
నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నా రు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
లింగాలఘణపురం: దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.భాస్కర్ అన్నా రు. గురువారం జీడికల్ వీరాచల శ్రీరామచంద్రస్వామి ఆలయంలో జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన దేవాలయాల ఈఓలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయాల పేర్లతో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల ని, నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఆదేశించా రు. ఈఓలు లక్ష్మీప్రసన్న, వంశీ పాల్గొన్నారు.
నేడు మార్కెట్‌కు సెలవు
జనగామ: గుడ్ ఫ్రైడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు నేడు(శుక్రవారం) సెలవు ప్రకటించినట్లు చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు. 19న మార్కెట్ సేవలు కొనసాగుతాయని తెలిపారు.
24న ఉచిత విద్య
టాలెంట్ టెస్ట్
జనగామ రూరల్: నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య లక్ష్యంతో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యాన ఈనెల 24న జిల్లా కేంద్రంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రావు, వెంకటేష్ తెలి పారు. గురువారం పట్టణంలో వారు మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిభా వంతులైన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ద్వారా ఉచిత విద్య అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4,5,6 తరగతులు చదివే వారికి అర్హత పరీక్ష ద్వారా 5,6,7 తరగతుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉందన్నారు. డిగ్రీ, ఆపై విద్య వరకు ఉచిత హాస్టల్ ప్రవేశంతో కూడిన విద్య అందించనున్నట్లు వివరించారు.
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
రఘునాథపల్లి: పౌష్టికాహారంతోనే ఆరోగ్యంగా ఉంటామని డీడబ్ల్యూఓ ఫ్ల్లోరెన్స్ అన్నారు. గురువారం నిడిగొండ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వ హించిన పోషణ పక్షం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రు పాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంద ని, ఆరునెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అంది స్తున్న పోషకాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంగన్‌వాడీ టీచర్లు సీహెచ్.జయలక్ష్మి, వీరలక్ష్మి, అంజనీబాయి, శోభ పాల్గొన్నారు. అలాగే శ్రీమన్నారాయణపురం, భాంజీపేట అంగన్‌వా డీ కేంద్రాల్లో పోషణ పక్షంలో భాగంగా ఆకలి పరీక్ష నిర్వహించారు.