ట్విటర్ వాడొద్దు.. శివ కార్తికేయన్ లాజికల్ కామెంట్స్ | Amaran Actor Sivakarthikeyan Suggests Not To Use Twitter | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: ఎలన్ మస్క్.. నన్ను బ్లాక్ చేస్తాడేమో!

Published Tue, Nov 26 2024 1:16 PM | Last Updated on Tue, Nov 26 2024 1:27 PM

Amaran Actor Sivakarthikeyan Suggests Not To Use Twitter

'అమరన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివకార్తికేయన్.. ట్విటర్ వాడొద్దని సలహా ఇస్తున్నాడు. దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉందని చెప్పాడు. ఇదేదో ఆషామాషీగా చెప్పకుండా లాజిక్‌తో సహా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. గోవాలో ప్రస్తుతం ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)

'ఎలన్ మస్క్ నన్ను బ్లాక్ చేసినా సరే ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఫెయిల్ అయినప్పుడు సోషల్ మీడియాలో చూసి తప్పొప్పులు తెలుసుకునే వాడిని. అయితే ఇది ఫలితం ఇవ్వడం సంగతి అటుంచితే మరింత నెగిటివిటీ పెంచింది. నేను యాంకర్‌గా పనిచేసినప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి నిజంగా మనుషుల్ని అడిగి ఫీడ్ బ్యాక్ తీసుకునేవాడిని. తద్వారా తప్పుల్ని సరిదిద్దుకునేవాడిని. కానీ ట్విటర్(ఎక్స్)లో అలా సాధ్యం కాదు' అని శివకార్తికేయన్ చెప్పాడు.

మూలాలని గుర్తుచేసుకోవడం వల్ల గత రెండేళ్లుగా మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చానని శివకార్తికేయన్ చెప్పాడు. ట్విటర్ (ఎక్స్) గురించి ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ తీసుకున్నా సరే ప్లస్సుల కంటే మైనస్సులే ఎక్కువైపోయాయి. ఫ్యాన్ వార్స్ చేసుకోవడం, అనవసరమైన వీడియోలపై కామెంట్స్ చేసి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చిక్కుల్లో ఇరుక్కోవడం లాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాంగా!

(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్‌ హ్యాండ్‌' లాంటి ట్యాగ్‌ ఎందుకు?: సమంత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement