మాట్లాడుకుందామని.. మట్టుబెట్టాడు | - | Sakshi
Sakshi News home page

మాట్లాడుకుందామని.. మట్టుబెట్టాడు

Published Tue, Apr 29 2025 12:12 AM | Last Updated on Tue, Apr 29 2025 12:12 AM

మాట్ల

మాట్లాడుకుందామని.. మట్టుబెట్టాడు

పెద్దపల్లిరూరల్‌: అక్రమసంబంధం నేపథ్యంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తన భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని జీర్ణించుకోలేక.. ఈ విషయమై కొంతకాలంగా సదరు యువకుడితో గొడవ జరుగుతున్నా.. అతడిలో మార్పు రాకపోవడం.. తను కాదంటున్న వెంట పడుతున్నాడంటూ భార్య చెప్పడంతో రగిలిపోయిన భర్త.. మాట్లాడుకుందాం రా.. అని పిలిచి కిరాతకంగా చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్‌(35) తన భార్య అనిత, ముగ్గురు పిల్లలతో పెద్దపల్లిలోనే నివాసముంటూ ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్‌కుమార్‌కు కుమార్‌ భార్య అనిత పినతల్లి కూతురు శైలజతో పెళ్లయింది. వరసకు మరదలు అయ్యే శైలజతో కుమార్‌ చనువుగా మెదలుతుండడాన్ని సంతోష్‌ తట్టుకోలేక పోయాడు. ఈ విషయమై కుమార్‌తో గొడవకు దిగాడు. కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా కుమార్‌ ప్రవర్తనలో తేడా కనిపించలేదు. తన భార్య శైలజను నిలదీయడంతో తను కాదంటున్న వెంటపడుతూ వేధిస్తున్నాడంటూ చెప్పడంతో సంతోష్‌లో కోపం ఉగ్రస్థాయికి చేరింది. ఈక్రమంలో సోమవారం సంతోష్‌ ‘మాట్లాడుకుందాం రా’ అని కుమార్‌ను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు పిలిచాడు. మార్కెట్‌ యార్డు ఆవరణలో తన భార్య, అక్కడున్నవారు చూస్తుండగానే కుమార్‌ను సంతోష్‌ కత్తితో నరికిచంపాడు. ఘటన స్థలాన్ని డీసీపీ కరుణాకర్‌, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్‌ పరిశీలించారు.

రమ్మని పిలిచి చంపేశారు..

పొలం కుమార్‌ ఇంట్లో ఉండగా సంతోష్‌కుమార్‌, శైలజ నుంచి ఫోన్‌ వచ్చిందని మృతుడి భార్య అనిత తెలిపింది. వెంటనే బయటకు వెళ్తుండగా ఎక్కడికి అని అడిగితే ‘సంతోష్‌, శైలజ తనతో మాట్లాడుతారట. వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రమ్మంటున్నారు’. అని బయటకు వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోయాడని రోదించింది. శైలజ తన భర్తతో చనువుగా ఉంటూ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు వెంట పడుతున్నాడంటూ చెప్పి కోపం పెరిగేలా చేసిందని పేర్కొంది. అక్రమసంబంధం ఉందనే అనుమానంతో తన భర్తను దారుణంగా చంపారని విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

అందరూ చూస్తుండగానే అఘాయిత్యం

కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు

మృతుడు, హంతకుడు సమీప బంధువులే

మాట్లాడుకుందామని.. మట్టుబెట్టాడు1
1/1

మాట్లాడుకుందామని.. మట్టుబెట్టాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement