
ఏషియన్ పారా త్రోబాల్ పోటీల్లో ప్రతిభ
భీమారం: ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన ఉస్కమల్ల కళ్యాణ్ ప్రతిభ చాటాడు. మార్చి 28 నుంచి 30వరకు కాంబోడియా రాజధాని పీనంపెన్‌లో జరిగిన మొదటి ఏసియన్ పారా త్రోబాల్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీల్లో ఎనిమిది దేశాలు పాల్గొనగా అందులో ఇండియా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. భారతజట్టులో ఆరెపల్లి గ్రామానికి చెందిన కళ్యాణ్ ప్రతిభ చాటాడు. కాగా, డిసెంబర్ 4, 5, 6వ తేదీల్లో కాంబోడియాల్లో జరిగిన సిట్టింగ్ పారా త్రోబాల్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న కళ్యాణ్ అత్యుత్తమ ప్రతిభతో బంగారు పతకం సాధించాడు. కళ్యాణ్‌ను డీసీసీ నాయకుడు చేకూర్తి సత్యనారాయణరెడ్డి, క్రీడాభిమానులు అభినందించారు.