
పురుగుల మందు తాగి ఆత్మహత్య
బోథ్: సొనాల మండలం సంపత్‌నాయక్ తండా గ్రామానికి చెందిన జాదవ్ దేవిదాస్(45) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఎల్.ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జాదవ్ దేవిదాస్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 15న మద్యం సేవించి ఇంటికి వెళ్లగా భార్య సుమన్ బాయి మందలించింది. దీంతో దేవిదాస్ తన వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగి రాత్రి 9 గంటలకు భార్యకు విషయం తెలిపాడు. వెంటనే మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవిదాస్ మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.