
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) భారీ కలెక్షన్స్ సాధించింది. అజిత్ మూడు దశాబ్ధాల సినీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్‌ను తాజాగా మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్‌కు జోడీగా త్రిష మరోసారి మెరిసింది. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌తో పాటు సునీల్, అర్జున్ దాస్‌లకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం తొమ్మిదిరోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అజిత్ కెరీర్‌లోనే టాప్ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ షేకింగ్ కలెక్షన్స్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. కలెక్షన్స్ పరంగా అజిత్ కెరీర్‌లో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక చిత్రంగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది. అయితే, ఇప్పటి వరకు అజిత్ కెరీర్‌లో టాప్-5 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే.. తెగింపు (రూ. 194 కోట్లు), విశ్వాసం (రూ.180 కోట్లు), వలిమై (రూ.152 కోట్లు), వివేకం (రూ. 121 కోట్లు), వేదాళం (రూ.119 కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రూ. 200 కోట్లు రాబట్టడంతో ఆయన కెరీర్‌లోనే టాప్ చిత్రంగా నిలిచింది. మూడు దశాబ్దాల అజిత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌కు ఆయన ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.

అజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్
అజిత్ ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో కార్ రేసులో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో తన తదుపరి చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో ప్రారంభించి 2026లో దీపావళి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఏ నిర్మాణ సంస్థ తీయనుంది.. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాటేమిటి అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కాగా నటుడు తాను ఎంతగా అభిమానిస్తున్నాను అన్న విషయాన్ని తెలిపేలా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం చివర్లో ఒక మేకింగ్ వీడియోను దర్శకుడు అదిక్ రవిచంద్రన్ విడుదల చేశారు. అందులో ఈయన నటుడు అజిత్ కాళ్లకు నమస్కరించడం, ఆయన చేతుల్ని పట్టుకొని ముద్దాడడం వంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. దీంతో నటుడు అజిత్ మళ్లీ అదిక్ రవిచంద్రన్‌కు అవకాశం ఇవ్వడం ఖాయం అనే టాక్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
The MASS SAMBAVAM is shaking the box office ❤🔥#GoodBadUgly hits 200 CRORES WORLDWIDE GROSS 💥💥
Book your tickets for #GoodBadUgly now!
🎟️ https://t.co/jRftZ6vpJD#200crGrossForGBU#BlockbusterGBU#AjithKumar @trishtrashers @MythriOfficial @Adhikravi @gvprakash… pic.twitter.com/CUrTW1NB2D— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2025