2064లో అసలేం జరగనుంది?.. తెలుసుకోవాలంటే ఈ ట్రైలర్‌ చూసేయండి! | Shraddha Srinath Latest Movie Kaliyugam 2064 Telugu Trailer Out Now | Sakshi
Sakshi News home page

Kaliyugam 2064 Telugu Trailer: 2064లో ఏం జరగబోతోంది?.. భయపెడుతోన్న ట్రైలర్!

Published Fri, Apr 25 2025 1:47 PM | Last Updated on Fri, Apr 25 2025 3:31 PM

Shraddha Srinath Latest Movie Kaliyugam 2064 Telugu Trailer Out Now

శ్రద్ధా శ్రీనాధ్‌, కిశోర్‌ ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం 'కలియుగం-2064'. ఈ సినిమాకు ప్రమోద్‌ సుందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చేనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్లపై కేఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ‍ రిలీజ్ చేస్తున్నారు. 

ట్రైలర్ చూస్తే రాబోయే కాలంలో 2064లో మనుషులు ఎలా ఉంటారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  భయంతో, ఆకలితో చద్దామా.. లేదంటే పోరాడి చద్దామా? అనేది మన చేతుల్లో ఉంది అనే డైలాగ్ వింటే మానవుడు తన మనుగడే చేసే పోరాటంగా చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది. 2064లో మనుషులు పరిస్థితి ఏంటనే కోణంలోనే ఈ సినిమాకు రూపొందించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి డాన్ విన్సెంట్‌ సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement