యూట్యూబర్‌తో స్టార్‌ సింగర్‌ ఎంగేజ్‌మెంట్‌, ఫోటోలు వైరల్‌ | Singer Armaan Malik Engagement With His Longtime Girlfriend Aashna Shroff, Pics Viral On Social Media - Sakshi
Sakshi News home page

Armaan Malik Engagement Photos: యూట్యూబర్‌తో నిశ్చితార్థం.. మోకాలిపై కూర్చుని ఉంగరం తొడుగుతూ..

Published Mon, Aug 28 2023 1:41 PM | Last Updated on Mon, Aug 28 2023 2:20 PM

Armaan Malik Engagement with Aashna Shroff, See Pics - Sakshi

స్టార్‌ సింగర్‌ అర్మన్‌ మాలిక్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలితో వైవాహిక జీవితాన్ని ఆరంభించబోతున్నాడు. ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ బ్లాగర్‌, యూట్యూబర్‌ ఆశ్న ష్రాఫ్‌తో ఏడడుగులు వేయనున్నాడు. సోమవారం(ఆగస్టు 28 వీరి ని

స్టార్‌ సింగర్‌ అర్మన్‌ మాలిక్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలితో వైవాహిక జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యాడు. ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ బ్లాగర్‌, యూట్యూబర్‌ ఆశ్న ష్రాఫ్‌తో త్వరలో ఏడడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో సోమవారం(ఆగస్టు 28) వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అర్మన్‌.. మోకాలిపై కూర్చుని కాబోయే భార్య వేలికి ఉంగరం తొడిగాడు.

ఈ మధురక్షణాలని ఆస్వాదించిన ఆశ్న పట్టరాని సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను అర్మన్‌, ఆశ్న.. సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో అభిమానులు పెళ్లికి రెడీ అయిన ఈ జంటకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్మన్‌ మాలిక్‌ తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళ, గుజరాతీ, పంజాబి, ఉర్దు, మలయాళ భాషల్లో పాటలు ఆలపించాడు.

తెలుగులో ఆయన బుట్టబొమ్మ.. (అల వైకుంఠపురములో) నిన్నిలా.. నిన్నిలా చూశానే.. (తొలిప్రేమ), అనగనగనగా..(అరవింద సమేత), పెదవులు దాటని పదంపదంలో.. (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా), పడిపడి లేచె మనసు టైటిల్‌ సాంగ్‌, నిన్నే నిన్నే..(అశ్వథ్థామ) ఇలా బోలెడన్ని హిట్‌ సాంగ్స్‌ పాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement