
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి గ్రాండ్‌గా వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు బన్నీ భార్య స్నేహారెడ్డి. తమ పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ యానివర్సరీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. బన్నీ- స్నేహారెడ్డి 2011లో మార్చి 6వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ టాలీవుడ్ కపుల్ తమ 14వ వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
2011లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఈ టాలీవుడ్ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన మూడేళ్లకు 2014లో అల్లు అయాన్ జన్నించగా.. ఆ తర్వాత 2016లో ఈ జంటకు కూతురు పుట్టింది. బన్నీ తమ ముద్దుల కూతురికి అల్లు అర్హ అని నామకరణం చేశారు. తమ అభిమాన హీరో పెళ్లి రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
కాగా.. గతేడాది పుష్ప-2 మూవీతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ చిత్రం భారీ రికార్డులు సృష్టించింది. ఏకంగా కేజీఎఫ్, బాహుబలి సినిమాల రికార్డ్‌లను దాటేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Happy Anniversary to the most adorable couple's#alluarjun #AlluSnehaReddy
💙🤍 pic.twitter.com/ph25JnihdF— SAITEJA_Bunny🚩 (@SaiTeja307799) March 6, 2025