
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ మేళాలో సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్నానం చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. నదిలో ఆయన స్నానం చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే దీనిపై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం.
ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో రాస్తూ..'ఇది నకిలీ వార్త. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి వారి పవిత్ర పూజలను కూడా కలుషితం చేయడమే వారి పని. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా. అసలు నిజమేంటో కోర్టులో తెలుస్తుంది. ఇలా చేయడం సిగ్గుచేటు' అని కన్నడలో పోస్ట్ చేశారు. మహాకుంభ్ మేళాలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారని తెలియగానే నెటిజన్స్ విభిన్నమైన కామెంట్స్ చేశారు. అయితే.. ప్రకాశ్ రాజ్ ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతోనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
ಸುಳ್ಳು ಸುದ್ದಿ
“ಸುಳ್ಳ ರಾಜ” ನ ಹೇಡಿಗಳ ಸೈನ್ಯಕ್ಕೆ .. ಅವರ ಪವಿತ್ರ ಪೂಜೆಯಲ್ಲೂ ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹಬ್ಬಿಸಿ ಹೊಲಸು ಮಾಡುವುದೇ ಕೆಲಸ .. police complaint ದಾಖಲಾಗಿದೆ .. ಕೋರ್ಟಿನ ಕಟಕಟೆಯಲ್ಲಿ ಏನು ಮಾಡುತ್ತಾರೋ ನೋಡೋಣ 😊 #justasking pic.twitter.com/S6ySeyFKmh— Prakash Raj (@prakashraaj) January 28, 2025