
తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త విలీన గ్రామాలతో సహా నగరంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. విలీన గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాపై ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో డీఈ, ఏఈలు పర్యవేక్షించాలని సూచించారు. నల్లానీరు రాని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా అందించాలన్నారు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి టెండర్ ప్రక్రి య చేపట్టాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చే యాలని, సీఎంఏ పనుల్లో గ్యాబ్స్ ఉంటే పరిష్కరించాలన్నారు. వీధి దీపాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. బాక్స్‌ల్లో సమయ వేళలు మార్చాలన్నారు. నాలాల్లో సిల్ట్ తొలగించేందుకు టెండర్లు పిలవాలన్నారు. ఈఈలు యాదగిరి, సంజీవ్, డీఈలు లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఓంప్రకాశ్, ఏఈలు సతీశ్, గట్టు స్వామి పాల్గొన్నారు.