావొచ్చు. ఎంటిక మందంల టక్కర్‌ గాక పోవచ్చు. నీ మోటర్‌ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు యాస్ట రావొచ్చు. నువ్వు యాస్ట మర్సెతంద్కు ఒక మజేదార్‌ ముచ్చట జెబ్త ఇను’’ అని అన్నడు.

‘‘చెప్పుడు నీ పని. ఇనుడు నా పని’’ అని విక్ర మార్కుడన్నడు. 
‘‘చెంద్రబాబుకు ముక్యమంత్రి కుర్సి ఉన్నా నిద్ర రాదు. లేకున్నా నిద్ర రాదు’’ అన్కుంట బేతా లుడింకేమో జెప్పబోతుంటె అడ్డం దల్గి,  
‘‘ఎందుకు రాదు’’ అని విక్రమార్కుడ డిగిండు.

‘‘చెంద్రబాబు ముక్యమంత్రిగ ఉండంగ కుర్సి దిగితె పౌరన్‌ ఎవలన్న గా కుర్సిల గూసోవొచ్చనేటి బయంతోని నాత్రిపూట గుడ్క నిద్ర పోలేదు. ఏం జేస్తె ముక్యమంత్రి కుర్సి వొస్తదా అని పగటీలి నాత్రి పూట ఒక్క తీర్గ ఆలోచన జేస్తుండ బట్కె గాయినకు నిద్రొస్తలేదు.’’

‘‘ముక్యమంత్రి కుర్సి కోసం గిప్పుడు గాయినేం జేస్తున్నడు?’’
‘‘గీ నడ్మ గాయిన పవన్‌ కల్యాన్‌ తాన్కి బోయిండు. గ్లిజరిన్‌ కంట్లె ఏస్కుంటె నీకు ఏడ్పొస్తది. గని గ్లిజరిన్‌ లేకున్నా నాకు ఏడ్పు వొస్తది. నా పెండ్లాంను తిట్టిండ్రనుకుంట అసెంబ్లిల నేను పల్ల పల్ల ఏడ్సిన. నువ్వు నేను గల్సి జెనం తాన్కి ఏడ్సు కుంటబోదాం. మోదీని బత్మిలాడు. గాయినను గుడ్క మనతోని గల్సి రమ్మను. ముగ్గురం గల్సి ఏడిస్తిమా అంటె మన ఏడ్పుల జగన్‌ సర్కార్‌ కొట్క బోతది. కాపుదనంకు కమ్మదనం గలిస్తె ఎదురుండదు అని చెంద్రబాబు పవన్‌తోని అన్నడు. అనుడే గాకుంట గిదే నాకు ఆక్రి మోక అన్కుంట ఒక్క తీర్గ ఏడ్సిండు.’’

‘‘మల్ల మున్పటి లెక్క టీడీపీతోని సోపతి జెసెతంద్కు బీజేపీ రడీగున్నడా?’’
‘‘అసల్‌ లేదు. సైకిల్‌ బిరక్‌ ఫేలైంది. పయ్య లల్ల గాలిబోయింది. గిప్పుడు గది శీకట్ల ఉన్నది. తెల్లా రంగనే మా తామరపువ్వు విచ్చుకుంటది. పగటీ లంత గట్లే ఉంటది. శీకట్ల ఉండేటి టీడీపీ తోని మా పార్టి సోపతి జేసే సవాల్‌ లేదు అని బీజేపీ ఎంపీ జి.వి.ఎల్‌. నరసింహారావు అన్నడు. జనసేన తోని పొత్తు గూడ్తం. గా పార్టితోని గల్సి వొచ్చేటి అసెంబ్లి ఎలచ్చన్ల పోటీ జేస్తం. టీడీపీకి మాకు జమా యించదు. చెంద్రబాబును సస్తె నమ్మం అని ప్రతాని అన్నడు.’’
‘‘చెంద్రబాబు గిన జెనం తాన్కి బోయిండా?’’

‘‘గీ నడ్మ మూడు దినాలు చెంద్రబాబు కర్నూలు జిల్లల దిర్గిండు. గిప్పుడున్నది శాసనసబ గాదు. కౌరవుల సబ. నేను ముక్యమంత్రినైతె గది పాండవుల సబ అయితది. నేను ముసలోన్ని అయిన. నాకు గిదే ఆక్రి మోక. నన్ను ముక్యమంత్రి కుర్సి మీద గూసుండబెడ్తె అమరావతిని రాజదాని జేస్త. ఇంద్రుని రాజదాని అమరావతి. గదే తీర్గ గీ చెంద్రుని రాజదాని గుడ్క అమరావతే అని చెంద్ర బాబు అన్నడు.’’

‘‘ముక్యమంత్రి కుర్సి కోసం చెంద్రబాబు ఇంకేం జేసిండు?’’
‘‘బాబు ఒక సన్నాసి తాన్కి బోయిండు. గాయిన కాల్లు మొక్కిండు. మల్ల ముక్యమంత్రిని గావాలంటె ఏం జెయ్యాలని అడిగిండు. దినాం తెల్లారి నాలుగ్గొట్టంగనే నిద్ర లెవ్వాలె. నెత్తిమీది కెల్లి తానం జెయ్యాలె. శివుని గుడికి బోవాలె. లింగంకు అబిసేకం చేసి మారెడాకులతోని పూజ జెయ్యాలె. శ్రీశైలం బోవాలె. వెయ్యిమందికి మెడల ఏస్కునే తంద్కు బంగారి లింగాలు ఇయ్యాలె. పెయ్యికి బూడ్ది బూస్కోవాలె అని జెప్పిండు. సన్నాసి జెప్పిన తీర్గనే చెంద్రబాబు జెయ్య బట్టిండు.

గట్ల జేస్తుండంగ ఒక నాత్రి గాయినకు కల బడ్డది. గా కలల శంకరుడు గండ్లబడ్డడు. దేవా! జగన్‌ సర్కార్‌ను గూలగొట్టెతంద్కు నాకు పాశుపతాస్త్రం ఇయ్యి అని శివున్ని అడిగిండు. గాయినకు శంకరుడా అస్త్రమిచ్చిండా? జవాబు ఎర్కుండి గూడ జెప్పకుంటివా నీ మోటర్‌ బిరక్‌ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు.

‘‘అన్ని అస్త్రాలను మించిన వెన్నుపోటు అస్త్రం నీ తాన ఉండంగ వేరె అస్త్రంతోని పనేంది అని శంకరుడున్నడు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్‌ దిగి బేతాలుడు బొందల గడ్డ దిక్కు బోయిండు.

తోక: గీ నడ్మ కుల నిర్మూలన సబకు మా సత్నారి బోయిండు. ‘‘సార్‌! మీ స్పీచ్‌ అదిరింది’’ అని ఒక పెద్దాయనతోని గాడు అన్నడు.
‘‘ఇంతకు మీరేంటోల్లు’’ అని గాయిన సత్నారి నడిగిండు. (క్లిక్ చేయండి: పవన్‌ కల్యాన్‌ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..)


- తెలిదేవర భానుమూర్తి 
సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement