సాక్షి నెట్‌వర్క్: అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న, వరి, మామిడిపంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన గాలిదుమారం, ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. వర్షపు నీరు రాశుల్లోకి చేరి ధాన్యం తడిసి రైతులు మనోవేదనకు గురవుతున్నారు. అలాగే బయ్యారం, దంతాలపల్లి, నర్సింహులపేట, తదితర మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. పలు చోట్ల ఇంటిపై కప్పులు లేచిపడ్డాయి. ప్రభుత్వం స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు.
ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.. :
ఉద్యానవన శాఖ అధికారి శాంతిప్రయదర్శిని
దంతాలపల్లి: అకాల వర్షాలతో దెబ్బతిన్న మామిడి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్టం తీవ్రతను ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శాంతిప్రయదర్శిని అన్నారు. బుధవారం మండలంలోని రేపోపి, వేములపల్లి, రామానుజపురం, పెద్ద ముప్పారం, రామవరం గ్రామాల్లో పర్యటించి మామిడితోటలను పరిశీలించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పంటలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి దీక్షిత్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం
నేలరాలిన మామిడికాయలు
కేసముద్రం మార్కెట్‌లో తడిసిన ధాన్యం
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
– మరిన్ని ఫొటోలు 9లోu
అకాల వర్షం..తీరని నష్టం
అకాల వర్షం..తీరని నష్టం
అకాల వర్షం..తీరని నష్టం