First Look
-
'చైనా పీస్' మూవీలో వాలిగా నిహాల్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'చైనా పీస్'. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నిహాల్ పుట్టినరోజు సందర్భంగా అతడు చేస్తున్న వాలి పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)ఇకపోతే ఈ సినిమాకు కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
బ్రిటిష్ పాత్రలో...
సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల యేటిగట్టు’. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కేపీ రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ సినిమాలో బ్రిటిష్ అనే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. రగ్డ్ హెయిర్, బ్లాక్ కోట్తో బ్రిటిష్ పాత్రలో శ్రీకాంత్ లుక్ వినూత్నంగా ఉంది. ఆదివారం (మార్చి 23) శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. -
ఫస్ట్ లుక్ తోనే షాకిచ్చిన 'పూర్ణ చంద్రరావు'
తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ మూవీస్ కూడా వస్తుంటాయి. అలా పో*ర్న్ అడిక్షన్ కథతో తీసిన మూవీ 'పూర్ణ చంద్రరావు'. తారక రామ దర్శకుడు. విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటించాడు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో రెస్పాన్స్ గట్టిగానే వచ్చింది. (ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్)సోఫాలో అర్ధనగ్నంగా కూర్చొని ల్యాప్‌టాప్ చూస్తున్న హీరో.. వెనుక స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఫోటోలు – ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు ఓ మెసేజ్ ఇస్తున్నాయి. టెక్నాలజీ, పో*ర్న్ అడిక్షన్, మానసిక స్థితి అన్నీ కలిపి ఓ డీప్ అర్ధం చెప్పేలా ఉంది. మామూలుగా మనం మద్యం, డ్రగ్స్, సోషల్ మీడియా అడిక్షన్ గురించి సినిమాలు చూస్తాం. కానీ పోర్న్ అడిక్షన్ గురించి ఓ ఫీచర్ ఫిల్మ్ రావడం ఇదే మొదటిసారి. ఒక పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకున్న ఈ 'పూర్ణ చంద్రరావు' ముందు ముందు ఇంకేం చేస్తాడో చూడాలి.(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్) -
మంచు లక్ష్మి నిర్మాతగా సైకలాజికల్ థ్రిల్లర్.. మోహన్ బాబు లుక్ రివీల్
టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో మరో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. దక్ష అనే మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.ఈ సినిమాను మంచు ఎంటర్ టైన్మెంట్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న, మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.Happy Birthday Dear Legend! Back with another banger, #Daksha The Deadly Conspiracy. Proud to be a producer alongside you. 🧿❤️ pic.twitter.com/AV09pC3wLs— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 19, 2025 -
క్రైమ్ థ్రిల్లర్ 'ది సస్పెక్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్..
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ది సస్పెక్ట్. ఈ క్రైమ్ థ్రిల్లర్ మార్చి 21న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ విఎన్ ఆదిత్య చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉన్న ది సస్పెక్ట్ చిత్రం కచ్చితంగా హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ ప్రవీణ్ పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో మార్చి 21న విడుదల చేయబోతున్నారు.చదవండి: ఎన్నో దారుణమైన సౌత్ సినిమాలకంటే కంగువా బెటర్: జ్యోతిక -
అప్సర రాణి 'బ్లడ్ రోజస్' ఫస్ట్ లుక్ రిలీజ్
రంజిత్ రామ్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్లడ్ రోజస్. ఎంజిఆర్ దర్శకుడు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో హరీష్ కె నిర్మాతగా వ్యవహరించారు. మహా శివరాత్రి సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ కథతో ఈ సినిమాని తీశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది.(ఇదీ చదవండి: 38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!) -
తకిట తదిమి...
ఘన ఆదిత్య, ప్రియ జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తకిట తదిమి తందాన’. చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేసి, ‘‘మంచి కంటెంట్ ఉన్న ఫీల్‌గుడ్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అన్నారు. ‘‘సినెటేరియా మీడియా వర్క్స్ వెంకట్ బులెమోని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అని చందన్‌కుమార్ తెలిపారు -
హారర్... థ్రిల్
ఆది సాయికుమార్(Aadi Saikumar) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’(Shambala). ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక(Swasika)ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వసంత అనే పాత్రలో స్వాసిక కనిపించనున్నట్లు ప్రకటించి, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్.‘‘సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘శంబాల’. ఈ మూవీలో ఆది భౌగోళిక శాస్త్రవేత్తగా సవాల్‌తో కూడుకున్న పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘తమ్ముడు’తో పాటు హీరో సూర్య 45వ సినిమాలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్వాసిక. -
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘కాంత(Kantha)’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్రఖని ఓ లీడ్ రోల్ చేశారు. ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ డాక్యుమెంటరీ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్‌ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.నటుడిగా దుల్కర్ పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కాంత’లోని ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘1950 నాటి మద్రాస్(చెన్నై) నేపథ్యంలో ‘కాంత’ ఉంటుంది. అప్పటి మానవీయ సంబంధాలు, సామాజిక పరిస్థితుల నేపథ్యంతో ఈ మూవీ కొత్తగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జాను. -
ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ . మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటివారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.కాగా ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించినట్లు వెల్లడించి, ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు’ అని ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై ఉంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. -
మురారి వినోదం
శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 37వ సినిమా ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి శుభాకాంక్షలతో హీరోలు బాలకృష్ణ, రామ్‌చరణ్ కలిసి విడుదల చేశారు. ‘‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రీకరణ జరుగుతోంది. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియన్స్ ను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సహ–నిర్మాత: అజయ్ సుంకర. -
గూస్ బంప్స్ తెప్పించేలా ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ఫస్ట్ లుక్
అభినయ చతుర సతీష్ నీనాసం నటించిన ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్స్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ నరహరి, జైష్ణవి, సతీష్ నీనాసం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దొండలే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది.ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్లో వినిపించే ఆ పాట, బీజీఎం, హీరోని చూపించిన విధానం, ఆ రక్తపాతం చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ అనే ఎక్స్ పీరియెన్స్ను ఇవ్వబోతోన్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టాకీ సీక్వెన్స్‌లు, పాటల్ని త్వరితగతిన షూట్ చేసేందుకు టీం రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లో సతీష్ నీనాసం బోల్డ్ అండ్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. కత్తులు పట్టుకుని ఊచకోత కోస్తున్న హీరో లుక్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.ఫిబ్రవరి 15న షూటింగ్‌ని పునఃప్రారంభించడానికి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ది రైజ్ ఆఫ్ అశోక మూవీ సతీష్ నీనాసం కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతోందని టీం ఎంతో నమ్మకంగా ఉంది. సతీష్ కెరీర్లో ఇదొక డిఫరెంట్ ప్రయోగం అని చెబుతున్నారు. ఈ సినిమాలో బి. సురేష్, అచ్యుత్ కుమార్, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే, సంపత్ మైత్రేయ, యశ్ శెట్టి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా లవిత్, ఆర్ట్ డైరెక్టర్‌గా వరదరాజ్ కామత్, సంగీత దర్శకుడిగా పూర్చంద్ర తేజస్వి SV పని చేస్తున్నారు. డా. రవివర్మ, విక్రమ్ మోర్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను మను షెడ్గర్ నిర్వర్తిస్తున్నారు. -
తెలుగు తెరపై మరో బోల్డ్ ‘ప్రేమికుడు’
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత టాలీవుడ్లో బోల్డ్ ప్రేమ కథలు ఎక్కువగా వస్తున్నాయి. హీరో పాత్రను బోల్డ్‌గా చూపిస్తూనే ఓ మంచి ప్రేమ కథను ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఆడియన్స్ కూడా అలాంటి కథలనే ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో రా అండ్ బోల్డ్ రొమాంటిక్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. యువతను టార్గెట్ చేసుకొని.. నేటి తరానికి, ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. (చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. ఆ భాషలో బాక్సాఫీస్ షేక్!)తాజాగా మరో బోల్డ్ లవ్‌స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే ‘ప్రేమికుడు’(Premikudu). రామ్ వెలుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పండు చిరుమామిళ్ల ప్రధాన పాత్రలో నటించారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పండు చిరుమామిళ్ల(Pandu Chirumamilla) బోల్డ్ అండ్ ఇంటెన్స్ పాత్రను పోషించినట్టుగా ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతుంది. "అన్ఫిల్టర్డ్" అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్లో హీరో నేలపై నగ్నంగా పడుకుని ఉండటం, ఆ సిగరెట్, చేతికి సంకెళ్ళు, శరీరంపై రక్తపు మరకలు చూస్తోంటే అందరినీ మెస్మరైజ్ చేసేట్టుగా ఉన్నాయి.ఈ మూవీకి ఆదిత్య లొల్ల సినిమాటోగ్రాఫర్ కాగా, చీదెళ్ల నాగార్జున రచయితగా పని చేస్తున్నారు. ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. -
ఇట్స్ ఓకే గురు ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
చరణ్ సాయి, ఉషశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ఇట్స్ ఓకే గురు. సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటిస్తున్నాడు. మణికంఠ దర్శకత్వంలో వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ గురువారం నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్స్, కొన్ని విజువల్స్ చూశాక.. ఇట్స్ ఓకె గురు కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అనిపిస్తోందన్నారు.దామోదర్ ప్రసాద్ గారు ఇచ్చిన కితాబు... తమ చిత్రంపై తమకు గల నమ్మకాన్ని రెట్టింపు చేసిందని నిర్మాత సురేష్ అనపురపు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో చరణ్ సాయి, హీరోయిన్ ఉష శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానియాక్ పాల్గొన్నారు!! -
కొత్త సినిమాతో అనుష్క.. భయపెట్టేలా ఫస్ట్ లుక్
'బాహుబలి' తర్వాత అనుష్క సినిమాలు చేయడంలో పూర్తిగా నెమ్మదించింది. ఒకటి అరా మూవీస్ చేస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబరులో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఏమైపోయిందో, ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఈమె పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ డీటైల్స్ బయటకొచ్చాయి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)'హరిహర వీరమల్లు' లేట్ అవుతూ వచ్చేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన డైరెక్టర్ క్రిష్.. అనుష్కని లీడ్ రోల్‌గా పెట్టి సినిమా తీస్తున్నాడు. దీనికే ఇప్పుడు 'ఘాటీ' టైటిల్ నిర్ణయించారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాధితురాలే క్రిమినల్ అయితే? అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.తల, చేతికి రక్తంతో చుట్ట తాగుతూ.. భయపెట్టేలా అనుష్క ఫస్ట్ లుక్ ఉంది. సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఇది పాన్ ఇండియా మూవీనే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దీన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో థియేట్రికల్ రిలీజ్ ఉండొచ్చేమో?(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
నిహారిక టాలీవుడ్ బంగారం..: డైరెక్టర్
వర్ధన్ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ట్రెండింగ్ లవ్. దొరకునా ఇటువంటి ప్రేమ అన్నది ట్యాగ్‌లైన్. హరీశ్ నాగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తన్వీ ప్రొడక్షన్స్, ఆర్‌డిజి ప్రొడక్షన్స్ పతాకాలపై సోనుగుప్తా, రూపేశ్ డి గోయల్ నిర్మిస్తున్నారు.‘ట్రెండింగ్ లవ్’ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నటి, నిర్మాత కొణిదెల నిహారిక విడుదల చేసింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ‘ట్రెండింగ్ లవ్ దర్శకుడు హరీశ్‌తో నేను గతంలో యూట్యూబ్ కోసం చేసిన షార్ట్‌ఫిలింలో పనిచేశాను. ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడు. మూవీలోని కొన్ని కట్స్ చూశాను. చాలా బాగున్నాయి. ఈ టీమ్ అందరికి చక్కని విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు హరీశ్ నాగరాజు మాట్లాడుతూ–‘‘ మా సినిమా ఫస్ట్‌లుక్‌ను మీరే రిలీజ్ చేయాలని ఒక్క మెసేజ్ పెట్టాను.. సరే అని మా టీమ్‌ని ఎంకరేజ్ చేయటానికి నిహారిక ముందుకొచ్చారు. నిహారిక వారి పింక్ ఎలిఫెంట్ సంస్థ టాలెంట్ ఉన్న ఎంతోమందికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అందుకే ఆమెను నేను టాలీవుడ్ బంగారం అంటుంటాను. మా సినిమాలో నటించిన నటులందరికి ఎంతో మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.చదవండి: మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక.. -
'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్
సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 'జై హనుమాన్' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు. 30న అంటే బుధవారం లుక్ బయటపెడతారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ)ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. చివర్లో సీక్వెల్ 'జై హనుమాన్' ఉంటుందని ప్రకటించారు. కానీ దానికి సంబంధించిన పనులేం జరిగినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడేమో ఫస్ట్ లుక్ అని చెప్పి షాకిచ్చారు.తొలి భాగంలో హనుమంతుడు పాత్రధారి ఎవరనేది రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా చూపిస్తారు. అయితే 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి.. హనుమంతుడిగా కనిపిస్తాడని అంటున్నారు. తొలి భాగాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించగా.. 'జై హనుమాన్'ని మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. పూర్తి వివరాలు రేపు తెలుస్తాయేమో?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
పవర్ఫుల్ యాక్షన్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జాత్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (అక్టోబరు 19) సన్నీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘జాత్’ టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఇందు రెబెక్కా వర్గీస్‌గా...
ఇందు రెబెక్కా వర్గీస్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారు హీరోయిన్ సాయిపల్లవి. అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ ‘అమరన్’. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ బహు బాషా చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని హీరోయిన్ ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నారు. శుక్రవారం సాయిపల్లవి పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ‘అమరన్’ సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ప్రోడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ‘అమరన్’ అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. -
పవర్ఫుల్ విశ్వంభర
హీరో చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు ‘విశ్వంభర’ మూవీ మేకర్స్. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఫస్ట్ లుక్ చూస్తే చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని చేత పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపించారు. చిరంజీవి లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరుపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదుర్స్ అంటున్నారు మెగా అభిమానులు. ‘‘క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. తన అభిమాన హీరో చిరంజీవితో ‘విశ్వంభర’ను ప్రతిష్టాత్మక ్రపాజెక్ట్గా తీర్చిదిద్దుతున్నారు వశిష్ఠ. ఈ సినిమా కోసం ఓ ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించాం. అద్భుతమైన వీఎఫ్ఎక్స్, హై యాక్షన్, చక్కని డ్రామాతో విజువల్ వండర్‌గా ఈ మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. 2025 జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
రా అండ్ రస్టిక్‌గా 'జాతర' ఫస్ట్ లుక్
సతీష్ బాబు లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'జాతర'. రాధా కృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీయా రాజ్ హీరోయిన్. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ని రిలీజ్ చేసి ప్రమోషన్ మొదలుపెట్టారు. ఈ పోస్టర్ చూస్తుంటే సతీష్ బాబు రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించారు. కత్తి పట్టుకుని ఉన్నారు.(ఇదీ చదవండి: చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)ఇక అమ్మవారి ఫోటో, జాతరలో పూనకాలు వచ్చినట్టుగా గెటప్, లుక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. 'దేవుడు ఆడే జగన్నాటకంలో ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం' అని పోస్టర్ మీదున్న డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్తూరు జిల్లాలోని పాలేటి గంగమ్మ దేవత జాతర బ్యాక్ డ్రాప్‌తో సినిమా తీశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్.. ట్విస్టులు, క్లైమాక్స్ మాత్రం) -
ఆసక్తి రేపుతున్న ‘కళింగ’ ఫస్ట్ లుక్
‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.కళింగ అనే టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. పోస్టర్లో హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం, హీరో చేతిలోని ఆ కాగడ.. మొత్తం ఆ సెటప్‌ను చూస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. -
'ప్రణయ గోదారి' మూవీ.. సాయి కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగులోని భిన్నమైన నటుల్లో సాయి కుమార్ ఒకరు. ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఈయన లేటెస్ట్ మూవీ 'ప్రణయ గోదారి'. ఇందులో పెదకాపు అనే పవర్ఫుల్ పాత్ర పోషించారు. తాజాగా సాయికుమార్ ఫస్ట్ లుక్‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)ఈ సినిమాకు పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ మూవీతో అలీ కుటుంబానికి చెందిన సదన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్. 'చూడగానే గంభీరంగా కనిపించే లుక్, మీసకట్టు, తెల్లని పంచె, లాల్చీతో, మెడలో రుద్రాక్షమాల, చేయికి కంకణం, చేతిలో సిగార్‌తో చాలా డిఫరెంట్‌గా సాయికుమార్ కనిపించారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) -
రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?
కన్నడ బ్యూటీ రష్మిక మరో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే కమర్షియల్ హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకుంది. 'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది వచ్చిన 'యానిమల్'తో నటిగా తానేంటో నిరూపించింది. ఇప్పుడు 'కుబేర'తో మరోసారి సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అయిపోయింది.(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు..)శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లుగా కాగా నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే ధనుష్, నాగ్ ఫస్ట్ లుక్ వీడియోస్ రిలీజ్ చేశారు. తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేశారు. ఇప్పటివరకు చేయని పాత్ర ఏదో రష్మిక చేసినట్లు అనిపిస్తుంది.ఈ వీడియోలో రష్మిక.. ఓ గునపం తీసుకుని పాతిపెట్టిన సూట్ కేసుని బయటకు తీస్తుంది. అందులో కోట్లాది రూపాయల డబ్బు చూసి మురిసిపోతుంది. దాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ) -
Marco First Look: టెర్రిఫిక్ లుక్ లో ఉన్ని ముకుందన్
‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్లో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.2024లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండగా.. ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభిస్తోంది. రక్తపు మరకలతో సీరియస్ లుక్ లో కత్తి ని పట్టుకొని ఉన్ని ముకుందన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనా కు వస్తున్నారు ప్రేక్షకులు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్ -
తుఫాను హెచ్చరిక.. ఫస్ట్‌లుక్ చూశారా?
అల్లు రామకృష్ణ, సుహానా ముద్వారి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తుఫాను హెచ్చరిక. జగదీష్ కె కె దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీ పాద క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కిషన్ అనాపు, రజనీకాంత్ ఎస్, సన్నీ బాన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ కె.కె. మాట్లాడుతూ, "ఈరోజు మా 'తుఫాను హెచ్చరిక' మొదటి పోస్టర్ విడుదల చేశాం. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఒక అందమైన హిల్ స్టేషన్లో ఆహ్లాదంగా జీవించే అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులని ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా విజయం సాధించాడు? అనేదే కథ.ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాటిక్ విజన్‌కు మా నటీనటులు, టెక్నీషియన్స్ ప్రాణం పోశారు. ఆ ఆర్టిస్ట్స్ అందరు అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అద్భుతంగా నటించారు. లంబసింగి, చింతపల్లి వంటి ప్రదేశాల్లో సరైన విజువల్ కోసం ఏడాది కాలం ఓపికగా వేచి ఉండి సరైన అందాలను చిత్రీకరించాము. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. -
థ్రిల్లర్ మూవీలో హాట్ బ్యూటీ పాయల్.. ఫస్ట్ లుక్ చూశారా?
ఆర్ఎక్స్100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.. సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పోలీస్‌గా సందడి చేయనుంది. ఈ మేరకు పాయల్ నటిస్తున్న కొత్త మూవీకి 'రక్షణ' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ సినిమాలో పాయల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాల్ని వెల్లడించబోతున్నారు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్) -
నోటు కథేంటి?
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. వర్షం కురుస్తుండగా గొడుగు పట్టుకుని నిల్చున్నారు నాగార్జున. ఆయన వెనకవైపు డబ్బు నోట్ల కట్టలు ఉన్న కంటైనర్ కనిపిస్తోంది. కాగా.. ఓ ఐదువందల రూపాయల నోటు కింద పడి ఉండటాన్ని చూసిన నాగార్జున తన పర్సులోంచి ఓ నోటుని తీసి, ఆ కంటైనర్‌లో పెడతారు. మరి.. ఆ నోటు వెనక కథేంటి అనేది సినిమాలో చూడాల్సిందే. ‘‘వైవిధ్యమైన కథాంశంతో ‘కుబేర’ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం బ్యాంకాక్‌లో నాగార్జున, ఇతర నటీనటులపై కొంత టాకీ, యాక్షన్ పార్ట్ చిత్రీకరించాం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. -
మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో!
సన్నీ లియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తర్వాత తర్వాత నటిగా మారిపోయింది. ప్రత్యేక గీతాలు, పలు పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు తెలుగులో ఓ హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. (ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్‌నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!) సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతోన్న మూవీ 'మందిర'. సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాత. ఆర్.యువన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సన్నీ ఈ పోస్టర్లో భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగిలిన వివరాలు ప్రకటించనున్నారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) -
భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ.. క్రేజీ అప్డేట్!
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందించారు. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్ డే సందర్భంగా తంగలాన్‌లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే మహిళా రైతు క్యారెక్టర్లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. తంగలాన్ సినిమాను త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చియాన్ విక్రమ్‌ను విభిన్నమైన క్యారెక్టర్లో దర్శకుడు పా.రంజిత్ చూపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..తంగలాన్' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నాప్పటికీ కుదరలేదు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. Happy birthday # Gangamma, @parvatweets stay happy n blessed 💥💥💥#HBDParvathyThiruvothu#Thangalaan pic.twitter.com/nNWvFpihfv — pa.ranjith (@beemji) April 7, 2024 -
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నేడు రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రష్మిక సింపుల్ మేకోవర్‌లో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. "ది గర్ల్ ఫ్రెండ్" లో ఆమె కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పుష్ప 2 చిత్రం నుంచి కూడా రష్మిక ఫస్ట్ లుక్ పోస్ట్ విడుదలైంది. అందులో ఆమె లుక్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండటంతో టీజర్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో రష్మిక నుంచి దాదాపు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. -
స్వీయ దర్శకత్వంలో మరో స్టార్ హీరో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్!
ఇటీవలే కెప్టెన్ మిల్లర్‌తో సూపర్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ధనుశ్ మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ధనుశ్-50 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ధనుశ్ కెరీర్లో 50వ సినిమాగా నిలవనుంది. తాజాగా రిలీజైన ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కథను తానే రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు ధనుశ్. ఈ చిత్రంలో కెప్టెన్ మిల్లర్‌లో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ఇదే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో 51వ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. #D50 is #Raayan 🔥 🎬 Written & Directed by @dhanushkraja 🎵 Music by @arrahman Releasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/vfemOIRKIX — Sun Pictures (@sunpictures) February 19, 2024 -
రూత్‌లెస్...పవర్ఫుల్
రూత్‌లెస్..పవర్ఫుల్..అన్ఫర్గెటబుల్... ఇవన్నీ ఒకరి గురించే. అతనే ఉధిరన్. ‘కంగువ’ సినిమాలో బాబీ డియోల్ పాత్ర పేరు ‘ఉధిరన్’. జనవరి 27 బాబీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కంగువ’ సినిమాలో ఆయన పోషిస్తున్న ఉధిరన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది. ఇందులో దిశా పటానీ హీరోయిన్గా, ఓ కీలక పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పదికి పైగా భాషల్లో, త్రీడీలోనూ విడుదల కానుంది. ‘‘ఉధిరన్‌గా యునిక్ మేకోవర్‌లో కనిపిస్తారు బాబీ డియోల్. యుద్ధానికి సిద్ధం అవుతున్న ఉధిరన్కు ఆయన ప్రజలు మద్దుతు తెలుపుతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాబీ డియోల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
గుర్తుపట్టలేనట్లుగా 'యానిమల్' విలన్.. ఆ సినిమా కోసమే ఇలా!
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా 'కంగువ'. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ పీరియాడికల్ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. చారిత్రక నేపథ్య కథతో డైరెక్టర్ శివ తీస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో 'కంగువ' చిత్రాన్ని త్రీడీలోనూ రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) ఇకపోతే ఈ సినిమాలో ఉధిరన్ అనే శక్తివంతమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. శనివారం ఈ నటుడి పుట్టినరోజు సందర్భంగా 'కంగువ' నుంచి ఆయన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'రూత్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్ గెటబుల్' అనే క్యాప్షన్‌తో ఉధిరన్ పాత్రని పరిచయం చేశారు. ఈ పోస్టర్లో బాబీ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. యుద్ధానికి సిద్ధమవుతున్న ఉధిరన్కు ఆయన వర్గమంతా తమ మద్ధతు తెలుపుతున్నట్లు ఈ పోస్టర్లో చూపించారు. విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపీరియెన్స్ ఇచ్చేందుకు 'కంగువ' త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతోంది. రీసెంట్గా 'యానిమల్' మూవీలో క్లైమాక్స్‌లో కనిపించే విలన్‌గా చేసిన బాబీ.. ఇప్పుడు 'కంగువ'లో ఉధిరన్‌గా చేస్తున్నాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) Happy birthday #BobbyDeol brother.. Thank you for the warm friendship. It was awesome to see you transform in full glory as the mighty #Udhiran in our #Kanguva Guys watch out for him! @directorsiva @ThisIsDSP @vetrivisuals @StudioGreen2 pic.twitter.com/e3cPBkdMcS — Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2024 -
సూర్య 'కంగువ' రెండో లుక్.. ఆ హిట్ సినిమా గుర్తొచ్చిందిగా!
నేషనల్ అవార్డ్ విన్నర్, తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. చారిత్రక నేపథ్యంతో డైరెక్టర్ శివ దీన్ని తీస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. త్రీడీలోనూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో 'కంగువ' సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) ఈ సెకండ్ లుక్ పోస్టర్లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్‌తోనూ సర్ప్రైజ్ చేశాడు. 'విధి.. కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్.. కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే కంగువ ' అనే క్యాప్షన్‌తో సెకండ్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్ దెబ్బకు 'కంగువ'పై అంచనాలు పెరుగుతున్నాయి. అదే టైంలో సూర్య '24' సినిమాలో ఆత్రేయ పాత్ర గుర్తొచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?) அனைவருக்கும் இனிய பொங்கல் மற்றும் தமிழர் திருநாள் வாழ்த்துகள்! Happy Pongal! मकर संक्रांति शुभकामनाएँ! ಎಲ್ಲರಿಗೂ ಸಂಕ್ರಾಂತಿ!ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು! అందరికి సంక్రాంతి!శుభాకాంక్షలు! #Kanguva #Kanguva2ndLook pic.twitter.com/Xe1yQ89nf4 — Suriya Sivakumar (@Suriya_offl) January 16, 2024 -
లుక్ మార్చేసిన టాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఏకంగా ముఖానికి రక్తంతో
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు బోలెడంత మంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా కొన్నేళ్ల ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ బ్యూటీని పరిచయం చేశాడు. ఆమె పేరే అప్సర రాణి. ఆర్జీవీ తీసిన పలు సినిమాల్లో నటించిన ఈమె.. బోల్డ్, హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా నిలిచింది. వరసపెట్టి అలాంటి సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా లుక్ మార్చి అందరికీ షాకిచ్చింది. (ఇదీ చదవండి: ఆ గుడిలో స్పెషల్ పూజలు చేసిన హీరో ప్రభాస్.. ఎందుకో తెలుసా?) అప్సరా రాణి హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాచరికం'. విజయ్ శంకర్ హీరోగా చేస్తున్నాడు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ నిర్మిస్తున్నారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు. రీసెంట్‌గానే ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇకపోతే శుక్రవారం, అప్సరా రాణి పుట్టినరోజు సందర్భంగా క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ముఖమంతా రక్తంతో, నోట్లో కత్తితో భయపెట్టేలా కనిపించింది. ఇప్పుడీ లుక్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. హాట్ బ్యూటీ ఇలా మారిపోయిందేంటా అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) -
'సలార్' విలన్ కొత్త సినిమా.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో తెలుసు. అతడి సినిమాల్ని ఇప్పటికే ఓటీటీల్లో చూసి ఎంటర్టైన్ అయ్యారు. ఈ మధ్య 'సలార్' సినిమాలోనూ ప్రభాస్ ప్రాణ స్నేహితుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. రెండో భాగంలో ప్రభాస్‌తో ఢీ అంటే ఢీకొట్టే విలన్‌గా కనిపించబోతున్నాడు. సరే దాని గురించి కాసేపు పక్కనబెడితే పృథ్వీరాజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. దీనిపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు. 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) పేరుతో తీస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. 90వ దశకంలో జీవనోపాధి కోసం కేరళని వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథని వాస్తవ ఘటనల ఆధారంగా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) సినిమాలో చూపించబోతున్నారు. పూర్తిగా ఎడారిలో తీసిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసిన ప్రభాస్.. లుక్ చూసి చాలా థ్రిల్ అవుతున్నానని ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సహా ఐదు భాషల్లో ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తీశారు. ఇక హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. 'నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది అనేది తెలుసు. ఐదేళ్లు ఈ సినిమా కోసం కేటాయించాను. మానసికంగా, శారీరకంగా నజీబ్ క్యారెక్టర్లా మారిపోయాను. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ మూవీ కోసం రాజీ లేకుండా కష్టపడ్డాను. ఈ మూవీకి పనిచేస్తున్నప్పుడు మేం ఎంతగా ఎంజాయ్ చేశామో, రేపు థియేటర్స్‌లోనూ ప్రేక్షకులు అంతే హ్యాపీగా ఫీలవుతారు' అని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
ప్రేమకు జై
అనిల్ బురగాని, ఆర్. జ్వలిత జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకు జై’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ని ప్రముఖ పాటల రచయిత శివశక్తి దత్త విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. నూతన నటీనటులు చాలా బాగా నటించారనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హీరో హీరోయిన్లతో పాటు ప్రతినాయకుడు దుబ్బాక భాస్కర్ బాగా నటించారు. మా సినిమాని నూతన సంవత్సరంలో విడుదల చేయనున్నాం’’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు, లైన్‌ప్రోడ్యూసర్: మైలారం రాజు. -
రోటి.. కపడా.. కామెడీ
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘‘వినోద ప్రధానంగా సాగే ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధ్రువన్, వసంత్.జి. -
పండగ పోస్టర్ గురూ
దీపావళి పండక్కి ఇండస్ట్రీలో సినీ టపాసులు బాగానే పేలాయి. టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, కొత్త పోస్టర్.. ఇలా సినీ ప్రేమికులకు కావాల్సిన మతాబులు అందాయి. ఈ విశేషాల్లోకి... రజనీకాంత్, కపిల్‌దేవ్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా జీవితా రాజశేఖర్ ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. క్రికెట్‌ను ప్రేమించే కొందరు హిందు, ముస్లిం యువకుల మధ్య రాజకీయ జోక్యంతో తలెత్తిన వివాదాలను మొయిద్దీన్ భాయ్ (రజనీ పాత్ర పేరు) ఎలా సరిదిద్దుతాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ చెబుతోంది. ‘రాంగ్ యూసేజ్’ అంటూ ‘సైంధవ్’ సినిమా కోసం పాట పాడారు వెంకటేశ్. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘రాంగ్ యూసేజ్’ పాట లిరికల్ వీడియోను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ సాంగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘ఈగల్’. ఇందులో కావ్యాథాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదల కానుంది. తొలి భాగం ట్రైలర్‌ను డిసెంబరు 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ప్రభాస్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మాస్ పోలీసాఫీసర్ పాత్రలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘భీమా’. ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ మాస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. దీపావళి సందర్భంగా ‘కంగువా’ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రెండు విభిన్న కాలాల్లో సాగనున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఏప్రిల్ 11న విడుదల కానుందని టాక్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో ప్లాన్ చేశారు. సంక్రాంతికి ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల కానుంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బ్రీత్’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చోటు చేసుకునే ఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని యూనిట్ చెబుతోంది. ప్రముఖ నటుడు ఉపేంద్ర భార్య, నటి ప్రియాంకా ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’. ఈ సినిమాకు లోహిత్ దర్శకుడు. రాధికా కుమారస్వామి సమర్పణలో రవిరాజ్ నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ‘‘ఇప్పటి వరకూ సినీ ప్రపంచంలో రాని ఓ ప్రయోగాత్మక చిత్రం ఇది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. 30 రోజులు గోవాలో ఏకధాటిగా షూటింగ్ జరిపాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సతీమణి, నటి రాధికా కుమారస్వామి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘అజాగ్రత్త’. శశిధర్ దర్శకత్వంలో రవిరాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏడు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రాధికా కుమారస్వామి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘భైరా దేవీ’. శ్రీ జై దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే అఘోరా భైరాదేవిగా రాధిక నటిస్తున్నారు. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న సినిమా ‘చే’. ‘లాంగ్ లివ్’ అనేది ఉపశీర్షిక. లావణ్య సమీరా, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్ కీలక పాత్రల్లో నటించారు. బి.ఆర్ సభావత్ నాయక్ దర్శకత్వంలో సూర్య, బాబు, దేవేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘‘చేగువేరా బయోపిక్ తీయాలన్నది నా 20 ఏళ్ల కల. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్‌లో జరిగిన ఎన్నో అరుదైన విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. డిసెంబరులో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు బి.ఆర్ సభావత్ నాయక్. -
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ అశ్వధామ’.. ఫస్ట్ లుక్ రిలీజ్
హృతిక్ శౌర్య, వరలక్ష్మీ శరతకుమార్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'అశ్వధామ’. 'హతః అక్షర’ అనేది ఉపశీర్షిక. చంద్ర శేఖర్ ఆజాద్ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్లిక్‌నైన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. హీరో పుట్టినరోజు(నవంబర్ 7) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రం బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. హృతిక్ శౌర్య 'ఓటు’ చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించారు. అందులో సాఫ్ట్ కుర్రాడిగా కనిపించిన ఆయన ఈ చిత్రంలో ప్రొపర్ కమర్షియల్ హీరోగా కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ "రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్, క్రైమ్ థ్రిల్లర్ ఇది. పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరతకుమార్ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంటుంది. నెగటివ్ షేడున్న పాత్రలో ఒక సర్ప్రైజ్ ఆర్టిస్ట్ కనిపిస్తారు. హీరోకి మంచి చిత్రం అవుతుంది. కమర్షియల్ హీరోగా ఎలివేట్ అవుతాడు. ఆయన చేసిన యాక్షన ఎపిసోడ్స్‌కి టీమ్ అంతా ఫిదా అయింది. ఇప్పటి వరకూ జరిగిన రెండు షెడ్యూళ్లలో కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్స సీన్స్ చిత్రీకరించాం’’ అని అన్నారు. -
యూత్‌ఫుల్ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో సత్యదేవ్ విడుదల చేశారు. ‘‘బెస్ట్ బడ్డీస్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫన్ రైడ్ ‘కిస్మత్’. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: వేదరామన్ శంకరన్, సహ నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
Adiparvam: మంచు లక్ష్మి లుక్ అదిరిందిగా!
మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. నేడు(అక్టోబర్ 8) మంచు లక్ష్మీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు. చిత్ర దర్శకుడు సంజీవ్ మెగోటి మాట్లాడుతూ... ‘మంచు లక్ష్మీప్రసన్న ఇదివరకు చెయ్యని పాత్రలో కొత్తగా కనిపిస్తారు. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్స్ గా నిలుస్తాయి’ అన్నారు. ‘రెట్రో ఫీల్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంతం అలరించే చిత్రమిది’అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావ్ అన్నారు. ఈ చిత్రంలో ఆదిత్యఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
మిషన్ సిద్ధం
తేజేశ్వర్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మిషన్ సి 1000’. ప్రగ్య నయన్ హీరోయిన్. టి. విరాట్, సుహాసిని నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత అభిషేక్ అగర్వాల్ రిలీజ్ చేశారు. తేజేశ్వర్ మాట్లాడుతూ– ‘‘తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. శ్రీధర్ ఆత్రేయ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో మొత్తం మూడు పాటలున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడిపై చిత్రీకరించిన పాట ఈ మూవీలో హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
మిస్టర్ ఇడియట్ వస్తున్నాడు
హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శర్మ హీరోయిన్. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం మాధవ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిస్టర్ ఇడియట్’లోని మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘‘మిస్టర్ ఇడియట్’ ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గౌరీ రోణంకి. ‘‘నవంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత జేజేఆర్ రవిచంద్. -
మహారాజాగా విజయ్ సేతుపతి!
తమిళ సినిమా: బహుభాషా నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా. ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, ది రూట్ జగదీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరంగు బొమ్మై చిత్రం ఫేమ్ నిధిలన్ కథా, దర్శకత్వం బాధ్యతలను వహిస్తున్నారు. నటి మమతా మోహన్ దాస్ నాయకిగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, నటి అభిరామి, నటుడు నట్టి, అరుల్ దాస్, సింగంపులి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, అద్నీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఒక హోటల్లో చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నటుడు నట్టి మాట్లాడుతూ.. ఈ చిత్ర స్క్రీన్ ప్లే ఇకపై వచ్చే చిత్రాలకు ఒక ఉదాహరణగా ఉంటుందన్నారు. నటి అభిరామి మాట్లాడుతూ.. విజయ్ సేతుపతితో కలిసి నటించిన తొలి చిత్రం ఇదే అన్నారు. చురుకైన కళ్లు కలిగిన వ్యక్తి కమలహాసన్ తర్వాత విజయ్ సేతుపతినే అని పేర్కొన్నారు. ఇలాంటి ఒక స్పెషల్ చిత్రంలో తాను నటించడం సంతోషమని నటి మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. మహారాజా రివెంజ్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. విజయ్ సేతుపతి 50వ చిత్రానికి తాను దర్శకుడు కావడం సంతోషమాన్ని నిధిలన్ పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ చతుపతి మాట్లాడుతూ.. అనుభవం, సహనం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయన్నారు. అలాంటి అనుభవాన్ని కలిగించిన తన దర్శక నిర్మాతలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. 50వ చిత్రం కచ్చితంగా తన సినిమా ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ చిత్రం నిర్మాతలకు మూడు రెట్లు లాభాలు తెచ్చిపెడుతుందని దర్శకుడు చెప్పారని, అది పొగరు కాదని.. చిత్రంపై నమ్మకం అన్నారు. -
ద్రోహి వస్తున్నాడు
సందీప్ కుమార్ బొడ్డ పాటి, దీప్తి వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వంలో రూపొందిన ఫిల్మ్ ‘ద్రోహి’. ‘ది క్రిమినల్’ అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, ఆర్. రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా లుక్, గ్లింప్స్ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రేక్షకులు మెచ్చే అన్ని థ్రిల్లర్ అంశాలున్న చిత్రం ఇది. ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. డెబి, ‘షకలక’ శంకర్, నిరోజ్, శివ, మహేశ్ విట్టా కీలక పాత్రలు పొషించిన ఈ చిత్రానికి సంగీతం: అనంత్ నారాయణ. -
కామెడీ.. థ్రిల్
పరుచూరి సుదర్శన్, శ్రీ జంటగా రవికిషోర్ బాబు చందిన దర్శకత్వంలో ఓ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు ‘రూమర్స్ డిస్ట్రాయ్ లైఫ్స్’ అనేది ఉపశీర్షిక. యన్. పాండు రంగారావు, కోయ చిన్నరెడ్డయ్య నిర్మిస్తున్న చిత్రం ఇది. శనివారం సుదర్శన్ బర్త్ డే. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. యోగి, దొరబాబు, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ బాబి, సునీతా మోహన్, రాజేశ్వరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య. -
ఘన్ను భాయ్ వినోదం
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఘన్ను భాయ్’. ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా ద్వారా ఆదిత్య గంగసాని హీరోగా పరిచయమవుతున్నారు. ప్రణయ్ మైకల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఘన్ను భాయ్’. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
కలర్‌ఫుల్ ఓనమ్
పంటలు ఇంటికి వచ్చిన వేళ..వంటలు ఘుమఘుమలాడిన వేళ..ఇంట్లో పండగ వేళ... ఇలా ఓనమ్ పండగను ఘనంగా జరుపుకున్నారు కొందరు తారలు.కేరళప్రాంతంలో పంటలు వచ్చే ఈ మాసంలో ఓనమ్ పండగ జరుపుకుంటారు. మంగళవారం పండగ సందర్భంగా పలువురు కథానాయికలు అందంగా ముస్తాబై, మెరిసిపోయారు. ఓనమ్ సాద్య పేరుతో దాదాపు 26 రకాల వంటకాలను అరిటాకులో వడ్డించుకుని, ఆరగించారు. పండగ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ∙మిర్నా మీనన్ ∙మాళవికా మోహనన్ ∙కల్యాణి ∙అపర్ణా దాస్ అదా శర్మ -
టైగర్ ప్రియురాలు ఈమెనే..
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్ (నటి కృతీ సనన్ చెల్లెలు), గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి వరుస విజయాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సారా పాత్రలో నటిస్తున్నారు నూపుర్. ‘టైగర్ లవ్ సారా’ అంటూ సోమవారం నూపుర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘రవితేజ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. అక్టోబర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్. మది, సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. Nothing makes me feel more proud than to launch my sister’s first PAN INDIA film Poster!🥹🧿❤️ #TigerNageswaraRao Meet our TIGER'S LOVE ❤️ Introducing @NupurSanon as the lovely Sara from the GRAND WORLD of #TigerNageswaraRao 🥷 WORLDWIDE HUNT begins from October 20th 🐯🔥… pic.twitter.com/hlyGMVv9ly — Kriti Sanon (@kritisanon) August 28, 2023 -
యాక్షన్ రాంబో
‘నారప్ప, పుష్ప, ధమాకా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలుపొషించిన శ్రీ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ‘రాంబో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళవారం (ఆగస్టు 22) శ్రీతేజ్ బర్త్ డే సందర్భంగా ‘రాంబో’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇటీవల జరిగిన వైజాగ్ షెడ్యూల్‌తో టాకీపార్ట్ పూర్తయింది. త్వరలోనేపాటలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రాజీవ్ సాలూరి, ఫర్నాజ్ శెట్టి, మైమ్ గోపి, గోలీసోడ మధు కీలకపాత్రలుపొషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, సునీల్ కుమార్ నామా. -
ఫీల్ గుడ్ మూవీ 'ఏందిరా ఈ పంచాయితీ' ఫస్ట్ లుక్
డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్‌గా టైటిల్.. ఇదే ఈ తరం ప్రేక్షకలోకం మెచ్చే సినిమా. స్టార్ హీరో హీరోయిన్స్ సంగతి పక్కనబెట్టి రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలకే ఓటేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో తీసే సినిమాలకంటే మన ఊరి వాతావరణంలో తీసే సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. లోకల్ లాంగ్వేజ్, లోకల్ అడ్డాలనే తెగ ప్రేమిస్తున్నారు. అయితే నేటితరం ప్రేక్షకుల టేస్ట్‌కి అనుగుణంగా వీటన్నింటినీ కలగలుపుతూ తీసిన సినిమానే 'ఏందిరా ఈ పంచాయితీ'. (ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. గంగాధర.టీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది. ఊర్లోని వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా కొన్ని సంకేతాలను వదిలారు. ఇలా టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎట్రాక్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. -
'దేవర' విలన్ ఇతడే.. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్
జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విలన్ లుక్ బయటపెట్టారు. (ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?) 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. దీంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలానే 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల కసితో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలానే సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఇలా చాలా అంశాలు దీనిపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. తాజాగా సైఫ్ అలీ పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే సైఫ్ అలీ ఖాన్.. 'భైరా' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. లుక్ అది చూస్తుంటే పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకొస్తామని ప్రకటించారు. BHAIRA Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781 — Jr NTR (@tarak9999) August 16, 2023 (ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!) -
ధీమహి.. ఇదో డిఫరెంట్ థ్రిల్లర్!
సాహస్ పగడాల హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ధీమహి’. నవీన్ కంటె మరో దర్శకుడిగా, విరాట్ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నిఖితా చోప్రా హీరోయిన్. పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘ధీమహి డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
మాస్టర్ పీస్
అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఎ మాస్టర్ పీస్’. సుకు పూర్వజ్ దర్శకత్వంలో సినిమా బండి ప్రొడక్షన్స్ పై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విలన్ పాత్రధారి మనీష్ గిలాడా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మేకర్స్. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఎ మాస్టర్ పీస్’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: శివరామ్ చరణ్, సంగీతం: ఆశీర్వాద్. -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టండి చూద్దాం? ఇలా తయారైందేంటి!
దాదాపు హీరోయిన్లు అందరూ వీలైనంత గ్లామర్ చూపించేందుకు తహతహలాడుతుంటారు. కుదిరితే సినిమాల్లో.. లేదంటే సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా బ్యూటీస్ అందరూ ఫొటోషూట్స్‌తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఆ బాపతే. కాకపోతే ఆమె, ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఎక్కువసేపు సస్పెన్స్ ఉంచకుండా చెప్పేస్తున్నాం. పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరేవరో కాదు మాళవిక మోహన్. కేరళకు చెందిన ఈమె.. దాదాపు పదేళ్ల నుంచి సినిమాలు చేస్తోంది. 2013లో 'పట్టం పోలే' అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అలా ఓ ఆరేళ్లపాటు మలయాళంలో మూడు, కన్నడ-హిందీలో తలో మూవీ చేసింది. 2019లో రజినీకాంత్ 'పెట్టా'లో నటించడం ఈమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించిన తర్వాత మాళవిక మోహనన్‌కు దళపతి విజయ్ 'మాస్టర్', ధనుష్ 'మారన్' చిత్రాల్లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగా ఆడినప్పటికీ ఈమెకు ఓ మాదిరి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈమె, ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చియాన్ విక్రమ్ 'తంగలాన్'లోనూ ఈమెనే కథానాయిక. ఈ చిత్రంలోని ఈమె ఫస్ట్‌లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో మాళవికని చూస్తే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఒంటిపై పచ్చబొట్లు, చేతిలో ఓ ఆయుధం, మెడ-నడుము-తల చుట్టూ తాళ్ల లాంటివి ఉన్నాయి. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో మాళవిక.. ఆరతి అనే పాత్రలో కనిపించబోతుంది. నార్మల్‌గా హాట్ అండ్ గ్లామర్‌గా కనిపించే ఈ బ్యూటీని ఇలా మార్చేయడం చూసి ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఏదేమైనా మాళవిక లేటెస్ట్ లుక్ మాత్రం క్రేజీగా ఉంది. Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb — pa.ranjith (@beemji) August 4, 2023 (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!) -
కోట బొమ్మాళి పీఎస్‌లో..
శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘రాజకీయాలు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో ‘కోట బొమ్మాళి పీఎస్’ రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్. -
'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?
తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో గానీ కొన్ని సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతలు అడ్డంగా బుక్కైపోతున్నారు. ఫ్యాన్స్ తో బూతులు తిట్టించుకుంటున్నారు. మొన్న ప్రభాస్ 'కల్కి' విషయంలో ఇలానే జరగ్గా.. ఇప్పుడు లారెన్స్ 'చంద్రముఖి 2' చిత్రంపైనా అలాంటి విమర్శలే వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) సూపర్‌స్టార్ రజినీకాంత్ 'చంద్రముఖి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90స్ జనరేషన్ కి ఈయన్ని బాగా పరిచయం చేసింది ఈ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా కంగనా రనౌత్ కనిపించనుంది. ఈ క్రమంలోనే సోమవారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ప్రశంసలు బదులు ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్‌లో లారెన్స్ వెంకటపతి రాజు గెటప్‌లో కనిపించాడు. కాకపోతే తల పెద్దగా, శరీరం చిన్నగా, చేయి సన్నగా ఉండటం వింతగా అనిపించింది. దీన్ని చూసిన నెటిజన్స్.. తెలిసే ఈ తప్పు జరిగిందా? లేదంటే కావాలనే ఇలా చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. మొన్నీ మధ్య ప్రభాస్ 'కల్కి' ఫస్ట్ లుక్ విషయంలో ఇలానే జరగ్గా, వెంటనే దాన్ని మార్చి మరో లుక్ విడుదల చేశారు. 'చంద్రముఖి 2' లుక్ ఏమైనా మార్చి రిలీజ్ చేస్తారా? అలానే వదిలేస్తారా అనేది చూడాలి. వినాయక చవితికి ఈ మూవీని థియేటర్లలో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. Thanks to Thalaivar Superstar @rajinikanth! Here’s presenting you the first look of #Vettaiyan 👑 I need all your blessings! Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🔥 #Chandramukhi2 🗝 pic.twitter.com/v4qYmkzeDh — Raghava Lawrence (@offl_Lawrence) July 31, 2023 (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
ఎమోషనల్ వృషభ
జీవన్, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషభ’. అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వంలో యుజిఓస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఉమాశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో మంచి ఎమోషన్ ఉన్నట్లనిపిస్తోంది’’ అని ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ‘‘1966–1990 నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆధ్యాత్మికంగా వెళుతూనే మనుషులకు, పశువులకు మధ్య ఉండే బాండింగ్‌ని చూపించాం’’ అన్నారు అశ్విన్. ‘‘ఓ పల్లె లోని చిన్న గుడిలో ఈ కథ నా మదిలో మెదిలింది’’ అన్నారు ఉమాశంకర్. -
పుష్ప 2 దెబ్బకు కొట్టుకుపోయిన ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్
-
పుష్ప 2 దెబ్బకు కొట్టుకుపోయిన ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్
-
ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ప్రాజెక్ట్ K'. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్టర్ కావడం, గత కొన్నేళ్లుగా ఈ చిత్రం సెట్స్ మీద ఉండటంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ బుధవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో అవన్నీ కాస్త తారుమారు అయ్యాయి అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ లుక్‌పై ఘోరంగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ ఐరన్ మ్యాన్ పోజులో కనిపించాడు. అది ఓకే గానీ ఆ తల వేరే ఎవరో బాడీకో అతికించినట్లు ఉందని స్వయానా అభిమానులే నిరుత్సాహపడ్డారు. సోషల్ మీడియాలో 'ప్రాజెక్ట్ K' టైప్ చేసి సెర్చ్ చేయండి మీకే విషయం అర్థమైపోతుంది. ఇవన్నీ మేకర్స్ దృష్టిలో పడినట్లున్నాయి. దీంతో అధికారికంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) అయితే ఇలా డిలీట్ చేసిన ఫస్ట్ లుక్ బదులు ఎలాంటి గ్రాఫిక్స్, పేర్లు లేకుండా ఉన్న అదే పోస్టర్ని పోస్ట్ చేశారు. గ్లింప్స్ వీడియో కోసం రెడీ అయిపోండి అని ట్వీట్ పెట్టారు. ఈ విషయం నిజమా కాదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదివిన తర్వాత 'ప్రాజెక్ట్ K' నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విట్టర్లోకి వెళ్లి చూడండి. మీకే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ ఎక్కువ కాకుడదనే ఉద్దేశంతోనే ఇలా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మేకర్స్ తీసేసినా సరే ఆ ఫొటో ఇప్పటికీ ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది. ఈ జాగ్రత్త ఏదో ముందు ఉంటే బాగుండేదని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023 (ఇదీ చదవండి: Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ) -
ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్
Prabhas Project K First Look Trolls: డార్లింగ్ ప్రభాస్ గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న హీరో. దీంతో ప్రస్తుతం అలాంటి భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కొత్త చిత్రాల అప్డేట్స్ అంటే ఎలా ఉండాలి. చూసే ప్రతిఒక్కరి మైండ్ బ్లాంక్ అయిపోవాలి. కట్ చూస్తే.. నిజంగానే అందరి బుర్ర తిరిగిపోతోంది. అయితే అది రివర్స్‌లో. ఇలా చెప్పడానికి 'ప్రాజెక్ట్ K' ఫస్ట్ లుక్‌తోపాటు చాలానే కారణాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టాలీవుడ్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. దానికి కారణం ప్రభాస్, రాజమౌళి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 'బాహుబలి' సినిమాతో నటుడిగా ప్రభాస్, డైరెక్టర్‌గా రాజమౌళి బోలెడంత క్రేజ్ అందుకున్నారు. రాజమౌళి ఆస్కార్ రేంజుని అందుకున్నాడు. ప్రభాస్ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. కరెక్ట్ గా చెప్పాలంటే డైరెక్టర్స్ అతడితో ఆడేసుకుంటున్నారా అనే డౌట్ వస్తోంది. (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) ఎందుకంటే 'బాహుబలి' తర్వాత 'సాహో' చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఆ సినిమా పర్వాలేదనిపించింది. కాకపోతే ప్రభాస్ రేంజ్‌కి తగ్గ మూవీ కాదని అప్పట్లో అభిమానులు మాట్లాడుకున్నారు. కాస్త కేర్ తీసుకుని ఉండాల్సిందని అన్నారు. దీని తర్వాత 'రాధేశ్యామ్' వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఓకే అనిపించినా.. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వచ్చాయి గానీ ప్రేక్షకుల్ని ఎందుకో అలరించలేకపోయింది. ఈ మధ్య వచ్చిన 'ఆదిపురుష్' గురించి మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఈ మూవీకి అయితే ఫస్ట్ లుక్ నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత కూడా ఘోరమైన ట్రోలింగ్ జరిగింది. 'సలార్' టీజర్‌తో అభిమానుల కాస్త తేరుకున్నప్పటికీ... ఇప్పుడు 'ప్రాజెక్ట్ K' ఫస్ట్ లుక్ వాళ్లని మరోసారి డిసప్పాయింట్ అయ్యేలా చేసింది. ఐరన్ మ్యాన్ పోజులో ఉన్న ఈ లుక్‌లో ప్రభాస్ తల వేరే ఎవరి శరీరానికో అతికించినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే 'మహానటి' లాంటి టిపికల్ స్క్రిప్ట్‌ని తీసిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకి డైరెక్టర్ కావడం, ఒక్క లుక్‌తో మూవీ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది సినిమా లవర్స్ వాదన. ఇంకా 'ప్రాజెక్ట్ K' టైటిల్ కూడా రివీల్ చెయ్యలేదు. ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. గురువారం జరిగే కామికాన్ ఈవెంట్లో టైటిల్ ఏంటనేది బయట పెట్టబోతున్నారు. అలాగే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వస్తుంది. అవి ఈ సినిమా గురించి పూర్తి డీటైలింగ్ ఇస్తాయి. ఏది ఏమైనా ఈ మధ్య ప్రభాస్ ప్రతి సినిమా ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ లుక్ లాంటివి ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తుండటం కాస్త వింతగా అనిపిస్తుంది. The Hero rises. From now, the Game changes 🔥 This is Rebel Star #Prabhas from #ProjectK. First Glimpse on July 20 (USA) & July 21 (INDIA). To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/AEDNZ3ni5Q@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7… pic.twitter.com/oRxVhWq4Yn — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2023 (ఇదీ చదవండి: Project K: దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది) -
నిర్మాతగా 'బాహుబలి' నటుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
'బాహుబలి' సినిమాలో సేతుపతి పాత్ర గుర్తుందా? అదేనండి గుడిలో అనుష్కపై చేయి వేయబోతే, ఆమె వేలు నరికేస్తుంది. ఆ తర్వాత 'తప్పు చేశావ్ దేవసేన.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తల’ అని బాహుబలి ప్రభాస్.. ఓ వ్యక్తి తలను నరికేస్తాడు. ఇప్పుడు ఆ నటుడు నిర్మాతగా మరో సినిమాని ప్రకటించాడు. కొత్త హీరోహీరోయిన్లని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశాడు. (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) యువనటుడు రాకేష్ వర్రే స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా చేసిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. 2019 దసరాకి థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీ.. ఓటీటీల్లోనూ బాగానే ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు అదే బ్యానర్‌పై రాకేష్ నిర్మాత కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. 'పేకమేడలు' అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీతో వినోద్ కిషన్, అనూష కృష్ణ టాలీవుడ్‌కి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. నీలగిరి మామిళ్ళ.. నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ బస్తీ, సిటీని 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చెన వేసిన హీరో లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపించాడు. ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. Presenting the captivating #firstlook poster of our upcoming movie "#Pekamedalu"! Following the universally appreciated "#EvvarikeeCheppoddu," we are thrilled to bring you yet another exhilarating roller coaster of emotions. Check #Motionposter Here: https://t.co/8p8xnx3HhN pic.twitter.com/vNXC5zWspS — Crazy Ants Productions (@crazyantsfilms) July 19, 2023 (ఇదీ చదవండి: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంజ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు!) -
'ప్రాజెక్ట్ K' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్
డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ K' ఒకటి. ఈ చిత్రంపై ఓ మాదిరిగా అంచనాలున్నప్పటికీ.. సినిమా లవర్స్ మాత్రం గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాబట్టి. ప్రభాస్ లాంటి కటౌట్‌ని పెట్టుకుని సాదాసీదా కథ అయితే తీయడుగా! తాజాగా బుధవారం రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్‌లుక్ చూస్తే అదే అనిపించింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కు బిగ్ రిలీఫ్) గత సినిమాలతో పోలిస్తే 'ప్రాజెక్ట్ K' ప్రభాస్ సరికొత్తగా కనిపించాడు. ఒళ్లంతా రోబో లాంటి సూట్ ఉన్నప్పటికీ.. పొడవైన జుట్టుతో కనిపించాడు. తన చేతితో భూమిని గుద్దితే, అది బద్దలైనట్లు ఈ ఫొటోలో చూపించారు. దీనిపై అభిమానులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. గురువారం జరిగే కామికాన్ ఈవెంట్ లో టైటిల్ ఏంటనేది రివీల్ చేయనున్నారు. మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా తీస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కొన్నిరోజుల ముందు ప్రకటించారు కానీ రిలీజ్ డేట్ మారే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. The Hero rises. From now, the Game changes 🔥 This is Rebel Star #Prabhas from #ProjectK. First Glimpse on July 20 (USA) & July 21 (INDIA). To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/AEDNZ3ni5Q@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7… pic.twitter.com/oRxVhWq4Yn — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2023 (ఇదీ చదవండి: Project K: దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది) -
గౌరవమే స్వేచ్ఛ
ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంకా అరుళ్ మోహనన్, నివేదితా సతీష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో టీజీ త్యాగరాజన్ సమర్పణలో జి. శరవణన్, సాయి సిద్ధార్థ్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ‘గౌరవమే స్వేచ్ఛ’ అనే క్యాప్షన్ తో శుక్రవారం ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు ధనుష్. ‘‘స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1930–1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. ఆల్రెడీ 85 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
విజయ్ 'లియో' ఫస్ట్‌లుక్.. ఇది గమనించారా?
దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాజిటివో, నెగిటివో ఎప్పటికప్పుడు మన దగ్గర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా మన దగ్గర కొందరు నెటిజన్స్ ఇతడిని తెగ ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న ఓ మూవీ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ పేరుకే తమిళ డైరెక్టర్. కానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలే దీనికి కారణం.. ఈ రెండు చిత్రాల్ని లింక్ చేస్తూ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) సృష్టించాడు. ఇప్పుడు విజయ్ తో చేస్తున్న 'లియో' కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా లియో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: హద్దులు దాటేస్తున్న తమన్నా.. 'లస్ట్ స్టోరీస్ 2'లో కూడా!) ఈ పోస్టర్ లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు చూపించారు. వెనక మంచు కొండలు, ఓ తోడేలు, ఓ వ్యక్తి ఊడిన పళ్లు, చేతిలో సుత్తి, దానితో పాటు గాల్లో రక్తం చూస్తుంటే.. విలన్ గ్యాంగ్ మనుషులు విజయ్ పై దాడి చేయడానికి వస్తే వాళ్లని తుక్కురేగ్గొట్టినట్లు కనిపిస్తుంది. గతంలో మూవీ నుంచి ఓ వీడియో రిలీజ్ చేసినప్పుడు టైటిల్ గోల్డ్ కలర్ లో ఉంది. ఈ ఫస్ట్ లుక్ లో మాత్రం రక్తంతో నిండిపోయింది. అయితే విజయ్ తో పాటు ఈ ఫొటోలో ఉన్న పన్ను, రక్తంతో ఉన్న చేయి సంతానం(విజయ్ సేతుపతి) దే అని తెలుస్తోంది. విక్రమ్ లో సంతానం పాత్రని ఓ సారి గుర్తుచేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా స్పష్టత రావాలంటే మాత్రం ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబరు 19న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. దాదాపు రూ.27 కోట్ల వరకు పలుకుతున్నాయని అంటున్నారు. #LeoFirstLook pic.twitter.com/zephjhBVbu — Vijay (@actorvijay) June 21, 2023 (ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?) -
ట్రైలర్ చూస్తే కష్టం అర్థమవుతోంది
‘‘నా దగ్గర ఓ వెబ్ సిరీస్‌కు సుబ్రమణ్యం అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. ‘నెల్లూరి నెరజాణ’ సినిమాను తెరకెక్కించటానికి చాలా కష్టపడ్డాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే టీమ్ అందరూ ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, వారందరికీ గొప్ప జీవితాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. ఎంఎస్ చంద్ర, హరి హీరోలుగా, అక్షాఖాన్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. చిగురుపాటి సుబ్రమణ్యం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ని నాగ్ అశ్విన్ విడుదల చేశారు. ‘‘నెల్లూరి నెరజాణ’ సినిమా అంతా నెల్లూరు యాసలో సాగుతుంది’’ అన్నారు చిగురుపాటి సుబ్రమణ్యం. ‘‘ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన సుబ్రమణ్యంగారికి కృతజ్ఞతలు’’ అన్నారు ఎంఎస్ చంద్ర, హరి, అక్షా ఖాన్. -
ఓ సామాన్యుడి సంతకం
‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నారప్ప’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తర్వాతి చిత్రానికి ‘పెదకాపు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. మిర్యాల సత్యనారాయణ సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌పై ‘పెదకాపు 1’ అని ఉంది. సో... ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పోస్టర్‌పై ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వెంకటేశ్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా?
వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. శుక్రవారం (మే 19) నవాజుద్దీన్ సిద్ధిఖీ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న వికాస్ వలిక్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో నవాజుద్దీన్ది పవర్ఫుల్ విలన్ రోల్. ‘‘హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. వెంకటేశ్ కెరీర్లో 75వ లాండ్ మార్క్ మూవీ ఇది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా (మనోజ్ఞ పాత్రలో) నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహానీ శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్మెంట్ కాగా ‘సైంధవ్’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహనిర్మాత: కిశోర్ తాళ్లరు, కెమెరా: ఎస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్) -
NTR30: ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ కోసం బీ రెడీ
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 అనే వర్కింగ్‌లో టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్‌కి జోడీగా నటిస్తుంది. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా తారక్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను అందించారు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈరోజు(శుక్రవారం)రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే జాన్వీ లుక్‌ని రివీల్ చేయగా ఇంతవరకు ఎన్టీఆర్ లుక్‌ని రిలీజ్ చేయలేదు. దీంతో ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తారక్ బర్త్‌డేకు ఒకరోజు ముందుగానే సర్ప్రైజ్ లభిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
ఆకట్టుకుంటోన్న ‘హ్యాపీ ఎండింగ్ ’ఫస్ట్ లుక్ పోస్టర్
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, హామ్స్ టెక్ ఫిల్మ్స్ & సిల్లీ మాంక్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీ ఎండింగ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. టైటిల్ కు భిన్నంగా హీరో యశ్ కూర్చుని ఉండగా.. వెనక గణపతి ఫోటో ఉంది. (చదవండి: అండర్ వాటర్‌లో నాగచైతన్య.. 'కస్టడీ' మేకింగ్ వీడియో రిలీజ్) ఒక మునీశ్వరుడుతో పాటు పాటు విల్లును ఎక్కుపెట్టిన వ్యక్తి, విల్లు చేతబట్టి యుద్ధానికి వెళుతున్నాడా అనేలా మరో వ్యక్తి ఫోటోస్ కనిపిస్తుండగా.. పోస్టర్ లో ఏంటీ.. బాబా శాపం ఇచ్చాడా అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటూనే యువతరాన్ని టార్గెట్ చేసుకుని రూపొందిన చిత్రం ఇది. -
అనూప్ రూబెన్స్ స్వరపరిచిన 'పైసా రే పైసా' ప్రోమో రిలీజ్
ఓ వైవిధ్యమైన కథతో ముస్తాబు అవుతున్న సినిమా ఓఎంజీ. ఓ మంచి ఘోస్ట్ అనేది ట్యాగ్‌లైన్. మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. "పైసా రే పైసా" అంటూ సాగే ఈ సాంగ్ మంచి డ్యాన్స్ బీట్ సాంగ్‌గా రూపొందించారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్సే స్వయంగా రచించి, పాడటం విశేషం. త్వరలోనే ఈ ఫుల్ సాంగ్ విడుదల కాబోతుంది.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. వెన్నెల కిశోర్, శకలక శంకర్, కమెడియన్ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ లుక్ చూశారా?
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర 2. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...``మా ఊరి పొలిమేర -2` పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు. నటుడు సత్యం రాజేశ్ మాట్లాడుతూ.. 'మా ఊరి పొలిమేర చిత్రాన్ని ఎంతో ఆదరించారు. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం' అన్నారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. `మా సినిమా ఫస్ట్‌లుక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడం చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నా. `మా ఊరి పొలిమేర` చిత్రాన్ని ప్రేక్షకులందరూ బాగా ఆదరించారు. 'మా ఊరి పొలిమేర' చిత్రానికి సిక్వెల్ ఉందా? లేదా? అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానంగా `మా ఊరి పొలిమేర -2` ఫస్ట్ లుక్ లాంఛ్ చేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడిస్తాం` అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః గ్యాని; సినిమాటోగ్రఫీః ఖుషేందర్ రమేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వర; కో-డైరక్టర్ః ఆకుల నాగ్; పీఆర్వోః జికె మీడియా; ఆర్ట్ డైరక్టర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎన్.సి.సతీష్ కుమార్; నిర్మాతః గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్ః డా.అనిల్ విశ్వనాథ్. చదవండి: సింగర్‌తో ఛత్రపతి డేటింగ్... ఎగిరి గంతేసిన నటి -
'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ్మత్తలా ఉందే!
బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది అనసూయ భరద్వాజ్. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. తాజాగా మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం విమానం. నేడు(సోమవారం)మేడే సందర్భంగా అనసూయ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇది రంగస్థలంలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రను గుర్తుచేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. చదవండి: షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరో.. ట్వీట్ వైరల్ సంతోష్ కట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్,సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
హెబ్బా పటేల్ చేతుల మీదుగా 'బోగీ' ఫస్ట్‌లుక్ రిలీజ్
పీసీ క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ చంద్ర నిర్మాతగా వరుణ్.K దర్శకత్వలో రూపొందుతున్న చిత్రం భోగి. సస్పెన్స్ కధాంశంతో, యూత్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇటీవలె షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రముఖ నిర్మాత డీఎస్ రావు, నటులు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మహిళలు ఎదుర్కుంటున్న సంఘటలను వివరిస్తూ, సున్నితమైన అంశాలను నలుగురు మహిళలు ఏ విధంగా ఎదుర్కొన్నారు అనే థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించామని తెలిపారు. -
పదేళ్ల తర్వాత టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్న ఆండ్రియా
విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. హిట్ సిరీస్‌తో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాప షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ను వదిలారు. కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా ఈ సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ అనే పాత్రలో కనిపించనుంది. చేతిలో రివాల్వర్‌తో స్టైలిష్ లుక్‌లో ఆండ్రియా దర్శనమిచ్చింది. కాగా గతంలో ఆమె నాగచైతన్య హీరోగా వచ్చిన తబాఖా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మళ్లీ పదేళ్లకు ఆండ్రియా టాలీవుడ్లో మెరవనుంది. Introducing JASMINE from SAINDHAV 🔥#SaindhavOnDec22 Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/I6L1W5cJjI — Andrea Jeremiah (@andrea_jeremiah) April 28, 2023 -
యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది!
యాపిల్ భారత్‌లో తన రెండవ స్టోర్ గురువారం (ఏప్రిల్ 20) ప్రారంభమవుతోంది. యాపిల్ సాకెట్ (apple saket)గా పిలుస్తున్న ఈ స్టోర్‌ను సీఈవో టిమ్ కుక్ ప్రారంభిస్తున్నారు. అధికారిక ప్రారంభానికి ఒక రోజు ముందు యాపిల్ తన ఢిల్లీ స్టోర్‌కు సంబంధించిన వివరాలను, చిత్రాలను వెబ్సైట్లో ప్రచురించింది. యాపిల్ ఉత్పత్తులను షాపింగ్ చేయడానికి, సేవలను పొందేందుకు యాపిల్ సాకెట్ కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని, ఇక్కడి సిబ్బంది కస్టమర్లకు అన్ని విధాలుగా సహకరిస్తారని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. అలాగే యాపిల్ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్టోర్‌లో ‘టుడే’ పేరుతో ఉచిత సెషన్లు ఏర్పాటు చేసింది. భారతదేశంలో తమ రెండవ స్టోర్ యాపిల్ సాకెట్‌ను ప్రారంభించడం ద్వారా ఢిల్లీలోని తమ కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామని యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిర్డ్రే ఓబ్రియన్ పేర్కొన్నారు. వెబ్సైట్ ఉంచిన ఫొటోల ప్రకారం.. యాపిల్ సాకెట్ స్టోర్‌లో ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వైట్ ఓక్ టేబుల్లతో స్టోర్ ముందు భాగాన్ని సుందరంగా రూపొందించారు. భారత్‌లో తయారు చేసిన ఫీచర్ వాల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మరోవైపు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఈ స్టోర్‌లో డెలివరీ పొందే సౌకర్యం ఉంది. ఇందుకోసం ప్రత్యేకమైన పికప్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇతర అన్ని యాపిల్ స్టోర్ల మాదిరిగానే ఢిల్లీలోని యాపిల్ సాకెట్ స్టోర్ కూడా 100 శాతం పునరుత్పాదక ఇంధన శక్తితో నడుస్తుంది. ఈ స్టోర్‌లో 70 కంటే ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన రిటైల్ టీమ్ ఉంది. దేశంలోని 18 రాష్ట్రాలకు వారు 15 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. డివైజ్ సెటప్ చేయడం, Apple IDని రికవరీ చేయడం, యాపిల్ కేర్ ప్లాన్‌ను ఎంచుకోవడం, సబ్స్క్రిప్షన్లను సవరించడం వంటి అన్ని విషయాలలో కస్టమర్లకు సహాయం చేసేందుకు ఇక్కడ జీనియస్ బార్ పేరుతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
సుహాస్ ' అంబాజీపేట మ్యారేజి బ్యాండు'.. ఆసక్తిగా ఫస్ట్‌లుక్ పోస్టర్
సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. దుశ్యంత్ కటికనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మెంబర్స్‌తో నిలబడి ఉన్న పోస్టర్ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. కాగా.. మొదటి సినిమా కలర్ ఫోటోతోనే ఫేమ్ సంపాదించుకున్న సుహాస్ ఇటీవలే రైటర్ పద్మభూషణ్ సినిమాతో అలరించాడు. ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. గ్యాంగ్ ల్యాండ్ అయ్యింది... ఇంక బ్యాండ్ మోగిపోతుంది 🎺🥁 Here's the first look of #AmbajipetaMarriageBand 💥💥#BunnyVas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP pic.twitter.com/WQ1EyPcwMt — Suhas 📸 (@ActorSuhas) April 11, 2023 -
పుష్ప రూలింగ్ స్టార్ట్
-
షాకింగ్ లుక్‌లో అల్లు అర్జున్.. నెట్టింట ఫోటో లీక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప-2 ది రూల్. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా వేర్ ఈజ్ పుష్ప పేరుతో ఇంట్రెస్టింగ్ వీడియోను వదిలిన సంగతి తెలిసిందే. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే పుష్ప వచ్చాడని అర్థం అంటూ కాన్సెప్ట్ టీజర్‌తో దుమ్మురేపిన పుష్ప టీంకు లీకు వీరులు షాక్ ఇచ్చారు. రేపు(శనివారం)బన్నీ బర్త్‌డే సందర్భంగా పుష్ప-2లోని ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయాలిని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ టీజర్ విడుదలైన కాసేపటికే అల్లు అర్జున్ మాస్‌లుక్ నెట్టింట లీక్ అయ్యింది. దీంతో చేసేదేమీ లేక అఫీషియల్ను పుష్పరాజ్ లుక్‌ను వదిలారు. అయితే ఇందులో అల్లు అర్జున్ మైండ్ బ్లాక్ అయ్యేలా అమ్మోరు అవతారంలో కనిపించి షాక్ ఇచ్చారు. కండలు తిరిగిన దేహంతో చీరకట్టుకొని చేతిలో తుపాకీ పట్టుకొని కనిపించారు బన్నీ. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఊరమాస్ లుక్‌లో నెవర్ బిఫోర్ అనేలా అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. #Pushpa2TheRule Begins!!! pic.twitter.com/FH3ccxGHb8 — Allu Arjun (@alluarjun) April 7, 2023 -
గ్లోబల్ స్టార్‌కు డబుల్ సర్ప్రైజ్.. 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా చెర్పీ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో ఇప్పటికే టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్రమైజ్డ్గా అంచనాలకు ధీటుగా గేమ్ చేంజర్‌ను నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే రామ్ చరణ్ బైక్‌పై కళ్లద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్న లుక్ అదిరిపోయింది. తాజా పోస్టర్‌ను చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే టైటిల్ రివీల్ చేయడంతో చెర్రీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇవాళ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చారు డైరెక్టర్ శంకర్. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా పవర్‌స్టార్ ఇమేజ్‌కు తగ్గ టైటిల్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్ ఖరారు చేశారు. టైటిల్, ఫస్ట్ లుక్కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. I couldn’t have asked for a better birthday gift !! #GameChanger Thank you @shankarshanmugh sir!! @SVC_official @advani_kiara @DOP_Tirru @MusicThaman pic.twitter.com/V3j7svhut0 — Ram Charan (@AlwaysRamCharan) March 27, 2023 -
వరుణ్ సందేశ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వరుణ్ సందేశ్ హీరోగా, ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా 'చిత్రం చూడర'. ఈ చిత్రానికి ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీఎం సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి’ రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ‘నేనింతే’ ఫేం అదితీ గౌతమ్ స్పెషల్ సాంగ్ చేస్తారని చిత్రబృందం పేర్కొంది. Get ready for an amusing ride with @itsvarunsandesh & gang 😀🤘 Here's the First Look of @BMCinemas_ Production No-1 #ChitramChudara 👀 Directed by @NHarsha828 🎬 Music by @radhanmusic 🥁#SeshuMaramreddy #BoyapatiBhagyalakshmi @DhanrajOffl#KasiViswanath #DhanaTummala pic.twitter.com/rs1Mi9icP5 — BM Cinemas (@BMCinemas_) March 9, 2023 -
సీరియస్ లుక్‌లో కమెడియన్స్.. భువన విజయమ్ ఫస్ట్ లుక్
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ డ్రామా భువన విజయమ్. యలమంద చరణ్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ వేణు ఉడుగుల లాంచ్ చేశారు. వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్‌లో కనిపించారు. శ్రీమతి లక్ష్మీ సమర్పిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. -
ఒకే ఫ్రేంలో అందాల తారలు.. కనుల పండుగగా హీరామండి ఫస్ట్‌లుక్
బాలీవుడ్లో దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. వాస్తవిక కథలను, హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన ఓ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పలువురు అగ్ర నటిమణులతో హీరామండి అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున ఈ సిరీస్ వేశ్యల కథ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సిరీస్‌ను నుంచి అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ క్వీన్స్ గెటప్‌లలో రాయల్ లుక్‌లో కనిపించారు. అందమైన తారలంతా ఒకే ఫ్రేంలో రాయల్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ అంత కనుల పండుగా చేసుకుంటున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కాగా స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. Another time, another era, another magical world created by Sanjay Leela Bhansali that we can’t wait to be a part of. Here is a glimpse into the beautiful world of #Heeramandi 💫 Coming soon! pic.twitter.com/tv729JHXOE — Netflix India (@NetflixIndia) February 18, 2023 -
తండ్రీ, కుమారుల అనుబంధమే 'తురువిన్ కురల్'
ప్రస్తుతం వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. భారీ చిత్రాలతో పాటు, వైవిధ్యభరిత కథాంశంతో కూడిన చిన్న చిత్రాలను ఈ సంస్థ నిర్మించడం విశేషం. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇటీవలే దర్శకుడు మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌ను ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. మరికొన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి తురువిన్ కురల్. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 24వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో నటుడు అరుళ్ నిధి కథానాయకుడుగా నటించారు. హరీష్ ప్రభు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి ఆత్మిక కథానాయకిగా నటించిన ఇందులో దర్శకుడు భారతీయ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిందని దర్శకుడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, పాండిచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. ఇది తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో అరుళ్ నిధి బధిరుడు(చెవిటి)పాత్రను పోషించడం విశేషం అన్నారు. చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, సింటో పోదుతాస్ ఛాయాగ్రహణం సమకూర్చారు. Presenting the Title & 1st look poster of our Production#24 #ThiruvinKural 📢⚕️ Starring the promising @arulnithitamil @offBharathiraja & @im_aathmika 🌟 Directed By @harishprabhu_ns 🎬 Music By @SamCSmusic 🎶 DOP @sintopoduthas 🎥 Editing @thecutsmaker ✂️🎞️ 🤝 @gkmtamilkumaran pic.twitter.com/aTzr2cbDtD — Lyca Productions (@LycaProductions) February 16, 2023 -
వినూత్న ప్రేమకథ 'పల్స్'.. ఫస్ట్‌లుక్ విడుదల
దిలీప్ కుమార్ మల్లా-రోషిణి పటేల్ సింగాని జంటగా నటించిన చిత్రం పల్స్. ఆర్.టి.మూవీ మేకర్స్ పతాకంపై రమణ తూముల స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ప్రముఖ సినీ రచయిత కె.శివశక్తి దత్తా (కీరవాణి ఫాదర్) సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆల్‌ది చెప్పారు. కాగా ఈ సినిమాలో ఈ చిత్రంలో కేరాఫ్ కంచరపాలెం రాధ, చంద్రశేఖర్ పాత్రుడు, డాక్టర్ శివరాం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి నిజాని అంజన్ సంగీతం సమకూర్చారు.ఈ చిత్రానికి కెమెరామెన్: చందు ఏజే, ఎడిటింగ్. ఉదయ్ చైతన్య (బాబి). -
అరవింద్ కృష్ణ కొత్త సినిమా యస్. ఐ.టి ఫస్ట్‌లుక్ అవుట్
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం "యస్. ఐ. టి. (S.I.T... ) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.బి.ఆర్. దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీ త్వరలోనే వెలువడనుంది. -
కమల్ కామరాజు 'సోదర సోదరీమణులారా...' ఫస్ట్‌లుక్ అవుట్
కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సోదర సోదరీమణులారా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టాగ్ లైన్. ఈ సినిమాతో రఘుపతి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 9 ఈఎమ్ ఎంటర్టైన్మెంట్స్, ఐఆర్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. పక్కా స్క్రిప్ట్‌తో కేవలం 35రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కింది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
తెలుగులో రిలీజ్ కానున్న కన్నడ హిట్ మూవీ వేద, ఫస్ట్ లుక్ చూశారా?
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ "వేద". ఈ సినిమా శివ రాజ్‌కుమార్‌కు చాలా ప్రత్యేకమైనది. అదెలాగంటే? ఈ సినిమాతో అతడు 125 చిత్రాల మైలురాయిని దాటేశాడు. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగులో విడుదలకు సిద్దమవుతోంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కన్నడలో డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు. చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. చివరికి వదిలేశాడు.. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే! -
తలైవాతో జతకడుతున్న తమన్నా.. ఫస్ట్‌లుక్ రిలీజ్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో 169వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో రివీల్ ఏశారు మేకర్స్. మిల్కీ బ్యూటీ తమన్నా తలైవాతో జతకడుతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమన్నా ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేసింది. కాగా జైలర్ చిత్రం మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు కన్నడ హీరో శివ రాజ్‌కుమార్, సునీల్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. .@tamannaahspeaks from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL — Sun Pictures (@sunpictures) January 19, 2023 -
అజయ్ దేవగన్ డైరెక్షన్లో పోలీస్ ఆఫీసర్‌గా టబు! ఫస్ట్‌లుక్ రిలీజ్
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘భోలా’. అజయ్ దేవగన్ ఫిలిమ్స్, టీ–సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె చేస్తున్న పోలీస్ ఆఫీసర్ లుక్‌ని అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘ఏక్ ఖాకీ.. సౌ సైతాన్స్’(ఒక పోలీసు.. వంద మంది దెయ్యాలు) అంటూ రాసుకొచ్చారు. పోలీస్ డ్రెస్, చేతిలో గన్‌తో టబు పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘భోలా’ తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. Ek khaaki. Sau shaitaan.#TabuInBholaa #Bholaain3D #Tabu pic.twitter.com/W5wLWqENyQ — Ajay Devgn (@ajaydevgn) January 17, 2023 -
రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అలా నిన్ను చేరి ఫస్ట్‌లుక్
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్‌తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న కొత్త సినిమా ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్రబృందం.. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ సినిమాలో శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు నటిస్తున్నారు. -
వేసవిలో కస్టడీ
నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 2023 మే 12న ‘కస్టడీ’ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘నాగచైతన్య పుట్టినరోజు (నవంబర్ 23) సందర్భంగా విడుదల చేసిన మా సినిమా టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని మే 12న తెలుగు, తమిళ భాషల్లో సినిమాని విడుదల చేయనున్నాం. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కదిర్. -
వాల్తేరు వీరయ్య: కేక పుట్టిస్తున్న రవితేజ ఫస్ట్‌లుక్ టీజర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కతున్న ఈ చిత్రంంలో మాస్ మహారాజా రవితేజ ఒక పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో రవితేజకి లుక్, అప్డేట్ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్, అటూ మాస్ మహారాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు(సోమవారం) రవితేజ ఫస్ట్‌లుక్ సంబంధించిన అప్డేట్ వదిలింది. చదవండి: అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సెట్లో ప్రభాస్ సందడి, వీడియో, ఫొటోలు లీక్ రవితేజ ఫస్ట్‌లుక్ టీజర్ పేరుతో తాజాగా మాస్మహారాజకు సంబంధించిన అప్డేట్ను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో రవితేజ తన నట విశ్వరూపం చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ మలిచిన ఈ ఫస్ట్‌లుక్ టీజర్ మాస్ ఆడియన్స్ చేత కేక పుట్టించేలా ఉంది. ‘ఫస్ట్ టైం ఒక మేకపిల్ల ను పులి ఎత్తుకొని వస్తున్నట్లు ఉన్నాది’ అనే డైలాగ్‌తో మాస్మహారాజా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్ లెవల్ అని చెప్పవచ్చు. చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ చూస్తుంటే రవితేజ రోల్‌ను డైరెక్టర్ బాబీ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దినట్లు ఉంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టైటిల్ ప్రచార చిత్రాలు సినిమా భారీ అంచనాలను పెంచగా.. తాజాగా విడుదలైన రవితేజ లుక్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి 13, 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. -
పల్లెటూరి అమ్మాయిగా నేహాశెట్టి.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తికేయ నటిస్తున్న తాజాచిత్రం బెదురులంక. క్లాక్స్ దర్శకత్వం రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా డీజే టిల్లు భామ నేహాశెట్టి నటిస్తుంది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. సోమవారం(నేడు)ఆమె బర్త్‌డే సందర్భంగా మేకర్స్ నేహాశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. Wishing beautiful & talented @iamnehashetty a very happy birthday ✨ Introducing "Chitra" from the world of #Bedurulanka2012 🌊 #Clax #ManiSharma @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth #HBDNehaSshetty pic.twitter.com/SWaoElGgFS — Kartikeya (@ActorKartikeya) December 5, 2022 -
చెఫ్‌గా మారిపోయిన హీరోయిన్ అనుష్క.. ఫోటో వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి గరిట పట్టారు. తన వంటలను కస్ట్మర్స్కి రుచి చూపించేందుకు చెఫ్‌గా మారారు. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. ఆమె నటిస్తున్న తాజా చిత్రం కోసమే. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తున్నారు. కాగా సోమవారం (నవంబర్ 7) అనుష్క బర్త్‌డేని పురస్కరించు కుని అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘మా సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. On my Birthday I am happy to Introduce myself as Masterchef 'Anvitha Ravali Shetty' from my upcoming project with @NaveenPolishety #MaheshBabuP #NiravShah @UV_Creations 😊 Can’t wait to meet u all on Big Screen 🤞🏻❤️ pic.twitter.com/jsVFlTDwMM — Anushka Shetty (@MsAnushkaShetty) November 7, 2022 -
‘అమ్మాయిలు అర్థం కారు’.. ఫస్ట్‌లుక్ విడుదల
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, జాతీయ రహదారి’ వంటి చిత్రాల ఫేమ్ నరసింహ నంది దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మాయిలు అర్థం కారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ విడుదల చేశారు. నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘నాలుగు జంటల ప్రేమకథలో ఏర్పడే మలుపులు, భావోద్వేగాలతో ఈ సినిమా ఉంటుంది. మధ్యతరగతి జీవితాల్లో డబ్బు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? దానివల్ల జీవితాలు ఎలా తారుమారవుతాయి? అనే అంశాన్ని చర్చించాం’’ అన్నారు. ‘‘చిత్తూరు, తిరుపతి ప్రాంతాల యాస నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు కర్ర వెంకట సుబ్బయ్య. -
‘ఫుల్ బాటిల్’ నుంచి సత్యదేవ్ ఫస్ట్‌లుక్ అవుట్
మెర్క్యురీ సూరి సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఫుల్ బాటిల్’. ఈ చిత్రంలో మెర్క్యురీ సూరి పాత్రలో స్టయిలిష్‌గా కనిపించనున్నారు సత్యదేవ్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఎస్డీ కంపెనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి. -
సత్యరాజ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నయన్ ‘కనెక్ట్’, ఫస్ట్‌లుక్ అవుట్
లేడీ సూపర్ స్టార్ నయనతార చిత్రాలకు అందరూ కనెక్ట్ అవుతారు. అలాంటిది ఇప్పుడు ఆమె కనెక్ట్‌గా మారింది. ఒక పక్క స్టార్ హీరోలతో నటిస్తున్న ఈమె, మరో పక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథల్లో నటిస్తూ విజయాలను అందుకుంటోంది. ఇలాంటి కథా చిత్రం విడుదలయ్యేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఈమె నటించిన ఓ2 చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా నయనతార కథానాయకిగా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి కనెక్ట్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. కాగా కనెక్ట్ చిత్రంలో నయనతారకు జంటగా నటుడు వినయ్ నటించగా సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనిని అశ్విన్ శరవణన్ తన గత చిత్రాల తరహాలోనే తెరకెక్కించినట్లు తెలిసింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ప్రత్యేక పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరపుకుంటున్న ఈ మూవీ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. అయితే నయనతార గత చిత్రాల మాదిరిగా ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? లేక థియేటర్లలో విడుదలవుతుందా ? అన్నది తెలియాల్సి ఉంది. కనెక్ట్ చిత్ర విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
మైనస్ డిగ్రీల చలిలో జాన్వీ కపూర్.. ఆకట్టుకుంటున్న టీజర్
దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మిలి'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో జాన్వీ నర్సు పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని జాన్వీ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ చిత్రానికి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాన్వీ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించనుంది. (చదవండి: హీరోయిన్ జీవితం అలా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వీ కపూర్) టీజర్‌ను చూస్తే... ' మైనస్ 16 డిగ్రీల చలి ఉష్ణోగ్రతతో ఫ్రీజర్‌లో ఇరుక్కుపోయిన జాన్వీ కపూర్ తన నోటిని ఉపయోగించి టేపులను చింపివేస్తున్నట్లు సీన్‌తో టీజర్ ప్రారంభమైంది. ఆమె ఫ్రీజర్ నుంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించడం.. స్టిల్స్‌లో ఆమె ప్లాస్టిక్‌తో చుట్టేసినట్లు కనిపించడం ఆసక్తిని రెేకెత్తిస్తోంది. టీజర్లో డైలాగ్‌లు లేకపోయినా.. జాన్వీ కపూర్ ఎక్స్ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) జాన్వీ కపూర్‌లో లుక్‌తో ఉన్న మరో పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో ఆమె ఫ్రీజర్‌లో ఇరుక్కుపోయి.. ఆమె ముఖంపై ఎర్రటి గుర్తులతో ఉన్నట్లు కనిపించింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌తో పాటు మనోజ్ పహ్వా, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహితో పాటు మరిన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్‌లో కూడా కనిపించనుంది. -
‘అధర్వ’ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్‌లుక్ రిలీజ్
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా 'అధర్వ'. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా,సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు.అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నిత్య అనే పాత్రలో సిమ్రాన్ చౌదరి కనిపించనుందని మేకర్స్ తెలిపారు. డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాను సంగీతం అందిస్తున్నారు. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
శాకుంతలం: సమంతకు జోడీగా నటిస్తున్న దేవ్ మోహన్ పోస్టర్ రిలీజ్
సమంత టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ – గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదయ్యాయి. ఇక ఈ సినిమాలో సమంత శాకుంతల దేవీ పాత్రలో సమంత నటిస్తుండగా దుష్యంత్ మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటించారు. తాజాగా ‘శాకుంతలం’ లోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. -
ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ ఫస్ట్‌లుక్, 3D మోషన్ పోస్టర్ విడుదల
యంగ్ హరో ఆది సాయికుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాప్ గేర్. ఇటీవలె విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి మరో అప్డేట్ను అందించి చిత్ర బృందం. ఈ చిత్రంలో ఆది సరికొత్త పాయింట్‌తో అలరించబోతున్నాడని తెలుస్తోంది ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే. ఇకపోతే ఈ మోషన్ పోస్టర్ సరికొత్తగా 3డీలో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పొందుతోంది. ఇందులో ఆది సరసన రియా సుమన్ నటిస్తోంది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
చిరంజీవి 'గాడ్‌ఫాదర్'లో సత్యదేవ్ క్యారెక్టర్ ఇదే
‘గాడ్ ఫాదర్’ కోసం జై దేవ్ అవతారం ఎత్తారు సత్యదేవ్. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినివను నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో జై దేవ్ పాత్ర చేశారు సత్యదేవ్. చిరంజీవి తమ్ముడిగా ఆయన క్యారెక్టర్ ఉండనుందని సమాచారం. ఇక దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5 నే రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్లో తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు. Presenting versatile actor @ActorSatyaDev as the wily 'Jaidev' from #GodFather ❤️🔥 - https://t.co/rSZusB3TTy#GodFatherOnOct5th 💥 Megastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @LakshmiBhupal @AlwaysRamCharan @ProducerNVP pic.twitter.com/TupFBOIxs2 — Konidela Pro Company (@KonidelaPro) September 12, 2022 -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ హీరోగా అజయ్‌గాడు, ఫస్ట్ లుక్ వచ్చేసింది
ఇటీవలే 'విశ్వక్' సినిమాలో అలరించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ అజయ్ కతుర్వార్ ప్రస్తుతం ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను యంగ్ హీరో సత్యదేవ్ ఆవిష్కరించారు. “అజయ్ గాడు” అనే టైటిల్ అందర్నీ ఆకట్టుకుంటుండగా అజయ్ తన ఫస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే ఫైర్ టీజర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అజయ్ దర్శకత్వం వహిస్తుండగా చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. అజయ్ నాగ్, హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతాన్ని సిద్ధార్థ్ శివుని సమకూర్చారు. View this post on Instagram A post shared by Ajay Kumar Kathurvar (@ajay_kathurvar) View this post on Instagram A post shared by Ajay Kumar Kathurvar (@ajay_kathurvar) చదవండి: చెర్రీ-ఉపాసనల మేకప్ ఆర్టిస్ట్‌తో నటుడి పెళ్లి -
ఈ పల్లెటూరి బుట్టబొమ్మను చూశారా? ఎంత చక్కగా ఉందో
అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. నవంబరులో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గోపీసుందర్, మాటలు: గణేష్‌కుమార్ రావూరి. -
'మార్క్ ఆంటోనీ'గా విశాల్.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది
వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం "మార్క్ ఆంటోనీ". మినీ స్టూడియోస్ పతాకంపై రీతు వర్మ , సునీల్ వర్మ , అభినయ , మహేంద్రన్ , నిజగల్ రవి , కింగ్స్లీ నటీ నటులుగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే సందర్బంగా "మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నట్లు చాలా పవర్ఫుల్ గెటప్‌లో కనిపిస్తున్నారు. -
బ్రహ్మానందం కొడుకు నటించిన తాజా చిత్రం.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్ అవుట్’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ మోదుగ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని శనివారం విడుదల చేశారు. కిటికీ నుంచి బయటికి చూస్తూ బిగ్గరగా అరుస్తున్న రాజా గౌతమ్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది. ‘‘సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న చిత్రమిది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో చెబుతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘చిత్రం’ శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఇతర కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోహన్ చారీ, సంగీతం: జోన్స్ రూపర్ట్. -
పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క.. "బ్రహ్మచారి" ట్రైలర్..
దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయి దొరకక తను ఎలాంటి ఇబ్బంది పడ్డాడు అనేదే ఈ "బ్రహ్మచారి" కథ. పొడిచేటి మూవీ మేకర్స్ పతాకంపై వెండితెరకు దర్శకుడుగా పరిచయం కాబోతున్న కొత్త కెరటం నర్సింగ్ దర్శకత్వంలో నూతన నటీనటులతో రమేష్ మాస్టర్ శ్రీ కిరణ్, విగ్నేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం "బ్రహ్మచారి'".ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు. కార్యక్రమానికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ కె బసి రెడ్డి గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ , ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు లయన్ డాక్టర్ సాయి వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర దర్శకుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ..మమ్మల్ని, మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వయసు పైబడ్డ వాళ్ళు డబ్బులున్నా, ఎంత ఇబ్బంది పడతారో కామెడీ గా చెప్పాలనుకున్నాను. ఇందులో నేను ఎదుర్కున్న అనుభవాలు కూడా ఉండవచ్చు.నిజ జీవితం లో ఎదురయ్యే సంఘటనలతో ఈ "బ్రాహ్మ చారి" సినిమా తియ్యడం జరిగింది. అన్నారు. -
దేశభక్తిని చాటేలా.. మిలటరీ నేపథ్యంలో కథ
‘‘ఎమోషనల్, ఫ్యామిలీ, మిలటరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. మంచి కంటెంట్‌తో డీయస్ రాథోడ్ తీసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. నజీరుద్దీన్, సీతా మహాలక్ష్మీ జంటగా డీయస్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భారత్ కీ నారీ’. అఖిల్ గంధం సమర్పణలో నమీర్ ఉద్దీన్ అహ్మద్ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ని బెక్కం వేణుగోపాల్, ఫస్ట్ లుక్‌ని కల్నల్ రామారావు విడుదల చేశారు. డీయస్ రాథోడ్ మాట్లాడుతూ– ‘‘దేశాన్ని కాపాడటానికి సైనికులు బాధ్యత వహించినట్లే వారి సతీమణులు కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారు. ఈ చిత్రాన్ని దేశ సైనికుల సతీమణులకు, వారి తల్లితండ్రులకు అంకితం చేస్తున్నాం. సెప్టెంబర్ నెలాఖరులో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘మిలటరీ ఆఫీసర్‌గా నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు నజీరుద్దీన్. -
‘ప్రొఫెసర్’గా మారిన మంచు మోహన్ బాబు
మంచు మోహన్‌బాబు ప్రొఫెసర్ విశ్వామిత్రగా మారారు. విశ్వంత్ హీరోగా, మోహన్‌బాబు, మంచు లక్ష్మీ, చైత్రాశుక్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ప్రతీక్ ప్రజోష్ డైరెక్టర్. మోహన్‌బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మోహన్‌బాబు ఫస్ట్‌లుక్ పోస్టర్ని ఆదివారం విడుదల చేశారు. ‘‘తన ఆలోచనలు, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల డాషింగ్ అండ్ డైనమిక్ ప్రొఫెసర్ కమ్ సైకియాట్రిస్ట్ విశ్వామిత్ర పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారు. తండ్రీకూతుళ్లు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే. మలయాళ నటుడు సిద్ధిఖ్ విలన్‌గా, సముద్రఖని కీలక పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: లిజో కె జోస్ పని చేస్తున్నారు. Meet the Dynamic and effervescent Professor Viswamitra. The man who can move mountains with his profound thinking and ideologies. @themohanbabu#Agninakshathram #ManchuMohanBabu #CharacterReveal #FirstLook pic.twitter.com/Q8uPz41vdu — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) July 31, 2022 -
బాలరాజుగా నాగ చైతన్య.. ఫస్ట్‌లుక్ చూశారా?
ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం రిలీజవుతోంది. తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య లుక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘లాల్‌సింగ్ చద్దా చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ను మీకు పరిచయం చేస్తున్నా.. అలనాటి బాలరాజు (అక్కినేని నాగేశ్వరరావు) మనవడు మన నాగచైతన్యనే ఈ బాలరాజు’’ అని పేర్కొన్నారు చిరంజీవి. చదవండి: ఆమె నా హృదయం ముక్కలు చేసింది: నాగ చైతన్య ‘లాల్ సింగ్ చడ్డా’, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాను. అలనాటి ‘బాలరాజు’ మనవడు మన అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు. @chay_akkineni Introducing #Balaraju from #LaalSinghChaddha #AamirKhan @AKPPL_Official @Viacom18Studios #LaalSinghChaddhaOnAUG11th pic.twitter.com/1cVgbURrZx — Chiranjeevi Konidela (@KChiruTweets) July 20, 2022 -
"మూడు చేపల కథ" ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
"సమంత" చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తొలి చిత్రంతోనే దర్శకుడిగా తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ముఖేష్ కుమార్ తెరకెక్కించిన ద్వితీయ చిత్రం "మూడు చేపల కథ". షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ గా ముఖేష్ కుమార్ రూపొందిస్తున్న "మూడు చేపల కథ" మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. యండమూరి నవలలు చదువుతూ పెరిగి ఆయన ఇచ్చిన ప్రేరణతో రచయిత అయి దర్శకుడిగా మారిన తను దర్శకత్వం వహించిన "మూడు చేపల కథ" ఫస్ట్ లుక్ యండమూరి ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖేష్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తన రెండవ చిత్రం "మూడు చేపల కథ" తెరకెక్కించానని ముఖేష్ తెలిపారు. ప్రముఖ ఆర్జే లక్ష్మీ పెండ్యాల (లక్కీ), సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న "గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ" స్టూడెంట్స్ డా: కల్యాణ్, సుభాష్ గయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. అధిక భాగం షూటింగ్ అనంతపురంలో జరుపుకున్న ఈ చిత్రం పోస్టర్‌ను ప్రముఖ యాంకర్ రమేష్ అనంతపురంలోనూ రిలీజ్ చేశారు. -
మైత్రీ మూవీ బ్యానర్లో యంగ్ హీరో మూవీ, ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నేటితో 30వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. శుక్రవారం (జూలై 15న) పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖు, హీరోహీరోయిన్లు కిరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఇదిలా ఈ హీరో బర్త్‌డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్ వదులుతున్నారు మేకర్స్. కాగా ప్రస్తుతం కిరణ్ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. అందులో ‘మీటర్’ ఒకటి. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి నేడుకిరణ్ అబ్బవరం బర్త్‌డే సందర్భంగా ‘మీటర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో కిరణ్ మాస్ లుక్‌లో కనిపించాడు. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు టాక్. అతుల్య రవి ఈ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత నిర్మిస్తున్నారు. సూర్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. సాయి కార్తిక్ స్వరాలని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, ‘రూల్స్ రంజన్’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాల షూటింగ్ బిజీగా ఉన్నాడు. Here's @Kiran_Abbavaram Mass Look from #Meter ❤️🔥 Get ready for Immeasurable Entertainment 🔥 ▶️ https://t.co/xZFvvnpyIQ#HBDKiranAbbavaram#RameshKaduri @AthulyaOfficial #SaiKartheek #VenkatCDileep @ClapEntrtmnt @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/YAqbRnH5le — Clap Entertainment (@ClapEntrtmnt) July 15, 2022 -
జిన్నాగా వస్తోన్న మంచు విష్ణు, ఫస్ట్ లుక్ చూశారా?
విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిన్నా. ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్‌లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, అలాగే చోటా కే నాయుడు కనిపించడం విశేషం. ఈ ఫస్ట్ లుక్ వీడియోలో హీరో అని పిలిస్తే పలకని మంచు విష్ణు జిన్నా అనగానే మాత్రం చటుక్కున లేచి నిలబడి దేనికైనా రెడీ అంటుండటం విశేషం. ఇక ఈ సినిమాకు ఇంతకుముందు విష్ణు నటించిన రెండు చిత్రాలకు స్క్రిప్ట్‌లు అందించిన కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. Mass Comedy Action!! It's the #Ginna Style@starlingpayal @SunnyLeone @anuprubens #PremRakshith@avaentofficial @24FramesFactory#Ginna #GinnaBhai Teluguhttps://t.co/1nmoFTUkVT Hindihttps://t.co/5TllK3y72q Malayalamhttps://t.co/MYoyBXgX4H — Vishnu Manchu (@iVishnuManchu) July 11, 2022 చదవండి: వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్ ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు -
‘లక్కీ లక్ష్మణ్.. మంచి కాఫీలాంటి సినిమా’
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్, మోక్ష హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఎ.ఆర్. అభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రం బృందంగా ఇటీవల ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ లాంచ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్కీ లక్ష్మణ్ మూవీ ఫస్ట్‌లుక్ చాలా బాగుందని, దర్శక, నిర్మాతలకు ఇది తొలి చిత్రమే అయిన మూవీ బాగా తీశాకరన్నారు. అలాగే లక్కీ లక్ష్మణ్ మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం హీరో సోహైల్ మాట్లాడుతూ.. అనిల్ అన్న చేతుల మీదుగా తన మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, తన బిజీ షెడ్యూల్లో సైతం తమ మూవీ ఫస్ట్‌లుక్ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన మూవీ దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారన్నాడు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్పుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్‌తో నిర్మించారని సోహైల్ తెలిపాడు. నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు ఒక మంచి కాఫీలాంటి సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్ కీత. -
రామారావు ఆన్‌డ్యూటీ నుంచి వేణు ఫస్ట్‌లుక్ అవుట్
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో స్పీడ్ స్పీడ్‌గా షూటింగ్‌లను పూర్తి చేస్తూ సినిమాలు వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన సినిమాల నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తోంది. ఈ క్రమంలో రామారావు ఆన్‌డ్యూటీ మూవీ నుంచి ఓ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఇటీవల రిలీజైన సీసా సీసా అనే ఐటం సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు వేణు తొట్టెంపూడి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. చదవండి: సమంత ఇన్‌స్టాలో కేటీఆర్ పోస్ట్, షాక్‌లో ఫ్యాన్స్, సామ్ టీం క్లారిటీ కాగా వేణు ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అతడు ఓ కీ రోల్ పోషించనున్నాడు. అయితే ఆయన పాత్రపై మాత్రం ఇప్పటి వరకు మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ. దీంతో తాజాగా వదిలిన వేణు ఫస్ట్‌లుక్ చూస్తుంటే అతడు పోలీతసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. హీరోగా స్యయం వరం, చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వేణు అనంతరం సహా నటుడిగా మెప్పించాడు. ఇక చివరిగా జూనియర్ ఎన్టీఆర్ దమ్ము, రామాచారి చిత్రాల్లో కనిపించిన ఆయన దాదాపు 11 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శ్రుతి? హీరోయిన్ క్లారిటీ ఇప్పుడు మళ్లీ రామారావు ఆన్‌డ్యూటీ మూవీతో తన ఫ్యాన్స్‌ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో సర్పట్టా ఫేం జాన్ విజయ్, చైతన్యకృష్ణ, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జులై 29న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది. Our favourite #VenuThottempudi will be live to talk about #RamaRaoOnDuty and much more 💥🔥 Tune into Instagram and Facebook of @SLVCinemasOffl 🔥#RamaRaoOnDutyOnJuly29 Mass Maharaja @RaviTeja_offl @directorsarat #AnveshiJain @SamCSmusic @RTTeamWorks pic.twitter.com/g0ORirHDic — SLV Cinemas (@SLVCinemasOffl) July 6, 2022 -
అవతార్ 2: నేవీ నాయకి లుక్ వచ్చేసింది!
అవతార్.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఎంతగానో అలరించిందీ చిత్రం. దీంతో ఈ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా రాబోతోంది అవతార్: ది వే ఆఫ్ వాటర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాలో నేవీ అధికారి రొనాల్గా నటించిన కేట్ విన్స్లెట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. భయమెరుగని నిజాయితీ గల నాయకిగా ఆమెను కీర్తించారు. అందుకు తగ్గట్టుగానే ఆమె లుక్ కూడా అదిరిపోయింది. ప్రముఖ ఎంపైర్ మ్యాగజైన్‌పై ఆమె ఫస్ట్ లుక్ ప్రచురితమైంది. ఇకపోతే విన్స్లెట్.. తన పాత్ర కోసం నీళ్లలో ఉన్నప్పుడు ఎక్కువ సేపు శ్వాస నిలుపుకోవడాన్ని ప్రాక్టీస్ చేసిందట. 20th సెంచరీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో విన్స్లెట్తో పాటు సామ్ వార్తింగ్టన్, జియో సాల్డనా, సిగర్నీ వేవర్ సహా పలువురు నటిస్తున్న విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by 20th Century Studios (@20thcenturystudios) చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు.. -
బాస్ తిరిగొచ్చేశాడు.. వారసుడు ఫస్ట్ లుక్ చూశారా?
దళపతి విజయ్ ప్రస్తుతం తన 66వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. జూన్ 22న విజయ్ బర్త్‌డే కావడంతో ఒక రోజుముందే దళపతి 66 సినిమా టైటిల్‌ను ప్రకటించారు. విజయ్- వంశీల కలయికలో వస్తున్న చిత్రానికి వరిసు అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. The BOSS Returns as #Varisu#VarisuFirstLook#HBDDearThalapathyVijay Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp#Thalapathy66 pic.twitter.com/x2HXJH3ejq — Sri Venkateswara Creations (@SVC_official) June 21, 2022 'వరిసుగా తిరిగొస్తున్న బాస్' అంటూ విజయ్ ఫస్ట్ లుక్ సైతం వదిలారు. ఇందులో హీరో బిజినెస్‌మెన్‌గా కనిపిస్తున్నాడు. బర్త్‌డే ట్రీట్ ఒకరోజు ముందే ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో #HBDDearThalapathyVijay, #Thalapathy66FirstLook హ్యాష్‌ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రాబోతోంది ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. #Varisu pic.twitter.com/b2bwNNAQP8 — Vijay (@actorvijay) June 21, 2022 #Thalapathy66 is #Vaarasudu in Telugu#VaarasuduFirstLook#VarisuFirstLook#HBDDearThalapathyVijayThalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/2TqlbestWr— Sri Venkateswara Creations (@SVC_official) June 21, 2022 చదవండి: ‘మేజర్’ నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్, ఆకట్టుకుంటున్న అమ్మ పాట పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట! -
ఉక్రెయిన్ బ్యూటీకి సుమతి శతకం బోధిస్తున్న శివ కార్తికేయన్
ఉక్రెయిన్ బ్యూటీ మరియ ర్యాబోషప్కకి సుమతీ శతకం బోధిస్తున్నారు హీరో శివ కార్తికేయన్. ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్, ర్యాబోషప్క జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేశ్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ర్యాబోషప్క ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తన ప్రేయసి ర్యాబోషప్కకి ప్రిన్స్ హ్యాపీగా సుమతీ శతకం బోధిస్తున్నట్లుగా పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. #Prince Second look ❤️👍 pic.twitter.com/A5mJh2cAAU — Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 10, 2022 -
కిరాయి ఫస్ట్ లుక్ చూశారా?
చీకటి గదిలో చితక్కొట్టుడు, 24 కిస్సెస్, డియర్ మేఘ, రీసెంట్ గా రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న "కొండ" చిత్రాలలో హీరోగా నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు త్రిగున్. అతడు తాజాగా నటిస్తున్న చిత్రం "కిరాయి". వీఆర్కే దర్శకత్వంలో అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో గుంటూరు, పల్నాడులలో ఎక్కువగా కిరాయి హత్యలు జరిగేవి. ఈ హత్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రోజు(జూన్ 8) హీరో త్రిగున్ బర్త్ డే సందర్బంగా డైరెక్టర్ హరీష్ శంకర్ "కిరాయి" ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 'త్రిగున్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. తను చాలా ఎనర్జిటిక్ హీరో. గతంలో లవ్, కామెడీ వంటి మంచి మంచి సినిమాలు చేశాడు. తను మొదటి సారిగా డిఫరెంట్ సబ్జెక్టు అటెంప్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాను' అన్నారు. చిత్ర దర్శకుడుV. R. K,(రామకృష్ణ) మాట్లాడుతూ.. 'ఇందులో హీరో కిరాయి తీసుకోకుండా కిరాయిహత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయవలసి వచ్చింది. ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ కథ. రీసెంట్గా ఈ సినిమా రష్ & ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ చాలా బాగుందని మెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. ఇందులో యాక్షన్ మాములుగా ఉండదు. ఒక ట్రాన్స్ఫారం బద్దలయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది' అన్నారు. చదవండి: రూ.40 వేల ఖరీదైన టీ షర్ట్ ధరించిన కరీనా, వెరీ చీప్ టేస్ట్ అంటున్న నెటిజన్లు రూ. 150 కోట్లలో మీ వాటా ఎంత? యంగ్ హీరోకు నెటిజన్ ప్రశ్న.. -
షాకింగ్ లుక్‌లో కోవై సరళ, ఫొటో వైరల్
Kovai Saral Shocking look From Sembi Movie: కోవై సరళ.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన కామెడీతో నవ్వించి లేడీ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. బెసిగ్గా తమిళ నటి అయిన కోవై సరళ టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో లేడీ కమెడియన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గరైంది. చివరిగా 2019లో వచ్చిన అభినేత్రి 2లో కనిపించిన ఆమె కొంతకాలంగా తెరపై కనుమరుగైంది. ఈ నేపథ్యంలో కోవై సరళకు సంబంధించిన ఓ షాకింగ్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తలపై క్లాత్ కప్పుకుని 70 ఏళ్ల వృద్దురాలిగా దీన స్థితిలో ఉన్నట్లు కినిపించింది. చదవండి: కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎప్పుడూ తెరపై నవ్వుతూ,నవ్విస్తూ ఉంటే కోవై సరళ ఇందులో మాత్రం చాలా సీరియస్‌గా కనిపించింది. అయితే ఇది ఆమె తాజాగా నటించిన తమిళ చిత్రం ‘సెంబి’ లోనిది. ‘అరణ్య’ ఫేమ్ ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమె 70 ఏళ్ల వృద్దురాలుగా నటిస్తోంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఓ బస్సు నేపధ్యంలో 24 మంది ప్రయాణికుల చుట్టూ ఈ కథ నడుస్తోందని, ఇందులో కోవై సరళ సీరియస్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. తంబి రామయ్య, అశ్విన్ కుమార్‌తోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ నీల ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తోంది. ఈ మూవీని తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. Presenting the Title and First Look of my next titled #SEMBI #செம்பி starring #KovaiSarala @i_amak prod by #Ravindran's @tridentartsoffl & #AjmalKhan @actressReyaa's @AREntertainoffl #Jeevan @nivaskprasanna #Buvan #VijayThennarasu @PhoenixPrabu2 @srikrish_dance @onlynikil pic.twitter.com/BCO7eACqYP — Prabu Solomon (@prabu_solomon) May 20, 2022 -
'క్రేజీ ఫెలో'గా మారిపోయిన హీరో ఆది.. లుక్ చూశారా?
హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో. ఫణికృష్ణ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆది కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. Unveiling the Crazy Look💥 of our #CrazyFellow 🕺 @AadiSaikumar #CrazyFellowLook@DiganganaS @mirnaaofficial @siriki_phani @SriSathyaSaiArt @KKRadhamohan #RRDhruvan #SatishMutyala @GiduturiSatya @adityamusic @UrsVamsiShekar pic.twitter.com/cwU91imGxd — Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) May 19, 2022 -
'ఖుషి' టైటిల్‌తో వస్తున్న విజయ్, సామ్
VD11 First Look: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో నటించిన పాన్ ఇండియా ఫిలిం లైగర్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా ఇదే డైరెక్టర్‌తో కలిసి జనగనమణ మూవీ చేయనున్నాడు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. ఇందులో సమంత అతడితో జోడీ కట్టింది. సోమవారం ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్‌డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. విజయ్, సమంతల మూవీకి ఖుషి టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఇందులో విజయ్ డ్రెస్సుకు, సమంత చీరకు ముడివేసినట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. An explosion of Happiness, laughter, Love and family bonding ❤️#Kushi - Telugu Tamil Kannada Malayalam Dec 23 Worldwide Release Spread the joy this Christmas, New Years 😍@Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic pic.twitter.com/HT3C38IT7I — Vijay Deverakonda (@TheDeverakonda) May 16, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1271266370.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: వాకింగ్‌కు వెళ్లిన.. సినీ నిర్మాత దుర్మరణం ఒకరి విప్లవం మరొకరికి ఉగ్రవాదం.. అదిరిన 'విక్రమ్' ట్రైలర్ -
సమంత, విజయ్‌ల ఫస్ట్‌లుక్ వచ్చేది అప్పుడే
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ను విజయ్ దేవరకొండ షేర్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని రేపు(సోమవారం)ఉదయం 9.30నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్లో 11వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి తర్వాత సామ్, విజయ్ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. Tomorrow :) 9:30 AM Muhurtham set by@Samanthaprabhu2 https://t.co/Mc3MEsdVF1 — Vijay Deverakonda (@TheDeverakonda) May 15, 2022 -
ఇద్దరు హీరోయిన్స్‌తో హస్యనటుడు సంతానం రొమాన్స్
గులు గులు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. హాస్యనటుడు సంతానం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. నటి అతుల్య చంద్ర, నమితా కృష్ణమూర్తి నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మేయాదమాన్, అడై చిత్రాల దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కిస్తున్నారు. సర్కిల్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.రాజ్ నారాయణన్ భారీఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనిని జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సినీ వర్గాల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు తెలిపారు. -
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది
'నాంది' సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు హీరో అల్లరి నరేష్ కామెడీని పక్కనపెట్టి తొలిసారి సీరియస్ రోల్ పోషించారాయన. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో మరో సీరియస్ పాత్రలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’అనే సినిమాను చేస్తున్నారు. అల్లరి నరేష్ సినీ కెరీర్‌ను ప్రారంభించి 20ఏళ్లు పూర్తయిన సంర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఏఆర్ రాజమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్గా నటిస్తుంది. జీ స్టూడియోస్, హర్ష మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. #Naresh59 #ItluMaredumilliPrajaneekam #IMP @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @SricharanPakala pic.twitter.com/oIPsid6p6H — Allari Naresh (@allarinaresh) May 10, 2022 -
క్యాబ్ డ్రైవర్‌గా మారిన హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఐశ్వర్యా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యక ఇమేజ్ను సంపాదించుకుంది. తాజాగా ఆమె క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తింది. రాజేశ్ కిన్ స్లిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘డ్రైవర్ జమున’ అనే పేరును ఖరారు చేశారు. గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్పీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. -
అపర్ణా మాలిక్ ‘డెడ్‌లైన్’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
అపర్ణా మాలిక్ హీరోయిన్గా, విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం డెడ్లైల్. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమాను శ్రీ విఘ్నతేజ ఫిలిం పతాకంపై బొమ్మారెడ్డి వీఆర్ఆర్ రచన దర్శకత్వంలో తాండ్ర గోపాల్ నిర్మించారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. చదవండి: ఉత్కంఠగా సమంత ‘యశోద’ మూవీ ఫస్ట్‌గ్లింప్స్ ఈ సందర్భంగా దర్శకుడు బొమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో ప్రతి స్త్రీ ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల గురించి చర్చించే చిత్రమే ఈ డెడ్ లైన్. నేటి యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని మా చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించాం. ప్రేక్షకుడు ఊహించని విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉత్కంఠ భరితంగా చిత్రీకరించాం. విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు’ అని అన్నారు. -
‘జనతా బార్’ నుంచి రాయ్‌లక్ష్మీ ఫస్ట్‌లుక్ విడుదల
రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘జనతా బార్’. రోచి శ్రీమూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. నేడు రాయ్‌లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా ‘జనతా బార్’ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా రమణ మొగిలి మాట్లాడుతూ– ‘‘స్పోర్ట్స్ నేపథ్యంలో జరగుతున్న అన్యాయాలు, లైంగిక వేధింపులపై ఓ యువతి చేసిన పోరాటమే ‘జనతా బార్’. ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంది. నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 8న హైదరాబాద్‌లో ఆ పాటల చిత్రీకరణ ఆరంభిస్తాం’’ అన్నారు. శక్తి కపూర్, ప్రదీప్ రావత్, సురేష్, దీక్షాపంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య, కెమెరా: చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అశ్వథ్ నారాయణ, అజయ్ గౌతమ్. -
పాన్ ఇండియా సినిమాలో జెర్సీ హీరోయిన్.. ఫస్ట్‌లుక్ విడుదల
శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి మొల్లేటి ప్రధాన తారాగణంగా నటించిన బహుభాషా చిత్రం ‘విట్ నెస్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ వెంకటేశ్ నిర్మించారు. ఈ సినిమాకు దీపక్ దర్శకత్వం వహించడంతో పాటు కెమెరామేన్ బాధ్యతలు నిర్వహించారు. మే డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘విట్ నెస్’ చిత్రంలో మంచి ఆశయం కోసం పోరాడే ఆర్కిటెక్ట్ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ కనిపిస్తారు. పారిశుద్ధ్య కార్మికుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: రమేష్ తమిళమణి. With the world of conservancy workers at its center, the movie WITNESS presents a never-seen-before view of metropolitan cities and the invisible corridors of power lying underneath them.#WITNESS First Look pic.twitter.com/JxyBweGxam — Shraddha Srinath (@ShraddhaSrinath) May 1, 2022 -
ఆకట్టుకుంటున్న 'విక్కీ ది రాక్ స్టార్' ఫస్ట్ లుక్
విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కితున్న చిత్రం ‘విక్కీ ది రాక్ స్టార్’. శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సీఎస్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలైంది. చదవండి 👉: యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? నేల పై సాగు చేసే రైతు ఆకాశం వైపుకి , ఆకాశమే హద్దు గా భావించే యువత నేల వైపుకి , ఒక వైపు నాగలితో రైతన్న, మరో వైపు గిటార్ తో విక్కి ది రాక్ స్టార్ , రైతు కాలికి ముద్దు పెడుతూ ఉన్న ఈ పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘నీ కాళ్ళకే ముద్దులె పెట్టనా ఫార్మర్ ’ అంటూ బాక్ గ్రాండ్ లో వస్తున్న లిరిక్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది.ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
రష్మిక బర్త్‌డే: దుల్కర్ సల్మాన్‌తో జతకట్టిన రష్మిక, ఫస్ట్‌లుక్ అవుట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నేటితో(ఏప్రిల్ 5) 26వ వసంతంలోకి అడుగు పెడుతుంది. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తూ ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఆమె ‘పుష్ప 2’తో పాటు హిందీలో అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే రణ్‌బీర్ కపూర్-సందీప్ వంగ దర్శకత్వంలో వస్తున్న ఏనిమల్ వరల్డ్ చిత్రంలో హీరోయిన్ చాన్స్ కొట్టెసింది. ఇప్పుడు తాజాగా ఆమె మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో జతకట్టబోతోంది. ఈ రోజు ఆమె బర్త్‌డే సందర్భంగా ఈ మూవీలోని తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఆమె పాత్ర పేరు కూడా ప్రకటించారు. కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రొమాంటిగ్ లవ్ స్టోరీ తెరకెక్కినున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో ఆమె అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. (చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ పై అక్షయ్ భార్య సంచలన వ్యాఖ్యలు) -
వరలక్ష్మి శరత్ కుమార్ ‘వర ఐపీఎస్’ ఫస్ట్‌లుక్ విడుదల
క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. లేడీ ప్రధానమైన పాత్రలు ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘వర ఐపీఎస్’. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీ లలితాంబికా ప్రొడక్షన్ నిర్మిస్తున్నఈ సినిమా తెలుగు హక్కులను శ్రీలక్ష్మి జ్యోతి బ్యానర్ వారు దక్కించుకున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ అధినేత ఏ ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తుండగా.. నేడు(ఏప్రిల్ 3) ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్.. సినిమాపై అంచనాలను పెంచింది. ఒరేయ్ బామ్మర్ది వంటి విజయవంతమైన సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ నుంచి మరో ఆసక్తి పరిచే సినిమా రావడం విశేషం. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ఫుల్ ఐపీఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జగదీష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి భారీ సినిమాకి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో తలైవసల్ విజయ్, రవి కాలే, సుమిత్ర, భరత్ రెడ్డి, బ్లాక్ పాండి, రాజేష్ తదితరులు నటిస్తున్నారు. -
‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి నితిన్ ఫస్ట్‌లుక్ అవుట్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి ఇందులో నితిన్‌కి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి నితిన్ లుక్‌ను విడుదల చేసింది చిత్రం బృందం. ఈ మేరకు శ్రీ ఎన్ సిద్ధార్థరెడ్డి ఐఏఎస్ గుంటూరు కలెక్టర్ ఈ రోజు ఫస్ట్ చార్జ్ తీసుకున్నారంటూ అంటూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ రోజు ఉదయం 10గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేశారు మేకర్స్. గుంటూరులో జిల్లా కలెక్టర్‌గా హీరో ఎదుర్కోబోయే సవాళ్లను ఈ మూవీలో చూపించనున్నారు. రాజకీయ నేపథ్యంతో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్లో కనిపించనున్నాడు. Its time to take my First Charge ✍️ Reporting as SIDDHARTH REDDY 😎 Meeku Nachhe , Meeru Mechhe MASS tho Vastunaa :))) #MacherlaNiyojakavargam🔥@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies @adityamusic pic.twitter.com/7vaf5h9YjK — nithiin (@actor_nithiin) March 26, 2022 -
'అంటే సుందరానికి'... నజ్రియా లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
నాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె లుక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో నజ్రియా లీలా థామస్‌గా నటించనుంది. తాజగా ఈమె లుక్‌ను రివీల్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మార్చి 17న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి నజ్రియా లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరి నాని, నజ్రియా కాంబినేషన్ ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. Aeeelllo! Ladies and gentlemen, obliging to your repeated requests of love, we will introduce our electric Charm⚡ #NazriyaFahadh as LEELA THOMAS on 17th March at 4:05 PM ❤️#AnteSundaraniki#ZerothLookOfLeela@NameisNani #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/HZcORNKg9g — Mythri Movie Makers (@MythriOfficial) March 16, 2022 -
అఖిల్ ‘ఎజెంట్’ మూవీ నుంచి మమ్ముట్టి లుక్ అవుట్
అక్కినేని వారసుడు అఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎజెంట్’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు చాకోలెట్ బాయ్‌గా కనిపించిన అఖిల్ ఈ మూవీ కోసం జిమ్‌లో కసరత్తుల చేసి సిక్స్ బ్యాక్ బాడీతో మేకోవర్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు మేకర్స్ దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఏజెంట్ చిత్రం నుంచి మమ్ముట్టి ఫస్ట్లుఖ్ పోస్టర్ విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ చిత్రంలో భాగమయ్యారు’ అంటూ ఆయన పోస్టర్‌ను విడుదల చేశారు. తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి తుపాకీని పట్టుకున్న మమ్ముట్టి భారీ యాక్షన్ సీన్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ‘ది డెవిల్ క్రూరమైన రక్షకుడు’ అని మేకర్స్ పోస్ట్ రిలీజ్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వడం పట్ల మమ్ముట్టి పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షి కథానాయికగా నటిస్తోంది. హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. A Stalwart of Indian Cinema who paved his own path with Discipline & Dedication 🔥 Megastar @mammukka🤘Joins the shoot of #AGENT ⚡️ Can’t wait to witness the magic on sets ❤️@AkhilAkkineni8 @DirSurender @AnilSunkara1 @VamsiVakkantham@hiphoptamizha @AKentsOfficial @S2C_Offl pic.twitter.com/pmVv474Vnz — AK Entertainments (@AKentsOfficial) March 7, 2022 -
దేవకన్యలా సమంత.. శాకుంతలం ఫస్ట్‌లుక్ వచ్చేసింది
Samantha First Look In Shakunthalam Is Out: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణాటీమ్ వర్క్స్ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సమంత ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సమంత దేవకన్యలా కనిపిస్తుంది. చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో సమంత లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. చదవండి: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను : సమంత Presenting .. Nature’s beloved.. the Ethereal and Demure.. “Shakuntala” from #Shaakuntalam 🤍 #ShaakuntalamFirstLook@Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official @tipsofficial #MythologyforMilennials pic.twitter.com/q4fCjyfnth — Samantha (@Samanthaprabhu2) February 21, 2022 -
నటుడు నరేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..
‘‘విజయ నిర్మల జయంతి సందర్భంగా ‘మిస్టర్ కింగ్’ పోస్టర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. హీరో శరణ్, దర్శక– నిర్మాతలకు, చిత్ర యూనిట్‌కు మంచి పేరు రావాలి’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. విజయ నిర్మల అన్నయ్య మనవడు, సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వం వహించారు. ]హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా ‘మిస్టర్ కింగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విజయ నిర్మల జయంతి సందర్భంగా(ఆదివారం) కృష్ణ విడుదల చేశారు. ‘‘మా ఫ్యామిలీ నుంచి వస్తున్న 8వ హీరో శరణ్’’ అన్నారు నరేశ్. ‘‘మా అమ్మగారు కూడా విజయ నిర్మలగారి అభిమాని’’ అన్నారు బి.ఎన్.రావు. ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు శశిధర్ చావలి. ‘‘మా సినిమా యువతకు బాగా నచ్చుతుంది’’ అన్నారు శరణ్. నిష్కల, ఊర్వీ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సమర్పణ: బేబీ హన్విక, సంగీతం: మణిశర్మ, కెమెరా: తన్వీర్ అంజుమ్, సహ నిర్మాత: రవికిరణ్ చావలి. -
"శ్రీ రంగనాయక" మూవీ పోస్టర్‌ను లాంచ్ చేసి తనికెళ్ల భరణి
వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో రామావత్ మంగమ్మ నిర్మించిన చిత్రం "శ్రీ రంగనాయక".గోవింద రాజ్ విష్ణు ఫిలిం బ్యానర్ పై నిర్మిస్తున ఈ చిత్రంలో వినయ్ రాజ్ దుందిగల్, పండ్రాల లక్ష్మి, రంగ బాషా ,నిహారిక చౌదరి, లెంకల అశోక్ రెడ్డి నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ వేడుక హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగింది. ఫస్ట్ లుక్ ను నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ,నటుడు కెప్టెన్ చౌదరి, నటుడు, నిర్మాత కోప్పిలి శ్రీనివాస్, దర్శకుడు దొరై రాజు, జూనియర్ పవన్ కళ్యాణ్, కరాటే యస్ శ్రీనివాస్, యస్.సౌమ్య, తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం నటుడు తనికెళ్ల భరణి మీడియాతో మాట్లాడుతూ.. నాకు భక్తి సినిమాలు అంటే ఎంతో ఇష్టం. అలాంటిది విష్ణుమూర్తి పైన వస్తున్న "శ్రీ రంగ నాయక" చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం దర్శక,నిర్మాత లకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు. -
‘14 డేస్ లవ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన వి.వి. వినాయక్
Vv Vinayk Launched 14Days Love First Look: మనోజ్ పుట్టుర్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘14 డేస్ లవ్’. నాగరాజ్ బోడెమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై హరిబాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ని డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘ఈ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్ బోడెమ్‌కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు. -
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' టైటిల్ లుక్ రిలీజ్
Prabhutva Junior Kalasala Title Look Released: యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై భువన్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. -
హీరోగా ప్రభుదేవా నెక్ట్స్ మూవీ ఇదే.. టైటిల్ వచ్చేసింది
Prabhu Deva Next Action Entertainer Film Titled Rekla: డాన్సింగ్ స్టార్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా ప్రస్తుతం నటన పైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హీరోగా వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ఆయన నటించడానికి అంగీకరించిన తాజా చిత్రానికి రెక్లా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది ప్రభుదేవా నటిస్తున్న 58వ చిత్రం కావడం గమనార్హం. ఒలింపియా మూవీస్ పతాకంపై అంబేత్‌కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి వాల్టర్ చిత్రం ఫేమ్ అన్భు దర్శకత్వం వహించనున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు ఆర్య బుధవారం తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ టైటిల్ లుక్ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండీగా మారి చిత్రంపై భారీ అంచనాలు నెలకునేలా చేస్తోందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా ఇందులో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. -
పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
Puneeth Rajkumar James Movie Army Officer Look Released: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో గతేడాది అక్టోబర్ 29న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఈ ఏడాది మార్చి17న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు(జనవరి26)న స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఆయన సైనికుడిలా కనిపించారు. చేతన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది.హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా, అను ప్రభాకర్ ముఖర్జీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా అదే రోజున ఈ సినిమా విడుదల చేయనున్నారు. దీంతో మార్చి 17-23 మధ్యలో ఎలాంటి సినిమాలు విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమానుకన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. -
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ చూశారా?
Vaisshnav Tej and Ketika Sharma First Look Released: వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. కేతికా శర్మ హీరోయిన్. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం∙టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ముఖచిత్రం: ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామా..
Anil Ravipudi launches first look of Mukha Chitram: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యరావ్, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో గంగాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ముఖచిత్రం’. ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ‘‘ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ దర్శకుడు, రైటర్ సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ అందించగా, కాలభైరవ సంగీతం అందించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
వడ్డీయుమ్ ముదలుమ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
స్టార్ వాల్యూస్‌తో చేసే చిత్రాలు కొన్నైతే కథలనే నమ్ముకుని రూపొందించే చిత్రాలు మరికొన్ని. వీటిలో రెండవ కోవకు చెందిన చిత్రం 'వడ్డీయుమ్ ముదలుమ్'. పిలోమియా పిక్చర్స్ పతాకంపై ఏ.సెవియర్ రాజ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఎన్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాత, కొత్త నటీనటులు నటించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజా విడుదల చేశారు. దీన్ని దర్శకుడు, నటుడు సముద్రఖని ఆవిష్కరించారు.