చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌'లో సత్యదేవ్‌ క్యారెక్టర్‌ ఇదే | Introducing Satya Dev As Jaidev In Chiranjeevi Godfather Film | Sakshi
Sakshi News home page

Satya Dev : చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌'లో సత్యదేవ్‌ క్యారెక్టర్‌ ఇదే

Published Tue, Sep 13 2022 11:12 AM | Last Updated on Tue, Sep 13 2022 11:14 AM

Introducing Satya Dev As Jaidev In Chiranjeevi Godfather Film - Sakshi

‘గాడ్‌ ఫాదర్‌’ కోసం జై దేవ్‌ అవతారం ఎత్తారు సత్యదేవ్‌. చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినివను నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్‌ ఖాన్‌, పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రంలో సత్యదేవ్‌ పాత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో జై దేవ్‌ పాత్ర చేశారు సత్యదేవ్‌. చిరంజీవి తమ్ముడిగా ఆయన క్యారెక్టర్‌ ఉండనుందని సమాచారం. ఇక దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5 నే రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌లో తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వాకాడ అప్పారావు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement