
ఈ పార్టీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, దిల్ రాజు, నాగవంశీ ఉన్నారు. మహేశ్ భార్య నమ్రత, కూతురు సితార కూడా పార్టీలో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను
గుంటూరు కారం సినిమాలో మాస్ యాంగిల్‌లో కనిపించి అభిమానులను ఖుషీ చేశాడు మహేశ్‌బాబు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ అందుకుంటున్న ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.164 కోట్ల మేర రాబట్టింది. దీంతో సంక్రాంతి పండగ రోజే సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
హైదరాబాద్‌లోని తన ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ పార్టీ ఇచ్చాడు మహేశ్. ఈ పార్టీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, దిల్ రాజు, నాగవంశీ ఉన్నారు. మహేశ్ భార్య నమ్రత, కూతురు సితార కూడా పార్టీలో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలందరూ పండగను పురస్కరించుకుని సాంప్రదాయ దుస్తుల్లో మెరవడం విశేషం. అయితే ఈ పార్టీకి త్రివిక్రమ్ శ్రీనివాస్, తమన్ ఇద్దరూ డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరు ఎక్కడ? అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Happy Sankranthi!!!
— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2024
Blockbuster celebrations 💥💥💥#GunturKaaram#DilRaju @vamsi84 @sreeleela14 @Meenakshiioffl pic.twitter.com/uxkDoEcjmj