Top Stories
ప్రధాన వార్తలు

భారత్, పాక్‌ల యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
War Live Updates..భారత్, పాక్‌ల యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటనఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయిభారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్ ఇరు దేశాలతో సుదీర్ఘంగా రాత్రంతా చర్చించాఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయిఇరు దేశాలకు కంగ్రాట్స్ pic.twitter.com/lRPhZpugBV— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025 బెంగళూరు నుంచి కళ్లి తండాకు మురళీ నాయక్ పార్థివదేహంపాకిస్తాన్ తో యుధ్ధంలో వీర మరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ పార్థివదేహం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్కడ ఆ వీర జవాన్‌కు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆ జవాన్ పార్థివదేహాన్ని శ్రీసత్యసాయి జిల్లాలోని కళ్లితండా తరలిస్తున్నారు. రేపు(ఆదివారం) సైనిక లాంఛనాలతో వీర మరణం పొందిన ఆ జవాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరో జవాన్ వీరమరణంపాక్ కాల్పుల్లో మరో జవాన్ 'సచిన్ యాదవ్‌రావు వనాంజే' (29) వీరమరణం పొందారు. ఈయన స్వగ్రామం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లాలోని తమ్లూర్.సైరన్ల శబ్దాలు వాడొద్దు.. మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచనసైరన్ల సౌండ్లతో.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందికేవలం అవగాహన కార్యక్రమాల్లోనే వినియోగించాలి ఢిల్లీ :32 విమానాశ్రయాలు మూసివేత9 మే 2025 నుండి 14 మే 2025 వరకు (15 మే 2025న 0529 IST వరకు) ఆపరేషనల్ కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేతభారత విమానాశ్రయాల అథారిటీ (AAI) సంబంధిత విమానయాన అధికారులు జారీ చేసిన ఎయిర్‌మెన్‌కు సూచనల (NOTAMs) వివరాలు 1 తాత్కాలిక విమానాశ్రయ మూసివేత: ◦ ప్రభావిత విమానాశ్రయాల జాబితా: ▪ అధంపూర్ ▪ అంబాలా ▪ అమృత్సర్ ▪ అవంతీపూర్ ▪ బఠిండా ▪ భుజ్ ▪ బికనీర్ ▪ చండీగఢ్ ▪ హల్వారా ▪ హిండన్ ▪ జైసల్మీర్ ▪ జమ్మూ ▪ జామ్‌నగర్ ▪ జోధ్‌పూర్ ▪ కాండ్లా ▪ కాంగ్రా (గగ్గల్) ▪ కేశోద్ ▪ కిషన్‌గఢ్ ▪ కుల్లూ మనాలి (భుంటర్) ▪ లేహ్ ▪ లూధియానా ▪ ముంద్రా ▪ నలియా ▪ పఠాన్‌కోట్ ▪ పటియాలా ▪ పోర్బందర్ ▪ రాజ్‌కోట్ (హిరాసర్) ▪ సర్సావా ▪ షిమ్లా ▪ శ్రీనగర్ ▪ థోయిస్ ▪ ఉత్తర్లై ◦ ఈ కాలంలో ఈ విమానాశ్రయాలలో అన్ని పౌర విమాన కార్యకలాపాలు నిలిపివేయబడతాయి. ఆపరేషన్ సిందూర్.. ఐదుగురు టాప్ ఉగ్రవాదులు హతం26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకున్న భారత్.ముంబై దాడి సూత్రధారిని మట్టుబెట్టిన భారత్.ఉగ్రస్థావరాలపై దాడిలో అబు జిందాల్ మృతిఐదుగురు టాప్ ఉగ్రవాదులను హతమార్చిన భారత్.ఆపరేషన్ సిందూర్ దాడుల్లో భాగంగా ఐదుగురు టాప్-5 టెర్రరిస్టులు హతం.ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతం.మురిద్కే, బహవల్పూర్లో జరిగిన దాడిలో ఉగ్రనేతలు మృతి,మురిద్కే దాడిలో అబు జుందాల్ హతం.అబు అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ చీప్ మునీర్.జైషీ చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది హఫీజ్ మహమ్మద్ జమీల్ హతంలష్కరే ఉగ్రనాయకుడు మహమ్మద్ యూసుఫ్ అజార్ హతం. కాందహార్ హైజాక్ కీలక సూత్రధారి మహమ్మద్ యూసఫ్ ఇవి మే 7వ తేదీ(బుధవారం అర్థరాత్రి) భారత్ మట్టుబెట్టిన ఉగ్రవాదులు వివరాలు Details of terrorists killed in the Indian strikes on 7th May in Pakistan: Sources 1) Mudassar Khadian Khas @ Mudassar @ Abu Jundal. Affiliated with Lashkar-e-Taiba. His funeral prayer was held in a government school, led by Hafiz Abdul Rauf of JuD (a designated global…— ANI (@ANI) May 10, 2025మోదీ హైలెవల్ మీటింగ్త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్ మీటింగ్ప్రధాని నివాసంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమావేశంభేటీలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీ..పాకిస్తాన్ దాడులు, భారత్ కౌంటర్‌పై చర్చ.దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీత్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీరాజ్నాథ్ భేటీలో పాల్గొన్న ఎన్ఎస్ఏ ధోవల్.సరిహద్దుల్లో ఉద్రికత్తలపై గంటకుపైగా చర్చ. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు..శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లుఉదయం 11.45 గంటల సమయంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారుల వెల్లడికొన్ని ప్రాంతాల్లో మోగిన సైరన్లు.. పేలుడు శబ్దాలతో వణికిపోయిన ప్రజలుశనివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించిన అధికారులు Srinagar airport early morning pic.twitter.com/rK9diP6Xov— Maroof (@maroof2221) May 10, 2025పాక్‌కు భారీ నష్టం..పాకిస్తాన్‌పై విరుచుకుపడుతున్న భారత వైమానిక దళం.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాక్‌పై దాడులురెండు రోజులుగా పాక్‌లోని ప్రధాన నగరాలపై వాయుసేన దాడులుభారత వైమానిక దాడుల్లో లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, పెషావర్, ఇస్లామాబాద్‌లో భారీ నష్టం.నూర్ఖాన్, ముర్షీద్, రఫికీ ఎయిర్‌బేస్‌లపై దాడి.నాలుగు పాక్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్.భారత్ దాడులతో పాక్ ప్రజలు నగరాలు వదిలేసి వెళ్లిపోతున్నారు.కరాచీలోనూ భయంతో పాక్ ప్రజలు తరలి వెళ్తున్నారు.ఇస్లామాబాద్‌లో ఇప్పటికే పెట్రోల్ బంక్‌లు బంద్.పాకిస్తాన్లో ఎయిర్‌పోర్టులన్నీ షట్‌డౌన్.సియోల్కోట్లో మరో ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసిన భారత్. అజిత్ దోవల్ భేటీ.. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న అజిత్ దోవల్. సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్న దోవల్.ఇంతకుముందే త్రివిధ దళాలతో భేటీ అయిన దోవల్. ఢిల్లీ..రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం.ౌసౌత్ బ్లాక్‌లో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.పాకిస్తాన్ దాడులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్యలుఉదయం 10:30 గంటకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం. ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించనున్న అధికారులు.పంజాబ్ భటిండాలో రెడ్ అలర్ట్‌ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ.జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న పాకిస్తాన్ కాల్పులు.రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ.#WATCH | J&K: Parts of a damaged drone found in a field in RS Pura. pic.twitter.com/Y3akkre6pQ— ANI (@ANI) May 10, 2025#WATCH | J&K: A house in the civilian area in Jammu suffered massive damage due to heavy shelling by Pakistan. pic.twitter.com/eqbHYcqB9w— ANI (@ANI) May 10, 2025అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..భారత్, పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం.భారీగా భద్రతా దళాల మోహరింపు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ.ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసిన అధికారులు.జమ్ము, రాజస్థాన్, పంజాబ్‌లో జనావాసాలపై పాక్ దాడులు.జానీపూర్ నివాస ప్రాంతంలో పాక్ మిస్సైల్ దాడులు. #WATCH | J&K: SDRF, local police, administration, and other agencies are at the spot. They cordoned off the place near Aap Shambhu Temple where a Pakistani strike occurred.As per the SDRF personnel, there has been no casualty. pic.twitter.com/FLLcHEc96X— ANI (@ANI) May 10, 2025పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు.. పాక్ మిలిటరీ పోస్ట్.. టెర్రర్ లాంఛ్‌ప్యాడ్ ధ్వంసంసరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులునియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న దాయాది.ఆ పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీపంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్ క్షిపణి శకలాలు లభ్యంజమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభ్యంపౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు. #WATCH | A projectile debris in Rajasthan's Barmer as Pakistan started targeting civilian areas. pic.twitter.com/tENtKWlLOa— ANI (@ANI) May 10, 2025 #WATCH | J&K | Splinters and debris of a projectile retrieved from Akhnoor pic.twitter.com/SR3qe3gHbv— ANI (@ANI) May 10, 2025 పాక్‌కు చుక్కలే..పాక్ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.పాక్ డ్రోన్లను, మిస్సైల్స్‌ను కూల్చివేసిన భారత్. #WATCH | Parts of a projectile found in a field in Amritsar, Punjab. pic.twitter.com/bPxXOxWT8n— ANI (@ANI) May 10, 2025#WATCH | Amritsar, Punjab | Debris of a drone were recovered from a field in Muglani Kot village pic.twitter.com/zxmklvX2tL— ANI (@ANI) May 10, 2025 #WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw— ANI (@ANI) May 10, 2025నేడు భారత సైన్యం మీడియా సమావేశం.నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.ఆపరేషన్ సిందూర్ 2.0పై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్ దాడులు తీవ్రతరం..లాహోర్, ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ దాడులు. మూడు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున పాక్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు.వీటిల్లో ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న కీలక స్థావరంరెండు పాకిస్థాన్ ఫైటర్ జెట్ల కూల్చివేతశ్రీనగర్ బేస్ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్‌పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున 5 గంటలకు వినిపించిన శబ్దాలుశ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుఆకాష్ జెట్‌తో పాక్ క్షిపణులను కూల్చివేసిన భారత్. Pakistan tried to hit the capital of India, New Delhi by it's long range missile Fateh-2But intercepted by Barak-8 missile defence system in Sirsa of Haryana#IndianArmy please ekbar attacking mode me aajao 😡🙏#IndiaPakistanWar #IndianNavyAction pic.twitter.com/x3kd7v87W2— Priyanshu Kumar (@priyanshu__63) May 9, 2025📹VIDEO : Pakistani citizen (lahore) sharing reality of Indo-pak war. exposed Pakistan's failure & pak media lies.India is right on Top. 👍👍 pic.twitter.com/Ff44gptNlc— Vaishnavi (@vaishu_z) May 9, 2025 Lahore, Pakistan is now being targeted by India. Pakistan’s 2nd largest city and one that is fully undisputed.This war is escalating very quickly. pic.twitter.com/6lzojd3DcY— Spencer Hakimian (@SpencerHakimian) May 10, 2025పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు.పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత. పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలు నిలిపివేత.పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు చేసింది. లాహోర్, రావాల్పిండి, పెషావర్లపై దాడి చేసింది. నూర్ఖాన్, మురీద్, రఫికి ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిన భారత్. డ్రోన్స్, మిస్సైల్స్‌తో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసిన భారత్.నూర్ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అటు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు.భారత్ వ్యూహ్మాతక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులను తెగబడింది.జమ్ము,శ్రీనగర్, అమృత్సర్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్.భారత్‌లోని 26 ప్రదేశాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.మిస్సైల్స్ ద్వారా పాక్ దాడులను అడ్డుకున్న భారత్.ఫతా వన్ మిస్సైల్‌ను ధ్వంసం చేసిన భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.#WATCH | Jalandhar, Punjab: Parts of a Pakistan drone recovered after a blast in Kanganiwal village in Rural Jalandhar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ZogqS588tR— ANI (@ANI) May 10, 2025 #WATCH | Loud explosions are being heard in Poonch area of Jammu and Kashmir. (Visuals deferred by unspecified time) pic.twitter.com/VkjzgY8jYc— ANI (@ANI) May 10, 2025టార్గెట్ పఠాన్‌కోట్..పఠాన్‌కోట్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్.రెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్.అన్నిచోట్ల పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత సైన్యం.భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఎయిర్‌బేస్ బంద్.. అన్ని విమానాలను రద్దు చేసిన పాక్.శ్రీనగర్ టార్గెట్‌గా పాకిస్తాన్ ాదాడులు.శ్రీనగర్‌లోని రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు. At least 4 airbases in Pakistan have been targeted by Indian strikes: Sources pic.twitter.com/3ZegA6YmzM— ANI (@ANI) May 10, 2025పాక్ డ్రోన్లు దాడులు.. సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. చీకట్లు పడుతూనే జమ్ము కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది.కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జోద్పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్‌పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పాక్ దాడులకు మించి భారత్ దాడి చేస్తుందన్నారు. ‘‘దేవుడి దయతో మనం భారత భూమిని జన్మించాం. భారత భూమి కోసం ప్రాణాలైన ఇస్తాం. ఇస్లాం పేరుతో పాక్ అసత్య ప్రచారం చేస్తోంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.పాకిస్థాన్ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అసదుద్దీన్ అన్నారు. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తుంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపడం దారుణమన్నారు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బతకాలి’ అని అసదుద్దీన్ అన్నారు.

వార్ జోన్.. ఈ నూతన వధూవరుల కథే దేశభక్తికి చిహ్నం
పాకిస్తాన్ తో యుద్ధం వేళ.. పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దుకావడంతో అంతా విధుల్లోకి తిరిగి హాజరయ్యే పరిస్థితి అనివార్యమైంది. ఈ క్రమంలోనే పెళ్లైన ఓ జవాన్ విధుల్లోకి హాజరయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ మే 5వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే పారామిలటరీ బలగాలు అంతా విధులకు హాజరు కావాలనే ఆదేశాల నేపథ్యంలో మనోజ్ పాటిల్ తిరిగి విధుల్లో చేరాడు. పెళ్లైన మూడు రోజులకే విధులకు హాజరయ్యాడు. అయితే నవ వధువు తన భర్తను దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి పంపి అందరికీ ఆదర్శంగా నిలవగా.. ఈ నూతన వధూవరుణ కథే దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఆ నవ వధువు దేశ భక్తిని అంతా కొనియాడుతున్నారు. తన సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపిన వనిత అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.सगळ काही भारत मातेसाठी...लग्नाच्या तीन दिवसांनंतर महाराष्ट्राचे सुपूत्र मनोज पाटील देश सेवेसाठी रवाना... #oprationsindoor #IndianNavyAction #IndiaPakistanTensions #jalgaonnews #India #army #manojpatil #देशसेवा pic.twitter.com/1gmbhYcoTD— Ganesh Pokale... (@P_Ganesh_07) May 9, 2025

ఇండియా పవర్ఫుల్ వెపన్స్.. శత్రువులకు సింహస్వప్నం!
పాక్ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్–400, ఆకాశ్ ఎన్జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. ఇది సోవియట్ కాలంనాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ (ఎస్ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్ ఆధారిత మిసైల్ లాంచర్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. → ఐదు హై ఇంటర్‌సెప్టివ్ యాంటెన్నాలతో కూడిన 4ఆర్90 యత్నాగన్ రాడార్ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్ జామింగ్ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (సీఏయూఎస్). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్ డిటెక్షన్, సాఫ్ట్/హార్డ్ కిల్ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్ (ఎలక్ట్రో–ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్ కిల్ (డ్రోన్ల కమ్యూనికేషన్ సిగ్నల్స్ జామింగ్), హార్డ్ కిల్ (నేలకూల్చడం) చేస్తుంది.సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ (సమర్). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్–1 వ్యవస్థ ఆర్–73ఈ, సమర్–2 ఆర్–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్–73ఈ మిసైళ్ల రేంజ్ 8 కి.మీ. ఆర్–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.→ ఎల్–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బోఫోర్స్ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివాటి ద్వారా ఎల్–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్. షిల్కా అనేది వీటి రష్యన్ నిక్‌నేమ్. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్ ప్రొపెల్డ్ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్ డెస్క్

రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆ సినిమాలకు వెళ్లడంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. అందుకే ఈ మధ్య ఈ రీరిలీజులు ఎక్కువయ్యాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka sundari ) మళ్లీ థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు. దీనికోసం వైజయంతీ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 8 కోట్లవరకు ఖర్చు చేశారు. ఇదంతా అభిమానుల కోసమేచేస్తున్నట్లుగా ప్రకటించారు. వారి అంచనాలకు తగ్గట్టే చిరంజీవి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ సినిమాను వీక్షించారు. దీంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.1.75 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. తమ అభిమాన హీరో సినిమా రీరిలీజ్‌కి ఈ స్థాయి కలెక్షన్స్ రావడం పట్ల మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా విషయానికొస్తే.. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం 1990 మే 9న రిలీజై సంచలనం సృష్టించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్‌గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి. అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు.‘మాస్ట్రో’ ఇళయరాజా అయితే ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.

మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం
పల్నాడు జిల్లా: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు. విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలానే విడదల రజినిపై కూడా అనేక అక్రమ కేసుల్ని బనాయించారు పోలీసులు. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుండటంపై ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు ఏపీలో పాలనను గాలికొదిలేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ.. తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అభ్యర్థనను తిరస్కరించిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈసారి ఫైనల్ చేరకుండానేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2023-25 సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. అసలు సమయానికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ వైఫల్యాలను కొనసాగించింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా ఈసారి ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. రెండు సిరీస్‌లలో ఇంతటి ఘోర పరాభవానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల బ్యాటింగ్ వైఫల్యమే.అయితే, కోహ్లి ఆసీస్ గడ్డపై ఓ శతకంతో మెరిసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అనంతరం ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ బరిలో దిగి అక్కడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టుకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు రాగా.. బుధవారం ఇందుకు సంబంధించి అతడు అధికారిక ప్రకటన విడుదల చేశాడు.సోషల్ మీడియా వేదికగాతాను టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జూన్ 20 నుంచి మొదలుకానున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోహ్లి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.జట్టుకు బలం అతడుఅయితే, బీసీసీఐ మాత్రం కోహ్లిని ఇంగ్లండ్‌తో సిరీస్ వరకైనా ఆడాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీతో బీసీసీఐ వర్గాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. అతడు డ్రెసింగ్‌రూమ్‌లో ఉంటే జట్టుకు బలం.ఇప్పట్లో టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాం’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది?అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వీడ్కోలు నేపథ్యంలో విరాట్ కోహ్లి తనకు కెప్టెన్సీ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శుబ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బోర్డు సహా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ మొదలుకానుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కెప్టెన్ నియమించాలని బోర్డు భావిస్తోంది.హెడ్‌కోచ్ గంభీర్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో పటిష్ట జట్టు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టుతో సిరీస్ నుంచే ఈ పని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకుడి వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్‌గానూ హిట్‌కాగా గతంలో కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కోహ్లికి ఉంది. టెస్టుల్లో అతడి రికార్డులు అమోఘం. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత... సౌతాఫ్రికా పర్యటనలో ఓటమి అనంతరం టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.కోహ్లి సారథ్యంలో డబ్ల్యూటీసీ 2019-21లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. అయితే, ఆ తర్వాత రోహిత్ గైర్హాజరీలో కూడా కోహ్లి ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించలేదు. బ్యాటర్‌గా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ అడిగాడని.. అందుకు బోర్డు నిరాకరించిందనే వార్తలు కల్పితాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!

పాకిస్తాన్లో టెన్షన్.. పీఎం షరీఫ్ సంచలన నిర్ణయం!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాక్ ఆర్మీ దాడులను భారత దళాలు తిప్పి కొడుతున్నాయి. పాక్ చర్యలకు చెక్ పెడుతూ భారత్ అలర్ట్‌గా ఉంది. భారత్ దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ పాకిస్తాన్ ప్రధాని చర్యలు సంచలనంగా మారాయి. న్యూక్లియర్ బాంబ్‌ను పర్యవేక్షించే అథారిటీతో పాక్ ప్రధాని సమావేశం కావడం పలు అనుమానాలను తావిస్తోంది.ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతూ పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్ మ్యూనిషన్, ఫైటర్ జెట్లను వాడి.. భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. సామాన్య పౌరుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతోంది. అయితే వాటిని భారత్ తిప్పికొట్టింది. భారత సైన్యం తమ దాడులను తిప్పికొడుతుండటంతో.. ఇక లాభం లేదని పాకిస్తాన్ ఏకంగా అణుబాంబును రెడీ చేస్తున్నట్లు అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. అందుకు కారణం తాజాగా పాక్ ప్రధాని షహెబాజ్ షరీఫ్ నిర్వహించిన ఓ మీటింగ్. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది.తాజాగా పాకిస్తాన్ ప్రధాని షహెబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ అథారిటీ అనేది దేశ అణ్వాయుధ నిల్వలతో సహా భద్రతా నిర్ణయాలు తీసుకునే పౌర, సైనిక అధికారుల అత్యున్నత సంస్థ. ఈ వారంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని పంపడం ద్వారా వారి వైమానిక సరిహద్దులను ఉల్లంఘించారని, కనీసం 48 మంది మరణించారని రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అణ్వాయుధాలను పర్యవేక్షించే అథారిటీతో పాక్ ప్రధాని సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. అయితే.. పాక్ బెదిరింపులకు పాల్పడుతుందని నిపుణులు అంటున్నారు.మరోవైపు.. తాజాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటన చేశారు. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని పేర్కొన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.🇵🇰🔥 (Reuters) - Pakistan Prime Minister Shehbaz Sharif has called a meeting of the National Command Authority on Saturday, the military said, after Islamabad launched a military operation against India and targeted multiple bases.The authority is the top body of civilian and… pic.twitter.com/dE6mtrwuEw— Dan-i-El (@Danielibertari0) May 10, 2025

ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్‌ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్‌గా గుర్తింపు పొందుతోంది.ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్‌లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.గత ఏప్రిల్‌లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది! - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

భారత్‌తో కాళ్ల బేరానికి పాకిస్తాన్.. పాక్ ఉప ప్రధాని కీలక ప్రకటన!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ యుద్ధం వేళ దాయాదికి చుక్కలు కనిపిస్తున్నాయి. భారత్ దాడుల కారణంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ డిప్యూటీ పీఎం, విదేశాంగమంత్రి ఇషాక్ దార్ కీలక ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని పాక్ మంత్రి ఇషాక్ దార్ ప్రకటన చేశారు. భారత్ ఆగిపోతే, మేం కూడా అలాగే చేస్తామని ఇషాక్ దార్ తెలిపారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, భారతదేశం ఈ సమయంలో ఆగిపోతే మేము కూడా శాంతిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ప్రతీకారం తీర్చుకోమని, ఏమీ చేయమని కూడా చెప్పుకొచ్చారు. తాము నిజంగా శాంతిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్దితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఉద్రిక్తతను తగ్గించాలని కోరుకుంటుందని , భారత్‌తో చర్చల కోసం కొత్త కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాలు సీఎన్ఎన్ న్యూస్‌కు వెల్లడించాయి.అయితే, పాక్ మంత్రి ప్రకటనకు ముందు.. పాకిస్తాన్‌కు అమెరికా కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే భారత్‌తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్తాన్‌కు అమెరికా సూచనలు చేసింది. సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాక్‌కు సూచించారని విదేశాంగశాఖ తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు అవసరమైతే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పాక్ ఇలా ప్రకటన చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Breaking: Global pressure on Pak mounts following escalatory action against India targeting civilian targets.Pak Deputy PM & Foreign Minister Mohammed Ishaq Dar tells a Pak channel that we have conveyed to the US, if India doesn’t respond any further we will not escalate.… pic.twitter.com/KcjaKrShCi— Saurabh Shukla सौरभ शुक्ल (@isaurabhshukla) May 10, 2025మరోవైపు.. ఇప్పటికే పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా భారత్ సరిహద్దులో తన కార్యకలాపాలను నిలిపివేస్తే తదుపరి చర్యలకు దూరంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో భారత్ దాడులు పాకిస్తాన్‌ను ఓ రేంజ్లో ఇబ్బందులు పెడుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఇస్లామాబాద్‌లో పెట్రోల్ బంకులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
'అతడు చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.. మరి ఎప్పుడూ పాక్‌కు రానున్నాడు'
భారత్ - పాక్ యుద్ధం: ట్రంప్ సంచలన ప్రకటన
‘బద్మాషులు’ వచ్చేస్తున్నారు
వార్ జోన్.. ఈ నూతన వధూవరుల కథే దేశభక్తికి చిహ్నం
'ఇకపై ఉగ్ర చర్యలను యుద్ధంగానే పరిగణిస్తాం': భారత్ హెచ్చరిక
భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
పాకిస్తాన్ దాడులు: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?
అతడి విషయంలో సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయం!
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
చల్లని కబురు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)
ఐపీఎల్ వాయిదా?
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
'అతడు చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.. మరి ఎప్పుడూ పాక్‌కు రానున్నాడు'
భారత్ - పాక్ యుద్ధం: ట్రంప్ సంచలన ప్రకటన
‘బద్మాషులు’ వచ్చేస్తున్నారు
వార్ జోన్.. ఈ నూతన వధూవరుల కథే దేశభక్తికి చిహ్నం
'ఇకపై ఉగ్ర చర్యలను యుద్ధంగానే పరిగణిస్తాం': భారత్ హెచ్చరిక
భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
పాకిస్తాన్ దాడులు: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?
అతడి విషయంలో సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయం!
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
చల్లని కబురు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
సినిమా

జాతీయ అవార్డ్ గ్రహీత విక్రమ్ కన్నుమూత
జాతీయ అవార్డ్ గ్రహీత, ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్(51) కన్నుమూశారు. తొలుత మరాఠీ సినిమాల్లో పనిచేసిన ఈయన తర్వాత పలు హిందీలో చిత్రాల్లో నటించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. విక్రమ్ గైక్వాడ్ మరణవార్త తెలుసుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాళులర్పించారు. ఈయన మరణం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. భారతీయ సినిమా, నాటక రంగానికి విక్రమ్ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)విక్రమ్ గైక్వాడ్ మేకప్ ఆర్టిస్ట్ గా చేసిన వాటిలో.. బెల్ బాటమ్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, బ్లాక్ మెయిల్, దంగల్, పీకే, సూపర్ 30, కేదార్నాథ్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ తదితర హిందీ సినిమాలున్నాయి.మరాఠీ సినిమాల్లో ఈయన్ని బాలగంధర్వ అని కూడా అంటారు. విక్రమ్ మరణంపై చిత్రపరిశ్రమలోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే విక్రమ్ మృతికి కారణం ఇంకా తెలియరాలేదు.(ఇదీ చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!)

‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor ) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరీ(Uttam Maheshwari) ప్రకటిస్తూ ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. దీనిపై నెటిజన్స్ మండిపడ్డారు. ఒకవైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే..ఈ సమయంలో పోస్టర్ రిలీజ్ చేయడం అవసరమా అంటూ దర్శకుడిని ట్రోల్ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చిరవకు దర్శకుడు ఉత్తమ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అందులో పేర్కొన్నాడు. (చదవండి: భారత్‌పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!)‘ఈ సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు చెబుతున్నాను. డబ్బు కోసం లేదా ఫేమస్ అవ్వడం కోసమే ఇలాంటి పని చేయలేదు. మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రపంచానికి తెలియజేసేలా ఓ పవర్ఫుల్ కథగా వెండితెరపై తీసుకురావాలనుకున్నాను. దేశంపట్ల గౌరవంతో నేను ఈ సినిమా చేయాలనుకున్నాడు. అంతేకాని డబ్బుకి ఆశపడి సినిమా ప్రకటన చేయలేదు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి నా క్షమాపణలు చెబుతున్నాను. ఇది సినిమా మాత్రమే కాదు దేశ ప్రజల ఎమోషన్’ అని ఉత్తమ్ మహేశ్వరీ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా, ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. 26 మంది భారత మహిళల నుదుటిన సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఇదే పేరుతో సినిమాను నిర్మించడానికి పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. టైటిల్ కోసం విఫల ప్రయత్నాలు చేశాయి. చివరకు నిక్కీవిక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై ఉత్తమ్ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’ తెరకెక్కిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో డైరెక్టర్ పై విధంగా స్పందించాడు.

'ఆపరేషన్ సిందూర్'పై బుద్దిలేని వ్యాఖ్యలు.. నటిపై భగ్గుమన్న నెటిజన్లు
ఆపరేషన్ సిందూర్ గురించి మలయాళ నటి చేసిన కామెంట్ విమర్శలకు దారి తీస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. అందులో సుమారు 100 మందికి పైగానే ఉగ్రవాదులు మరణించారు. దీంతో సోషల్ మీడియా అంతా భారత సైన్యానికి జేజేలు పలికింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ తాము ఆర్మీ వెంటే అంటూ నెటిజన్లు, ప్రముఖులు పోస్ట్‌లు పెట్టారు. అయితే, కేరళకు చెందిన నటి అమీనా నిజమ్.. ఆపరేషన్ సిందూర్ కోసం భారతదేశం 'సిగ్గుపడుతుందని' పోస్ట్ చేసింది.అమీనా తన సోషల్‌మీడియాలో ఇలా రాసుకొచ్చింది 'ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌లోని ప్రజలను చంపడంపై నేను సిగ్గు పడుతున్నాను. చంపుకోవడం ఒక్కటే మార్గం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. యుద్దం శాంతిని తీసుకురాదు, ప్రాణాలను తీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ సపోర్ట్ చేయకండి. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని భావించే వ్యక్తులను మోసగిస్తున్నారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల నష్టపోయేది పౌరులే. నేను నా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని, అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదానిని కాదు.' అంటూ ఆమె షేర్ చేసింది.నటి అమీనాపై నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.. అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయం మీకు గుర్తుచేయాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఆమెను దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులను పాపం అనడం, వారిపై సానుభూతి చూపించడం ఏ మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదని ఇది మీ కెరీర్‌కు కూడా అంత మంచిది కాదంటూ చిన్నపాటి వార్నింగ్‌లు కూడా నెటిజన్లు ఇస్తున్నారు.ఎవరీ అమీనా..?అమీనా నిజమ్ కేరళకు చెందిన నటి, ఆమె ప్రముఖ మలయాళ టీవీ రియాలిటీ షో అయిన నాయక నాయకన్ ద్వారా పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె అనేక సినిమాలతో పాటు పలు షోలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ 18 (2018) సినిమాతో అలరించింది. ఆ తర్వాత ఆమె పతినేట్టం పడి, అంజామ్ పాతిర, పట్టాపాకల్, టర్కిష్ తర్కం, టర్బో వంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by KRISHNA | KOCHI BRIDAL MEHNDI ARTIST (@mehndibykrish)

శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడింది. ఆయన నటించిన తాజా చిత్రం ‘#సింగిల్’ ఈ శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చి.. హిట్ టాక్ని సంపాదించుకుంది. శ్రీవిష్ణు వన్‌లైన్ పంచ్‌లు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ రావడంతో తొలిరోజు భారీ కలెక్షన్లనే రాబట్టింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.4.15 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. (చదవండి: #సింగిల్ మూవీ రివ్యూ)బుక్‌మై షోలో 24 గంటల్లోనే 50.71 వేల టికెట్లు బుక్ అయ్యాయి. హిట్ టాక్ రావడంతో రెండో రోజు కూడా భారీగానే బుకింగ్స్ జరిగాయి. సినిమాకు వచ్చిన టాక్ని బట్టి చూస్తే..వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతభాగం భారత సైనికులకు విరాళంగా ఇస్తామని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక సినిమా విషయానికొస్తే.. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో శ్రీవిష్ణుకి జోడీగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం
క్రీడలు

సోషల్ మీడియాలోనే రిటైర్మెంట్.. రోహిత్‌ను ఇలాగే పంపిస్తారా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు రోహిత్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అయితే భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ముందే తొలిగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా రోహిత్ లాంటి అద్భుతమైన కెప్టెన్ సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రోహిత్‌కు సరైన విడ్కోలు లభించలేదని తివారీ అభిప్రాయపడ్డాడు."రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. కెప్టెన్‌గా అతడి ట్రాక్ రికార్డు చాలా బాగుంది. అతడి సారథ్యంలో భారత్ 12 టెస్టుల్లో విజయం, మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా చేర్చాడు. అటువంటి కెప్టెన్‌కు సరైన విడ్కోలు లభించలేదు. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో కాకుండా మైదానంలో మ్యాచ్ ఆడిన తర్వాత రిటైర్ అయి ఉంటే బాగుండేది. అది అతడికి సరైన విడ్కోలు అయి ఉండేది. కానీ రోహిత్ విషయంలో అది జరగలేదని" పరోక్షంగా బీసీసీఐపై తివారీ మండిపడ్డాడు. రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.చదవండి: పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు.. త్వరలోనే ఐపీఎల్ మళ్లీ మొదలు: గంగూలీ

Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ.. తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అభ్యర్థనను తిరస్కరించిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈసారి ఫైనల్ చేరకుండానేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2023-25 సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. అసలు సమయానికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ వైఫల్యాలను కొనసాగించింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా ఈసారి ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. రెండు సిరీస్‌లలో ఇంతటి ఘోర పరాభవానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల బ్యాటింగ్ వైఫల్యమే.అయితే, కోహ్లి ఆసీస్ గడ్డపై ఓ శతకంతో మెరిసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అనంతరం ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ బరిలో దిగి అక్కడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టుకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు రాగా.. బుధవారం ఇందుకు సంబంధించి అతడు అధికారిక ప్రకటన విడుదల చేశాడు.సోషల్ మీడియా వేదికగాతాను టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జూన్ 20 నుంచి మొదలుకానున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోహ్లి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.జట్టుకు బలం అతడుఅయితే, బీసీసీఐ మాత్రం కోహ్లిని ఇంగ్లండ్‌తో సిరీస్ వరకైనా ఆడాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీతో బీసీసీఐ వర్గాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. అతడు డ్రెసింగ్‌రూమ్‌లో ఉంటే జట్టుకు బలం.ఇప్పట్లో టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాం’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది?అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వీడ్కోలు నేపథ్యంలో విరాట్ కోహ్లి తనకు కెప్టెన్సీ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శుబ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బోర్డు సహా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ మొదలుకానుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కెప్టెన్ నియమించాలని బోర్డు భావిస్తోంది.హెడ్‌కోచ్ గంభీర్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో పటిష్ట జట్టు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టుతో సిరీస్ నుంచే ఈ పని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకుడి వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్‌గానూ హిట్‌కాగా గతంలో కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కోహ్లికి ఉంది. టెస్టుల్లో అతడి రికార్డులు అమోఘం. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత... సౌతాఫ్రికా పర్యటనలో ఓటమి అనంతరం టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.కోహ్లి సారథ్యంలో డబ్ల్యూటీసీ 2019-21లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. అయితే, ఆ తర్వాత రోహిత్ గైర్హాజరీలో కూడా కోహ్లి ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించలేదు. బ్యాటర్‌గా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ అడిగాడని.. అందుకు బోర్డు నిరాకరించిందనే వార్తలు కల్పితాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!

పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు.. త్వరలోనే ఐపీఎల్ మళ్లీ మొదలు!
ఐపీఎల్-2025 (IPL 2025)ని వాయిదా వేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్వాగతించాడు. దేశ సరిహద్దుల వెంబడి నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా బోర్డు సరిగ్గా స్పందించిందని పేర్కొన్నాడు. అయితే, త్వరలోనే ఈ మెగా టోర్నీ మళ్లీ మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.దాయాది దుశ్చర్యలుపాకిస్తాన్కు ఎక్కువ కాలం పోరాడే శక్తి లేదని.. కాబట్టి త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని గంగూలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాదాపు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత్ చేపట్టిన ఈ చర్యను దాయాది జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అనుచితంగా దాడులకు తెగబడుతోంది.ఈ క్రమంలో దాయాది పాక్ దుశ్చర్యలకు భారత్ గట్టి సమాధానిమిస్తోంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి.. రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా సరిహద్దుల వెంబడి పాక్ ఎక్కువగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ.. సామాన్యులు, సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తోంది. భారత్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది.ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ధర్మశాల స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల పాటు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.పాకిస్తాన్‌కు అంత సీన్ లేదుఈ పరిణామాలపై స్పందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బీసీసీఐ భారత, విదేశీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.అయితే, త్వరలోనే లీగ్ మళ్లీ మొదలు కావాలని ఆకాంక్షిద్దాం. ప్రస్తుతం టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో ఉంది. ఇలాంటి తరుణంలో ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, రాజస్తాన్, జైపూర్ వంటి ప్రాంతాలు మినహా.. మిగతా చోట్ల ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది.కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయనే విశ్వాసం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితులను, ఒత్తిడిని ఎక్కువ కాలం భరించలేదు. ఆ దేశానికి అంతటి సామర్థ్యం లేదు. కాబట్టి బీసీసీఐ కచ్చితంగా ఐపీఎల్-2025ని పూర్తి చేస్తుంది’’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.సురక్షితంగా ఢిల్లీకిఇదిలా ఉంటే.. ధర్మశాలలో మ్యాచ్ రద్దు కాగానే.. బీసీసీఐ పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లను సురక్షితంగా ఢిల్లీకి చేర్చింది. అత్యంత భద్రత నడుమ వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025లో ఇప్పటికి 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయిపోయాయి. మిగతా మ్యాచ్‌లలో ఢిల్లీ, కోల్‌కతా, లక్నో జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!

టెస్టుల్లో అద్భుతం.. కానీ వన్డే, టీ20లలో మాత్రం వేస్ట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) బ్యాటింగ్ తీరుపై భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ (Sanjay Bangar)విమర్శలు గుప్పించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని అన్నాడు. వన్డే, టీ20 క్రికెట్లో సరైన షాట్ల ఎంపిక విషయంలో ఇప్పటికీ అతడు తడబడుతుండటం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నాడు.అత్యంత ఖరీదైన ఆటగాడిగాఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ ఉత్తరాఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ చరిత్ర సృష్టించాడు.చెత్త ప్రదర్శనఅయితే, ఆట విషయంలో మాత్రం పంత్ తుస్సుమనిపించాడు. ఇప్పటి వరకు పది ఇన్నింగ్స్ 12.80 సగటుతో.. 99.22 స్ట్రైక్‌రేటుతో 128 పరుగులే చేశాడు. పంత్ ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టిన నాటి (2016) నుంచి అతడి కెరీర్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పవచ్చు.టెస్టుల్లో అద్బుతం.. కానీ వన్డే, టీ20లలో మాత్రం వేస్ట్!లక్నో కెప్టెన్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా పంత్ విఫలం కావడం తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘వైట్ బాల్ క్రికెట్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడంలో పంత్ తడబడుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.50, 20 ఓవర్ల ఫార్మాట్లో అతడి ఆట గొప్పగా లేదు. అయితే, టెస్టు క్రికెట్లో మాత్రం అతడొక అద్భుతమైన బ్యాటర్. సంప్రదాయ ఫార్మాట్లో అతడి ఆటకు పేరు పెట్టే పనేలేదు.కానీ ఈ ఐపీఎల్ సీజన్లో అతడు అవుటైన విధానం చూస్తుంటే.. స్కూప్ షాట్లు ఆడేందుకు అతడు విఫలయత్నం చేసిన తీరును గమనించవచ్చు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.వారం పాటు వాయిదా అదే విధంగా.. రిషభ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్ సరిగా లేదని సంజయ్ బంగర్ ఈ సందర్భంగా విమర్శించాడు. తనలోని అత్యుత్తమ బ్యాటర్ ఆడే విధానాన్ని పంత్ మర్చిపోయాడని.. అందుకే ఇలా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్-2025లో పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. ఐదు గెలిచి.. ఆరింట ఓడింది. తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.టీమిండియా తరఫున ఇలా..టెస్టుల్లో రిషభ్ పంత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటికి 43 మ్యాచ్‌లు ఆడి 2948 పరుగులు చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఆరు టెస్టు సెంచరీలు ఉన్నాయి.అయితే, వన్డేల్లో 31 మ్యాచ్‌లలో కలిపి పంత్ కేవలం 871 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 76 అంతర్జాతీయ టీ20లలో కలిపి 1209 పరుగులు సాధించగలిగాడు. ఇక ఐపీఎల్లో మొత్తంగా 122 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 3412 రన్స్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
బిజినెస్

బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో బాస్మతి బియ్యం ధరలు పెరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్(ఏఐఆర్ఈఏ) స్పందించింది. ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ఇటీవల బాస్మతి బియ్యం ధరలు పెరగడానికి భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ డిమాండ్ పెరగడమే ధరలు పెరిగేందుకు కారణమవుతుందని తెలిపింది. ధరల పెరుగుదల మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ నుంచి బలమైన డిమాండ్ నెలకొందని వివరించింది.అంతర్జాతీయ డిమాండ్బాస్మతి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మిడిల్ఈస్ట్రన్ దేశాల్లో ఈ బియ్యానికి ఆదరణ అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఆ ప్రాంతాల్లో పెరిగిన దిగుమతి డిమాండ్ ధరలపై ఒత్తిడిని పెంచింది. ఇది దేశంలోని బాస్మతి బియ్యం ఎగుమతి ప్రాంతాల్లో ఒక మోస్తరు ధరల పెరుగుదలకు దారితీసింది. ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సరఫరాకు ఒప్పందం1509, 1718తో సహా ప్రసిద్ధ బాస్మతి రకాల ధర ఇటీవల పెరిగింది. ఇది ఫిబ్రవరి 2025లో కేజీ రూ.52గా ఉండేది. ఇటీవల దీని ధర పెరిగి కేజీ రూ.58కు చేరింది. కానీ ఇది 2024 సెప్టెంబర్‌లో రూ.62గా ఉంది. అప్పటి ధరల కంటే ప్రస్తుత ధరలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయగా, పాకిస్థాన్ 1 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది.

తగ్గినట్టే తగ్గి.. తులం బంగారం ఇప్పుడు..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. క్రితం రోజున భారీగా క్షీణించిన పసిడి ధరలు నేడు (మే 10) కాస్త ఎగిశాయి. మరోసారి తగ్గుతుందని ఆశించిన కొనుగోలుదారులకు నేడు నిరాశ ఎదురైంది. మే 10 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,450హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,450చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,830- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,600ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి. ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,450ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి. బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,450బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీ మీద రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,10,900 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 98,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

హైదరాబాద్ ఇప్పుడు కాస్ట్లీ సిటీ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కాస్ట్లీ సిటీగా అభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు దేశంలోని ఏ ఇతర మెట్రో నగరాలతో పోల్చినా భాగ్యనగరంలో గృహాల ధరలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయింది. వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్‌లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెంది.. చ.అ. ధర సగటున రూ.5,800 నుంచి రూ.6,000 వేలకు పెరిగింది. ముంబైలో ఏడాదిలో 3 శాతం పెరిగి.. రూ.9,600 నుంచి రూ.9,800లకు చేరిందని ఓ సంస్థ నివేదిక వెల్లడించింది.👉ఇది చదివారా? సెకండ్ హ్యాండ్ ఇళ్లు.. హైదరాబాద్‌లో ఇక్కడ భలే డిమాండ్దాదాపు పదేళ్ల కాలంలో అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం, స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్ ధరలలో సవరణలతో పాటు గృహ కొనుగోళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి నమోదైంది. ఒకవైపు సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులకు రాయితీలను అందిస్తున్నారు. లేదంటే ఆయా నగరాలలో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముంది.సరఫరా, డిమాండ్లలో వృద్ధి రేటు.. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో గృహాల విక్రయాలలో హైదరాబాద్‌లో అత్యధిక వృద్ధి నమోదైంది. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ ప్రాంతాలలో గృహ విక్రయాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఆయా ప్రాంతాలలో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ.. డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. లాంచింగ్ అయిన ప్రాజెక్ట్‌లలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల వాటా 36 శాతంగా ఉంది. దుండిగల్, తెల్లాపూర్, గోపనపల్లి, బాచుపల్లి, బండ్లగూడ జాగీర్ ప్రాంతాలలో ఇళ్ల సరఫరా ఎక్కువగా ఉంది.

దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సరఫరాకు ఒప్పందం
దీర్ఘకాలిక పునరుత్పాదక ఇంధన సరఫరా కోసం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఏఎం గ్రీన్ ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సీఐఎల్ సోలార్, పవన శక్తి ద్వారా ఏఎం గ్రీన్ ఉత్పత్తి చేయబోతున్న గ్రీన్ అమ్మోనియా సౌకర్యాలకు 4,500 మెగావాట్ల కార్బన్ రహిత శక్తిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఒప్పందంపై సీఐఎల్ జీఎం (ఈ అండ్ ఎం) సుదర్శన్ బోరా, ఏఎం గ్రీన్ బిజినెస్ డెవలప్మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శతన్షు అగర్వాల్ ఇరు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో సంతకాలు చేశారు.దేశవ్యాప్తంగా భారీ పునరుత్పాదక ఇంధన విస్తరణ జరపాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా గుజరాత్, రాజస్థాన్‌ల్లో సోలార్ పవర్ కెపాసిటీని 2,500 మెగావాట్ల నుంచి 3,000 మెగావాట్ల వరకు పెంచాలని నిర్ణయించారు. 1,500 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని 2,000 మెగావాట్లకు విస్తరించాలని చూస్తున్నారు. ఇందుకోసం దక్షిణ భారతదేశంలో అనువైన స్థలాలను అన్వేషిస్తున్నారు. ఈమేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రూ.25,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఏఎం గ్రీన్ ఈ పునరుత్పాదక శక్తిని పంప్డ్ హైడ్రో స్టోరేజీతో అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ ఉత్పత్తి సౌకర్యాలకు స్థిరమైన గ్రీన్ ఎనర్జీ సరఫరాను ఇది నిర్ధారిస్తుంది. గ్రీన్కో గ్రూప్ ప్రమోటర్లు స్థాపించిన ఏఎం గ్రీన్ 2030 నాటికి ఏటా 5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక ఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్‌కు సమానం. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యంలో 20%గా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఐటీఆర్ దాఖలుకు 5 ప్రధాన అంశాలుఈ సందర్భంగా సీఐఎల్ సుస్థిరమైన ఎనర్జీని సరఫరా చేసేందుకు కట్టుబడి ఉందని సంస్థ ఛైర్మన్ పీ.ఎం.ప్రసాద్ తెలిపారు. భారతదేశ ఇంధన తయారీలో బొగ్గు కీలక భాగంగా ఉన్నప్పటికీ, సీఐఎల్ గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈమేరకు కంపెనీ చురుకుగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గ్రీన్కో అండ్ ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి ఈ ప్రాజెక్టుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఇతర గ్రీన్ మాలిక్యూల్స్ తయారీలో గణనీయంగా ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్-ఫ్రీ, పునరుత్పాదక ఇంధన సరఫరాదారుగా ఉన్న సీఐఎల్తో జతకట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఫ్యామిలీ

ఈ సమ్మర్లో చిన్నారులకు కథ రాయడం నేర్పండిలా..!
ఒక హీరో, ఒక విలన్, ఒక క్లయిమాక్స్... అంతే కథ. చెడు మీద మంచి గెలవడం... ప్రాబ్లమ్ మీద పరిష్కారం గెలవడంభయం మీద ధైర్యం గెలవడం... ఇదే కథ రాయడం అంటే.కథలు రాస్తే మీరు క్రియేటర్ అవుతారు. క్యారెక్టర్స్‌ను క్రియేట్ చేసి గేమ్ ఆడతారు. ఇది చాలా ఫన్‌గా ఉంటుంది. ‘రైటర్’, ‘ఆథర్’ అనిపించుకోవాలంటే కథలు రాయాలి. ఈజీగా రాయగలరు. ఎలాగో వినండి.కథ రాయడం భలే వీజీ. చిట్టి చిలకమ్మ ఒక రోజు అల్లరి చేసింది. అల్లరి చేస్తే అమ్మ చిన్న దెబ్బ కొట్టింది. చిట్టి చిలకమ్మ బుంగమూతి పెట్టింది. అలిగి తోటకు వెళ్లింది. అక్కడ పండిన జాంకాయ కనిపించింది. దానిని తెచ్చుకుని తీరిగ్గా కొరికి గుటుక్కున మింగింది. అలకా గిలకా అన్నీ పోయాయి. మళ్లీ హాయిగా ఆటల్లో పడింది. చూశారా ఇంతే కథ. చిన్నప్పుడు మనం విన్న రైమ్... ‘చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా... తోట కెళ్లావా... పండు తెచ్చావా... గూట్లో పెట్టావా... గుటుక్కున మింగావా’... దానినేగా మనం పైన కథగా రాసింది. ప్రతి కథలో చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. దానికి సొల్యూషన్ ఉంటుంది. ఇవి రెండూ ఉంటే అది కథ. పైన కథలో అమ్మ కొట్టడం ప్రాబ్లమ్. పండు తిని ఆ సంగతి మర్చిపోవడం సొల్యూషన్.ఇప్పుడు చెప్పబోయే కథలో ప్రాబ్లమ్’, ‘సొల్యూషన్ ’ కనిపెట్టండి.ఒక ఆవు దారి తప్పి అడవిలోకి వెళ్లిపోతే పులి పట్టుకుంది. ‘పులి బ్రో.. పులి బ్రో... ఇంటి దగ్గర నాకు చంటి దూడ ఉంది. దానికి పాలివ్వకపోతే ఏడుస్తుంది. వెళ్లి పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను కిల్ చేసి తినెయ్’ అంది. ‘నో. వదల్ను. నువ్వు వెళితే రావు’ అంది పులి. ‘వస్తాను. ప్రామిస్’ అంది ఆవు. పులికి జాలి పుట్టి వస్తే వస్తుంది రాక΄ోతే రాదు అని పంపింది. పాపం ఆవు ఇంటికి వెళ్లి ఇచ్చిన ప్రామిస్‌కు కట్టుబడి తిరిగి పులి దగ్గరకు వచ్చింది. పులి చాలా ఇంప్రెస్ అయ్యింది. నీలాంటి గుడ్ కౌను నేను చూడలేదు. నిన్ను వదిలేస్తున్నా. వెళ్లు’ అంది.పులి ఆవును పట్టుకోవడం ప్రాబ్లమ్. తన నిజాయితీతో ఆవు ఆ ప్రాబ్లం నుంచి బయట పడటం సొల్యూషన్ . చిన్న కథైనా ఎంత బాగుందో చూడండి. పంచతంత్రంలో ఈ కథ మీరు చదివే ఉంటారుగా.మనం తెలుగు వాళ్లం కాబట్టి తెలుగులో కథలు రాయడం ప్రాక్టీసు చేయాలి. తెలుగు బాగా రాకపోతే పర్వాలేదు.. ఇంగ్లిష్‌లో కథలు రాయొచ్చు. ఆ భాష ఈ భాష ఏదీ సరిగ్గా రాలేదంటే కొంచెం ప్రాబ్లమే. కథలు ఎందుకు రాయాలంటే వాటి ద్వారా మన థాట్స్ షేర్ చేసుకోవచ్చు. అవేర్నెస్ తేవచ్చు. సెన్సిటైజ్ చేయొచ్చు. చూడండి... ఇది సమ్మర్. ఎంత వేడిగా ఉంటోంది. ఫారెస్ట్లు పెంచడం ఎంత అవసరమో చెప్తూ ఒక కథ రాయొచ్చు. ఒక అడవిలో చెట్లు కొట్టేయడం వల్ల ఒక పక్షికి గూడు పెట్టుకునే చోటు దొరకదు. అది సిటీకి వస్తుంది. చాలా కష్టాలు పడుతుంది. చివరకు ఒక అపార్ట్మెంట్ కిటికీ దగ్గర గూడు ఏర్పాటు చేసుకుంటుంది. నాలుగురోజులు గడుస్తాయో లేదో వేడి గాలి దాని గూడు మీదకు వస్తూ ఉంటుంది. కారణం ఏమిటని చూస్తే ఏసి ఔట్‌డోర్ యూనిట్ నుంచి ఆ గాలి వస్తుంటుంది. ఆ ఔట్ డోర్ యూనిట్ ఆగదు. పక్షి ఆ గూటిలో ఉండలేదు... ఇలా ఒక స్టోరీ రాయొచ్చు.కథలు రాయాలంటే ముందు కథలు చదవాలి. స్టోరీ బుక్స్ చదివితే కథలు ఎలా రాయాలో తెలుస్తుంది. స్టోరీలు చదివి బెడ్ మీదకు చేరితే మీకూ రకరకాల స్టోరీ ఐడియాస్ వస్తాయి. వాటిని బాగా స్కీమ్ చేసుకుని పేపర్ మీద రాయాలి అంతే. కథ రాసి దానికో టైటిల్ పెట్టాలి. ‘మేకపిల్ల హోమ్‌వర్క్’, ‘ఆక్సిజన్ ట్యాంకర్ దొంగలు’, ‘ఫ్లయింగ్ బైస్కిల్’... ఇలా. కథలు రాస్తే మిమ్మల్ని రైటర్ అంటారు. రైటర్ గారూ అని పిలుస్తారు. చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కదా. ఆ యుద్ధాన్ని చూసి క్లౌడ్స్ ఏమనుకుంటాయి? బ్లూ కలర్ క్లౌడ్, వైట్ కలర్ క్లౌడ్‌ను కేరెక్టర్లుగా చేసి కథ రాయాలి. రాయండి. అలాంటి కథలు రాయడమే ఈ సమ్మర్లో మీకు సరైన హోమ్‌వర్క్. చివరగా కథలు లేకుండా లోకం ఉండదు. ఎప్పుడూ అందరికీ కథలు కావాలి. ఆ కథల్లో ఎంత గట్టి ప్రాబ్లమ్ ఉంటే అంత బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పేస్‌లో చిక్కుకుపోయింది. ఆమెను క్యారెక్టర్‌గా తీసుకుని ఒక స్టోరీ రాయొచ్చు. ఎంత ధైర్యంగా ఆమె అన్నాళ్లు స్పేస్‌లో ఉందో చెప్పి ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియకపోవడం వల్ల టెన్షన్ బిల్డప్ చేసి క్లయిమాక్స్‌లో స్పేస్‌షిప్ వెళ్లి ఆమెను తీసుకురావడంతో హ్యాపీ ఎండింగ్ చేస్తే అది కథ. – కె.(చదవండి: అలనాటి వేసివి ముచ్చట్లు..! చిన్నారులు తప్పక తెలుసుకోవాల్సిన సరదాలు..)

బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ డైట్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..
ఎముకల ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనది. వయసు పెరిగేకొద్దీ ఎముకలు సాంద్రతను కోలపోతాయి. పైగా పగుళ్లు ఏర్పడి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఎముకలను బలహీనపర్చడాన్ని వేగవంతం చేస్తాయి. తరుచుగా గాయలయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటా వేలల్లో ఉంటుందోని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైద్యలు మాత్రం ఇండియన్ డైట్‌తోనే నివారించుకోవచ్చని చెబుతున్నారు. ఎముక ఆరోగ్యాన్నికాపాడంలో భారతీయ ఆహారాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయిని చెబుతున్నారు. పైగా అవి అందుబాటులో ఉండే ఆహారాలేనని అంటున్నారు. అంతేకాదండోయ్ బలమైన ఎముకల బెస్ట్ ఇండియన్ ఫుడ్ గైడ్ ఏంటో కూడా వివరించారు. మరీ అవేంటో తెలుసుకుందామా..!.కాల్షియం అధికంగా ఉండే ఆహారాలుఎముకల బలానికి కాల్షియం అత్యంత ముఖ్యమైన ఖనిజం. పెద్దలకు రోజుకు 1000–1200 mg కాల్షియం అవసరం. భారతీయ ఆహారంలో సహజంగానే అనేక కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు ఉన్నాయి.పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్ , మజ్జిగ వంటివి కాల్షియం అద్భుతమైన వనరులు.ఆకుకూరలు: పాలకూర (పాలక్), మెంతులు (మేథి), ఉసిరి వంటి మొక్కల ఆధారిత కాల్షియంనువ్వులు: భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే నువ్వులు (టిల్) గింజలు కాల్షియంతో సమృద్ధిగా ఉంటాయి.రాగి: సాంప్రదాయ భారతీయ ధాన్యం, రాగులు కాల్షియంతో నిండి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైనవి.అంటే పైన చెప్పిన వాటిల్లో కనీసం ఒక గ్లాసు పాలు లేదా మజ్జిగ తీసుకున్నాచాలు కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.మెరుగైన కాల్షియం శోషణకు విటమిన్ డికాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం. సూర్యరశ్మికి గురికావడం ఉత్తమ సహజ వనరులే కానీ ఫుడ్ పరంగా ఏవంటే..గుడ్డు పచ్చసొనసాల్మన్, సార్డిన్ వంటి కొవ్వు చేపలుబలవర్థకమైన పాల ఉత్పత్తులుపుట్టగొడుగులుఇక్కడ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండే సూర్యరశ్మిలో గడిపే యత్నం చేయటం వంటివి చేస్తే చాలు.ఎముక ద్రవ్యరాశికి ప్రోటీన్ప్రోటీన్లు ఎముకల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ ఆహారాంలో ప్రోటీన్‌ని జోడిస్తే ఈ ఎముకల సమస్యను అధిగమించొచ్చు.పప్పుధాన్యాలు, కాయధాన్యాలు (పప్పు, రాజ్మా, శనగ, మూంగ్)పాల ఉత్పత్తులుబాదం, వాల్నట్లు, అవిసె గింజలు, విత్తనాలులీన్ మాంసాలు, గుడ్లుప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఎముక సాంద్రతను పెంచుతుంది, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు వైద్యులుఎముక సాంద్రతకు మెగ్నీషియం, ఫాస్ఫరస్ఎముకల నిర్మాణాన్ని నిర్వహించడానికి కాల్షియంతో పాటు మెగ్నీషియం, పాస్ఫరస్ కూడా కీలకమే. ఈ ఖనిజాలు అధికంగా ఉండే భారతీయ ఆహారాలలో ఇవి ఉన్నాయి:అరటిపండ్లు, అంజూర పండ్లు, ఖర్జూరాలుగోధుమ బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాలుజీడిపప్పు, వేరుశెనగ వంటి గింజలుగుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలుఎముకలకు హాని కలిగించే ఆహారాలు..పోషకాలు అధికంగా ఉండే ఆహారం కీలకం అయినప్పటికీ, కొన్ని ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయని విషయం గ్రహించాలని హెచ్చరిస్తున్నారు నిపుణులుతినకూడనవి..చక్కెర పానీయాలుశీతల పానీయాలుఎముకల నుంచి కాల్షియం లీక్ అయ్యే అధిక ఉప్పుఅధిక మొత్తంలో కెఫిన్నడక, జాగింగ్, బరువు మోసే వ్యాయామాలు, సమతుల్య ఆహారం తదితరాలు జీవితాంతం ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అందువల మనకు అందుబాటులో ఉండే ఈ సాధారణ ఆహారాలతో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..)

హైదరాబాద్ టు హనోయ్.. ఎగిరిపోదామా!
హైదరాబాద్ నుంచి హనోయ్‌లోని నోయ్‌బాయ్ విమానాశ్రయానికి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు వియట్‌జైట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండగా కొత్తగా వియత్నాం ఎయిర్‌లైన్స్ సర్వీసులు మొదలయ్యాయి. నగరం నుంచి వియత్నాం వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో విమాన సర్వీసులకు సైతం భారీ డిమాండ్ నెలకొంది. కొత్తగా ప్రారంభించిన వియత్నాం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (వీఎన్–984) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి ఆది, బుధ, శుక్ర వారాల్లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. హనోయ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.25 గంటలకు అక్కడికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వియత్నాం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (వీఎన్–985) హనోయ్ నుంచి ప్రతి ఆది, బుధ, శుక్ర వారాల్లో సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. మారుతోంది డెస్టినేషన్.. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది పర్యాటకులు దుబాయ్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేసియా తదితర దేశాలకు రాకపోకలు సాగిస్తారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 12 వేల మందికిపైగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఉంటే వారిలో 60 శాతానికి పైగా ఈ నాలుగైదు దేశాలకు రాకపోకలు సాగించే వాళ్లే ఎక్కువ. కాగా.. కొంతకాలంగా సిటీ టూరిస్టుల డెస్టినేషన్లు మారుతున్నాయి. కొత్త ప్రదేశాల్లో పర్యటించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సోలోగా వెళ్లే వారికి, కుటుంబాలతో సహా కలిసి వెళ్లాలనుకొనే వాళ్లను వియత్నాం విశేషంగా ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం భారత్ నుంచి సుమారు 5 లక్షల మంది వియత్నాం సందర్శించినట్లు అంచనా. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకించి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించినవాళ్లు లక్ష మందికిపైగా ఉంటారని అమీర్‌పేట్‌కు చెందిన ఒక ప్రముఖ ట్రావెల్స్ సంస్థ వెల్లడించింది. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీవియత్నాంకు పర్యాటక ప్యాకేజీలను అందజేస్తున్న సంస్థలకు సైతం డిమాండ్ పెరిగింది, సులభంగా వీసాలు లభించడం, విమాన చార్జీలు, పర్యాటక ఖర్చులు కూడా తక్కువ మొత్తంలోనే ఉండడం వల్ల ఎక్కువ మంది వియత్నాంను సందర్శిస్తున్నారు. ‘ఆ దేశంలో వందల కొద్దీ పర్యాటక స్థలాలు ఉన్నాయి. చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఆ దేశంలోని ఒక్క డానాంగ్ ప్రాంతాన్నే సుమారు 2.22 లక్షల మంది భారతీయ పర్యాటకులు గత సంవత్సరం సందర్శించారు.’అని వాల్మీకి ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకులు హరికిషన్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ పెరగడంతో ఎక్కువ మంది సందర్శించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో ఒక అందమైన దేశం.. సహజమైన దీవులు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ దేశంలోని హనోయ్, హోచిమిన్ సిటీ, హాలోంగ్ బే, హోయి ఆన్, సాపా, హ్యూ,పాంగ్‌న, బిన్‌తన్, మయిచావ్, కావోబాంగ్ వంటి సుమారు 45 ప్రముఖ పర్యాటక స్థలాలను ఎక్కువ మంది సందర్శిస్తున్నారు.

138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ప్రస్తుత కాలంలో అందర్నీ భయపెడుతున్న సమస్య అధిక బరువు. జీవన శైలి, ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఈ బాధలనుంచి విముక్తి పొందేందుకు, స్లిమ్‌గా కనిపించేందుకు భారీ కసరత్తులే చేస్తున్నారు. అంతేకాదు బరువు తగ్గడంతో తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 14 నెలల్లో 63 కిలోలు తగ్గిన మహిళ వెయిట్ లాస్ జర్నీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె కథ చాలా హైలైట్‌గా నిలిచింది. కొన్ని టిప్స్‌ను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవేంటో తెలుసుకుందాం ఈ కథనంలో.ఫిట్నెస్ మోడల్ నెస్సీ చుంగత్ వెయిట్ లాస్ జర్నీ చాలా స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. 138 కిలలో బరువున్న ఆమె కష్టపడి 75 కిలోలకు చేరింది. 2023లో నవంబరులో మొదలు పెట్టి, 2025 జనవరి నాటికి అంటే 14 నెలల్లో ఏకంగా 63 కిలోల బరువు తగ్గించుకుంది. "138 కిలోల నుండి బరువు తగ్గే ప్రయాణం అంత సులభం కాదు" అని నెస్సీ తన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను 40 లక్షలమంది వీక్షించారు. బరువు తగ్గాలనే స్థిర చిత్తం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బలమైన సంకల్ప శక్తి ద్వారా 63 కిలోల బరువును తగ్గించుకుంది. "ఇది ఒక మైండ్ గేమ్" అని చెబుతుంది నెస్సీ.‘‘ఇక నేను చేయలేను .. ఆపేస్తా..’’అని చాలాసార్లు అనిపించినా .. ఆమె దివంగత తల్లి ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడిన తీరు గుర్తొచ్చి, తన ప్రయత్నాన్ని కొనసాగించింది. తన సొంత అనుభవంతో రూపొందించుకున్న నిబంధనలు, సూత్రాల ద్వారా నెస్సీ తన ఫ్యాట్‌ను తగ్గించుకునే ప్లాన్‌కు కట్టుబడి ఉంది. చివరికి అనుకున్నది సాధించింది.ఇదీ చదవండి: రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!మూడంటే..మూడు టిప్స్షుగర్కు చెక్: ముఖ్యంగా మూడే మూడు డైట్ చిట్కాలు పాటించినట్టు నెస్సీ చెప్పుకొచ్చింది. చక్కెరను తగ్గించండి, కానీ ఆనందాన్ని , సంతోషాన్ని కాదు సుమా. రోజువారీ ఆహారం నుంచి చక్కెను పూర్తిగా తొలగించాలి. కానీ వారానికి ఒక కేక్ ముక్క లేదా చిన్న చాక్లెట్ ముక్క తినవచ్చు.ఉదయాన్నే వేడి నీళ్లు : ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించాలి. ఇది ఒక చిన్న అడుగే, కానీ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది వెయిట్లాస్కు బాగా ఉపయోగపడుతుంది.చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీట్రస్ట్ది ప్రాసెస్: మీరు పాటిస్తున్న పద్ధతిపై విశ్వాసాన్ని కోల్పోకండి. అద్దాన్ని కాదు.. నమ్మేది.. ట్రస్ట్‌ది ప్రాసెస్ మొదలు పెట్టిన తొలినెలలో మార్పు కనిపించకపోతే.. భయపడకండి అంటుంది ఆమె. ఆ నమ్మకమే తనకు బాగా ఉపయోగపడిందని నెస్సీ వెల్లడించింది. తక్షణం వచ్చే ఫలితంపై కాకుండా, నిరాశపడకుండా, దీర్ఘకాలిక లక్ష్యంపై గురి పెట్టి తన శరీర బరువును తగ్గించుకున్న నెస్సీ స్టోరీ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నోట్ : బరువు పెరగడం, తగ్గడం అనేది శరీరతత్వం, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుందనే గమనించాలి. ఆరోగ్య మార్పులు, వ్యాయామం, విశ్వాసం ప్రధాన పోషిస్తాయి. ఏదైనా కొత్త ఆహారం లేదా ఫిట్నెస్ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Nessy chungath ❇️🧸🌸 (@call_me_nessykutty)
ఫొటోలు


లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)


పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్ (ఫొటోలు)


‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)


హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)


HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)


ట్రెడిషనల్ + వెస్ట్రన్... లాపతా లేడీ సరికొత్త స్లైల్ (ఫొటోలు)


ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)


హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)
అంతర్జాతీయం

దైవం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి
వాటికన్ సిటీ: కొత్తగా ఎన్నికైన పోప్ లియో 14 తన మొదటి ప్రార్థనను నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దైవం పట్ల విశ్వాసాన్ని కలిగించాలని, విశ్వాసం లేకపోవడాన్ని తీవ్రంగా ఎదుర్కోవాలని కాథలిక్ చర్చికి పిలుపునిచ్చారు. చర్చిలు ఈ ప్రపంచంలోని చీకటి రాత్రులను ప్రకాశవంతం చేసే దీపస్తంభాలని, నిర్వహణలో విశ్వసనీయంగా ఉంటానని చెప్పారు. 267వ పోప్‌గా ఎన్నికైన మరుసటి రోజు ఆయన కార్డిన్సల్ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు విశ్వాసానికి దూరమై, సాంకేతికత, డబ్బు, విజయం, అధికారం, ఆనందం వైపు మొగ్గచూపుతున్న ఈ సమయంలో విశ్వాసాన్ని అసంబద్ధంగా భావించే ప్రమాదముందని హెచ్చరించారు. ఇందుకు ప్రచారం అవసరమని గుర్తు చేశారు. ‘విశ్వాసం లేకపోవడమంటే జీవితం అర్థాన్ని కోల్పోవడం, దయను విస్మరించడం, మానవ గౌరవాన్ని ఉల్లంఘించడం, కుటుంబ సంక్షోభమని.. ఇది సమాజానికి చెడు గాయాలను చేస్తుందని ఇటాలియన్లో ప్రసంగించారు. 69 ఏళ్ల పోప్ లియో బంగారంతో అలంకరించిన తెల్లటి పాపల్ వ్రస్తాన్ని ధరించి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాటికన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. మే 18న అధికారిక ప్రమాణ స్వీకారం నూతన పోప్ లియో14 మే 18న అధికారికంగా పోప్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో మొదటి బహిరంగ ప్రార్థన నిర్వహిస్తారు. ఆ తరువాత మొదటి సాధారణ సమావేశం మే 21న జరగనుంది. అయితే.. పోప్ ఫ్రాన్సిస్ మరణంతో సాంకేతికంగా ఉద్యోగాలు కోల్పోయిన వాటికన్ సంస్థల అధిపతులు, సభ్యులందరూ తదుపరి నోటీసు వచ్చేవరకు పదవిలో ఉండాలని లియో కోరారు. పోప్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ పోప్ లియో 14కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘పోప్ లియో 14కు భారత ప్రజల నుంచి హృదయపూర్వక అభినందనలు. శుభాకాంక్షలు. శాంతి, సామరస్యం, సంఘీభావం, సేవ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో కాథలిక్ చర్చి నాయకత్వం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన భాగస్వామ్య విలువలను పెంపొందించడానికి హోలీ సీతో నిరంతర చర్చలకు భారతదేశం కట్టుబడి ఉంది’’అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. పోప్‌కు రాహుల్‌గాంధీ అభినందనలు 2వేల ఏళ్ల చరిత్ర కలిగిన కాథలిక్ చర్చికి మొట్టమొదటి అమెరికన్ పోప్‌గా ఎన్నికైన కార్డినల్ రాబర్ట్ ప్రెవోస్ట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం అభినందించారు. ‘పోప్ లియో 14కు అభినందనలు. ఆయన నాయకత్వంలో శాంతిని, కరుణను, మానవాళికి సేవను పెంపొందించాలి. ఈ సంతోషకరమైన సందర్భంలో ప్రపంచ కాథలిక్ కమ్యూనిటీకి నా శుభాకాంక్షలు’’అని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

పాక్‌కు బిలియన్ డాలర్లు
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి తనకు 100 కోట్ల డాలర్లు మంజూరైనట్టు పాకిస్తాన్ పేర్కొంది. పాక్ ప్రధాని కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు భేటీలో ఇందుకు ఆమోదముద్ర పడ్డట్టు పేర్కొంది. ఇది పాక్‌కు 700 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణ ప్యాకేజీలో భాగం. ఈ మొత్తాన్ని మూడేళ్ల వ్యవధిలో ఇచ్చేందుకు గత జూలైలో ఐఎంఎఫ్ అంగీకరించింది. రుణ వాయిదాల వినియోగాన్ని ఆర్నెల్లకోసారి సమీక్షిస్తూ ఏడు వాయిదాల్లో రుణాన్ని అందజేస్తామని పేర్కొంది. తొలి వాయిదాగా గతంలోనే 100 కోట్ల డాలర్లు అందజేసింది. ఈ రుణంపై భారత్ తొలినుంచీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చుతూ వస్తోంది. ‘‘ఈ నిధులను పాక్ ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలపైనే వెచ్చిస్తుంది. అంతిమంగా ఇది భారత్‌కే గాక అంతర్జాతీయ సమాజానికే పెనుముప్పుగా పరిణమిస్తుంది. కనుక పాక్‌కు రుణసాయాన్ని పూర్తిగా నిలిపేయాలి’’అని కోరుతూ వస్తోంది. పాక్‌కు 100 కోట్ల డాలర్ల విడుదల ప్రతిపాదనను శుక్రవారం నాటి ఐఎంఎఫ్ బోర్డు భేటీలో భారత్ వ్యతిరేకించింది. దానిపై జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పాక్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రచారం చేసుకుంటున్న మోదీ ప్రభుత్వం ఓటింగ్‌కు దూరంగా ఎందుకు ఉన్నట్టు? అలాగాక వ్యతిరేకంగా ఓటేస్తే మన వైఖరిని సమర్థంగా వినిపించినట్టుగా ఉండేది’’అంటూ ఆక్షేపించింది. దివాలా స్థితిలో ఉన్న పాక్‌ను చైనా, సౌదీ అరేబియా, ఖతార్‌తో పాటు ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్‌లే ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నాయి. 2024 నాటికి పాక్ విదేశీ రుణభారం 130 బిలియన్ డాలర్లు దాటింది.

కాస్మోస్ 482’ కూలిపోయే సమయం వచ్చేసింది..!
నాటి సోవియట్ యూనియన్ 53 ఏళ్ల క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ శనివారం భూమ్మీద కూలబోతోంది. వాస్తవానికి ఇది శుక్ర గ్రహాన్ని పరిశోధించేందుకు సోవియట్ 1972లో ప్రయోగించిన ఓ ల్యాండర్ మాడ్యూల్. సాంకేతిక లోపం కారణంగా ఆ ప్రయోగం విఫలమై గత అర్ధ శతాబ్ద కాలానికి పైబడి ‘కాస్మోస్ 482’ వ్యోమనౌక భూమి దిగువ కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. గుండ్రటి ఆకృతిలో ఉన్న ఈ వ్యోమనౌక బరువు 495 కిలోలు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:46 గంటల సమయంలో అది గంటకు 242 కిలోమీటర్ల వేగంతో భూమిపై కూలుతుందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) అంచనా వేసింది. భూమిపై 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య గల సువిశాల ప్రదేశంలో అటు బ్రిటన్ మొదలుకొని ఇటు ఆస్ట్రేలియా వరకు అది ఎక్కడైనా కూలిపోవచ్చని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, పీడనం పరంగా భూమి వాతావరణంతో పోలిస్తే శుక్ర గ్రహంపై కఠినాతి కఠిన పరిస్థితులు ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని శుక్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగేలా ‘కాస్మోస్ 482’ను ప్రత్యేకంగా డిజైన్ చేసి, టైటానియం ఉష్ణరక్షణ కవచంలో ఉంచి ప్రయోగించారు. అందువల్ల భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పటికీ ఇతర అంతరిక్ష నౌకలు, ఖగోళ వస్తువుల మాదిరిగా ‘కాస్మోస్ 482’ గాలి ఒరిపిడికి మండిపోయి శకలాలుగా రాలిపోదని, ‘ఫిరంగి గుండు’ మాదిరిగా ‘ఒకే ముక్క’గా చెక్కు చెదరకుండా భూమిపై కూలుతుందని భావిస్తున్నారు. ఫలితంగా రోదసి నుంచి భూమిపై కూలిపోయే ఇతర వ్యర్థాలతో పోలిస్తే ఈ స్పేస్ క్రాఫ్ట్ పతనం వల్ల తలెత్తే ప్రమాదం తక్కువేనని అంటున్నారు. శుక్రుడిపై దిగే సమయంలో ‘కాస్మోస్ 482’ వేగాన్ని తగ్గించడానికి పారాచూట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అయితే 50 ఏళ్లకు పైగా నౌక అంతరిక్షంలోనే ఉండిపోయినందున సౌర వికిరణం ప్రభావానికి ఆ పారాచూట్ వ్యవస్థ పాడైపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒమన్ సింధుశాఖ, ఈశాన్య ఆఫ్రికా, బోర్నియో, పశ్చిమార్ధ గోళంలోని ప్రదేశాల్లో వ్యోమనౌక కూలవచ్చని, అయితే భూమిపై సముద్ర ప్రాంతాలతో కూడిన జలావరణమే 70% ఉంది కనుక జనావాస ప్రాంతాల్లో అది కూలే అవకాశాలు స్వల్పమని భావిస్తున్నారు. ఇక అది నేరుగా ఒక వ్యక్తిపై పడే సంభావ్యత వేలు, లక్షల వంతుల్లో ఒక శాతం వంతు మాత్రమే. 1961-1984 మధ్య కాలంలో నాటి సోవియట్ తన ‘వెనెరా మిషన్స్’లో భాగంగా శుక్ర గ్రహంపైకి 29 అంతరిక్ష నౌకలను ప్రయోగించగా 10 వ్యోమనౌకలు శుక్రుడిపై విజయవంతంగా దిగాయి. - జమ్ముల శ్రీకాంత్

మోదీని కలిసిన వరల్డ్ బ్యాంక్ చీఫ్: సింధు జలాల ఒప్పందంపై..
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ సింధు జలాల నిలిపివేతపై స్పందిస్తూ.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవడం లేదని వరల్డ్ బ్యాంక్ చీఫ్ 'అజయ్ బంగా' స్పష్టం చేశారు. మా పాత్ర కేవలం ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని అన్నారు.భారతదేశంలో పర్యటిస్తున్న అజయ్ బంగా.. గురువారం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అదే రోజు ఉత్తరప్రదేశ్ మ్యాఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్'ను కలిసిన తరువాత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంక్ అధినేతగా పదవిని స్వీకరించిన తొలి భారతీయ అమెరికన్ సిక్కుగా రికార్డ్ క్రియేట్ చేసిన బంగా.. ఇండియా - పాకిస్తాన్ యుద్ధం సమయంలో మన దేశంలో పర్యటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.1960లో సింధు జలాల పంపకంపై భారతదేశం-పాక్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదంలో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంది. ఆ సమయంలో రెండు దేశాలు ఒప్పందంపై సంతకం చేయడానికి సహాయపడింది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు, రెండు దేశాల ఇంజనీర్లు.. ప్రపంచ బ్యాంకు మధ్య సంప్రదింపులు, రాజకీయ కుతంత్రాలను అధిగమించడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలో మేము జోక్యం చేసుకోవడం లేదని ఆయన స్పష్టం చేసారు.We have no role to play beyond a facilitator. There’s a lot of speculation in the media about how the World Bank will step in & fix the problem but it’s all bunk. The World Bank’s role is merely as a facilitator-World Bank President, Ajay Banga on #IndusWaterTreaty Suspension… pic.twitter.com/6bbiZpKf0o— PIB India (@PIB_India) May 9, 2025
జాతీయం

భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
చెన్నై: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న భారత సైన్యాన్ని విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తులను అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. చెంగల్పట్టు జిల్లా కాట్టాన్‌కొళత్తూర్ సమీపంలోని ఓ ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో లోరా అనే మహిళ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆమె.. సోషల్ మీడియా వేదికగా.. పోస్టులు పెట్టారు. ఆపరేషన్ సిందూర్, భారత సైన్యాన్ని విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్‌లో పోస్టులు పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమెను సస్పెండ్ చేస్తూ వర్సిటీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఆమె పోస్టులో.. బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో భారత్.. పాకిస్తాన్లో ఒక పిల్లవాడిని చంపేసింది. ఇద్దరు వ్యక్తులను గాయపరిచింది. మీ స్వంత రక్తదాహం కోసం, ఎన్నికల విన్యాసాల కోసం అమాయక ప్రాణాలను చంపడం ధైర్యం కాదు.. అది న్యాయం కాదు. ఇది పిరికి చర్య! అని ఆమె తన స్టేటస్‌లో రాసుకొచ్చారు. లాక్డౌన్లు, ఆహార కొరత వంటి అనిశ్చితుల గురించి కూడా ఆమె హెచ్చరించారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. Meet Lora S., an Assistant Professor at SRM Institute of Science & Technology.⁰In the wake of Operation Sindoor, she repeatedly posted anti-Army content on her social media.Is this what passes for academic responsibility at @SRM_Univ?She has now been suspended. pic.twitter.com/1pufrM7kSj— Rakesh M (@Fitsanatani) May 8, 2025

భారత్, పాక్ యుద్ధం.. దేశంలో 32 విమానాశ్రయాలు మూసివేత
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం వేళ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) కీలక ప్రకటన చేసింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలోని 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విమానాశ్రయాల వివరాలను వెల్లడించింది.వివరాల ప్రకారం.. ఉత్తర , పశ్చిమ భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో విమాన కార్యక్రమాలు నిలిపిపోయాయి. 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు AAI తెలిపింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం.. మే 8న తొలుత 24 విమానాశ్రయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 32 విమానాశ్రయాల్లో కార్యక్రమాలను నిలిపివేశారు.విమానాశ్రయాలు ఇవే..అమృత్సర్, చండీగఢ్, జైసల్మేర్, జమ్మూ, పటియాలా, పోర్బందర్, పఠాన్‌కోట్, అవంతిపూర్, బటిండా, భుజ్, బికానెర్, హల్వారా, అధమ్‌పూర్, అంబాలా, హిండన్, జామ్‌నగర్, జోధ్‌పూర్, కండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోద్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లుధియానా, ముంద్రా, నలియా, రాజ్‌కోట్ (హిరాసర్), సర్సావా, షిమ్లా, శ్రీనగర్, థోయిస్ , ఉత్తర్లై.ఈ పరిణామాల నేపథ్యంలో, ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ప్రభావిత ప్రాంతాలకు తమ విమానాలను రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్ , రాజ్కోట్లకు వెళ్లే , వచ్చే విమానాలను రద్దు చేసింది. ప్రయాణికులకు పూర్తి వాపసు లేదా ఒకసారి ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించింది.ఇండిగో కూడా NOTAM పరిధిలోకి వచ్చే అనేక నగరాలకు తమ సేవలను నిలిపివేసింది. ప్రయాణికులు తమ విమాన స్థితిని తెలుసుకోవడానికి, రీబుక్ చేసుకోవడానికి లేదా వాపసు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ లింక్‌లను అందుబాటులో ఉంచింది. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో, ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి. 🚨 India has shut 32 airports for civilian flight operations till May 15. (DGCA) pic.twitter.com/NHoABXPX6d— Indian Tech & Infra (@IndianTechGuide) May 10, 2025

పాక్ దాడుల్లో సీనియర్ అధికారి మృతి.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన
శ్రీనగర్: భారత్,పాకిస్థాన్ మధ్య తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. మరోవైపు.. దాయాదా పాకిస్తాన్.. భారత్ సరిహద్దుల్లో పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా దాడులకు తెగబడింది. తాజాగా పాక్ జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు.వివరాల ప్రకారం.. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది పాకిస్తాన్. ఈ దాడుల్లో శనివారం ఉదయం జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. రాజ్‌కుమార్ జిల్లా డెవలప్మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.Deeply saddened to hear about the tragic loss of Dr. Raj Kumar Thapa, KAS who was posted as ADDC Rajouri in the Pakistani terror attack. Our heartfelt condolences go out to the bereaved family, friends, and loved ones of the victim.Om Shanti! pic.twitter.com/mmZoS1rJWY— IAS Fraternity 🇮🇳 (@IASfraternity) May 10, 2025ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్‌కుమార్ మృతిపై సీఎం ఒమర్ ట్విట్టర్ వేదికగా..‘రాజౌరీని లక్ష్యంగా చేసుకున్న పాక్ జరిపిన దాడుల్లో రాజ్‌కుమార్ మృతి చెందారు. నిబద్ధత కలిగిన ఓ ఆఫీసర్‌ను మనం కోల్పోయాం. ఒక్కరోజు ముందే నేను అధ్యక్షత వహించిన ఆన్లైన్ సమావేశంలో రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఇంతలోనే రాజౌరీలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదు. ఇది మాకెంతో నష్టం’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శుక్రవారం రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల పాకిస్తాన్ దాడులు చేసింది. దీంతో, విద్యుత్తు సరఫరా నిలిపివేసి ‘బ్లాకౌట్’ పాటించారు. శ్రీనగర్, పఠాన్ కోట్ ప్రాంతాల్లో ఉదయం కూడా పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. డ్రోన్లతో పాక్ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు.

భారత్, పాక్‌ల యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
War Live Updates..భారత్, పాక్‌ల యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటనఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయిభారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్ ఇరు దేశాలతో సుదీర్ఘంగా రాత్రంతా చర్చించాఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయిఇరు దేశాలకు కంగ్రాట్స్ pic.twitter.com/lRPhZpugBV— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025 బెంగళూరు నుంచి కళ్లి తండాకు మురళీ నాయక్ పార్థివదేహంపాకిస్తాన్ తో యుధ్ధంలో వీర మరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ పార్థివదేహం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్కడ ఆ వీర జవాన్‌కు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆ జవాన్ పార్థివదేహాన్ని శ్రీసత్యసాయి జిల్లాలోని కళ్లితండా తరలిస్తున్నారు. రేపు(ఆదివారం) సైనిక లాంఛనాలతో వీర మరణం పొందిన ఆ జవాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరో జవాన్ వీరమరణంపాక్ కాల్పుల్లో మరో జవాన్ 'సచిన్ యాదవ్‌రావు వనాంజే' (29) వీరమరణం పొందారు. ఈయన స్వగ్రామం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లాలోని తమ్లూర్.సైరన్ల శబ్దాలు వాడొద్దు.. మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచనసైరన్ల సౌండ్లతో.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందికేవలం అవగాహన కార్యక్రమాల్లోనే వినియోగించాలి ఢిల్లీ :32 విమానాశ్రయాలు మూసివేత9 మే 2025 నుండి 14 మే 2025 వరకు (15 మే 2025న 0529 IST వరకు) ఆపరేషనల్ కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేతభారత విమానాశ్రయాల అథారిటీ (AAI) సంబంధిత విమానయాన అధికారులు జారీ చేసిన ఎయిర్‌మెన్‌కు సూచనల (NOTAMs) వివరాలు 1 తాత్కాలిక విమానాశ్రయ మూసివేత: ◦ ప్రభావిత విమానాశ్రయాల జాబితా: ▪ అధంపూర్ ▪ అంబాలా ▪ అమృత్సర్ ▪ అవంతీపూర్ ▪ బఠిండా ▪ భుజ్ ▪ బికనీర్ ▪ చండీగఢ్ ▪ హల్వారా ▪ హిండన్ ▪ జైసల్మీర్ ▪ జమ్మూ ▪ జామ్‌నగర్ ▪ జోధ్‌పూర్ ▪ కాండ్లా ▪ కాంగ్రా (గగ్గల్) ▪ కేశోద్ ▪ కిషన్‌గఢ్ ▪ కుల్లూ మనాలి (భుంటర్) ▪ లేహ్ ▪ లూధియానా ▪ ముంద్రా ▪ నలియా ▪ పఠాన్‌కోట్ ▪ పటియాలా ▪ పోర్బందర్ ▪ రాజ్‌కోట్ (హిరాసర్) ▪ సర్సావా ▪ షిమ్లా ▪ శ్రీనగర్ ▪ థోయిస్ ▪ ఉత్తర్లై ◦ ఈ కాలంలో ఈ విమానాశ్రయాలలో అన్ని పౌర విమాన కార్యకలాపాలు నిలిపివేయబడతాయి. ఆపరేషన్ సిందూర్.. ఐదుగురు టాప్ ఉగ్రవాదులు హతం26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకున్న భారత్.ముంబై దాడి సూత్రధారిని మట్టుబెట్టిన భారత్.ఉగ్రస్థావరాలపై దాడిలో అబు జిందాల్ మృతిఐదుగురు టాప్ ఉగ్రవాదులను హతమార్చిన భారత్.ఆపరేషన్ సిందూర్ దాడుల్లో భాగంగా ఐదుగురు టాప్-5 టెర్రరిస్టులు హతం.ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతం.మురిద్కే, బహవల్పూర్లో జరిగిన దాడిలో ఉగ్రనేతలు మృతి,మురిద్కే దాడిలో అబు జుందాల్ హతం.అబు అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ చీప్ మునీర్.జైషీ చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది హఫీజ్ మహమ్మద్ జమీల్ హతంలష్కరే ఉగ్రనాయకుడు మహమ్మద్ యూసుఫ్ అజార్ హతం. కాందహార్ హైజాక్ కీలక సూత్రధారి మహమ్మద్ యూసఫ్ ఇవి మే 7వ తేదీ(బుధవారం అర్థరాత్రి) భారత్ మట్టుబెట్టిన ఉగ్రవాదులు వివరాలు Details of terrorists killed in the Indian strikes on 7th May in Pakistan: Sources 1) Mudassar Khadian Khas @ Mudassar @ Abu Jundal. Affiliated with Lashkar-e-Taiba. His funeral prayer was held in a government school, led by Hafiz Abdul Rauf of JuD (a designated global…— ANI (@ANI) May 10, 2025మోదీ హైలెవల్ మీటింగ్త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్ మీటింగ్ప్రధాని నివాసంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమావేశంభేటీలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీ..పాకిస్తాన్ దాడులు, భారత్ కౌంటర్‌పై చర్చ.దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీత్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీరాజ్నాథ్ భేటీలో పాల్గొన్న ఎన్ఎస్ఏ ధోవల్.సరిహద్దుల్లో ఉద్రికత్తలపై గంటకుపైగా చర్చ. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు..శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లుఉదయం 11.45 గంటల సమయంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారుల వెల్లడికొన్ని ప్రాంతాల్లో మోగిన సైరన్లు.. పేలుడు శబ్దాలతో వణికిపోయిన ప్రజలుశనివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించిన అధికారులు Srinagar airport early morning pic.twitter.com/rK9diP6Xov— Maroof (@maroof2221) May 10, 2025పాక్‌కు భారీ నష్టం..పాకిస్తాన్‌పై విరుచుకుపడుతున్న భారత వైమానిక దళం.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాక్‌పై దాడులురెండు రోజులుగా పాక్‌లోని ప్రధాన నగరాలపై వాయుసేన దాడులుభారత వైమానిక దాడుల్లో లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, పెషావర్, ఇస్లామాబాద్‌లో భారీ నష్టం.నూర్ఖాన్, ముర్షీద్, రఫికీ ఎయిర్‌బేస్‌లపై దాడి.నాలుగు పాక్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్.భారత్ దాడులతో పాక్ ప్రజలు నగరాలు వదిలేసి వెళ్లిపోతున్నారు.కరాచీలోనూ భయంతో పాక్ ప్రజలు తరలి వెళ్తున్నారు.ఇస్లామాబాద్‌లో ఇప్పటికే పెట్రోల్ బంక్‌లు బంద్.పాకిస్తాన్లో ఎయిర్‌పోర్టులన్నీ షట్‌డౌన్.సియోల్కోట్లో మరో ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసిన భారత్. అజిత్ దోవల్ భేటీ.. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న అజిత్ దోవల్. సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్న దోవల్.ఇంతకుముందే త్రివిధ దళాలతో భేటీ అయిన దోవల్. ఢిల్లీ..రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం.ౌసౌత్ బ్లాక్‌లో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.పాకిస్తాన్ దాడులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్యలుఉదయం 10:30 గంటకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం. ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించనున్న అధికారులు.పంజాబ్ భటిండాలో రెడ్ అలర్ట్‌ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ.జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న పాకిస్తాన్ కాల్పులు.రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ.#WATCH | J&K: Parts of a damaged drone found in a field in RS Pura. pic.twitter.com/Y3akkre6pQ— ANI (@ANI) May 10, 2025#WATCH | J&K: A house in the civilian area in Jammu suffered massive damage due to heavy shelling by Pakistan. pic.twitter.com/eqbHYcqB9w— ANI (@ANI) May 10, 2025అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..భారత్, పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం.భారీగా భద్రతా దళాల మోహరింపు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ.ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసిన అధికారులు.జమ్ము, రాజస్థాన్, పంజాబ్‌లో జనావాసాలపై పాక్ దాడులు.జానీపూర్ నివాస ప్రాంతంలో పాక్ మిస్సైల్ దాడులు. #WATCH | J&K: SDRF, local police, administration, and other agencies are at the spot. They cordoned off the place near Aap Shambhu Temple where a Pakistani strike occurred.As per the SDRF personnel, there has been no casualty. pic.twitter.com/FLLcHEc96X— ANI (@ANI) May 10, 2025పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు.. పాక్ మిలిటరీ పోస్ట్.. టెర్రర్ లాంఛ్‌ప్యాడ్ ధ్వంసంసరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులునియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న దాయాది.ఆ పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీపంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్ క్షిపణి శకలాలు లభ్యంజమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభ్యంపౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు. #WATCH | A projectile debris in Rajasthan's Barmer as Pakistan started targeting civilian areas. pic.twitter.com/tENtKWlLOa— ANI (@ANI) May 10, 2025 #WATCH | J&K | Splinters and debris of a projectile retrieved from Akhnoor pic.twitter.com/SR3qe3gHbv— ANI (@ANI) May 10, 2025 పాక్‌కు చుక్కలే..పాక్ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.పాక్ డ్రోన్లను, మిస్సైల్స్‌ను కూల్చివేసిన భారత్. #WATCH | Parts of a projectile found in a field in Amritsar, Punjab. pic.twitter.com/bPxXOxWT8n— ANI (@ANI) May 10, 2025#WATCH | Amritsar, Punjab | Debris of a drone were recovered from a field in Muglani Kot village pic.twitter.com/zxmklvX2tL— ANI (@ANI) May 10, 2025 #WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw— ANI (@ANI) May 10, 2025నేడు భారత సైన్యం మీడియా సమావేశం.నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.ఆపరేషన్ సిందూర్ 2.0పై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్ దాడులు తీవ్రతరం..లాహోర్, ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ దాడులు. మూడు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున పాక్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు.వీటిల్లో ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న కీలక స్థావరంరెండు పాకిస్థాన్ ఫైటర్ జెట్ల కూల్చివేతశ్రీనగర్ బేస్ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్‌పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున 5 గంటలకు వినిపించిన శబ్దాలుశ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుఆకాష్ జెట్‌తో పాక్ క్షిపణులను కూల్చివేసిన భారత్. Pakistan tried to hit the capital of India, New Delhi by it's long range missile Fateh-2But intercepted by Barak-8 missile defence system in Sirsa of Haryana#IndianArmy please ekbar attacking mode me aajao 😡🙏#IndiaPakistanWar #IndianNavyAction pic.twitter.com/x3kd7v87W2— Priyanshu Kumar (@priyanshu__63) May 9, 2025📹VIDEO : Pakistani citizen (lahore) sharing reality of Indo-pak war. exposed Pakistan's failure & pak media lies.India is right on Top. 👍👍 pic.twitter.com/Ff44gptNlc— Vaishnavi (@vaishu_z) May 9, 2025 Lahore, Pakistan is now being targeted by India. Pakistan’s 2nd largest city and one that is fully undisputed.This war is escalating very quickly. pic.twitter.com/6lzojd3DcY— Spencer Hakimian (@SpencerHakimian) May 10, 2025పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు.పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత. పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలు నిలిపివేత.పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు చేసింది. లాహోర్, రావాల్పిండి, పెషావర్లపై దాడి చేసింది. నూర్ఖాన్, మురీద్, రఫికి ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిన భారత్. డ్రోన్స్, మిస్సైల్స్‌తో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసిన భారత్.నూర్ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అటు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు.భారత్ వ్యూహ్మాతక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులను తెగబడింది.జమ్ము,శ్రీనగర్, అమృత్సర్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్.భారత్‌లోని 26 ప్రదేశాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.మిస్సైల్స్ ద్వారా పాక్ దాడులను అడ్డుకున్న భారత్.ఫతా వన్ మిస్సైల్‌ను ధ్వంసం చేసిన భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.#WATCH | Jalandhar, Punjab: Parts of a Pakistan drone recovered after a blast in Kanganiwal village in Rural Jalandhar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ZogqS588tR— ANI (@ANI) May 10, 2025 #WATCH | Loud explosions are being heard in Poonch area of Jammu and Kashmir. (Visuals deferred by unspecified time) pic.twitter.com/VkjzgY8jYc— ANI (@ANI) May 10, 2025టార్గెట్ పఠాన్‌కోట్..పఠాన్‌కోట్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్.రెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్.అన్నిచోట్ల పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత సైన్యం.భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఎయిర్‌బేస్ బంద్.. అన్ని విమానాలను రద్దు చేసిన పాక్.శ్రీనగర్ టార్గెట్‌గా పాకిస్తాన్ ాదాడులు.శ్రీనగర్‌లోని రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు. At least 4 airbases in Pakistan have been targeted by Indian strikes: Sources pic.twitter.com/3ZegA6YmzM— ANI (@ANI) May 10, 2025పాక్ డ్రోన్లు దాడులు.. సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. చీకట్లు పడుతూనే జమ్ము కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది.కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జోద్పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

రూ.50 లక్షల ఆభరణాలు : చెల్లని చెక్కు ఇచ్చి చెక్కేసిన కిలాడీ
గచ్చిబౌలి: సినీ ప్రముఖులు, రాజకీయ పెద్దలు తెలుసని బిల్డప్ ఇస్తూ విలువైన నగలను ఆర్డర్ చేసి ఉడాయించిన ఓ కిలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాయమాటలు చెప్పి రూ.50 లక్షల విలువ చేసే నగలను తీసుకుని బిల్లులు చెల్లించకుండా తిరుగుతున్న మహిళ కోసం రాయదుర్గం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజుల క్రితం అబిడ్స్‌లోని ఓ నగలు షాపు యజమానికి రమాదేవి అనే మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసి వివిధ డిజైన్ల నగలను ఎంపిక చేసుకుంది. దాదాపు రూ.50 లక్షల విలువైన నలను రాయదుర్గం పీఎస్ పరిధిలోని తాను నివాసం ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీకి తెప్పించుకుంది. చెక్ ఇచ్చి కొంత డబ్బు తక్కువగా ఉందని రెండు రోజుల తర్వాత బ్యాంకులో వేసుకోవాలని సూచించింది. అయితే ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేసింది. బాధితులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రమాదేవి కోసం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండా గతంలో ఇదే తరహాలో నగలు కాజేసిన ఆమెపై నార్సింగి పీఎస్ పరిధిలో ఒకటి, రాయదుర్గం పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. అయినా తన తీరుమార్చుకోని సదరు మహిళ సినీ ప్రముఖులు, రాజకీయనాయకులతో దిగిన ఫొటోలు చూపిస్తూ, తాను ధనవంతురాలినని బిల్డప్ ఇస్తూ జ్యువెల్లర్ షాపుల యజమానులతో పరిచయం చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో నమ్మకంగా ఉన్నట్లు నమ్మిస్తుంది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో విలువైన నగలు తీసుకుని మోసాలకు పాల్పడుతోంది. గతంలో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చినన పోలీసులు ఈ సారి ఆమెను అరెస్ట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తోగొంతు కోసి..మృతదేహాన్ని తగులబెట్టి..చాంద్రాయణగుట్ట: ఓ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేయడమేగాక మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ కేశవగిరి హిల్స్ ప్రాంతంలో కేతావత్ బుజ్జి (55), రూప్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త, కుమారుడు మరో ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న బుజ్జి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. బుధవారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అర్ధరాత్రి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం తగలబడుతున్నట్లు గుర్తించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె మృతదేహం సగం కాలిపోయింది. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బుజ్జిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ

నకిలీకి ‘అసలు సీఐ’ తోడు
పీఎం పాలెం (విశాఖపట్నం): మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ ఏసీబీ సీఐ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. నకిలీ ఏసీబీ సీఐ అవతారం ఎత్తిన బలగ సుధాకర్.. ‘సీఐ’గా పనిచేస్తున్న స్వర్ణలతను ‘ఏసీబీ ఎస్పీ’గా పేర్కొంటూ సబ్ రిజిస్ట్రార్ (sub registrar) చక్రపాణిని మభ్యపెట్టాడు. ‘ఏసీబీ దాడుల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే సుధాకర్ కోరినట్లుగా రూ. 5 లక్షలు ఇచ్చేయండి’ అంటూ ఆమె కూడా చక్రపాణికి ఫోన్లో తెలిపారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న సుధాకర్ ఫోన్ నంబరు ఆధారంగా చేసిన దర్యాప్తులో తాజా అంశం బట్టబయలైంది. దీంతో గతంలో వైజాగ్‌లో పనిచేసి ప్రస్తుతం బాపట్ల (Bapatla) రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత ప్రమేయం ఈ కేసులో ఉందని పోలీసులు తేల్చారు. ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్టయిన సుధాకర్‌తోపాటు, సీఐ స్వర్ణలతను రిమాండ్ నిమిత్తం భీమిలి కోర్టుకు తరలించామని స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపారు.అసలేం జరిగింది? బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బలగ సుధాకర్ వచ్చాడు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి, తనను ఏసీబీ సీఐగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో మీ ఆఫీసులో రైడ్ జరగబోతోందని, తనకు 5 లక్షల రూపాయలు ఇస్తే దాడుల ముప్పు నుంచి మిమ్మల్ని కాపాడతానని నమ్మబలికాడు. అతడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పీఎం పాలెం పోలీసులకు చక్రపాణి సమాచారం ఇచ్చారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. చదవండి: అంతుచూసిన అనుమానం.. భర్త చేతిలో భార్య దారుణ హత్య

ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు
సనత్‌నగర్: ఉద్యోగం కోసం వచ్చినన ఓ వ్యక్తి రూ.1.40 లక్షల విలువైన రెండు ఐఫోన్లను చోరీ చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట డీఐ జి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేటలోని ఎఫ్డీఆర్ ఆర్డీ టవర్స్‌లో గల జెప్టో కార్యాలయానికి స్టోర్ ప్యాకర్‌గా పనిచేసేందుకు బాలానగర్‌లోని జింకలవాడకు చెందిన గౌతమ్ అంకిత్‌పాత్ర (24) ఈ నెల 3వ తేదీన వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత స్టోర్‌లో పనిచేసేందుకు అంగీకరించాడు. స్టోర్‌ను ఒకసారి చూసి వస్తానని చెప్పి స్టోర్‌లో కనిపించిన రెండు విలువైన ఐఫోన్లను తీసి దాచుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కార్యాలయానికి రాలేదు. ఆ తర్వాత స్టోర్ ఆడిట్ చేసిన నిర్వాహకులు రెండు ఐఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గౌతమ్ అంకిత్‌పాత్ర సెల్ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు స్టోర్ ఉద్యగి తిలక్‌కుమార్ బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సికింద్రాబాద్: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచి్చన వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ఒడిశా రాష్ట్రం పలపాతి గ్రామానికి చెందిన జడునాథ్ ముర్ము, మల్హో మణి ముర్ము(26) దంపతులు. ఈ నెల 6న సాయంత్రం 8 గంటల సమయంలో భార్యభర్తలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకొని విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలెక్కారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ ఫాం నంబర్ 1లోని గేట్ నంబర్ 5 వద్ద కూర్చున్నారు. టూత్‌పేస్ట్ తీసుకొచ్చేందుకు భర్త జడునాథ్ బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా భార్య మల్హో మణి ఆచూకీ లభించకపోవడంతో జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లో యువకుడి ఆత్మహత్య చిక్కడపల్లి: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌కు వచి్చన గుర్తుతెలియని యువకుడు అక్కడే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన మెట్రో సిబ్బంది 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు
కర్నూలు (సెంట్రల్)/వెల్దుర్తి: కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు హత్య కేసులో 11 మంది నిందితులపై నేరం రుజువైంది. వీరందరికీ జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి జి. కబర్థి గురువారం తీర్పు చెప్పారు. మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డి అనుచరులతో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో పెళ్లికి రెండు వాహనాల్లో బయల్దేరారు. నిందితులు రెండు ట్రాక్టర్లలో వచ్చి నారాయణరెడ్డి కారును ఢీకొట్టి నారాయణరెడ్డిపై దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన సాంబశివుడునూ అంతమొందించారు. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదుచేసి 19 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. నిందితులుగా ఉన్న ప్రస్తుత పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ప్రస్తుత వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మలు హైకోర్టును ఆశ్రయించగా వీరి పేర్లు కేసు నుంచి తొలగించారు. ఏ4గా ఉన్న కోతుల రామాంజనేయులు చనిపోవడంతో మొత్తం 16 మందిపై తుది విచారణ సాగింది. ఇందులో 11 మందికి జీవిత ఖైదు పడగా, ఐదుగురిపై నేరం రుజువు కాలేదు. జీవిత ఖైదు పడిన నిందితులు వీరే.. కురువ రామాంజనేయులు, రామయ్యనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకటరాముడు, గంటల శీను, బీసన్నగారి రామాంజనేయులు(40), బీసన్నగారి రామాంజనేయులు(42), బీసన్నగారి పెద్ద బీసన్నలకు జీవితఖైదు పడింది. చాకలి నారాయణ, కర్రి గిడ్డయ్య, చెరుకులపాడు గోపాల్, చిన్న వెంకటలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బీసన్నగారి పెద్ద బీసన్న వయస్సు ప్రస్తుతం 83 ఏళ్లు. నిందితుడు ఆత్మహత్యా యత్నం.. నిందితుల్లో ఒకరైన రామాంజనేయులును వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తలను వాహనం కిటికీకి కొట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకే.. నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు హత్యకేసులో తమకే ఎందుకు జీవితఖైదు పడిందని, కేఈ శ్యాంబాబుకు ఎందుకు శిక్ష పడలేదని నిందితులు కురువ రామాంజనేయులు, బీసన్నగారి రామాంజనేయులు ప్రశ్నించారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకు పోవాల్సిందేనని, ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మొద్దని.. వారెలాంటి సాయం చేయరని, తమకు తగిన శాస్తి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.చట్టం, కోర్టులపై నమ్మకం పెరిగింది.. నారాయణరెడ్డి సతీమణి,మాజీఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనంతరం.. కర్నూలులోని తన స్వగృహంలో నారాయణరెడ్డి సతీమణి, కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ అంశంపై స్పందించారు. కోర్టు తీర్పుతో, పోలీసులు కేసులో చూపిన తెగువతో తమకు, ప్రజలకు చట్టంపై, కోర్టులపై నమ్మకం పెరుగుతోందన్నారు. తన భర్త నారాయణరెడ్డి బతికుంటే ఎమ్మెల్యే కాలేమన్న భయంతోనే కేఈ శ్యాంబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆమె ఆరోపించారు. నారాయణరెడ్డి హత్య కేసు తీర్పును చూసి ప్రజలు కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. నారాయణరెడ్డి సోదరుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే తన తండ్రిని, తన సోదరుడిని పోగొట్టుకున్నామన్నారు.
వీడియోలు


దేశాన్ని రక్షించడానికి నా సిందూరాన్ని పంపుతున్నా


26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులు.. నేలమట్టం చేసిన భారత సైన్యం


ప్రజలకు ఇవ్వాల్సింది పోయి వారి దగ్గర నుంచే దోచుకుంటున్నారు: Karumuri Nageswara


గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్


సీమ రాజాకు ఇక చుక్కలే. .. అంబటి సంచలన నిర్ణయం


నడిరోడ్డుపై ఒక మహిళను.. వీళ్లు పోలీసులేనా..!


ఎప్పుడు పిలిచినా యుద్ధానికి రెడీ


S400 చూసి వణికిపోతున్న పాక్ ఫేక్ ప్రచారంతో శునకానందం


మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం


బగ్లీహార్, సలాల్ డ్యామ్స్ గేట్లు తెరిచిన ఇండియా