
కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
జనగామ రూరల్: పెట్టుబడి దారులకు దేశ సంపదను దోచిపెడుతూ కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ పిలుపునిచ్చారు. అఖిలభారత కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో బీఆర్‌టీయూ అల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తోందన్నారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు యాటాల సోమన్న, రాపర్తి రాజు, ఆకుల శ్రీనివాస్, మోటే, శ్రీశైలం, చుంచు విజేందర్, జేరిపోతుల కుమార్, ఎండీ అంజాద్ పాషా, రమాదేవి పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర
ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ