
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంక ట్రంప్(43) ప్రాచీన సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ జియూ–జిత్సూ(జుజుత్సూ)లో చక్కటి ప్రావీణ్యం సంపాదించారు. ఆమె జుజుత్సూలో శిక్షణ పొందుతున్న వీడియోను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, మియామీలోని ఓ వ్యాయామశాలలో ఇవాంక ట్రంప్ జుజుత్సూ నైపుణ్యాలను ప్రదర్శించారు. తన ప్రత్యర్థని క్షణాల్లో మట్టికరిపించారు. నీలం రంగు బెల్ట్ ధరించిన ఇవాంక తన హస్త లాఘవంతో అందరినీ ఇంప్రెస్ చేశారు. జుజుత్సూలో ఆమె బలం, క్రమశిక్షణ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో బ్లూబెల్ట్ సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. ఇవాంక ట్రంప్ జుజుత్సూను నిత్యం సాధన చేస్తుంటారు.
ఇక, డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇవాంక ట్రంప్ ఆయనకు సీనియర్ సలహాదారుగా సేవలందించారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబ బాధ్యతలకే పరిమితం అవుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ కుటంబ, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తనకు దొరికిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
Ivanka Trump is a Jiu-Jitsu badass pic.twitter.com/IFtJROhjTt
— Sara Rose 🇺🇸🌹 (@saras76) March 22, 2025