
అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్(GFP Index) విడుదల చేసింది. ఇందులో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసేంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్
సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకత, సాంకేతిక, భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూకే, దక్షిణకొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్.. నాల్గో స్థానాన్ని నిలబెట్టుకుంది.
యూఎస్ఏ (పవర్ ఇండెక్స్ 0.0744)
2,127,500 మంది సైనిక శక్తితో యూఎస్ఏ అగ్రస్థానంలో నిలిచింది. 13, 043 విమానాలు, 4, 640 యుద్ధ ట్యాంకుర్లతో కూడిన బలీయమైన సైనిక శక్తితో అమెరికా ఉంది. దాంతోపాటు అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా అమెరికా సొంతం. అత్యాధునిక సాంకేతికత, వైమానిక ఆధిపత్యం కూడా అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి.
రష్యా (పవర్ ఇండెక్స్0.0788)
అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఉక్రియెన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. చైనాతో వ్యూహాత్మక పొత్తులను కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది.
చైనా (పవర్ ఇండెక్స్ 0.0788)
పవర్ ఇండెక్స్ పాయింట్లలో రష్యాతో కలిసి పంచుకుంటున్న చైనా.. అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. చైనా సైనిక విస్తరణ, సాంకేతిక పురోగతి, ఆర్థిక శక్తి తదితర అంశాలు ప్రపంచ వేదికపై ఆ దేశ సైనిక పురోగతని చూపెడు\తోంది. 6,800 యుద్ధ ట్యాంకర్లతో అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్ కల్గిన దేశంగా చైనా ఉంది. చైనా 3,170,000 సైనిక సిబ్బందితో పాటు 3,309 యుద్ధ విమానాలను కల్గి ఉంది.
భారత్ (పవర్ ఇండెక్స్ పాయింట్లు 0.1184)
ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాలలో ఒకటిగా ఉన్న భారత్,.. నాల్గో స్థానంలో ఉంది. 5,137,550 మంది సైన్యం, 2,229 యుద్ధ విమానాలు, 4, 201 యుద్ధ ట్యాంకర్లతో భారత్ నాల్గో స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను, అణ్వాయుధాలను కల్గిన భారత్.. ఆసియా అంతటా వ్యూహాత్మకంగా తన ఉనికిని విస్తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.
దక్షిణకొరియా (పవర్ ఇండెక్స్ 0.1656)
పవర్ ఇండెక్స్ జాబితాలో దక్షిణాకొరియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 3,820,000 సైనిక సిబ్బంది, 1, 592 యుద్ధ విమానాలు, 2, 236 యుద్ధ ట్యాంకర్లు దక్షిణకొరియా సొంతం. అత్యంత అధునాతన టెక్నాలజీ కల్గిన రక్షణ రంగంలో దక్షిణకొరియాది ప్రత్యేక స్థానం. దాంతోపాటు అమెరికాతో సాన్నిహిత్య సంబంధాలు కూడా దక్షిణకొరియా సైనిక బలానికి మరింత దోహదం చేస్తోంది,. ప్రధానంగా సరిహద్దుల్లో ఉత్తరకొరియాతో ఉన్న వైరంలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులను దక్షిణకొరియా ఎప్పటికప్పుడు చాకచక్యంగా తిప్పికొడుతోంది.
యూకే (పవర్ ఇండెక్స్ 0.1785)
పవర్ ఇండెక్స్ స్కోరులో యునైటెడ్ కింగ్ డమ్(యూకే) ఆరోస్థానంలో ఉంది. 1,108,860 మంది సైనిక సిబ్బందితో పాటు 631 ఎయిర్ క్రాఫ్ట్ లు, 227 యుద్ధ ట్యాంకర్లు యూకే కల్గి ఉంది. పవర్ ఫుల్ నేవీ, శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యం యూకే సొంతం. నాటో సభ్యత్వం కల్గిన దేశాల్లో యూకే కీలక పాత్ర పోషిస్తోంది.
ఫ్రాన్స్ (పవర్ ఇండెక్స్ 0.1878)
అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో ఫ్రాన్స్ ది ఏడో స్థానం. 376,000 మంది సైనికి శక్తి, 976 ఎయిర్ క్రాఫ్ట్ లు, 215 యుద్ధ ట్యాంకర్లను ఫ్రాన్స్ కల్గి ఉంది. నాటోతో పాటు, యూరోపియేన్ భద్రత విభాగంలో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషిస్తోంది. అధునాతన ఆయుధ శక్తిని ఫ్రాన్స్ కల్గి ఉంది. అధునాతమైన అణ్వాయుధాలను కల్గిన దేశంగా ఫ్రాన్స్ ఉంది.
జపాన్ (పవర్ ఇండెక్స్ 0.1839)
సైనిక శక్తిలో జపాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. 328,150 సైనిక శక్తి, 1, 443 ఎయిర్ క్రాఫ్ట్ లు, 521 యుద్ధ ట్యాంకర్లను జపాన్ కల్గి ఉంది. మిలటరీ విభాగంలో సాంకేతికపరంగా అడ్వాన్స్ డ్ గా ఉన్న దేశం జపాన్. త్యున్నత సైనిక శిక్షణ కల్గిన దేశంగా జపాన్ కొనసాగుతోంది. ప్రధానంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో జపాన్ సైనిక శక్తి అత్యంత బలంగా ఉంది.
టర్కీ (పవర్ ఇండెక్స్ 0.1902)
టర్కీది తొమ్మిదో స్థానం. 883,900 సైనిక సిబ్బంది, 1,083 ఎయిర్ క్రాఫ్ట్స్, 2,238 యుద్ధ ట్యాంకర్లు ఫ్రాన్స్ కల్గి ఉంది. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ వ్యవహారాల్లో టర్కీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోంది. ఎయిర్ ఫోర్స్, మిలటరీ విభాగాల్లో టర్కీ అత్యంత బలంగా ఉంది.
ఇటలీ (పవర్ ఇండెక్స్ 0.2164)
అత్యంత బలమైన సైనిక శక్తి కల్గిన దేశాల టాప్ 10 జాబితాలో ఇటలీది పదో స్థానం. 280,000 సైనిక శక్తిని ఇటలీ కల్గి ఉంది. 729 ఎయిర్ క్రాఫ్ట్ లు, 200 యుద్ధ ట్యాంక్లరు ఇటలీ కల్గి ఉంది. నాటోలో ఇటలీ ముఖ్య భూమికను పోషిస్తూ ఉంది.
పవర్ ఇండెక్స్ లెక్క ఇలా..
పవర్ ఇండెక్స్ స్కోరును లెక్కించేటప్పుడు అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఒక దేశానికి అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్ ఉండి, అదే దేశానికి నేవీ బలం తక్కువగా ఉంటే, ఆ దేశం మొత్తం స్కోరులో వెనకంజలో ఉంటుంది. ఇక్కడ సైనిక బలాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా లెక్కించి ఒక అంచనా వేస్తారు. పవర్ ఇండెక్స్ స్కోరు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంత బలంగా ఉన్నట్లు అర్ధం.
.