
సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ (91) మృతదేహం వద్ద విలపిస్తున్న కుమార్తె ఇరినా. అనారోగ్యంతో మంగళవారం మరణించిన గోర్బచెవ్ అంత్యక్రియలు శనివారం మాస్కోలో నిరాడంబరంగా ముగిశాయి. భార్య రైసా సమాధి పక్కనే ఆయన పార్థివ దేహాన్ని ఖననంచేశారు.
అభిమాన నేతను కడసారి చూసుకునేందుకు రష్యా పౌరులు భారీగా పోటెత్తారు. అంత్యక్రియల్లో అధ్యక్షుడు పుతిన్ పాల్గొనలేదు. సోవియట్ కుప్పకూలడానికి గోర్బచెవే కారకుడనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను పాల్గొనాల్సి వస్తుందనే అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపలేదని కూడా చెబుతున్నారు.