
రావుల మధుకు డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి రావుల మధు పీహెచ్‌డీ డాక్టరేట్ సాధించారు. వర్సిటీ అధ్యాపకుడు వాసం చంద్రశేఖర్ పర్యవేక్షణలో ‘ప్రిపరేషన్ డెవలప్‌మెంట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ నావెల్ నానో క్రిస్టలైన్ సిరియా బేస్డ్ ఎట్రోజీనియస్ క్యాటలిస్ట్ ఫర్ ది కటలిటీక్ ఎవాల్యూషన్ ఆఫ్ సెలెక్టివ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆరోమాటిక్ అమైన్‌న్స్’ అనే అంశంపై మధు పరిశోధన జరిపారు. బుధవారం నిర్వహించిన బహిరంగ మౌఖిక పరీక్షకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టీ సవిత జోత్స్న ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, సైన్స్ డీన్ ఆచార్య కే సంపత్ కుమార్, బోయపాటి శిరీష, అధ్యా పకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.