
తెలుగు బడా నిర్మాత దిల్ రాజు మరో కొత్త అడుగు వేశారు. మారుతున్న టెక్నాలజీ, ట్రెండ్ కి తగ్గట్లు కొత్తగా సొంత ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ) కంపెనీ గురించి ప్రకటన చేశారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ)
తెలుగు సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి కొత్తగా ఏఐ స్టూడియోను ప్రారంభించబోతున్నట్లు దిల్ రాజు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. సినిమా ప్రస్ధానం మొదలైన 1913 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఇందులో చూపించారు. పూర్తి వివరాలు మే 4న వెల్లడిస్తామని పేర్కొన్నారు.
దిల్ రాజు ప్రకటన బట్టి చూస్తే తాను నిర్మించే సినిమాలతో పాటు టాలీవుడ్ లోని ఇతర చిత్రాల్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ సహా పలు విభాగాల్లో ఏఐ సాంకేతికతని ఉపయోగించబోతున్నారు. దీని ద్వారా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయనేది మరికొన్నేళ్లలో తెలుస్తుంది.