
ట్రాక్టర్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
మాక్లూర్: మండలంలోని చిక్లీ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని చిక్లీ గ్రామానికి చెందిన ర్యాపని ఒడ్డె గంగాధర్(48) ఆదివారం సాయంత్రం గ్రామ శివారులో రోడ్డు పక్కన తన బైక్‌ను నిలిపి, కూర్చున్నాడు. అదే గ్రామానికి చెందిన కారం నవీన్ ట్రాక్టర్ నడుపుతూ వేగంగా వచ్చి గంగాధర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అతడు మృతిచెందాడు. ఇదిలా ఉండగా ట్రాక్టర్ నడిపిన కారం నవీన్ ట్రాక్టర్‌తోపాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఇద్దరి మధ్య భూ తగాదాలు..
నవీన్‌కు, మృతుడు గంగాధర్‌కు మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని కొనుగోలు కేంద్రం వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈక్రమంలో నవీన్ ట్రాక్టర్‌తో కావాలనే అతడిని ఢీకొట్టాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యగా చిక్లీలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేసి, ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు నవీన్‌పై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
పోలీసులకు లొంగిపోయిన నిందితుడు