Guntur Kaaram Movie
-
గుంటూరు కారం సాంగ్.. ఆ దేశంలో క్రేజ్ చూశారా!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గతేడాది సంక్రాంతికి అభిమానులను అలరించాడు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ మూవీలో కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్‌లో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తన స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఊపేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా తమన్ మ్యూజిక్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను అలరించింది.అయితే సినిమా రిలీజైన ఏడాది దాటిపోయినా కుర్చీని మడతపెట్టి సాంగ్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా నేపాల్‌లో ఈ పాటకు ఇద్దరు యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు పక్కన యువతులు గుంటూరు కారం సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. అంతేకాకుండా నేపాల్‌లోని ఓ కళాశాలలో స్టూడెంట్స్ సైతం కుర్చినీ మడతపెట్టి అనే సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాట అభిమానులకు గూస్బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది. #KurchiMadathapetti Mania in NEPAL ❤️🔥Global sensation @urstrulyMahesh - @MusicThaman 🥁 #MaheshBabu | #GunturKaaram pic.twitter.com/mfJcQurGrS— VardhanDHFM (@_VardhanDHFM_) January 22, 2025 -
భారీ బడ్జెట్ చిత్రాలు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్!
కాలం ఎవరి కోసం ఆగదు. కాలంతో పాటే మనం పరిగెత్తాల్సిందే కానీ నీకోసం ఈ ప్రపంచంలో ఏది వేచి ఉండదు. అలా కర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కాలం. చూస్తుండగానే మరో ఏడాది కనుమరుగవుతోంది. ఈ కాలమనే భూగర్భంలో 2024 కలిసిపోనుంది. కొత్త ఆశలతో మరో ఏడాది అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ ఏడాది అయినా సక్సెస్ సాధించాలని కోరుకునే వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. మరి ఈ ఏడాది సినీ పరిశ్రమకు కలిసొచ్చిందా? లేదా? అనేది చూద్దాం.మరి ఈ ఏడాది సినీ పరిశ్రమ కొంతవరకు సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్తీ-2 లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. మరికొన్ని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అనూహ్యంగా చతికిలపడ్డాయి. భారీ అంచనాలతో రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. మరి 2024లో విడుదలై బాక్సాఫీస్ డిజాస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో మనం ఓ లుక్కేద్దాం. ఇండియన్-2- నిరాశపరిచిన సీక్వెల్28 ఏళ్ల క్రిత శంకర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఇండియన్(భారతీయుడు). ఈ మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కమల్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. కమల్ హాసన్ నటనతో మెప్పించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.సూర్య కంగువాకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది.రామ్ పోతినేని- డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో గతంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అదే కాన్ఫిడెన్స్‌తో డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్‌ను తీసుకొచ్చారు పూరి జగన్నాధ్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ నటన ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా పేరును దక్కించుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.మోహన్ లాల్- మలైకోట్టై వాలిబన్మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ మూవీ మలైకోట్టై వాలిబన్. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం వీజువల్ ఫీస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కథ, మోహన్ లాల్ నటన మెప్పించినప్పటికీ స్క్రీన్‌ప్లే మైనస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. వాలిబన్ అనే ఓ యోధుని కథ ఆధారంగా ఈ మూవీని తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించారు.మహేశ్ బాబు- గుంటూరు కారంఈ ఏడాది సంక్రాంతికి రీలీజైన టాలీవుడ్ చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈచిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గతంలో సూపర్ హిట్స్ కావడంతో అదేస్థాయిలో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా అభిమానులను ఆకట్టుకుంది.మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, క, వాజై, మెయిజగన్ వంటి చిత్రాలు పెద్ద కమర్షియల్ హిట్ సాధించాయి. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. -
ఈ ఏడాది టాప్ సాంగ్స్ లిస్ట్ ప్రకటించిన యూట్యూబ్.. తెలుగు పాటకు చోటు
తెలుగు సాంగ్ గ్లోబల్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన సాంగ్స్‌లలో టాప్-10 లిస్ట్‌ను యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. అందులో ఇండియా నుంచి ఒక సాంగ్ మాత్రమే ఉంది. అయితే, అది తెలుగు సినిమాకు సంబంధించిన పాట కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో సందడి చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్‌తో లెక్కలేనన్నీ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది.'కుర్చీ మడతపెట్టి' సాంగ్ విడుదలైనప్పటి నుంచే యూట్యూబ్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. 527+ మిలియన్ వ్యూస్‌తో ఇప్పటికి కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దీంతో 2024 యూట్యూబ్ టాప్ సాంగ్స్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్ పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 7 టాప్ హిట్ సాంగ్స్‌ను యూట్యూబ్ ప్రకటించింది. అందులో భారత్ నుంచి ఎంపికైన ఏకైక పాట 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్ ఉండటం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు పాట సత్తా చాటడంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న విడుదలైంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారికా అండ్ హసిని బ్యానర్స్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, మహేష్ వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాయి. -
బ్యాట్మింటన్‌లో స్టేట్ లెవల్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్
ఇతర రంగాలకు కాస్త భిన్నం సినిమా రంగం. ఇక్కడు ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో చెప్పలేం. అసలు వారు కూడా ఊహించలేరు. తన పరిస్థితి అంతేనంటోంది నటి మీనాక్షి చౌదరి. ఈ కన్నడ భామలో అందం, అభినయం ఉన్నా, అదృష్టం మాత్రం కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. టాలీవుడ్లో వర్థమాన హీరోలతో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈమెకు ఒక్క సారిగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా ఆమె నటించిన తొలి భారీ చిత్రం గుంటూరు కారం. మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. అదే విధంగా తమిళ చిత్ర పరిశ్రమకు కొలై అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ నటుడు విజయ్ సరసన గోట్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఈ చిత్రం తరువాత ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం)గా తెరకెక్కిన లక్కీభాస్కర్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు టాలీవుడ్లో ఈ అమ్మడు బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల నటి మీనాక్షీ చౌదరి ఒక భేటీలో తన తండ్రి సైనికుడు కావడంతో చాలా క్రమశిక్షణతో పెరిగానని చెప్పింది. స్కూల్, కాలేజ్ రోజుల్లోనే తనను స్పోర్ట్స్‌లో పాల్గొనేలా చేశారని చెప్పింది. తాను టెన్సీస్ క్రీడలో రాష్ట స్థాయిలో పాల్గొన్నానని చెప్పింది. తన తండ్రి తనను క్రీడాకారిణిగా చూడాలని ఆశించారని పేర్కొంది. అలా తాను హీరోయిన్ని అవుతానని అస్సలు ఊహించలేదని నటి మీనాక్షీ చౌదరి చెప్పుకొచ్చింది. కాగా ఈమె ఇప్పుడు కథానాయకిగానే కాకుండా వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ బిజీగా ఉండడం గమనార్హం. -
కుర్చీ మడతపెట్టి పాటకు మైండ్ బ్లాక్ అయ్యే రికార్డ్
కొన్ని పాటలు భాషతో సంబంధం లేకుండా క్లిక్ అవుతాయి. అలా ఈ ఏడాది కుర్చీ మడతపెట్టి పాట సూపర్‌డూపర్ హిట్టయింది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవల్లోనూ ఈ పాట మార్మోగిపోయింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం సినిమాలోనిదే ఈ పాట!పాట బ్లాక్బాస్టర్ హిట్మహేశ్బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటకైతే విజిల్స్ పడ్డాయి.వన్స్మోర్ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రిపీట్ మోడ్‌లో పాట వింటూనే ఉన్నారు. తాజాగా ఈ పాట అరుదైన రికార్డు అందుకుంది. ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది. ఈ సంతోషకర సమయంలో ఫ్యాన్స్ వన్స్‌మోర్ అంటూ మరోసారి కుర్చీ మడతపెట్టి సాంగ్ వింటున్నారు. చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్రప్రసాద్ -
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజే వేరు. అగ్రహీరోల సినిమాలన్నీ ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాయి. పొంగల్ బాక్సాఫీస్ పోటీకి థియేటర్లు దొరకడం అంతా ఆషామాషీ కాదు. అందుకే పెద్ద హీరోలంతా ముందుగానే కర్చీఫ్ వేసేస్తారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ చిత్రం రెడీ అయిపోయాయి. త్వరలోనే మరిన్నీ చిత్రాలు పొంగల్ బాక్సాఫీస్ పోటీకి సై అంటున్నాయి.అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలే సందడి చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్‌తో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్ పోటీలో నిలిచాయి. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించారు. వేదికపై వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు.అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో మహేశ్ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 25 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న మహేష్ మీద సెటైర్ వేయడం కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గుంటూరు కారం సినిమాపై మాట్లాడినందుకు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రానా, తేజ సజ్జా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Context 😤pic.twitter.com/PBTuhvgD3W— Cinderella🦋 (@GlamGirl_Geetha) November 6, 2024 U had one success man, one! Daniki 25 yrs ga ace filmography unna Mahesh meedha satireUnless you come up with a sequel for Hanuman, aa collections thechkolev and yk why @tejasajja123 Inka Rana gurinchi enduku, shelved project adhi— Jimhalpert (@satvikdhfm) November 5, 2024 Dear @tejasajja123 ,Need apology to superstar @urstrulyMahesh garu and his fans You and rana degrade comments about 2024 sankranthi films , in this sankranthi one of my beloved superstar film also there you know also,Please try to understand this situation.Thanks and…— Sagar MB (@dhfmbabu4005) November 5, 2024 -
కుర్చీ మడతపెట్టి సాంగ్.. నా లుక్ చూసి ట్రోల్ చేస్తారనుకున్నా!
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బొద్దుగా తయారవుతుంటారు. ముందు ఎలా ఉన్నా సరే తల్లయ్యాక మాత్రం శరీర సౌష్ఠవమే మారిపోతుంది. సమయమే కొందరిని మళ్లీ మామూలు స్థితికి తీసుకొస్తే మరికొందరు మాత్రం జిమ్, డైటింగ్‌తో సన్నబడి నాజూకుగా అవుతుంటారు. అందరిలాగే డెలివరీ తర్వాత హీరోయిన్ పూర్ణ కూడా బొద్దుగా అయిపోయింది. లావయ్యా.. సాంగ్ చేయగలనా?సరిగ్గా అదే సమయంలో తనకు గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి పాటలో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో తన రియాక్షన్ ఎలా ఉందనేది తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. పూర్ణ మాట్లాడుతూ.. శేఖర్ మాస్టర్ నాకు ఫోన్ చేసి కుర్చీమడతపెట్టి పాట ఆఫర్ చేశారు. మాస్టర్, నేనిప్పుడు దున్నపోతులా తయారయ్యాను, ఈ అవతారంలో నేను చేయగలను అనుకుంటున్నారా? అని అడిగాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బరువు పెరిగిపోయాను.అదే హైలైట్ చేస్తామనడంతో..నాపై నేనే అపనమ్మకంతో ఉన్నాను. కానీ సినిమా టీమ్, డైరెక్టర్ నా డ్యాన్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ హైలైట్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్‌కు ఒకరోజు ముందు కూడా నేను రావాల్సిందేనా? అని అడిగాను. అందుకు అవునన్నారు. అయితే సోషల్ మీడియాలో నా ఫోటోలు చూసినవాళ్లు పూర్ణ ఏంటి? పందిలా తయారైంది.. అని చులకనగా కామెంట్లు చేసేవాళ్లు. మీరు తిట్టేది తల్లినేఅవి చూసి చాలా బాధపడ్డాను. ఇలా నోటికి ఏదొస్తే అది వాగేవాళ్లు ఒక తల్లిని తిడుతున్నామని ఎందుకు గ్రహించరో? ఈ నెగెటివిటీని దృష్టిలో పెట్టుకునే ఆ సాంగ్‌లో కనిపించేందుకు అంగీకరించాను. ఆశ్చర్యమేంటంటే.. నా పర్ఫామెన్స్ మెచ్చుకున్నవాళ్లే ఎక్కువ. ఇది నా కెరీర్లోనే బెస్ట్‌గా నిలిచిపోయింది' అని పూర్ణ చెప్పుకొచ్చింది. చదవండి: బిగ్‌బాస్ షోలో 'మహారాజ' నటి ఎంట్రీ? -
హనుమాన్ టు కల్కి.. టాలీవుడ్ ఫస్టాప్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం.ఓపెనింగ్ అదిరింది!టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’, ‘బిఫోర్ మ్యారేజ్’ సినిమాలు ప్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి.బ్యాండ్ మోగింది..ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్‌కట్ బాలరాజు’, ‘గేమ్ ఆన్’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’, ‘సుందరం మాస్టర్’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్ కావడం గమనార్హం.అలరించని సమ్మర్సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ టాలీవుడ్‌కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. మార్చి తొలివారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. (చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)రెండోవారం గోపిచంద్ ‘భీమా’తో విశ్వక్ సేన్ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్ టాక్ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అయినా..ఒక్కటి కూడా హిట్ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ సూపర్ హిట్ కొట్టేసింది. బాక్సాపీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.ఏప్రిల్‌లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్ టాక్ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.(చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)మేలో తొలివారం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్ వీక్‌లో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్‌కి వచ్చిన విషయమే తెలియదు. ఆ తర్వాత వారంలో ‘నట రత్నాలు’, ‘బిగ్ బ్రదర్’, ‘సీడీ’ ‘సిల్క్ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్ టాక్ని మూటగట్టుకున్నాయి. గెటప్ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్ టాక్‌కి సంపాదించుకుంది. ఇక జూన్ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్.. ‘మనమే’ అంటూ శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏది హిట్ కాలేదు. రెండో వారంలో సుధీర్ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్ షాప్ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్‌కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్ సృష్టిస్తోంది. మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి. -
Mother's Day 2024: బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘అమ్మ’
నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా..విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై లుక్కేద్దాం.గుంటూరు కారం(2024)మహేశ్‌బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రం మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కినదే. ఇందులో మహేశ్‌కు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ- మహేశ్‌బాబు మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి.ఒకే ఒక జీవితం(2022)శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.'బిచ్చగాడు'తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మ చెప్పింది2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ప్రభాస్ 'ఛత్రపతి'(2005)రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు.అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.నిజంకొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటు అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్, చిరుత, అమ్మ రాజీనామా, సింహరాశి, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. -
గ్లోబల్ రేంజ్లో మహేశ్.. ఆఫ్రికాలో 'కుర్చీని మడతపెట్టి'న చిన్నారులు
త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం 'గుంటూరు కారం'. సినిమా విషయంలో మొదట నెగటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా రూ. 175 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 'కుర్చీని మడతపెట్టి' సాంగ్ లక్షల వ్యూస్‌తో రికార్డులు సృష్టించడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేసింది. మహేశ్ బాబు, శ్రీలీల, పూర్ణ ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. ఇది విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ పాటకు ఆఫ్రికన్ పిల్లలు స్టెప్పులు వేశారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో నేషనల్ బాస్కెట్‌బాల్ గేమ్స్ జరుగుతుండగా.. ఆట మధ్యలో ఏర్పాటుచేసిన వినోద కార్యక్రమంలో కొందరు అమెరికన్స్ ఈ పాటకు డ్యాన్స్ వేశారు. దానిని చూసిన ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లల అదిరిపోయే డ్యాన్స్‌తో తాజాగా కుర్చీ మడతపెట్టేశారు. స్మాష్ టాలెంట్ ఫౌండేషన్ వారు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ పాటకు థమన్ అందించిన మ్యూజిక్కు తమదైన శైలిలో చక్కగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. From “Smash Talent Foundation Kids”, AFRICA 😯🔥#KurchiMadathapetti goes Global 🌍 #MaheshBabu | #GunturKaaram My Hero @urstrulymahesh 👑 pic.twitter.com/rzkgxzQcCr — VardhanDHFM (@_VardhanDHFM_) April 13, 2024 Dancing to #KurchiMadathapetti on stage - Done ✅🤩🤩🤪 #Goals2024 pic.twitter.com/cuursWK1Ec — Sou😇 (@theChicaCuriosa) April 15, 2024 #KurchiMadathaPetti song at at Pune Ugaadi celebrations 🔥🔥#GunturKaaram pic.twitter.com/slaaxtoQYI — Charan (@charantweetz) April 9, 2024 Em rasika raajuvo mari 💃😻#KurchiMadathapetti pic.twitter.com/KvL4Tx44om — ︎ ︎ (@VamsiPrince_) April 10, 2024 #MaheshBabu𓃵 craze in Orissa#KurchiMadathapetti pic.twitter.com/VCVeH4Oa9U — varapanakoushik Reddy (@varapanakoushik) April 12, 2024 🕋 రంజాన్ పండగా సందర్భంగా 🕋 🪑 #kurchimadathapetti 🪑 Song singing 🎤@shamna_kkasim dance 🔥🪑@urstrulyMahesh #MaheshBabu #GunturKaaram @MusicThaman @Kkdtalkies #SSMB29 pic.twitter.com/JZoclaAZnu — ⭐ god of tollywood ⭐ ssmb ⭐ (@kiranprinc31148) April 14, 2024 #KurchiMadathaPettiGoesGlobal 🌏🎵🔥#KurchiMadathaPetti 💥 pic.twitter.com/VM9okKzJ4v — thaman S (@MusicThaman) April 1, 2024 -
గుంటూరు కారం.. అంతా వేస్ట్ అయిపోయింది: జగపతిబాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతికి రిలీజైంది. సరిగ్గా అప్పుడే చిన్న చిత్రం హనుమాన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుంటూరు కారం చిత్రాన్ని వెనక్కు నెడుతూ హనుమాన్ సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మహేశ్ సినిమాకు కలెక్షన్స్ అయితే చూపెట్టారు కానీ అదే సమయంలో నెగెటివిటీ కూడా వచ్చింది. ఈ మూవీలో జగపతిబాబు విలన్‌గా నటించాడు. నిజం చెప్తున్నా తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేశ్‌బాబుతో పని చేయడం నాకెంతో ఇష్టం. కానీ నిజాయితీగా చెప్తున్నా.. గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే మూవీ చాలా డిఫరెంట్‌గా ఉండాల్సింది. క్యారెక్టర్లను ఇంకా మెరుగ్గా రాసుకోవాల్సింది. కానీ కొంతకాలానికే అంతా గందరగోళంగా మారింది. దీంతో సినిమా పూర్తి చేయడం కష్టమైంది. వేస్ట్ నేను చేయాల్సింది చేశాను. కానీ.. మహేశ్‌తో నా కాంబినేషన్ ఎప్పుడూ గొప్పగా ఉండాలనుకుంటాను. ఇలాంటి సినిమాల కోసం మా కాంబినేషన్‌ను వేస్ట్ చేయాలనిపించదు' అని చెప్పుకొచ్చాడు. జగపతిబాబు ప్రస్తుతం మిస్టర్ బచ్చన్, పుష్ప 2 సినిమాలు చేస్తున్నాడు. అలాగే తమిళంలో కంగువా, హిందీలో రుస్లాన్ సినిమాల్లో కనిపించనున్నాడు. చదవండి: ఒకప్పుడు రూ.500 అద్దె.. ఇప్పుడదే ఇల్లు కోరుకుంటున్న హీరో -
పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఫిక్సయిపోయిందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మంచి హై ఇచ్చే విజువల్స్.. అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. ఇప్పుడు బన్నీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ 'పుష్ప' మూవీని 2021 చివర్లో కేవలం తెలుగు వరకే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పెద్దగా ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఉత్తరాదిలో మాత్రం ప్రేక్షకులు 'పుష్ప' దెబ్బకు మెంటలెక్కిపోయారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) దీంతో 'పుష్ప 2' కాస్త లేట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉండిపోయింది. త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి శ్రీను.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడనిపిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే పుకార్లకు చెక్ పడినట్లయింది. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన త్రివిక్రమ్ ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) Wishing an amazing actor with great perseverance & dedication to achieve anything on and off screen, the stylish Icon Star of Indian cinema and National Award winner, Our @alluarjun garu a very Happy Birthday ❤️#HappyBirthdayAlluArjun 🌟 Can't wait to work with you again, sir.… pic.twitter.com/BhLfbaynwB — Haarika & Hassine Creations (@haarikahassine) April 8, 2024 -
కుర్చీ మడతపెట్టి పాట NBA గేమ్ హాఫ్‌టైమ్‌లో ప్లే చేసారు
-
సలార్ అయినా.. గుంటూరు కారం అయినా.. అదే చూడాల్సింది: నాగవంశీ కౌంటర్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమాపై ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది గుంటూరు కారంపై విమర్శలు కూడా చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన సినిమా రిలీజ్ సమయంలో వచ్చిన విమర్శలకు కౌంటరిచ్చారు. పెద్ద హీరోల సినిమాలకు లాజిక్‌లతో పనిలేదని ఆయన అన్నారు. స్టార్ హీరోల ఎలివేషన్స్ చూసి సినిమాను ఎంజాయ్ చేయాలన్నారు. నాగవంశీ మాట్లాడుతూ.. 'సలార్‌లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. కొందరు మాత్రం కొన్ని సీన్స్‌లో లాజిక్ లేదని కామెంట్స్ చేశారు. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా తరచుగా హీరో హైదరాబాద్ వెళ్లినట్లు చూపించారు. వెంటనే ఎలా వెళ్తాడని కొందరు కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం గుంటూరు టూ హైదరాబాద్ మూడున్నర గంటల జర్నీని సినిమాలో చూపించలేం కదా. కొందరైతే గుంటూరు కారంలో మాస్ సీన్స్ లేవని, త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని అన్నారు. కానీ ఓటీటీలో రిలీజ్ తర్వాత సినిమా చాలా బాగుందని మెసేజ్‌లు పెట్టారు' అని అన్నారు. గతంలో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాల్లో మాస్ సాంగ్స్ చేశారు. అందుకే గుంటూరు కారంలోనూ అలాంటి సాంగ్ ఉంటే బాగుంటుందని కుర్చినీ మడతపెట్టి పాటను పెట్టినట్లు నాగవంశీ తెలిపారు. ఇక్కడ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి కానీ.. ఆ టైమ్‌కు శ్రీలీల రావడం.. వెంటనే దుస్తులు మార్చుకోవడం లాంటి లాజిక్‌లు మాట్లాడకూడదని అన్నారు. సినిమాను కేవలం వినోదం రూపంలోనే చూడాలని.. ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న ఆయనకు సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదన్నారు. సినిమా బాగోలేదని కామెంట్ చేసే అర్హత ఎవరికైనా ఉంటుంది.. కానీ చిత్ర బృందంపై ఎవరు పడితే వారు మాట్లాడకూడదంటూ నాగవంశీ గట్టిగా బదులిచ్చారు. -
గుంటూరు కారం సాంగ్.. అంత భయంకరంగా ఉందన్న టీమిండియా స్టార్ క్రికెటర్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన భామ శ్రీలీల. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌కు అభిమానులకు అయితే ఏకంగా పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులకు ఫిదా కానీ వారు ఉండరేమో. అంతలా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది ఈ కన్నడ భామ. అయితే తాజాగా గుంటూరు కారం సాంగ్‌పై టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా శ్రీలీల, మహేశ్‌బాబు డ్యాన్స్‌కు తాను ఫిదా అయ్యానని వెల్లడించారు. ఓ అభిమానితో మాట్లాడుతూ గుంటూరు కారం సాంగ్‌ను ప్రస్తావించారు. మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్‌లో శ్రీలీల, మహేశ్ బాబు డ్యాన్స్ భయంకరంగా ఉందని అన్నారు. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్‌కు వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్ టైప్ చూడమని అశ్విన్ సలహా కూడా ఇచ్చాడు. మహేశ్ బాబు ఎక్స్ట్రార్డినరీ డ్యాన్సర్ అని.. అతనితో పాటు శ్రీలీల అదరగొట్టిందని అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సాంగ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీమ్‌కు ఊపు తీసుకొస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Cricketer @ashwinravi99 about #GunturKaaram 🔥@urstrulyMahesh @sreeleela14 pic.twitter.com/8mV2JNreU2 — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
'గుంటూరు కారం' విషయంలో బాధంతా వాళ్లదే: నిర్మాత నాగవంశీ
ఈసారి సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలోని హ్యాట్రిక్ మూవీ ఇది. విడుదలకు ముందు ఫ్యాన్స్.. ఓ రేంజు అంచనాలు పెంచేసుకున్నారు. కానీ టాక్ రివర్స్ అయిపోయింది. రూ.150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టుకుంది కానీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విషయంలో నిరాశపరిచింది. తాజాగా ఓ ఈవెంట్లో 'గుంటూరు కారం' మూవీ గురించి ప్రశ్న ఎదురవగా.. నిర్మాత నాగవంశీ విచిత్రమైన సమాధానమిచ్చారు. (ఇదీ చదవండి: బోల్డ్నెస్ గురించి ప్రశ్న.. బిర్యానీ, పులిహోర అని అనుపమ కౌంటర్స్) 'గుంటూరు కారం సినిమా విషయంలో మాకు ఎలాంటి బాధలేదు. బాధంతా కూడా మీడియాదే' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. ఈయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే పెట్టిన డబ్బులొచ్చేయని అన్నట్లే. కానీ రియాలిటీ చూసుకుంటే ఈ మూవీ మహేశ్ అభిమానులే చాలామందికి నచ్చలేదు. అలానే సినిమాని కొన్న చాలామంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయారని సమాచారం. కానీ నాగవంశీ మాత్రం మీడియా బాధంతా అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోంది. అలానే త్రివిక్రమ్-అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అప్డేట్ గురించి అడగ్గా.. మరో ప్రెస్‌మీట్ లో చెబుతానని మాట దాటవేశారు. సితార సంస్థ నుంచి త్వరలో రాబోతున్న మూవీ 'టిల్లూ స్క్వేర్'. 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‌గా తీసిన ఈ మూవీలో సిద్ధు, అనుపమ హీరోహీరోయిన్లుగా నటించారు. మల్లిక్ రామ్ దర్శకుడు. తొలి భాగంతో పోలిస్తే ఇందులో గ్లామర్, రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి దీని ఫలితం ఫస్ట్ పార్ట్‌కి మించి ఉంటుందా? లేదా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: సిల్క్ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని) -
ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరో ఐదేళ్ల బయట ఎక్కడా కనిపించడు. గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ మాట తెగ వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలో రాజమౌళితో మూవీ చేయబోతున్నాడు కాబట్టి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అందుకే తగ్గట్లే మహేశ్.. షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్, రాజమౌళితో మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నన్ను ప్రభావితం చేసి నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు మురారి,పోకిరి,శ్రీమంతుడు. ఈ మూవీస్.. నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. ఈ మూడింటిలానే ఆడియెన్స్‌కి నచ్చేలా, నైతిక అంశాలు ఉండేలాంటి కథల్ని ఎంపిక చేసకుంటూ వస్తున్నాను. అయితే ఇన్నేళ్ల ప్రయాణంలో సినిమా సక్సెస్ కావడంపై నా ఆలోచన విధాం కూడా మారింది. ఓ మూవీ హిట్ కావడానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది కూడా అంతే ముఖ్యం' (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) 'సినిమాలో కనిపించే ప్రతి పాత్రకు నెగిటివ్ ఛాయలు ఉంటాయి. కాబట్టి ప్రతి పాత్ర ఏదో ఓ నైతిక విషయాన్ని అంతర్లీనంగా చెబుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేను ఓ సినిమాని అంగీకరించిన తర్వాత ఆ పాత్రకు లొంగిపోతాతను. దర్శకుడు చెప్పినట్లు ఆ పాత్ర చేసుకుంటూ వెళ్లిపోతాను. ఆ పాత్రకు గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ.. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులు.. ఏది తప్పో ఒప్పో గుర్తించేంత పరిణతి సాధించారని అనుకుంటున్నారు. అలానే రాజమౌళి సర్‌తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మహేశ్ చెప్పుకొచ్చాడు. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు. కానీ సినిమా పూర్తిగా తేలిపోయింది. ఏ దశలోనూ అలరించలేకపోయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ అందరూ కూడా రాజమౌళితో మూవీపైనే గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. జంగిల్ అడ్వంచర్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీ కోసం మహేశ్ దాదాపు మూడేళ్ల కేటాయించినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) -
పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. త్రివిక్రమ్‌పై మళ్లీ ట్రోల్స్!
'గుంటూరు కారం' మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్‌ని మహేశ్ ఫ్యాన్స్ మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకిలా చేశారు అని తెగ బాధపడుతున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం రెండు ఫొటోల వల్లే వచ్చింది. మళ్లీ ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా 'గుంటూరు కారం' తీశారు. అప్పుడెప్పుడో 2021 మేలో లాంచ్ చేశారు. అప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డేని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. కానీ షూటింగ్ లేటు అయ్యేకొద్ది స్టోరీ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్ ఒక్కొక్కరుగా మారుతూ వచ్చారు. మరి పూజా హెగ్డేని తప్పించారో, తప్పుకొందో తెలీదు గానీ సినిమా నుంచి సైడ్ అయిపోయింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) దీంతో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. మొన్నీమధ్ సంక్రాంతికి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్‌ని మాములుగా ట్రోల్ చేయలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరో దఫా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అప్పట్లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్‌తో పాటు పూజా హెగ్డే కూడా కనిపించింది. ఈ ఫొటోల బట్టి చూస్తే శ్రీలీల చేసిన అమ్మూ పాత్ర పూజా చేయాల్సింది. మీనాక్షి చేసిన బుజ్జి పాత్ర శ్రీలీల చేయాలి. తాజాగా రిలీజైన ఫొటోల్లో పూజా లుక్ బాగుంది. దీంతో ఇంత మంచిగా ఉన్న హీరోయిన్ని ఎందుకు తీసేశార్రా బాబు అని నెటిజన్స్ దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. అదీ సంగతి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) -
శ్రీవారి సేవలో గుంటూరు కారం భామ.. వీడియో వైరల్!
కొత్త ఏడాదిలోనే హిట్ సినిమాతో బోణి కొట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరెకెక్కిన గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న ఈ కన్నడ బ్యూటీకి గుంటూరు కారంతో సక్సెస్ ట్రాక్‌లో వచ్చేసింది. తాజాగా ఈ పెళ్లిసందడి భామ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ..' గతంలో పెళ్లి సందడి సినిమా తర్వాత తిరుమలకు వచ్చా. ఇప్పుడు మళ్లీ నా కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నా కొత్త ప్రాజెక్ట్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తారు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. తిరుమలకు రావడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అందుకే వచ్చా' అని చెప్పుకొచ్చింది. #Sreeleela, "#GunturKaaram," Actress visited the esteemed Tirumala Tirupati Venkateswara Temple. During her pilgrimage, she participated in the VIP break darshan & offered her सेवा to Lord Venkateswara. The warm reception from temple authorities & blessings from pundits. pic.twitter.com/EUHVCxkj8p — Informed Alerts (@InformedAlerts) February 19, 2024 -
ఇది మహేష్ బాబు సినిమా నా ? పరుచూరి సంచలన కామెంట్స్
-
డ్యాన్స్‌తో కుర్చీ మడత పెట్టేసిన 'మహేశ్ బాబు' అన్న కూతురు
మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం 'గుంటూరుకారం'. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం యూత్ నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు మెప్పించింది. మొదట ఈ సినిమా బాగాలేదని అన్నవారితోనే కొన్నిరోజుల తర్వాత మళ్లీ చూసి.. అరే సినిమా బాగుందే అనే కితాబు ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని భారీగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని కుర్చీ మడత పెట్టి అనే పాట ఒక రేంజ్లో హిట్ అయింది. ఈ పాట నుంచి మిలియన్ల కొద్ది రీల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కూతురు భారతి కూడా చేరింది. భారతి ఘట్టమనేని చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన బాబాయ్ మహేశ్ పాటకు భారతి వేసిన స్టెప్పులు ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే ఇదే పాటకు మహేశ్ కూతురు సితార కూడా ఒక రీల్ చేసింది. అప్పుడు కూడా సితార వేసిన స్టెప్పులకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ తన అన్న కూతురు భారతి కూడా కుర్చీ మడత పెట్టేసింది. ప్రస్తుతం ఆమె ఫారిన్లో చదువుకుంటున్నట్లు సమాచారం. రమేశ్ బాబు కూడా తన తండ్రి కృష్ణతో కలిసి పలు సినిమాల్లో కనిపించారు. చివరిగా ఎన్కౌంటర్ అనే చిత్రంలో తండ్రితో కలిసి నటించిన రమేశ్‌బాబు తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ కొంత కాలం తర్వాత తన సోదరుడు అయిన మహేశ్‌తో కలిసి అర్జున్, అతిథి చిత్రాలను నిర్మించాడు. కానీ ఆయన పిల్లలు భారతి, జయ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ తాజాగా భారతి చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీలీల రేంజ్లో దుమ్మురేపిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతలా ఆమెపై పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్న ఆ సాంగ్‌ను మీరూ చూసేయండి. View this post on Instagram A post shared by Bhar Ghats (@bharathighattamaneni) -
‘గుంటూరు కారం’లో అది మిస్ అయింది.. ఈ టైటిల్ పెడితే బాగుండేది: పరుచూరి
మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది మహేశ్ బాబు రేంజ్ సినిమా కాదని, త్రివిక్రమ్ బలమైన కథను రాసుకోలేకపాయడనే విమర్శలు కూడా వచ్చాయి. కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెటిఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న గుంటూరు కారం చిత్రంపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ. ఇది మహేశ్ బాబు స్థాయి సినిమా కాదని, టైటిల్ కూడా అలా పెట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘350 చిత్రాలకు పైగా పని చేసిన నాకు ‘గుంటూరు కారం’ కథనం కాస్త కన్ఫ్యూజ్గా అనిపించింది.ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. రెండోసారి చూస్తే స్పష్టత ఉండొచ్చేమో. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేతో ఆడుకున్నాడు. గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో ఇందులోని హీరో పాత్రను అలా క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ మంచి టైటిల్స్ పెడతారు. ఆయన సినిమాన్నింటిలో ఇది కొంత తేడాగా అనిపించింది. తల్లి వద్దనుకుంటే.. సంబంధిత డాక్యుమెంట్స్‌పై హీరో సంతకం పెడతాడా, లేదా? అనే పాయింట్ చుట్టు ఈ కథ అల్లుకున్నాడు. అయితే ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంట్ పండలేదు. అలాగే తాత మనవళ్ల సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. హీరో అమ్మను దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్ చేయలేడు, ఇబ్బంది పెట్టలేడు. సెంటిమెంట్ ప్రధానంగా సినిమాని తీద్దామనుకుంటే ఈ టైటిలే తప్పు. ‘గుంటూరు వారి అబ్బాయి’ అని పెట్టి ఉంటే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుని ఉండేవారు. గుంటూరు కారం.. పేరుకు సరిపోయేలా స్క్రీన్‌ప్లేని సెట్ చేశారు. సంతకం పెట్టించేందుకు హీరోయిన్.. హీరో ఇంటికొచ్చి, ప్రేమలో పడేయాలనుకుంటుంది. ఇది పాజిటివ్ దృక్పథం కాదు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్‌నే డెవలప్ చేసుకుంటూ వెళ్లి ఉంటే ఈ సినిమా మరో విధంగా ఉండేది. అని పరుచూరి అభిప్రాయ పడ్డాడు. -
గుంటూరు కారం సాంగ్.. అలాంటి వారిపై మండిపడ్డ యాంకర్ రష్మీ!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన చిత్రాల్లో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో సీనియర్ నటి పూర్ణ సైతం స్టెప్పులతో అదరగొట్టింది. శ్రీలీల ఎక్కువగా హైలెట్ అయింది. అయితే ఈ పాటకు బుల్లితెర యాంకర్ రష్మీని ఎంపిక చేయాలనుకున్నట్లు ఓ వార్త నెట్టింట వైరలైంది. పూర్ణ ప్లేస్‌లో రష్మీ గౌతమ్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ అందుకు రష్మీ నో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా వీటిపై రష్మీ స్పందించింది. ఇలాంటి ఫేక్ వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడింది. అంతే కాదు.. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అందువల్లే తనను ఎవరు రిజెక్ట్ చేయలేదని తెలిపింది. అంతే కాదు.. ఆ పాత్రలో పూర్ణ అద్భుతంగా చేశారని కొనియాడింది. ఇలాంటి తప్పుడు వార్తలతో నెగెటివిటీని ప్రచారం చేయవద్దని కోరింది. ఎవరు కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రోత్సహించవద్దని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రష్మీ చివరసారిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి పక్కన ఓ పాటలో అలా మెరిసింది. This news is absolutely baseless I was not approached so no scope for rejection Also poorna garu did an absolute fab job no one else could have done it better Fake news like these might bring unwanted negativity towards me kindly do not encourage such news pic.twitter.com/QywBUN76Te— rashmi gautam (@rashmigautam27) February 13, 2024 -
ఓటీటీలో గుంటూరు కారం.. ఆ విషయంలో ఆడియన్స్ ఫుల్ డిసప్పాయింట్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 9న ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్ వర్షన్లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్లలో రిలీజైన నెలలోపే గుంటూరు కారం స్ట్రీమింగ్కు వచ్చేసింది. దీంతో ఓటీటీలోనూ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. డబ్బింగ్ వర్షన్‌పై మాత్ర పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా శాండల్‌వుడ్ ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో గుంటూరు కారం సినిమా కన్నడ వర్షన్‌పై కన్నడ ప్రేక్షకులు అసంతృప్తి చేస్తున్నారు. ట్రాన్స్లేషన్తో పాటు వాయిస్ ఓవర్ కూడా అసలు బాగాలేదని సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద సినిమా అయినప్పటికీ డబ్బింగ్‌ను తూతూ మంత్రంగా కానిచ్చేశారని మండిపడుతున్నారు. గుంటూరు కారం తమిళ డబ్బింగ్ వర్షన్లో కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ సినిమాలో ఆడియన్స్‌ను ఓ రేంజ్లో ఊపేసిన మాస్ సాంగ్ ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ డబ్బింగ్ వర్షన్లో పేలవంగా ఉందని మరికొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అన్ని భాషల్లో ఒరిజినల్ సాంగ్ ఉంటేనే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌లో గుంటూరు కారం నెట్‌ప్లిక్స్‌లో దూసుకెళ్తోంది. Guntur Kaaram has to be the worst Kannada dubbed movie recently in terms of both writing and voice artists selection. Absolutely pathetic. Original was movie was bad and this dubbing quality made it even worse.#GunturKaaram — Mal-Lee | ಮಲ್ಲಿ (@MallikarjunaNH) February 9, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన 'గుంటూరు కారం'.. ఆ వర్షన్లో మరింత క్రేజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం సుమారు రూ. 280 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. మహేశ్ కెరీర్లోనే మూడోసారి రూ. 200 కోట్ల మార్క్‌ను ఈ చిత్రంతో అందుకున్నారు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా సూపర్ కొట్టి టాలీవుడ్లో తన రేంజ్ ఏంటో మరోసారి చూపించాడు ప్రిన్స్ మహేశ్.. ఆయన క్రేజ్‌కు తగ్గట్లే గుంటూరు కారం ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో నేడు ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. హిందీలో క్రేజ్ టాలీవుడ్ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్,తారక్,రామ్ చరణ్ వంటి స్టార్స్ బాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మహేశ్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన SSMB29 చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళితో ప్లాన్ చేశారు. ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఇలాంటి సమయంలో నెట్ ఫ్లిక్స్ ద్వారా 'గుంటూరు కారం' చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా చూసిన ఆయన అభిమానులు ఇప్పుడు హిందీలో మరోసారి రమణగాడిని చూస్తున్నారు. Hindi version of Kurchi madathapetti song from Guntur Kaaram ain’t bad 🪑🔥 @MusicThaman#GunturKaaramOnNetflix pic.twitter.com/76YumZyRCy — Satvik (@SatvikV1) February 8, 2024 Dum Masala Biryani Erra Kaaram Ara kodi ready ga pettukoni full ga enjoy chese Guntur Kaaram vacchesindhi 🤤 Guntur Kaaram, now streaming on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.#GunturKaaramOnNetflix pic.twitter.com/ROm8FYyjcU — Netflix India South (@Netflix_INSouth) February 8, 2024 -
'గుంటూరు కారం' క్రేజీ సాంగ్.. ఇలా కూడా వాడేస్తున్నారా?
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఫ్యాన్స్ భారీ అంచనాల నడుమ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్ సంగీతమందించారు. అమెరికాలోనూ తగ్గని క్రేజ్.. అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. 'కుర్చీని మడతబెట్టి' అనే పాట చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు ఈ సాంగ్‌కు స్టెప్పులు వేయని వారు ఉండరేమో. అంతలా వైరలైంది గుంటూరు కారం సినిమాలోని పాట. ఇప్పుడు ఇండియాలోనే కాదండోయ్.. కుర్చీ సాంగ్ ఫీవర్ కాస్తా అమెరికాకు చేరింది. ఏకంగా ఈ పాటకు స్టెప్పులు వేయడమే కాదు.. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్ ప్లే అవుతుండగా ట్యూన్‌కు తగ్గట్టుగా వర్కవుట్ చేస్తూ కనిపించారు. కుర్చీని మడతపెట్టి.. వార్మప్ అంటూ ఎంజాయ్ చేస్తోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్ బాబుగారి "గుంటూరు కారం" సినిమా హిట్ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ అమెరికాలో మాత్రం ఇదీ పరిస్థితి ఇప్పుడు 👇😊#GunturKaaram #GunturKaaramCelebrations pic.twitter.com/TF9XtYr87y — Prakash Arige (@prakasharige) February 7, 2024 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే చాలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న దానిపై ఆసక్తితో ఉంటారు ఆడియన్స్. అలాగే ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ వారంలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైపోయాయి. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ ఈ వీకెండ్లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పెడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. మరీ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఓ లుక్కేయండి. అంతే కాకుండా ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ ఈగల్ వచ్చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న యాత్ర-2 ఈ వారంలోనే థియేటర్లకు రానుంది. ఈనెల 8న యాత్ర-2 థియేటర్లలో విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 సన్ నెక్ట్స్ అయలాన్- (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి 09 -
మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ.. ఎక్కడ తేడా కొట్టిందంటే!
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి) అయితే ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది బిగ్‌బాస్ సోహెల్ హీరోగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన చిత్రాలు ఫ్లాఫ్ కావడంపై స్పందించారు. అదే క్రమంలో ఇటీవలే రిలీజైన మహేశ్ బాబు గుంటూరు కారం సక్సెస్ కాకపోవడంపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అక్కడే తేడా కొడుతుందని అన్నారు. అప్పటి టాప్ హీరోల చిత్రమైనా.. గుంటూరు కారం సినిమా అయిన ఇదే జరుగుతుందన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు స్టార్డమ్కు తగినట్లుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ భావించారు. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. కథను బేస్ చేసుకునే సినిమాలు తీయాలి. అంతేకానీ స్టార్‌డమ్‌ను నమ్ముకుంటే అక్కడే తేడా కొడుతుంది. నా సినిమా యమలీల అందుకే పెద్ద హిట్ అయింది. కానీ మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.' అని అన్నారు. -
ఓటీటీలోకి గుంటూరు కారం..స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
-
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ మూడు మాత్రం స్పెషల్!
మరోవారం రానే వచ్చింది. వీకెండ్ ముగియడంతో సినీ ఆడియన్స్ ఎప్పటిలాగే వర్క్ మోడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో ఓటీటీల్లో వచ్చే సినిమాల కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. కాగా.. గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఒకటి, రెండు చిత్రాలు మినహా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వచ్చేవారంలో ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారంలో ముఖ్యంగా సంక్రాంతికి సందడి చేసిన సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులో మహేశ్ బాబు గుంటూరు కారం, కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ కెప్టెన్ మిల్లర్, కన్నడ స్టార్ దర్శన నటించిన కాటేరా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటితో భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్ భక్షక్, సుస్మితా సేన్ ఆర్య-3 వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతున్నాయి. అంతే కాకుండా ఈ వారంలో మాస్ మహారాజా నటించిన ఈగల్ థియేటర్ల వద్ద సందడి చేయనుంది. మరీ ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05 ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్డమ్ - ఫిబ్రవరి 05 మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05 మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05 ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05 లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07 రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07 లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07 వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-0 9 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా ది ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్) - ఫిబ్రవరి 6 ది నన్ 2 - ఫిబ్రవరి 7 హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 -
కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్..
-
Guntur Kaaram OTT Release Date: గుంటూరు కారం ఓటీటీ డేట్ వచ్చేసింది!
సంక్రాంతికి రిలీజైన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన సైంధవ్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే! తాజాగా మహేశ్‌బాబు మాస్ మసాలా మూవీ గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. వారం రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్లో.. ఇది చూసిన ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. రౌడీ రమణ వచ్చేస్తున్నాడ్రోయ్.. అని సంబరపడుతున్నారు. గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజైంది. చాలారోజుల తర్వాత మహేశ్ ఫుల్ మాస్ లుక్కులో కనిపించాడు. కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో స్టెప్పులైతే ఇరగదీశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజైన మొదటి వారంలో రూ.212 కోట్లు రాబట్టింది. తమన్ సంగీతం అందించగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించాడు. కథేంటంటే? జనదళం పార్టీ నాయకుడు వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాటా మధు (రవి శంకర్) తనకే మంత్రి పదవి కావాలంటాడు. అందుకు ఒప్పుకోకపోతే వసుంధరకు మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని, రెండో పెళ్లి విషయాన్ని బయటపెడతానని బెదిరిస్తాడు. దీంతో ముందు జాగ్రత్తగా సూర్యనారాయణ.. వసుంధ మొదటి భర్త కొడుకు రమణ(మహేశ్‌బాబు)ను పిలిచి.. తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్‌పై సంతకం చేయాలంటాడు. ఇందుకు రమణ ఒప్పుకోడు. గుంటూరులో ఉంటూ మిర్చి యార్డ్ నడిపిస్తూ ఉంటాడు. అసలు వసుంధర మొదటి భర్తకు ఎందుకు విడాకులిచ్చింది? రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? చివరకు రమణ తన తల్లి ప్రేమ పొందాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
మహేశ్ 'కుర్చీ మడతపెట్టి..' వీడియో సాంగ్ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేశ్‌బాబును ఊర మాస్ లుక్కులో చూడాలన్న అభిమానుల ఆశ గుంటూరు కారంతో నెరవేరింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. మహేశ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఫుల్ ఎనర్జీతో సాంగ్ ఏదైనా ఉందా? అంటే అది కుర్చీ మడతపెట్టి పాటే.. ఆ మధ్య ఈ పాట లిరికల్ వీడియో రిలీజ్ చేయగా.. అందులో అక్కడక్కడా వచ్చే మహేశ్ స్టెప్పులు చూసి మురిసిపోయారు ఫ్యాన్స్. ఈ వీడియో ఇప్పటివరకు 81 మిలియన్ల వ్యూస్ రాబట్టి అదరగొట్టింది. తాజాగా కుర్చీ మడతపెట్టి.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇందులో మహేశ్ ఎనర్జీ, జోష్ వేరే లెవల్ అంతే! తమన్ సంగీతమందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ రాశాడు. సాహితి చాగంటి, శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. మరి మీరు కూడా ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి.. చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ! -
సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?
సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'హనుమాన్' తప్పితే మిగతావన్నీ సైలెంట్ అయిపోయాయి. ఈ శుక్రవారం దాదాపు 8-10 వరకు తెలుగు చిన్న మూవీస్ అన్నీ ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. అలానే రాబోయే రెండు మూడు నెలల్లో పెద్ద చిత్రాలేం లేవు. దీంతో మూవీ లవర్స్ దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. కొత్తగా ఏమున్నాయి? సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయని తెగ సెర్చ్ చేస్తున్నారు. 'గుంటూరు కారం' విషయానికొస్తే.. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమాకు రిలీజ్‌కి ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్, రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల ప్రేక్షకులు మరీ అంత కాకపోయినా సరే లైట్ తీసుకున్నారు. మహేశ్ యాక్టింగ్ తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏం లేదని చెప్పొచ్చు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగు వారాల అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) 'హనుమాన్' విషయానికొస్తే.. మహేశ్ మూవీతో పాటు జనవరి 12న రిలీజైన ఈ చిత్రంపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల సమస్య వల్ల తొలివారం పర్లేదు గానీ ఆ తర్వాత కలెక్షన్స్ దుమ్మురేపాయి. ఇప్పటికే రూ.250 కోట్ల వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. లెక్క ప్రకారం థియేటర్లలోకి వచ్చిన మూడు-నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేలా డీల్ మాట్లాడుకున్నారు. కానీ టాక్-రెస్పాన్స్ చూసి ప్లాన్ మారింది. మార్చి 2 లేదా 3వ వారం ఓటటీలోకి రావొచ్చని టాక్. జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్'.. ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. కంటెంట్, స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల్ని ఇది అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటింంచేశారు. నాగార్జున 'నా సామి రంగ' పెద్దగా అంచనాల్లేకుండా సంక్రాంతి బరిలో దిగి పాసైపోయింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ రూమర్ డేట్స్ అయినప్పటికీ త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) -
కుర్చీ తాత అరెస్ట్ బండారం మొత్తం బట్టబయలు చేసిన వైజాగ్ సత్య
-
అలాంటి సీన్స్ ఉంటే చేస్తా.. కానీ: గుంటూరు కారం భామ
ఇటీవలే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో తనదైన నటనతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. అయితే తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది ముద్దుగుమ్మ. అవకాశం వస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయని వెల్లడించింది. (ఇది చదవండి: ఓటీటీలో యానిమల్.. నెట్‌ఫ్లిక్స్‌పై నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే?) మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..' మహేశ్ బాబుతో ఛాన్స్ అనగానే నా సంతోషానికి అవధులు లేవు. తొలి రోజే సెట్లో ఆయనతోనే నటించా. మొదట కంగారు పడ్డా. కానీ టెన్షన్ పడకుండా ఇంకాస్తా సమయం తీసుకోమని మహేశ్ నాకు ధైర్యం చెప్పారు. కానీ సినిమాల్లో నా కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నా. తెరపై ముద్దు సీన్స్‌కు సంబంధించి కొన్ని రూల్స్ కచ్చితంగా పాటిస్తా. స్క్రిప్ట్ డిమాండ్‌ను చేస్తే తప్ప అలాంటి వాటికి ఒప్పుకోను. అది కూడా మరీ అసభ్యకరంగా లేకుంటేనే చేస్తా. కేవలం కిస్ సీన్స్ కోసమే అంటే కచ్చితంగా నో చెప్పేస్తా.' అంటూ తన మనసులోని మాటలను పంచుకుంది. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నా పట్ల ఎంతో ఆప్యాయతను చూపిస్తున్నారని తెలిపింది. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలు చేయాలనేదే తన కోరికని వెల్లడించింది. అందువల్లే కథల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. రెమ్యునరేషన్ కంటే.. నటనకే ప్రాధాన్యత ఇస్తానని అంటోంది మీనాక్షి చౌదరి. కాగా.. తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంలో పరిచయమైంది. ఆ తర్వాత రవితేజ సరసన 'ఖిలాడి', అడివి శేష్‌తో కలిసి 'హిట్ 2' సినిమాలతో హిట్స్ సాధించింది. -
కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్
కుర్చీ తాత.. రెండు మూడు రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతడు.. 'గుంటూరు కారం'లోని ఓ పాట వల్ల మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ సడన్‌గా కుర్చీ తాతని అరెస్ట్ చేశారనే విషయం నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఓ యూట్యూబర్ కేసు పెట్టడంతోనే ఇలా జరిగింది. ఇప్పుడు సదరు యూట్యూబర్.. కుర్చీ తాత బండారం మొత్తం బయటపెట్టాడు. (ఇదీ చదవండి: దిగ్గజ హీరోయిన్ కన్నుమూత.. కారణం ఏంటంటే?) హైదరాబాద్‌లోని కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ బతికే ఈ ముసలాయన.. ఓ ఇంటర్వ్యూలో 'కుర్చీ మడతపెట్టి..' అనే బూతు డైలాగ్ చెప్పి అలా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ పదాన్ని 'గుంటూరు కారం' కోసం తమన్ ఉపయోగించుకున్నాడు. అందుకు గానూ సదరు కుర్చీ తాతకు డబ్బులు కూడా ఇచ్చాడు. అయితే ఈ తాతకి గత కొన్నాళ్ల నుంచి సాయం చేస్తున్న వైజాగ్ సత్యనే ఈయనపై కేసు పెట్టాడు. అలానే అసలేం జరిగిందో మొత్తం చెప్పాడు. 'ఈయన(కుర్చీ తాత) అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టే టైప్. 'గుంటూరు కారం' సినిమాలోని పాటలో ఆయన డైలాగ్ పెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గరికి నేనే తీసుకెళ్లాను. తమన్‌తో మాట్లాడిన తర్వాత ఈ డైలాగ్ సినిమాలో పెట్టుకున్నారు. కుర్చీ తాతకు రూ.20 వేలు సాయం కూడా చేశారు. తర్వాత 'గుంటూరు కారం' స్పూఫ్ కాన్సెప్ట్‌తో తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేయించాను. వాళ్లు రూ.5 వేలు ఇచ్చారు. అలా చిన్న చిన్న ఇంటర్వ్యూలు అవి చేసుకుంటూ బాగానే సంపాదించుకున్నాడు. అక్కడితో హ్యాపీగా ఉన్నాడని అనుకున్నాం. కానీ మహేశ్ బాబు దగ్గరికి నన్ను తీసుకెళ్లు.. నాకు ఇల్లు ఇప్పించు, ప్లాట్ ఇప్పించు అని నన్ను సతాయించాడు' (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) 'అయితే మహేశ్‌బాబు నీకెందుకు ప్లాట్ ఇస్తాడని కుర్చీ తాతతో నేను అన్నాను. 'గుంటూరు కారం'తో ఆయన రూ.300 కోట్లు సంపాదించాడు. నాకు ప్లాట్ ఇప్పించు అని నన్ను ఒకటే ఇబ్బంది పెట్టాడు. ఆయనెందుకు నీకిస్తారు. ఒకవేళ డబ్బులొచ్చిన ప్రొడ్యూసర్‌కి వస్తాయి గానీ ఆయనకు వస్తాయా అని అడిగాను. దీంతో పగబట్టి.. నా మీద బ్యాడ్ వీడియోలు చేశాడు. సత్య ఓ దొంగ, నా మీద లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. వాడి కాలు తీసేస్తా, చేయి తీసేస్తా, వాడిని మర్డర్ చేసేస్తా.. మా సొంత బావమరిదినే కుర్చీ మడతపెట్టి చంపేసా అని పిచ్చిపిచ్చిగా వీడియోలు చేశాడు' 'ఇక కుర్చీ తాత మీద నాకు చిరాకొచ్చింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. దీంతో పోలీసులు.. కుర్చీ తాతని మడతపెట్టేశారు. తీసుకెళ్లి బాగా కోటింగ్ ఇచ్చారు. అయితే స్టేట్మెంట్లో మాత్రం.. వైజాగ్ సత్య చాలా మంచోడు, నా గాడ్ ఫాదర్ లాంటోడు.. కాకపోతే యూట్యూబర్సే నాకు మందు ఇచ్చి సత్యని తిట్టించారని చెప్పాడు. ఈ రోజు నుంచి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు' అని యూట్యూబర్ సత్య చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా చూస్తుంటే కుర్చీ తాతకి కాస్త ఫేమ్ వచ్చేసరికి ఇగో ఎక్కువైపోయింది. దీంతో ఇన్నాళ్లు తన పక్కనున్న వాళ్లే అరెస్ట్ చేయించారు. అలానే పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇతడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా?) -
‘గుంటూరు కారం’ ఎఫెక్ట్.. ‘గురూజీ’కి బన్నీ షాక్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా, డైరెక్టర్ అయినా హిట్ లేకుంటే అంతే సంగతి. ఒకటి రెండు ఫ్లాప్స్ వచ్చాయంటే ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టేస్తుంది. డైరెక్టర్ల విషయం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓ స్టార్ హీరోతో తీసిన సినిమా ఫ్లాప్ అయిందంటే.. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ ఖాతాలోకే వెళ్తుంది. అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకు రారు. తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో అదే జరిగినట్లు తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్ గురుజీపై బాగానే పడినట్లు అనిపిస్తుంది. (చదవండి: భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్.. ఎన్టీఆర్‌కి పెద్ద భారమే!) ఈ చిత్రం విడుదలకు ముందు.. అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు త్రివిక్రమ్ ప్రకటించాడు. అయితే సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ‘గుంటూరు కారం’ చిత్రానికి కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ.. సినిమాకు తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వినిపిసించింది. ఇందులో త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి. మహేశ్ కారణంగా సినిమాకు ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చాయని సినీ పండితులు అభిప్రాయపడ్డారు. మహేశ్ లాంటి స్టార్ హీరోని త్రివిక్రమ్ సరిగా వాడుకోలేకపోయాడని నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఇవన్నీ చూసిన బన్నీ.. తివ్రిక్రమ్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా?) పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి-అల్లు అరవింద్ కాంబోలో సినిమా రాబోతుందని గీతా ఆర్ట్స్ అఫిషియల్‌గా ప్రకటించింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ అల్లు అర్జున్‌తోనే బోయపాటి సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బన్నీకి బోయపాటి కథ వినిపించాడట. ఆయన ఓకే చెప్పిన తర్వాత గీతా ఆర్ట్స్ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. అంట్లీతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే బోయపాటి మూవీ ఉంటుందని మరో ప్రచారం సాగుతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు సందీప్ రెడ్డి వంగాతో కూడా బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇవన్నీ వరుసగా రాబోతున్న చిత్రాలు. ఈ లెక్కన చూస్తే.. ఇప్పట్లో త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా రావడం కష్టమే. -
గుంటూరు కారం ఎఫెక్ట్..త్రివిక్రమ్ నుండి స్టార్ హీరో యూ టర్న్
-
గుంటూరు కారం ఫేమస్ సాంగ్.. కుర్చీ తాతను మడతపెట్టేశారు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసింది. అయితే ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌పై నెట్టింట రీల్స్ కూడా తెగ వైరలయ్యాయి. ఎందుకంటే ఈ డైలాగ్ ఓ తాత చెప్పింది కావడంతో సినిమాకు క్రేజ్‌ను తీసుకొచ్చింది. అలాగే ఈ డైలాగ్ సినిమాలో పెట్టినందుకు కుర్చీ తాతకు లక్ష రూపాయలు సాయం కూడా అందించారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడతపెట్టి సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన కుర్చీ తాత.. తాజాగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నటి స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమను బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నారని.. తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైజాగ్ సత్య పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఉంటాడు. ఇతనికి భార్య, కొడుకులు, కూతురు ఉన్నారు. అయితే ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతుంటారు. అయితే యూట్యూబ్ ఛానల్స్ అతన్ని వైరల్ చేయడంతో పాపులర్ అయ్యారు. -
అతన్ని కలిసేందుకే జర్మనీ వెళ్లిన మహేశ్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కొద్దిరోజుల క్రితం జర్మనీ వెళ్లారు. గుంటూరు కారం సినిమా విడుదల తర్వాత ఆయన వెళ్లడం జరిగింది. సాధారణంగా విదేశాలకి వెళ్లినప్పుడు మహేశ్ బాబు కుటుంబంతో కలిసి వెళ్తారు.. కానీ ఈసారి ఒక్కరే వెళ్లడంతో చాలామంది అతని పర్యటన మీద పలు ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా రాజమౌళి సినిమా కోసం తన లుక్, మేకోవర్ గురించిన సాంకేతికపరమైన విషయాల గురించి వెళ్లారని వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో SSMB29 త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా మహేశ్ ఒక ఫోటో షేర్ చేసి తాను ఎందుకు జర్మనీ వెళ్లారో చెప్పకనే చెప్పారు. మహేశ్ జర్మనీకి వెళ్ళింది ఒక డాక్టర్‌ను కలుసుకోవడం కోసమని తెలిసింది. అయితే ఆ డాక్టర్‌ను మహేశ్ కలుసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు కలిశారు. దీంతో ఆ డాక్టర్ ఎవరు? ఆయన దగ్గర ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో వస్తున్నాయి. జర్మనీలోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆ డాక్టర్ పేరు 'హరీ కొనిగ్'. ఆయన బాడీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన డాక్టర్. అక్కడ ఆయనకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహేశ్ కూడా తన బాడీ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెడతారనే విషయం అందరికీ తెలిసిందే.. గుంటూరు కారం చిత్రం సమయం నుంచే ఆయన SSMB29 కోసం కసరత్తులు ప్రారంభించారు. ఆ వర్కౌట్ ఫోటోలు అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఆయన పోస్ట్ చేస్తుంటారు కూడా.. రాజమౌళి సినిమా కోసం తన బాడీ ఫిట్నెస్ గురించే ఆ డాక్టర్‌ను కలిసేందుకు జర్మనీ వెళ్లినట్లు తెలస్తుంది. రాజమౌళి - మహేశ్ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించిన కథ వర్క్ పూర్తి అయిందని రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ వేసవి నుంచి షూటింగ్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Dr. Harry König (@drharrykoenig) -
ఆ విషయం డైరెక్టర్ చెప్పగానే వణికిపోయా.. గుంటూరు కారం హీరోయిన్!
దళపతి, తమిళ స్టార్ హీరో విజయ్‌తో జత కట్టే అవకాశం అంత సులభంగా రాదు. అలా వచ్చిందంటే ఆమె లక్కీ హీరోయినే. తాజాగా ఆ ఛాన్స్ గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరిని వరించింది. విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్‌ఆల్ టైం(GOAT). ఈ చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అయితే తాజాగా విజయ్ చిత్ర షూటింగ్లో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. విజయ్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్‌తో కలిసి ఓ పాటకు డాన్స్ చేయనున్నట్లు దర్శకుడు ముందుగా చెప్పగానే నాకు దడ మొదలైందని అన్నారు. దీనికి కారణం ఆయన గొప్ప డాన్సర్ కావడమేనని పేర్కొన్నారు. అయితే విజయ్ మాత్రం తనతో చాలా ఉన్నతంగా నడచుకున్నారని చెప్పారు. ఆయనకు తాను కూడా వీరాభిమానిని అన్నారు గుంటూరు కారం భామ. విజయ్ షూటింగ్ స్పాట్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని.. చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పారు. ఆయనతో కలిసి నటించడం సరికొత్త అనుభవమని పేర్కొన్నారు. కాగా.. మైక్ మోహన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, ప్రేమ్‌జీ, వైభవ్ అరవింద్ ఆకాష్, నటి స్నేహ, లైలా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక మీనాక్షి సినిమాల విషయాకొనిస్తే.. ప్రస్తుతం టాలీవుడ్లో మీనాక్షి చౌదరి బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇంతకుముందే విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన కొలై చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అదే విధంగా ఆర్జే బాలాజీ సరసన నటించిన సింగపూర్ సెలూన్ చిత్రం ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది. -
కీరవాణితో కలిసి థియేటర్లో సినిమా చూసిన జక్కన్న
కొన్ని సినిమాలు ఏకపక్షంగా పాజిటివ్ టాక్‌తో బీభత్సమైన వసూళ్లు రాబడతాయి. కానీ కొన్ని మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ భారీగానే కలెక్షన్స్ సాధిస్తాయి. గుంటూరు కారం సినిమా ఈ కోవలోకే వస్తుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో సినిమా చూసిన జక్కన్న మొదటివారంలో ఈ సినిమా రూ.212 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి పండగను మహేశ్ బాగానే వాడేసుకున్నాడు. తాజాగా ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించాడు. ఏఎమ్‌బీ థియేటర్లో కీరవాణితో కలిసి సినిమా చూశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేచి నిలబడ్డాడు.. వెళ్లిపోయాడా? అందులో జక్కన్న లేచి నిలబడగా కీరవాణి సీటులోనే కూర్చున్నాడు. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 'కీరవాణి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏదో తేడాగా ఉంది? కొంపదీసి నిద్రపోయాడా? థమన్ సంగీతానికి నిద్రొచ్చేసినట్లుంది..', 'జక్కన్న రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడా?', 'సినిమా పూర్తిగా చూడకుండానే లేచి వెళ్లపోయినట్లున్నాడు' అని సెటైర్లు వేస్తున్నారు. Video #GunturKaaram #SSRajamouli 👍 pic.twitter.com/nkaUnwaKWv — Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) January 20, 2024 చదవండి: గుండెపై పచ్చబొట్టు.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన నటి! అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం -
అనాధ పిల్లల కోసం మరోసారి మంచి మనసు చాటుకున్న సితార
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే మహేశ్ తన సొంత గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేస్తూనే వందల మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు ఉచింతంగానే చేపించారు. అలా తన గొప్ప మనసు చాటుకుంటూ సినిమాలతో పాటు మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి బాటలోనే సితార కూడా అడుగులు వేస్తుంది. కొన్ని నెలల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఆ విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించిన సితార వారితో సరదాగా మాట్లాడటమే కాకుండా వారితో కేక్ కూడా కట్ చేపించారు. ఒక జ్యువెలరీ యాడ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం ఒక చారిటీ కోసం విరాళంగా ఇచ్చేశారు. తాజాగా సితార అనాధ పిల్లలతో కొంత సమయం గడిపారు. ఆపై మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాను వారందరికి చూపించారు. మొదటిరోజు ఈ సినిమాపై నెగటివ్ టాక్ వచ్చినా తర్వాత సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా గుంటూరు కారం కనెక్ట్ అయింది. ఇప్పుడు అనాధ పిల్లల కోసం హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్లో స్పెషల్ షో ఏర్పాటు చేసింది. ఏఎంబీలో అత్యంత లగ్జరీ స్క్రీన్‌లో వారు సినిమా చూసేలా ఏర్పాటు చేసింది. (ఇదీ చదవండి: అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం) గతంలో హీరోయిన్ సమంత కూడా హాయ్ నాన్న చిత్రాన్ని అనాధ పిల్లలకు చూపించారు. వారి కోసం ఆమె ఒక స్పెషల్ స్క్రీన్‌ను బుక్ చేసి ఏర్పాట్లు చేశారు. తాజాగా సితార కూడా తన తండ్రి చిత్రం అయిన గుంటూరు కారం అనాధ పిల్లలకు చూపించి నెటిజన్ల నుంచి అభినందనలు పొందుతుంది. View this post on Instagram A post shared by Mahesh Babu FC (@_urstrullymahesh_) -
ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' హవా కాస్త తగ్గింది. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో కొన్నిచోట్ల 'హనుమాన్' కనిపిస్తోంది. ఇకపోతే సంక్రాంతి కానుకగా రిలీజైన మహేశ్ సినిమా.. ఊహించని విధంగా బెన్ ఫిట్ షోల నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా టాక్ ఏం మారలేదు. అయితే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ విషయంలో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 'గుంటూరు కారం' సినిమాలో మహేశ్ యాక్టింగ్ తప్పితే మిగతా వాటిపై ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. డైరెక్టర్ త్రివిక్రమ్‌తో పాటు సంగీత దర్శకుడు తమన్‌పై విమర్శలు గట్టిగానే వచ్చాయి. అయితే చిత్రబృందం మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌కి తమ సినిమా నచ్చేసిందని చెబుతోంది. వీటి సంగతి పక్కనబెడితే వారంలో రూ.212 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) సరే 'గుంటూరు కారం' టాక్-కలెక్షన్స్ గురించి కాసేపు పక్కనబెడితే ఓటీటీ రిలీజ్ విషయమై ఇప్పుడు ఓ టాక్ వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మహేశ్ కొత్త సినిమాని 28 రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకురానుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఫిబ్రవరి రెండో వారంలో అంటే 9 లేదా 10వ తేదీన 'గుంటూరు కారం' ఓటీటీలో వచ్చేయొచ్చు. అయితే 'సలార్' ఓటీటీ విడుదలనే దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎందుకంటే డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన సలార్.. జనవరి 20న ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో 'హనుమాన్' విన్నర్‌గా నిలిచింది. 'గుంటూరు కారం', 'నా సామి రంగ' చిత్రాలు పాస్ కాగా.. 'సైంధవ్' సినిమా సరైన ప్లానింగ్ లేకుండా వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిలైనట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) -
పండుగ వల్లే అన్ని కలెక్షన్స్ వచ్చాయా?
-
అలా చేయకపోవడం మా తప్పే..!
-
నెగిటివ్ రివ్యూస్ విని మహేష్ బాబు ఒకటే చెప్పాడు
-
మా మీద కోపం తో వాళ్ళు కావాలని చేస్తున్నారు
-
సలార్ మాస్ సినిమా.. మేము చేసిన తప్పు ఏంటంటే..!
-
గుంటూరు కారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..?
-
గుంటూరు కారం కలెక్షన్స్ ఊచకోత..
-
గుంటూరు కారంపై నెగెటివ్ టాక్.. మహేశ్‌బాబు ఏమన్నాడంటే?
'అతడు', 'ఖలేజా' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారంలోనే ఈ సినిమా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. భారీ వసూళ్లు.. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు నిర్మాత ఎస్. నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. "గుంటూరు కారం సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులు అయింది. కొందరి అంచనాలను తప్పని నిరూపిస్తూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యారు. కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేసి తప్పుడు రివ్యూలిచ్చారు. కానీ కుటుంబ ప్రేక్షకులు, సాధారణ ప్రేక్షకులు ఎప్పుడైతే సినిమాకి రావడం మొదలుపెట్టారో సాయంత్రానికి ఒక్కసారిగా టాక్ మారిపోయింది. ఇది నేను చెప్పడం కాదు.. ఇప్పటిదాకా సాధించిన వసూళ్లే చెబుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మహేశ్‌కు మొదటి నుంచీ నమ్మకముంది గతంలో మా బ్యానర్ నుంచి పండగకి ఒక సినిమా వచ్చేది. సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి. వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఇప్పుడు గుంటూరు కారం చిత్రం రివ్యూలతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. పండగ కారణమైతే అన్ని సినిమాలు హిట్ కావాలి కదా. పండగకు వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మహేశ్‌బాబు మొదటి నుంచి ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. మొదట్లో నెగటివ్ రివ్యూలు వచ్చినా ఆయన ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఆయన అంచనా నిజమైంది రేపటి నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడండి అంటూ మాకు భరోసా ఇచ్చారు. ఆయన అంచనానే నిజమైంది. ఆయన ధైర్యమే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణమైందనిపించింది. ఇది మాస్ సినిమా అని అంతా భావించారు. త్రివిక్రమ్ గారి శైలిలో ఉండే ఫ్యామిలీ సినిమా అని ముందుగా ప్రేక్షకులకు తెలిసేలా చేయలేకపోయాము. అయినా జానర్ ను బట్టి ఒక్కో సినిమా ఒక్కో ప్రాంతంలో ఎక్కువ వసూళ్లు రాబడుతుంది. సినిమా విజయం అనేది మొత్తం వసూళ్లపై ఆధారపడి ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫరిస్తే రిజెక్ట్ చేశా.. అయినా తన నుంచి మెసేజ్.. -
గుంటూరు కారం కలెక్షన్స్.. ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసిన మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం తొలి వారంలో రూ. 212 కోట్లు వసూల్ చేసినట్లు అఫీషియల్‌గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రాంతీయ భాషలో మాత్రమే విడుదలైన గుంటూరు కారం చిత్రం కలెక్షన్స్ పరంగా అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. రిజనల్ ఫిల్మ్ పరంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. మహేశ్ బాబు కెరీర్లో రూ.200+ గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా రూ. 100 కోట్ల క్లబ్లో మహేశ్ బాబు చిత్రాలు ఐదు ఉన్నాయి. టాలీవుడ్లో ఈ రికార్డ్ మహేశ్ పేరుతో మాత్రమే ఉంది. ఈ సినిమా మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 sets the BOX-OFFICE ablaze!! 🔥🕺#GunturKaaram grosses over a SMASHING 𝟐𝟏𝟐 𝐂𝐑 Worldwide in it’s 1st Week ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 (Highest for a regional cinema)💥💥 Watch #BlockbusterGunturKaaram at… pic.twitter.com/KyXpMsIwHf — Haarika & Hassine Creations (@haarikahassine) January 19, 2024 -
కలెక్షన్స్ వేటలో హనుమాన్..!
-
నా పర్పామెన్స్ చూసి నాకు మజా వచ్చింది
-
పిల్లలతో సినిమా అంటే భయపడ్డ..!
-
హనుమాన్, గుంటూరు కారం లెక్క ఎంత..?
-
తెలుగులో ఇదే నా చివరి సినిమా.. మళ్లీ ఆ చాన్స్ రాకపోవచ్చు: మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన ప్యాన్స్‌కి షాకింగ్ న్యూస్ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు. అతడు, ఖలేజా లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. మహేశ్‌బాబు మాస్ యాక్షన్, డ్యాన్స్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో నెక్లెస్ పాటతో పాటు కుర్చి సాంగ్ ఉండాలని ముందే నిర్ణయించుకున్నామని మహేశ్ అన్నారు. (చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్.. అసలు విషయం బయటపెట్టిన సూపర్ స్టార్) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ మరిన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ‘గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్ సాంగ్స్ ఉండాలని నేను, త్రివిక్రమ్ ముందుగానే అనుకున్నాం. ఈ మూవీ తర్వాత తెలుగులో సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు. బహుశా ఇదే నా చివరి తెలుగు చిత్రం కావొచ్చు. అందుకే మాస్ సాంగ్స్ ఉండాలనుకున్నాం. ఈ మూవీలోనే నా డ్యాన్స్ అంతా చూపించాలనుకున్నాను. కుర్చి సాంగ్.. నా కెరీర్ బెస్ట్ కావాలని శేఖర్ మాస్టర్‌తో చెప్పాను. ఆయన అలాంటి స్టెప్పులే కంపోజ్ చేశాడు. శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేయడానికి మొదట్లో టెన్షన్ పడ్డాను. నెక్లెస్ పాట షూటింగ్ అయితే ముందే పూర్తి చేశాం. ఆ తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. కుర్చి సాంగ్ రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు(డిసెంబర్ 22)పూర్తి చేశాం. చాలా అద్భుతంగా అనిపించింది. నా కెరీర్ బెస్ట్ సాంగ్ ఇదే’ అని మహేశ్ అన్నారు. ప్రస్తుతం మహేశ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో ‘ఇదే ఆఖరి సినిమా కావచ్చు అంటే ఆయన ఇకపై తెలుగు సినిమాలు చేయరా’ అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ చెప్పింది నిజమే! మహేశ్‌బాబు మరో రెండు,మూడేళ్ల వరకు తెరపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే తన తదుపరి సినిమా రాజమౌళితో చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు రాజమౌళి. ఈ సినిమా రిలీజ్‌కి దాదాపు రెండేళ్లు పట్టొచ్చు. ఆ తర్వాత మహేశ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం గ్యారెంటీ. దీంతో మహేశ్ బాబు తదుపరి ఎలాంటి చిత్రం చేసినా.. అది పాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉన్న చిత్రాలే చేయాలి. తెలుగు సినిమాల మాదిరి ఆ చిత్రాల్లో మాస్ సాంగ్స్, డ్యాన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అది దృష్టిలో పెట్టుకోనే.. గుంటూరుకారంలో తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులను నచ్చే సాంగ్స్, స్టెప్పులు ఉండేలా మహేశ్ జాగ్రత్త పడొచ్చు. -
గుంటూరు కారం నుండి రమణ ఎయ్ పాట రిలీజ్
-
బీడీ తాగడం వల్ల మైగ్రేన్‌తో ఇబ్బందిపడ్డా: మహేశ్‌బాబు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇందులో మాస్ యాంగిల్ కనిపించాడు మహేశ్. డైలాగ్స్, లుక్స్ మాత్రమే కాదు తన చేష్టలు కూడా అలాగే ఉంటాయి. అంతేకాదు పొగ తాగడాన్ని వ్యతిరేకించే ఈ హీరో గుంటూరు కారం సినిమాలో ఎప్పుడూ బీడీ కాలుస్తూ కనిపిస్తుంటాడు. మరి బీడీ, సిగరెట్ కాల్చొద్దని నీతులు చెప్పే హీరోనే ఇలా బీడీ తాగుతుంటే అభిమానులు ఫాలో అవరా? అంటారేమో.. తను తాగింది నిజమైన బీడీ కాదట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాని వెనక అసలు సీక్రెట్ బయటపెట్టాడు మహేశ్. బీడీ తాగడం వల్ల మైగ్రేన్ అతడు మాట్లాడుతూ.. 'నేను సిగరెట్, బీడీ తాగను. ఎవరు కూడా దాని జోలికి వెళ్లొద్దనే చెప్తాను. సినిమాలో నేను వాడింది ఆయుర్వేదిక్ బీడీ. లవంగం ఆకులతో దాన్ని తయారు చేశారు. సినిమా షూటింగ్ మొదలైన తొలినాళ్లలో నాకు నిజమైన బీడీ ఇచ్చారు. కానీ దానివల్ల మైగ్రేన్‌తో ఇబ్బందిపడ్డాను. ఈ బీడీ తాగడం నా వల్ల కావట్లేదని చెప్తే డైరెక్టర్ త్రివిక్రమ్ ఆయుర్వేదిక్ బీడీని తీసుకొచ్చారు. అందులో పొగాకును వాడలేదు. సినిమా మొత్తం ఆ ఆయుర్వేదిక్ బీడీలనే వాడాను' అని చెప్పుకొచ్చాడు. సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం కాగా గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.164 కోట్లు రాబట్టి రెండు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. మరోవైపు మహేశ్ సంక్రాంతి రోజే చిత్రయూనిట్‌కు సక్సెస్ పార్టీ ఇచ్చాడు. హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, దిల్ రాజు ఈ పార్టీకి హాజరయ్యారు. చదవండి: రజనీ అభిమానులపై ముసలావిడ ఆగ్రహం.. పండగపూట ఇదేం లొల్లి అంటూ! -
డేంజర్ జోన్లోకి 'డేంజర్ పిల్ల' .. శ్రీలీల చేస్తున్న తప్పేంటి?
కొంతమంది హీరోయిన్లకు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్న సరే.. సదరు హీరోయిన్‌కి మాత్రం వరుస అవకాశాలు వస్తాయి. ఒక్క హిట్ పడినా సరే.. వెంటనే స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోతారు. అలాంటి హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తొలి సినిమా పెళ్లి సందడిలో తనదైన అందం, అభినయంతో మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక రెండో సినిమా ‘ధమాకా’ సూపర్ హిట్ కావడం.. దానికి తన గ్లామర్, డ్యాన్స్ ప్రధాన కారణం అవ్వడంతో..రెండో సినిమాకే శ్రీలీల స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ధమాకా తర్వాత టాలీవుడ్ మొత్తం శ్రీలీల పేరునే జపించింది. బడా బ్యానర్స్ అన్నీ శ్రీలీలకు అడ్వాన్స్‌లు ఇచ్చేశాయి. శ్రీలీల కూడా తన పాత్ర ప్రాధాన్యతను చూసుకోకుండా హీరో, బ్యానర్ పేర్లను చూసి సినిమాలకు సైన్ చేసింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్ జోన్లోకి వెళ్లింది. ఈ మధ్య కాలంలో శ్రీలీల హీరోయిన్గా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. రామ్ ‘స్కంధ’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, నితిన్ ‘ఎక్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రాలన్నింటిలోనూ శ్రీలీలనే హీరోయిన్. ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. డిజాస్టర్ టాక్ని సంపాదించుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన ‘భగవంత్ కేసరి’మాత్రం హిట్ టాక్‌కి సంపాదించుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకే వెళ్లింది. ఇలా వరుస ఫ్లాపులు వచ్చినా శ్రీలీల మాత్రం ధైర్యం కోల్పోలేదు. దానికి కారణం ‘గుంటూరు కారం’. కెరీర్లోనే తొలిసారి మహేశ్ బాబు లాంటి బిగ్ స్టార్ సరసన నటించే అవకాశం శ్రీలీలకు వచ్చింది. ఈ చిత్రం కచ్చితంగా హిట్ కొట్టి..మళ్లీ తన గురించి టాలీవుడ్ చర్చించుకునేలా చేస్తుందని శ్రీలీల భావించింది. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకుంది. అంతేకాదు శ్రీలీల పాత్రపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో శ్రీలీలకు వచ్చిన ఒక్కగానొక్క అవకాశం కూడా చేజారిపోయినట్లైయింది. గతంలో పూజా హెగ్డే, కృతీశెట్టి లాంటి హీరోయిన్లు కూడా ఇలాంటి తప్పులే చేసి.. తెలుగు తెరకు కనుమరుగైపోయారు. ఇప్పుడు శ్రీలీల కూడా ఆ లిస్ట్‌లోకి చేరబోతుందని టాలీవుడ్ పండితులు అంటున్నారు. శ్రీలీల చేస్తున్న తప్పేంటి? శ్రీలీల మంచి అందగత్తె. తెరపై గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. డాన్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు కానీ.. కథల ఎంపిక విషయంలో మాత్రం తప్పు చేస్తోందని సీనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరో, పెద్ద బ్యానర్ పేర్లను మాత్రమే చూస్తుంది కానీ.. నటనను ప్రదర్శించే క్యారెక్టర్లను మాత్రం ఎంచుకోవడం లేదని అంటున్నారు. ఇక నుంచైన ఫెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రల్లో నటించపోతే.. స్టార్ హీరోయిన్ అనే కూర్చి నుంచి శ్రీలీల దిగిపోవడం ఖాయమని చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్‌కి జోడీగా నటిస్తోంది. -
Guntur Kaaram Success Party Pics: గుంటూరు కారం సక్సెస్.. మహేశ్‌బాబు ఇంట గ్రాండ్ పార్టీ
-
మహేశ్‌బాబు ఇంట గుంటూరు కారం బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్!
గుంటూరు కారం సినిమాలో మాస్ యాంగిల్లో కనిపించి అభిమానులను ఖుషీ చేశాడు మహేశ్‌బాబు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంటున్న ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.164 కోట్ల మేర రాబట్టింది. దీంతో సంక్రాంతి పండగ రోజే సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ పార్టీ ఇచ్చాడు మహేశ్. ఈ పార్టీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, దిల్ రాజు, నాగవంశీ ఉన్నారు. మహేశ్ భార్య నమ్రత, కూతురు సితార కూడా పార్టీలో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలందరూ పండగను పురస్కరించుకుని సాంప్రదాయ దుస్తుల్లో మెరవడం విశేషం. అయితే ఈ పార్టీకి త్రివిక్రమ్ శ్రీనివాస్, తమన్ ఇద్దరూ డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరు ఎక్కడ? అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Happy Sankranthi!!! Blockbuster celebrations 💥💥💥#GunturKaaram#DilRaju @vamsi84 @sreeleela14 @Meenakshiioffl pic.twitter.com/uxkDoEcjmj — Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2024 View this post on Instagram A post shared by Meher Ramesh (@meherramesh) చదవండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా? -
సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?
ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. రిలీజ్ ముందు వరకు చూసుకుంటే ఎప్పుడు లేనంత రచ్చ ఈసారి జరిగింది. చిన్నా పెద్దా అనే అంతరాలు చేసి మాట్లాడటం, థియేటర్ల కేటాయింపు దగ్గర వివాదం.. ఇలా ఊహించని మలుపులతో ప్లాన్ చేసుకున్న నాలుగు మూవీస్ కూడా థియేటర్లలోకి వచ్చేశాయి. మరి వీటిలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నవి ఏవి? ప్రస్తుతం ఎంతెంత కలెక్షన్స్ సాధించాయి? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) 'గుంటూరు కారం'.. అలా అలా ఈసారి వచ్చిన వాటిలో భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోనే దీనికి కారణం. మాస్ ఎలిమెంట్స్ గట్టిగా ఉంటాయని చెప్పడంతో అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. తీరా చూస్తే.. మహేశ్ తన వరకు బాగా న్యాయం చేశాడు. స్వాగ్, డ్యాన్సులు రెచ్చిపోయి మరీ చేశాడు. కానీ కథ, డైలాగ్స్, దర్శకత్వం విషయంలో త్రివిక్రమ్ పెద్దగా కొత్తదనం చూపించలేకపోయాడు. దీంతో బెన్ఫిట్ షో అయిపోగానే మిక్స్డ్ టాక్ వచ్చింది. మూడు రోజుల్లోనే రూ.164 కోట్లు వచ్చిన ప్రకటించుకున్నారు. వసూళ్లు అయితే రావొచ్చేమో గానీ మిగతా విషయాల్లో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయిందనేది చాలామంది మాట! హనుమాన్.. ఊహించని సక్సెస్ రిలీజ్‌కి ముందే చిన్న సినిమా అని తక్కువ చేసి చూడటం, థియేటర్లు ఇవ్వకపోవడం లాంటి వాటివల్ల 'హను-మాన్' సినిమాపై సింపతీ పెరిగింది. ఇక స్టోరీ పరంగా కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ.. హై ఇచ్చే ఎలిమెంట్స్, దేవుడి సెంటిమెంట్ లాంటివి జనాలకు బాగా కనెక్ట్ అయిపోయాయి. సినిమాకు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చేసింది. తెలుగులో థియేటర్ల తక్కువ కావడం వల్ల కలెక్షన్స్ తక్కువ వచ్చుండొచ్చు కానీ లాంగ్ రన్లో మిగతా మూడు సినిమాల కంటే దీనికే ఎక్కువ వస్తాయి. (ఇదీ చదవండి: సంక్రాంతి అంటే సినిమా ఉండాల్సిందేనా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది?) సైంధవ్.. అంతంత మాత్రమే విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' సినిమాతో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే టేకింగ్, యాక్టింగ్ పరంగా పెద్దగా వంకపెట్టడానికి ఏం లేదు గానీ స్క్రీన్ ప్లే కాస్త సాగదీత, స్టోరీలో చిన్నచిన్ పారపొట్లు ఈ చిత్రానికి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. అలానే దీనికంటే ముందు 'గుంటూరు కారం', 'హనుమాన్' రావడంతో ఇక అందరి దృష్టి వాటిపైనే ఉండిపోయింది. దీంతో వెంకీమామని పట్టించుకునేవాళ్లు తక్కువైపోయారు. అయితే ఈ సినిమాకు తొలిరోజు రూ.6 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. నా సామిరంగ.. స్లో పాయిజన్ నాగార్జున విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'నా సామి రంగ'. విడుదలయ్యేంత వరకు దీనిపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. బడ్జెట్ కూడా తక్కువే. అలా తాజాగా సంక్రాంతికి రిలీజైన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిందని అంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే యావరేజ్ అంటున్నారు. పండగ హడావుడిలో పెట్టిన బడ్జెట్లో ఈ మూవీ సేఫ్ అయిపోవచ్చు.ఈ చిత్రానికి కూడా తొలిరోజు రూ.6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇక నాలుగు సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి ఎలా చూసుకున్నాసరే 'హను-మన్' సంక్రాంతి విన్నర్! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
నెగెటివిటీతో మా సినిమాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు: గుంటూరు కారం నిర్మాత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఫ్యాన్స్‌లో గుంటూరు కారంపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే కొందరు అభిమానులు మహేశ్ బాబు సూపర్ హిట్ కొట్టారంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మరికొందరు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేపోయిందని కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటికే గుంటూరు కారంపై వస్తున్న నెగెటివ్ టాక్‌పై నిర్మాత దిల్‌రాజు కూడా స్పందించారు. ఇది వ్యాపారమని.. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారని అన్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మా గుంటూరు కారం సినిమాకు వందలాది ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ నుంచి గుంటూరు కారం చిత్రానికి విపరీతమైన స్పందన వచ్చిందని ట్వీట్లో రాసుకొచ్చారు. గుంటూరుకారం చిత్రంపై నెగెటివీటి వచ్చినప్పటికీ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేవారిపై.. అలాగే మూవీ క్వాలిటీపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. సినిమా విషయంలో చివరికి ఆడియన్స్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు. ఈ విషయం గుంటూరు కారం విషయంలో మరోసారి రుజువైందన్నారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన గుంటూరు కారం సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ నాగవంశీ పోస్ట్ చేశారు. కాగా.. ఈనెల 12న రిలీజైన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. We've been receiving hundreds of such videos with highly positive feedback from family audiences & youth. The initial negativity on the movie cannot deem the quality and enjoyability factor of a film. It's always the audiences who give their final verdict and it is again proved… https://t.co/kkKm8sZ3kY — Naga Vamsi (@vamsi84) January 14, 2024 -
రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ దగ్గర తడబడుతోంది. తొలిరోజే ఆహా అనే రేంజులో కలెక్షన్స్ రాగా.. రెండో రోజుకి భారీగా డ్రాప్ కనిపించింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అలానే రాబోయే రోజుల్లో మరింతగా తగ్గే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ చిత్రానికి ఇలా జరగడానికి కారణాలేంటి? రెండో రోజుల్లో మహేశ్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ షూటింగ్ వాయిదా పడటం, హీరోయిన్ పూజాహెగ్డే, సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం లాంటివి అభిమానులకు సందేహాలు రేకెత్తించాయి. అయినా సరే త్రివిక్రమ్ మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ తాజాగా రిలీజైన ఈ సినిమాకు మొట్టమొదటి షో నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ప్రేక్షకుల ముందువెనక అయ్యారు. (ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఈమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?) అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల 'గుంటూరు కారం' సినిమాకు తొలిరోజు ఏకంగా రూ 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలే ప్రకటించారు. రెండో రోజుకి వచ్చేసరికి రూ.127 కోట్ల వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే రెండో రోజు కేవలం రూ 33 కోట్ల వచ్చినట్లే అనమాట. అంటే ఫస్ట్ డే వచ్చిన మొత్తంతో పోలిస్తే ఇది మూడో వంతు. 'గుంటూరు కారం' కలెక్షన్స్ తగ్గడానికి కారణాలు చూసుకుంటే.. దీనితోపాటే రిలీజైన 'హను-మాన్' హిట్ టాక్ తెచ్చుకోవడం, అలానే 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలతో థియేటర్ల పంచుకోవడం కూడా వసూళ్ల తగ్గుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు కథలోనూ కొత్తదనం లేకపోవడం మహేశ్ సినిమాకి దెబ్బేసినట్లు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 💥#GunturKaaram grosses over 𝟏𝟐𝟕 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 in 2 Days Worldwide 🔥 ఈ భోగికి మీలో ఉన్న Egos & Haterd కాల్చేస్తారు అని ఆశిస్తూ, మీ అందరికి భోగి శుభాకాంక్షలు ✨ Watch the #BlockbusterGunturKaaram at cinemas… pic.twitter.com/1OvKeHnM36 — Haarika & Hassine Creations (@haarikahassine) January 14, 2024 -
ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు కాదు.. దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్.. ఈసారి సంక్రాంతిని బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే సినిమాలు-రిలీజులు-థియేటర్లల పంపకాల విషయంలో చాలా రచ్చ జరిగింది. 'గుంటూరు కారం' కోసం 'హనుమాన్'కి అన్యాయం చేశారని, దీనికి దిల్‌రాజే కారణమని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వీటిలో 'హనుమాన్' హిట్ టాక్ తెచ్చుకోగా, మహేశ్ మూవీకి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే 'గుంటూరు కారం' సినిమాకు టాక్ అటుఇటుగా వచ్చినప్పటికీ తొలిరోజు ఏకంగా రూ 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. అలానే నిర్మాత నాగవంశీ, నైజాంలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్‌రాజు కలిసి తాజాగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. థియేటర్ల విషయమై జరిగిన గొడవ గురించి దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: వరసగా మూడోసారి అలా డిసప్పాయింట్ చేసిన త్రివిక్రమ్!) ''గుంటూరు కారం' సినిమాకు అర్థరాత్రి ఒంటి గంట షో అయిపోయిన తర్వాత మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. పర్వాలేదు, యావరేజ్ అని కొందరు.. బావుంది అని ఇద్దరు ముగ్గురు నాతో అన్నారు. కానీ నేను సుదర్శన్ థియేటర్లలో మళ్లీ సినిమా చూశాను. ఇది మహేశ్ బాబుని బేస్ చేసుకుని తీసిన సినిమా. తల్లికొడుకుల మధ్య ఎమోషన్స్ ఉన్న సినిమా. కచ్చితంగా ప్రేక్షకులు ఈ నెగిటివ్ వైబ్స్, రివ్యూలు చూసి థియేటర్లకు వెళ్లినా సరే.. సినిమాకు విషయముండి, కనెక్ట్ అయితే స్టాండ్ అవుతుంది. ఇలా ఎన్నో సినిమాలు చూశాం. అవన్నీ బ్లాక్‌బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. 'సినిమా బాగుంటే చూస్తారు. బాగుండే సినిమాని ఏదైనా కానీ ఎవడూ ఆపడు. అది చరిత్ర. ప్రతి ఏడాది సంక్రాంతి రాగానే మా అందరి మధ్య యుద్ధం జరగడం సర్వసాధారణం. ఎందుకంటే అల్టిమేట్‌గా ఇది వ్యాపారం. ఇక్కడ ఎవరూ ఎవరికి శత్రువులు కాదు. మిత్రులు కాదు. సంక్రాంతి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి వ్యాపారపరంగానే చూస్తాం. ఇంకో రెండు రోజుల తర్వాత ఈ టాపిక్ ఎవరూ మాట్లాడరు' అని దిల్ రాజు అన్నారు. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) #DilRaju says Sankranthi Wars are common and ultimately this is all Business and there are No friends or enemies here!! pic.twitter.com/TDeVWOkNFZ — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 13, 2024 -
Guntur Kaaram Collection Day 1: రచ్చ లేపిన గుంటూరు కారం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ యాంగిల్లో దుమ్ములేపాడు మహేశ్‌బాబు. గుంటూరు కారం సినిమాలో తన యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ బిర్యానీ తినిపించాడు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అక్కడక్కడా తడబడ్డట్లు కనిపించింది. అయితే పాటలు, ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజులో జరిగాయి. దీంతో సంక్రాంతి పందెంలో దిగిన గుంటూరు కారం తొలి రోజు బీభత్సంగా రాబట్టింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్‌డే రూ.94 కోట్లు రాబట్టింది. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సూపర్ స్టార్ మహేశ్ తన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడంటూ చిత్రయూనిట్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది చూసిన అభిమానులు జై బాబు, రికార్డ్స్ బ్రేకింగ్ రమణ అంటూ సంతోషంతో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్, ప్రకాశ్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి బరిలో విజయం సాధించేనా? ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికి పోటీగా హనుమాన్, సైంధవ్ రంగంలోకి దిగాయి. వీటిలో హనుమాన్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.20 కోట్ల మేర రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ మౌత్ టాక్ వల్ల హనుమాన్ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. రేపు(జనవరి 14న) ఈ మూడు సినిమాలకు పోటీగా నా సామిరంగ రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద జరిగే ఫైట్‌లో ఈ నాలుగింటిలో ఏది విజేతగా నిలుస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది! Biggest opening day ever for the Reigning Super 🌟 @urstrulyMahesh 🕺😎#GunturKaaram strikes a 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝟗𝟒 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Worldwide on Day 1 ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 in regional cinema! 🔥🔥 Watch the #BlockbusterGunturKaaram at cinemas near you… pic.twitter.com/TNNMBjVLeI — Haarika & Hassine Creations (@haarikahassine) January 13, 2024 చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? అప్పుడు శోభన్ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు -
వరసగా మూడోసారి అలా డిసప్పాయింట్ చేసిన త్రివిక్రమ్!
తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ కొందరి దర్శకులకు కూడా కల్ట్ అభిమానులున్నారు. వీళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన సినిమా తీస్తే చాలు దాన్ని రిపీట్స్‌లో చూడొచ్చు. ఆయన పెన్ పవర్ అలాంటిది. కానీ తాజాగా 'గుంటూరు కారం' మూవీతో వచ్చిన గురూజీ.. చాలా డిసప్పాయింట్ చేశాడని మూవీ చూసిన చాలామంది అంటున్నారు. ఇదే టైంలో ఓ విషయంలోనూ త్రివిక్రమ్ పట్టుతప్పుతున్నట్లు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్‌కి థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి) డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడనే పేరుంది. అయితే గత మూడు సినిమాల నుంచి మాత్రం సెకండ్ హీరోయిన్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా అనే సందేహం వస్తుంది. ఫస్ట్ 'గుంటూరు కారం'నే తీసుకుందాం. ఇందులో రాజీ అనే మరదలి పాత్ర కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అయితే ఈమెతే ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ) ఇక త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి రిపీటైంది. 'అరవింద సమేత'లో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక 'అల వైకుంఠపురములో' చిత్రంలోనూ నివేదా పేతురాజ్‌ని సెకండ్ హీరోయిన్గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్‌కి గుర్తింపు అయితే ఏం రాలేదు. అయితే ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు పేరున్న హీరోయిన్లని కాకుండా కాస్త గుర్తింపు ఉన్న తెలుగు అమ్మాయిల్ని తీసుకుంటే సరిపోతుందిగా అని సగటు సిని ప్రేమికుడు అనుకుంటున్నాడు. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) -
గుంటూరు కారం మూవీ.. ప్రిన్స్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఈ సినిమా అభిమానులు ఆశించినా స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని కొందరు సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!) అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం చిత్రానికి మహేశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టీటౌన్లో టాక్ వినిపిస్తోంది. అయితే మహేశ్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.70 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే గుంటూరు కారం సినిమాకు తక్కువగానే తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ షాకవుతున్నారు. తమ అభిమాన హీరో తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడాన్ని నమ్మలేకపోతున్నారు. స్టార్ హీరోగా ఉన్న మహేశ్ ఇంత తక్కువ తీసుకోవడం ఏంటని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: గుంటూరు కారం రిలీజ్.. ట్రెండింగ్‌లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే?) -
Guntur Kaaram: అభిమానులతో కలిసి సినిమా చూసిన మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది ఆయన మాస్ మసాలా సినిమాతో వస్తున్నాడంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం నేడే(జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుకు తగ్గట్లే సినిమాలో ఘాటు ఎక్కువే ఉందనుకున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో టాక్ చూస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే కనిపిస్తోంది. మిక్స్డ్ టాక్.. మహేశ్ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు కానీ కొన్నిచోట్ల సీన్లు, డైలాగులు పేలవంగా ఉండటం, కథ కూడా బలహీనంగా ఉండటంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ సహా ఫైటింగ్ సీన్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్ తన ఫ్యామిలీతో కలిసి శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో గుంటూరు కారం సినిమా చూశాడు. భార్య నమ్రత, తనయుడు గౌతమ్, కూతురు సితార అతడి వెంట ఉన్నారు. థియేటర్లో మహేశ్‌బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్, రచయిత వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు.. మహేశ్‌తో కలిసి థియేటర్లో సినిమా వీక్షించారు. థియేటర్లో అభిమాన హీరో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషంతో కేకలు పెట్టారు. అయితే మహేశ్, త్రివిక్రమ్, వంశీ ముఖాల్లో చిరునవ్వే కనిపించడం లేదని అభిమానులు ఫీలవుతున్నారు. మహేశ్‌ను అలా దిగాలుగా చూడలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. Superstar @urstrulyMahesh at sudarshan 35mm 😍🔥 #GunturKaaram pic.twitter.com/vbVwvWVWo8 — Mahesh Fans Campaign ™ (@ursMFC) January 12, 2024 Actor Mahesh Babu Arrived At Sudharshan Theatre For Watching His Movie With Fans#GunturKaaramOnJan12th #GunturKaaram #MaheshBabu pic.twitter.com/njfKeMAX29 — Pawar Dilip Kumar Choudhary (@DkpChoudhary) January 12, 2024 చదవండి: గుంటూరు కారం ఓటీటీ పార్ట్నర్ ఇదే! సినిమా సత్తాను బట్టి.. -
గుంటూరు కారం రిలీజ్.. ట్రెండింగ్‌లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే?
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మరో చిత్రం గుంటూరు కారం. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజైంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సినీ ప్రియుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గుంటూరు కారం అంత ఘాటు.. సినిమాలో కనిపించలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అభిమానుల నుంచి మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే ఒకవైపు గుంటూరు కారం థియేటర్లలో అలరిస్తుండగా.. మరోవైపు పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. గుంటూరు కారం సినిమాను అజ్ఞాతవాసి చిత్రంతో పోలుస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇవాళ విడుదలైన గుంటూరు కారం చూస్తే.. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి గుర్తుకు వస్తోందని కొందరు ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆరేళ్ల క్రితం రిలీజైన పవన్ సినిమా క్రియేట్ చేసిన ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డును గుంటూరు కారం క్రాస్ చేయలేదని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ రెండు చిత్రాలను త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కినవే కావడం మరో విశేషం. మరీ సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం మూవీతో మరో చిత్రం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. పొంగల్ పోటీని తట్టుకుని ఎవరు సక్సెస్ సాధిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Edi endhuku EPPUDU 😭#GunturKaaram #Agnyaathavaasi 💔@PawanKalyan @urstrulyMahesh pic.twitter.com/5clG1sQ8zb — Joh№y (@Johnny__007) January 12, 2024 #Agnyaathavaasi Trending 🙂pic.twitter.com/pobebEsBcj — Kobali🌊 (@kobali778) January 12, 2024 -
గుంటూరు కారం ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..
సంక్రాంతి రేసులోకి పందెం కోళ్లు దిగాయి. ఈరోజు (జనవరి 12న) మహేశ్‌బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి మాస్ మసాలా సినిమా అయితే మరొకటి సూపర్ హీరో చిత్రం! ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉంది. ఇక ఈ సినిమాకు మొదట్లో రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువే అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ రైట్స్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.40 కోట్లు పెట్టి మరీ గుంటూరు కారం సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. రెండు నెలల తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా రిజల్ట్‌ను బట్టి సినిమా కాస్త ముందుగా లేదా ఆలస్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు కనిపిస్తోంది. చదవండి: హను-మాన్ రిలీజ్.. ఆదిపురుష్ డైరెక్టర్‌పై మళ్లీ ట్రోలింగ్! ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ -
Meenakshi Chaudhary: గుంటూరు కారంలో అమాయకంగా కనిపించే మీనాక్షి ఎంత క్యూట్ గా ఉందో చూడండి (ఫోటోలు)
-
గుంటూరు కారం మూవీ పబ్లిక్ టాక్
-
Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
టైటిల్: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు) రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సంగీతం:తమన్ ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2024 కథేంటంటే.. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్‌ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్‌లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్‌లో సినిమాలను తెరకెక్కించాడు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్‌లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్‌గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్‌గా సాగుతుంది. లేడిస్‌తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్‌తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్‌బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. -
Guntur Kaaram Twitter Review : ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ
అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మహేశ్-త్రివిక్రమ్‌ల కాంబోలో మూడో చిత్రం కావడంతో ‘గుంటూరు కారం’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే సినిమా ఓ రేంజ్లో ఉంటుందని నిర్మాత నాగవంశీ చెప్పడంతో సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ చిత్రంపై అసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షితో సంబంధం లేదు. ఎక్స్(ట్విటర్)లో గుంటూరుకారం చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది చెబితే.. రొటీన్ కథ అని, మహేశ్ స్థాయి సినిమా కాదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. #GunturKaaram Pakka Sankranti treat to all VINTAGE #MaheshBabu fans. Clean commercial movie with Fast screenplay,fun,action,dance, emotional like every #Trivikram movies. @MusicThaman Anna's bgm 🔥🔥🔥🔥 Personally I really like and enjoy the movie as an Audience. — Vishwa (@Vishnu49137510) January 11, 2024 ‘మహేశ్ బాబు అభిమానులకు ‘గుంటూరుకారం’ పక్కా సంక్రాంతి ట్రీట్. త్రివిక్రమ్ గత సినిమాల మాధిరే వేగవంతమైన స్క్రీన్‌ప్లే, కామెడీ, యాక్షన్, ఎమోషనల్..అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. తమన్ బీజీఎం బాగుంది. పర్సనల్‌గా నేను ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశాను’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #GunturKaaram first Half Done! One word - BLOCKBUSTER 🔥 #GunturKaram Super star ⭐ #MaheshBabu𓃵 's Intro ,🔥 Awesome Movie Title card ,🔥 Dum Masala song ,🔥 This is Babu's #Sankranti ,🔥 Full on engagement in the first half! Mahesh Babu on steroids his performance is… pic.twitter.com/8IEw6heL1B — it's cinema's (@itscinemas) January 11, 2024 #gunturkaaram - Outdated Trivikram commercial Movie +Ve 👉 First 30 Mins full meals 👌👌 👉 #MaheshBabu One Man show💥💥🔥 👉Mass Songs with Dance 🔥🔥 -ve 👉2nd Half 👎👎 👉Weak Direction & story 👉Over hype 😄 Total ga 2hour 38 mins lo Only 50 mins Good Rest of movie… — Movie బుల్లోడు🙏🙏 (@RVPratap2) January 11, 2024 To put it on the lines of #Trivikram #GunturKaaram is “FAIR AND LOVELY” when #MaheshBabu is on screen and rest of the time it’s completely “UNFAIR AND LONELY”! 😢 And by the way, no one knows why #MeenakshiChaudhary is there.#GunturKaaram #GunturKaaramReview #Review #Sreeleela — FILMOVIEW (@FILMOVIEW_) January 11, 2024 #GunturKaaram REVIEW - ⭐⭐⭐⭐ First Half Screen Play Was So Fast With Full Of Mass Elements And Goosebump Stunts. Second Half Was Fully Packed With Emotions And Dialogues Along With Mass Scenes 🔥 2nd Half > 1 st Half , A solid Comeback from @urstrulyMahesh 🌶️❤️🔥 pic.twitter.com/Enpi03rzkq — Let's X OTT GLOBAL (@LetsXOtt) January 11, 2024 #GunturKaaramReview - IT'S A BLOCKBUSTER FILM!!! 🔥 RATING - ⭐⭐⭐½ Super Star #MaheshBabu's entry mass 🔥 and #Thaman's BGM Awesome 👍, 2nd half >> 1st half,#BLOCKBUSTER written all over, Super Star #MaheshBabu shines throughout the movie, #Sreeleela's dance Performance… pic.twitter.com/7EPqnrks5W — it's cinema's (@itscinemas) January 11, 2024 #GunturKaaram 1st half - Fun Filled Emotional Entertaining 👉 #MaheshBabu Attitude, Swag & Body Language 🔥 👉 @MusicThaman BGM 👌 👉 @Sreeleela & Babu Dance for Parady Scene🥳 👉 #Trivikram Classy + Massy Dialogues #GunturKaaramReview @urstrulyMahesh #RamanaGadiMassJaathara pic.twitter.com/TeLPewTkYV — BTSI Connects (@btsiconnects) January 11, 2024 Babu one Man show 🔥🔥🔥🔥🔥 Acting, Dance, swag, emotions, all Round performance Trivirkam excelled in last 30 mins Rowdy Ramana festival movie 🔥🔥🔥🔥🔥 Pandaga cinema !! #KurchiMadathapetti 🔥🔥🔥 Den fight 🔥 Climax 🥹#gunturkaaram pic.twitter.com/jodFmJBEaB — Ooriki Monagadu 🌶🌶♨️ (@OorikiMonagadu_) January 11, 2024 Never Before Celebrations By Melbourne Mahesh Fans at WORLD'S BIGGEST SCREEN 🔥🔥🔥💥 @IMAX_MELBOURNE Kurchilu Madathapettedham.... 🔥🔥🤙🤙 Bomma Blockbuster ✊✊💥#GunturKaaram #MaheshBabu #GunturKaaramReview #MelbourneMaheshFans pic.twitter.com/LVMi2b3qQb — Australian Telugu Films (@AuTelugu_Films) January 11, 2024 -
మెచ్చుకున్నారే కానీ తెలుగులో అవకాశాలు ఇవ్వలేదు: విలన్
సంక్రాంతి పోటీ భలే రంజుగా మారింది. నాలుగు సినిమాలు పందెం కోళ్లలా బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, నా సామిరంగ చిత్రాలు సంక్రాంతిని క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఇకపోతే రేపు (జనవరి 12న) గుంటూరు కారం, హనుమాన్ రిలీజ్ అవుతుండగా, సైంధవ్ జనవరి 13న, నా సామిరంగ ఆ మరుసటి రోజున విడుదల కానున్నాయి. అయితే గుంటూరు కారం, నా సామిరంగ చిత్రాల్లో విలన్‌గా నటించిన మధుసూదన రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. నాకు తెలియకుండానే సినిమా పూర్తి చేశాడు 'అమ్మది ఖమ్మం, నాన్నది ఒంగోలు. నేను పుట్టిపెరిగింది, చదువుకుందంతా కర్ణాటకలో! నన్ను విలన్‌గా గుర్తించిన డైరెక్టర్ దేవ్ కట్టా. ఆయన దర్శకత్వం వహించిన ఆటో నగర్ సూర్య సినిమా తర్వాత ఇక్కడ దశ మారుతుందనుకున్నాను. అందరూ అద్భుతంగా చేశావని చెప్పేవారే తప్ప అవకాశాలు మాత్రం ఎక్కువగా ఇవ్వలేదు. అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాను. నా భార్య శృతి కూడా విలన్‌గా యాక్ట్ చేసింది. మాకు ఇద్దరు కుమారులు సంతానం. ఓ కుమారుడు ప్రీతమ్ నాకు తెలియకుండానే సినిమా చేశాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే చిత్రంలో నటించాడు. అంతా అయ్యాక సినిమా చేశానని చెప్పడంతో షాకయ్యాను. తను కళ్ల ముందే ఎదుగుతున్నందుకు ఉప్పొంగిపోయి ఆనందంతో ఏడ్చేశాను. అయితే నా పేరు ఎక్కడా వాడకూడదని తనకు కండీషన్ కూడా పెట్టాను. కానీ . రోజంతా కష్టపడితే.. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. రోజంతా పని చేస్తే రూ.300 వచ్చేవి. కెప్టెన్ విజయ్‌కాంత్ అంటే చాలా ఇష్టం. ఆర్మీ నుంచి యాక్టింగ్‌లోకి వచ్చాను. ఇన్నేళ్లలో వందల కోట్లు సంపాదించాననుకుంటారు. కానీ అంత సీన్ లేదు. లక్ష రూపాయలు వస్తే అందులో 30% జీఎస్టీ పోతుంది. నా మేనేజర్‌కు, మేకప్‌మెన్‌కు.. వారికి డబ్బులివ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఎవరికైనా డబ్బు కావాలంటే సాయం చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, భోజ్‌పురి భాషల్లో నటించాను. ఈసారి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది' అని చెప్పుకొచ్చాడు మధుసూదనరావు. చదవండి: కమల్, శ్రీవిద్య లవ్‌స్టోరీ.. పెళ్లి చేసుకుంటానన్న కమల్.. కానీ! -
పాన్ ఇండియా హీరోలతో పోటీ పడుతున్నా దీపికా
-
‘గుంటూరు కారం’ మైండ్ బ్లోయింగ్ మేకింగ్ HD స్టిల్స్ (ఫొటోలు)
-
గుంటూరు కారం మూవీ మార్నింగ్ షో కలెక్షన్...!
-
గుంటూరు కారం మేకింగ్ వీడియో రిలీజ్.. అదిరిపోయిన యాక్షన్ సీన్స్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అర్ధరాత్రి నుంచే గుంటూరు కారం రుచి ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు మహేశ్.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొడుతుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్ రికార్డులకెక్కింది. తాజాగా గుంటూరు కారం చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను యూనిట్ షేర్ చేసింది. షూటింగ్ సెట్స్‌లో మహేశ్ ఎంతో ఫన్నీగా నవ్విస్తూ ఉన్న విజువల్స్ అందరినీ మెప్పిస్తాయి. రెండురోజుల క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గుంటూరు కారంతో ఈసారి గట్టిగా కొడతామంటూ మహేశ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రతి సినిమాకు తన తండ్రి ఫోన్ చేసేవారని, ఈసారి తన తండ్రి పాత్రను ప్రేక్షకులు పోషించాలని స్టేజీ మీద ఎమోషనల్ అయ్యాడు. ఇకపై తనకు తల్లయినా, తండ్రయినా ప్రేక్షకులే అంటూ రెండు చేతులెత్తి మొక్కాడు. దీంతో ఎప్పటికీ మహేశ్‌కు అండగా తాము ఉంటామంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదలైన గుంటూరు కారం మేకింగ్ వీడియోను మీరు చూసేయండి. -
ఆంధ్రాలోనూ 'గుంటూరు కారం' టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైపోయింది. జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అయితే టికెట్ రేట్ల పెంపుపై ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించేసింది. అన్ని థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50 వరకు పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. అలానే ఈనెల 12 నుంచి పదిరోజుల పాటు టికెట్ ధరల పెంపు కోసం వెసులుబాటు కల్పించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) ఇక తెలంగాణ విషయానికొస్తే.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పెంపు ఇచ్చారు. ఆల్రెడీ తెలంగాణలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి అనుమతి లభించిన దృష్ట్యా ఆంధ్రాలోనూ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. సినిమా విషయానికొస్తే.. మాస్-ఫ్యామిలీ-కమర్షియల్ ఎలిమెంట్స్‌తో 'గుంటూరు కారం' తీశారు. మహేశ్‌కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. చినబాబు నిర్మాతగా వ్యవహరించారు. (ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?) -
అమ్మ, నాన్న అన్ని మీరే: మహేష్ బాబు
-
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పీచ్
-
మహేష్ దెబ్బకు స్క్రీన్లు చినిగిపోతాయి
-
బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే మహేష్ బాబు..!
-
అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. త్రివిక్రమ్ తక్కువ మాట్లాడాడు. మహేశ్ ఊహించని విధంగా ఎమోషనల్ అయ్యాడు. ఇకపై నాకు అమ్మ నాన్న మీరే అని అభిమానులని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. గుంటూరులో మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలీల కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. చాలామంది దృష్టి ఆమె కట్టుకున్న చీరపై పడిండి. మరి ఈ శారీ ఖరీదు ఎంతో తెలుసా? సినిమా చూసేవాళ్లలో సీన్స్, సాంగ్స్ చూసి ఆనందపడే వాళ్లు కొందరు.. మరికొందరు మాత్రం హీరోహీరోయిన్ ఎలాంటి బట్టలు వేసుకున్నారు. అవి ఎక్కడ దొరుకుతాయి అని సెర్చ్ చేస్తుంటారు. అలా వీళ్లని 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల కట్టుకున్న చీర.. ఎట్రాక్ట్ చేసింది. దీంతో అసలు ఈ శారీ కాస్ట్ ఎంత? అదెక్కడ దొరుకుతుంది అని వెతకడం మొదలుపెట్టారు. (ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) 'బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ' పేరుతో ఇది అందుబాటులో ఉంది. ఈ డిజైనర్ వేర్ చీర ధర అక్షరాలా రూ.1,59,000. చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ దీని ఖరీదు ఇంతా అని తెలిసేసరికి.. నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ప్లెయిన్‌గా లేకుండా గడుల్లా ఉన్న ఈ చీర.. అమ్మాయిలు, ఆంటీలు అనే తేడా లేకుండా అందరికీ నచ్చేస్తోంది. 'గుంటూరు కారం' విషయానికొస్తే.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ రోజు అర్థరాత్రి ఒంటి గంట నుంచే బెన్ఫిట్ షోలు ఒక్క హైదరాబాద్‌లోనే తొలిరోజు వందలాది షోలు పడుతున్నాయి. మహేశ్ మాస్ అవతార్, త్రివిక్రమ్ దర్శకత్వం.. శ్రీలీల డ్యాన్సులు.. ఇలా చాలా అంశాలు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. మరి మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిటింగ్? (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) #Sreeleela 😍🥰 pic.twitter.com/PNJQ7IifSH — VD bulletin (@vdbulletin) January 10, 2024 -
మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్.. నమ్రత ఆసక్తికర పోస్ట్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మరో చిత్రం 'గుంటూరు కారం'. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా..వ్యూస్ పరంగా యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్ సక్సెస్ కావడంపై మహేశ్ భార్య నమ్రత ఆసక్తికర పోస్ట్ చేశారు. నమ్రత తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' మహేశ్ సూపర్ ఫ్యాన్స్ గురించి మాట్లాడే చివరి వ్యక్తి బహుశా నేనే అనుకుంటా. మన రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. అన్నివేళలా ఆయనకు మద్దతుగా ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తూ మరింత కష్టపడి పనిపడేలా చేశారు. మా సొంత ఊరు గుంటూరులో మీరు చూపించిన ప్రేమను చూసి ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది. మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్. ఈ ప్రేమను కుటుంబసభ్యులుగా మనం ఆదరిస్తాం. ఈ ప్రేమ ఇలాగే మనం జీవించి ఉన్నంత కాలం ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఎల్లప్పుడూ మా ప్రేమను ప్రతిఫలంగా అందిస్తాం. మీరు దానిని స్వీకరిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీ అభిమానానికి నా హృదయం సంతోషంతో నిండుగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. గుంటూరులో మంగళవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మహేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి నుంచి నాకు మీరే అన్నీ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన నమ్రత ఈ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సొంతగడ్డపై జరగడం ఆనందంగా ఉంది..
-
నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం: మహేశ్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మరో చిత్రం గుంటూరు కారం. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. తాజాగా ఈవెంట్ సక్సెస్ కావడం పట్ల మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఈవెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహేశ్‌బాబు తన ట్వీట్లో రాస్తూ..' థ్యాంక్ యూ గుంటూరు!! నా సినిమా ఈవెంట్ హోమ్‌టౌన్‌లో జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఇది గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం. మీ అందరినీ ప్రేమిస్తున్నా.. నా సూపర్ ఫ్యాన్స్‌ను మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్నా. అతి త్వరలో మళ్లీ కలుద్దాం. ఇప్పుడే సంక్రాంతి మొదలవుతోంది. నిన్న జరిగిన కార్యక్రమానికి సహకరించిన గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. Thank you, Guntur!! ♥️ Celebrating the film in my hometown surrounded by so much love, is a timeless memory that I will hold close to my heart. Love you all, my superfans and I look forward to seeing you again...very soon!! ♥️♥️♥️ Sankranthi begins now!! 🎉 #GunturKaaram A… pic.twitter.com/RWpaplus8X — Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2024 -
మా ఇద్దరికీ సంక్రాంతి కలిసొచ్చిన పండగ
‘‘నాన్నగారికి (సూపర్ స్టార్ కృష్ణ), నాకు సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజైతే అది బ్లాక్‌బస్టరే.. ఈసారి కూడా ‘గుంటూరు కారం’తో బాగా గట్టిగా కొడతాం. కానీ, ఈసారి కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్య లేరు. ఆయన నా సినిమా చూసి కలెక్షన్స్, సినిమా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా ఉండేది. ఆయన ఫోన్ కోసం ఎదురు చూసేవాణ్ణి. ఇప్పుడు అవన్నీ మీరే (ఫ్యాన్స్) చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మానాన్న.. మీరే అన్నీ (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు మహేశ్‌బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు, శ్రీలీల జంటగా మీనాక్షీ చౌదరి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం గుంటూరులో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘నేను త్రివిక్రమ్ గారి సినిమాలు చేసినప్పుడల్లా నా నటనలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాలకు మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ ఆ మ్యాజిక్ జరిగింది. ఒక కొత్త మహేశ్‌బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. మా నిర్మాత చినబాబుగారికి అత్యంత ఇష్టమైన హీరో నేనే. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో వచ్చిన సంతోషం చూసినప్పుడు నాకు ఆనందంగా అనిపించేది. శ్రీలీలతో డ్యాన్స్ చేయడమంటే వామ్మో.. అదేం డ్యాన్సు.. హీరోలందరికీ తాట ఊడిపోద్ది (నవ్వుతూ). తమన్ ప్రతిసారీ నాకు బెస్ట్ ఇస్తాడు. ‘కుర్చీ మడతపెట్టి..’ పాట చూస్తే థియేటర్లు బద్దలయిపోతాయి. పాతికేళ్లుగా మీరు (ఫ్యాన్స్) చూపించిన అభిమానం మరచిపోలేను. మాటల్లేవ్.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకేమీ తెలియదు.. మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ –‘‘కృష్ణగారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి గొప్ప మహానటుడు, మహా మనిషితో నేను నేరుగా పని చేయలేకపోయాను. కానీ, ఆయన పని చేసిన ఓ సినిమాకి పోసానిగారి వద్ద అసిస్టెంట్‌గా చేశాను. ఆ తర్వాత ‘అతడు, ఖలేజా’ సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడాను. అలాంటి గొప్ప వ్యక్తికి కొడుకుగా పుట్టిన మహేశ్‌గారు ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంటుంది. ఒక సినిమాకి 100 శాతం పని చేయాలంటే 200 శాతం పని చేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేశ్‌గారే.. ఈ మాట చెప్పడానికి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడరు. ‘అతడు, ఖలేజా’లకు పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అది అందం పరంగా, నటన పరంగానూ. ఈ సంక్రాంతిని రమణగాడితో కలిసి థియేటర్లలో ఆనందంగా జరుపుకుందాం’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చినబాబు, నాగవంశీల సక్సెస్ జర్నీ అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఏదో మాయ చేస్తారు.. ఈ సినిమాలో కూడా చేశారు. ‘గుంటూరు కారం’తో మహేశ్‌గారు కలెక్షన్ల తాట తీస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా రాబోతోంది’’ అన్నారు. -
Sree Leela : ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల (ఫొటోలు)
-
'గుంటూరు కారం' సినిమాలో ఆ మేజిక్ జరిగింది: హీరో మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు. అయితే అందరూ ఎదురుచూసే డైరెక్టర్ త్రివిక్రమ్ సింపుల్ స్పీచుతో ముగించేశాడు. హీరో మహేశ్ మాత్రం ఊహించని విధంగా ఎమోషనల్ అయ్యాడు. అభిమానులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేయగా ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) 'త్రివికమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. నాకు ఫ్యామిలీ మెంబర్ లాంటోళ్లు. నేను ఆయన గురించి బయట ఎప్పుడూ మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ ఏం మాట్లాడుతాం. గత రెండేళ్ల నుంచి ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ అస్సలు మర్చిపోలేను. మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా నాకు వింతగానే ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలా మాట్లాడుకోం. ఆయన (త్రివిక్రమ్) సినిమాల్లో నేను ఎప్పుడు చేసినా సరే ఓ మేజిక్ జరుగుతుంది. అది నాకు తెలీదు. 'అతడు' నుంచి మా జర్నీ మొదలైంది. 'ఖలేజా'లో ఒక మేజిక్ జరిగింది. అదే మేజిక్ ఇప్పుడు 'గుంటూరు కారం'లోనూ జరిగింది. మీరు ఓ కొత్త మహేశ్ బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే(త్రివిక్రమ్) కారణం. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) 'తెలుగమ్మాయి చాలారోజుల తర్వాత స్టార్ హీరోయిన్ కావడం చాలా బాగుంది. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం వామ్మో! ఇదేం డ్యాన్స్!' అని శ్రీలీలని ఉద్దేశించి మహేశ్ మాట్లాడాడు. అలానే తమన్ గురించి చెబుతూ.. ''కుర్చీ మడతపెట్టి' పాట చేస్తావా? అని తమన్‌ని అడిగితే వెంటనే ఒప్పుకొన్నాడు. రేపు మీరు ఆ పాట చూడండి థియేటర్లు బద్దలైపోతాయి' అని మహేశ్ చెప్పాడు. ఇక చివర్లో కాస్త భావోద్వేగానికి గురైన మహేశ్ అభిమానులని ఉద్దేశిస్తూ.. 'మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలీదు. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజైతే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం. బాగా గట్టిగా. ఇక నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్నీ మీ ఆశీస్సులు అభిమానం నా దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను' అని చెప్పి స్పీచ్ ముగించేశాడు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!) -
Guntur Kaaram Pre Release Event : గ్రాండ్‌గా ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
సంక్రాంతి సినిమాల గొడవ.. ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏం చూడాలనేది ప్రేక్షకులు డిసైడ్ అవుతారు. ప్రతిసారి ఇదే జరిగేది. కానీ ఈసారి మాత్రం అంతకు మించి అనేలా పరిస్థితి తయారైంది. కొందరు నిర్మాతలు కావాలనే కొన్ని సినిమాల్ని తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో నానా హంగామా నడించింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇక లాభం లేదనుకుని స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ ఈ గొడవపై స్పందించింది. కీలక ప్రకటన రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) 'సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు థియేటర్ల వివాదాలపై తెలుగు చిత్రాలకి సంబంధించి మా మూడు సంస్థలు 15 రోజుల క్రితం ఓ మీటింగ్ పెట్టి సంక్రాంతి బరిలో ఉన్న ఐదుగురు ప్రొడ్యూసర్లని పిలిచి గ్రౌండ్ రియాలిటీ వివరించి సహకరించమని కోరాం. సంక్రాంతి బరిలో ప్రతి ఏటా సినిమాల పోటీ ఉంటుంది. అలానే ఈసారి ఐదు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. హనుమాన్, ఈగల్, సైంధవ్, గుంటూరు కారం, నా సామి రంగ. ఛాంబర్ వినతిని మన్నించి సంక్రాంతి బరి నుంచి 'ఈగల్' రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9కి మార్చారు' 'సంక్రాంతి అంటే సినిమాల మధ్య మంచి పోటీ వాతావరణం ఉంటుంది. తెలుగు సినిమాకి సంబంధించి మా మూడు సంస్థలు కలిపి ఏ హీరోకి ప్రొడ్యూసర్ కి దర్శకుడు కి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపిస్తున్నాం. కానీ కొన్ని సైట్ల వాళ్లు ఫ్యాన్స్, హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజాన్ని తెలుసుకుని వార్తలని రాయాల్సిందిగా కోరుతున్నాం. ఇకనుంచి సోషల్ మీడియా, ఇతర మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టే రాతలు రాస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటాం' అని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటనలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
తెలంగాణలో 'గుంటూరు కారం' టికెట్ రేట్స్ పెంపు.. బెన్ఫిట్ షోలు అలా
సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు.. చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇలాంటి టైంలో మూవీ టీమ్‌కి సంతోషపరిచే విషయం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చింది. టికెట్ల రేట్ల పెంపుతో పాటు బెన్ఫిట్ షోలకు అనుమతి లభించింది. కొన్నిరోజుల ముందు 'గుంటూరు కారం' టీమ్.. తెలంగాణ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా పర్మిషన్ లభించింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి దక్కింది. అంటే సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.250, మల్టీప్లెక్స్‌ల్లో రూ.410 అనమాట. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) అలానే 12న అర్థరాత్రి ఒంటి గంట నుంచి రాష్ట్రంలో దాదాపు 23 చోట్ల ప్రదర్శనకు అనుమతి ఇచ్చినట్లు రివీల్ అయింది. అలానే తొలిరోజు ఆరో షో ప్రదర్శనకు కూడా పర్మిషన్ దొరికింది. అలానే ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి లభించింది. అయితే సాధారణ ప్రేక్షకుడికి ఈ టికెట్స్ రేట్లు అవి ఎక్కువగా అనిపించొచ్చు. కానీ డై హార్డ్ అభిమానులకు మాత్రం అర్థరాత్రి నుంచి షోలు అంటే పండగ చేసుకుంటారు. టికెట్స్ రేట్లు అనేవి పెద్దగా పట్టించుకోరు. ఇకపోతే మహేశ్ ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) -
కమల్ హాసన్, మణిరత్నం కాంబో.. టైటిల్ ఇదే..!
-
గుంటూరు కారం లో ఘాటు కన్పిస్తుందా..?
-
గుంటూరు కారంతో ఆ రికార్డులన్నీ మడతపెట్టేసిన మహేశ్ బాబు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొడుతోంది. సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఊచకోత సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్ రికార్డులకెక్కింది. ఇదివరకు ఈ రికార్డు సలార్ పేరిట ఉంది. ఇటీవల రీలీజైన సలార్ ట్రైలర్‌కు 24 గంటల్లో 32.50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రీజనల్ సినిమాతోనే మహేశ్ ఇలా రికార్డులు క్రియేట్ చేస్తే.. రేపొద్దున రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా రేంజిలోకి ఎంట్రీ ఇచ్చాక ఇండస్ట్రీలో ఆయన ఊచకోత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ముగ్గురు ఫ్యాన్స్ మృతి.. వారి కుటుంబాలకు అండగా నిలిచిన హీరో యశ్) ఆదివారం (జనవరి 7) రాత్రి 9.09 నిమిషాలకు విడుదలైన ఈ చిత్ర టైలర్ సరిగ్గా 24 గంటల్లో దాదాపు 40 మిలియన్ల మంది వీక్షించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రం తర్వాత సలార్ 24 గంటల్లో 32.58 M , లియో 31.91M, బీస్ట్ 29.8M, సర్కారు వారి పాట 26.77 M, తెగింపు (అజిత్) 25 M రాధేశ్యామ్ 23.3 M, ఆచార్య 21.86M, బాహుబలి 21.81M, RRR 20.45 M, KGF- 2 19.38 M, బ్రో ది అవతార్ 19.25 M వ్యూస్ సాధించిన జాబితాలో ఉన్నాయి. నేడు గుంటూరులో ప్రీ రిలీజ్: గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగప్రదేశంలో నేడు (జనవరి 9) సాయింత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జనవరి 6న హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడకుండా ఉండేందుకు ఏపీలోని గూంటూరులో ఈవెంట్ ఉంటుందని మూవీ మేకర్స్ మరో డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షీ చౌదరి, రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరామ్ ప్రధానంగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి 'గుంటూరు కారం' రానుంది. -
సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!
తెలుగు ప్రజలు ప్రస్తుతం సంక్రాంతి మూడ్‌లో ఉన్నారు. కొత్త బట్టలు కొనాలి, ఈ వీకెండ్ వచ్చే కొత్త సినిమాలకు వెళ్లాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఇండస్ట్రీలో థియేటర్లలో సమస్య అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. టాలీవుడ్లో ప్రస్తుత పరిస్థితులకు నిర్మాత దిల్‌రాజు ప్రధాన కారణమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇలాంటి టైంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. దిల్‌రాజ్ ఏం మాట్లాడారు? తాజాగా హైదారాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లోని జరిగిన ఓ ప్రెస్ మీట్లో మాట్లాడిన దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. 'ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. అప్పుడు ఏదో ఓ రకంగా నాపై ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు. 'హనుమాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి నా గురించి మాట్లాడిన మాటలని కొన్ని వెబ్సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా' అని చెప్పారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) 'వ్యాపార పరంగా వచ్చే విమర్శలని ఆయా వెబ్‌సైట్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. తమిళ సినిమాను నేనే వాయిదా వేశాను. హను-మాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు మాత్రం థియేటర్లు దొరకడం లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ వైబ్సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తా' అని దిల్‌రాజు హెచ్చరించారు. అయితే దిల్‌రాజు ఇలా కామెంట్స్ చేయడం పక్కనబెడితే సోషల్ మీడియాలో మాత్రం ఈయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకంటే 'హనుమాన్' తప్పితే మిగతా మూడు సినిమాలు అంటే 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' చిత్రాల్ని ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనే న్యూస్ బయటకు రావడమే దీనికి కారణం అనిపిస్తోంది. (ఇదీ చదవండి: బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) -
తెలంగాణలో నో పర్మిషన్.. ఏపీకి షిఫ్ట్ అయిన 'గుంటూరు కారం' ఈవెంట్
ఈ సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో హిట్ పెంచేందుకు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు బరిలోకి దిగుతున్నాడు. త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12న విడుదలకు రెడీగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. మంచి రెస్పాన్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ట్రైలర్‌తో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్ పడటంతో కాస్త నిరాశకు గురయ్యరనేది వాస్తవం గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 6న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు ఏర్పాట్లు కూడా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో రెడీ చేశారు. చివరి క్షణంలో భద్రతా సమస్యల కారణంగా తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ను రద్దు చేసింది. దీంతో మరో తేదీలో ఏర్పాట్లు చేసుకునేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. దీంతో రేపు (జనవరి 9న) గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో జరగనుందని చిత్ర నిర్మాత నాగవంశీ అఫీషియల్‌గా ప్రకటించారు. గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగప్రదేశంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి లభించడంతో వారు అక్కడ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. అందుకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనవరి 9న సాయింత్రం 5 గంటల నుంచి గుంటూరులో మహేశ్ ఫ్యాన్స్ జాతర గ్యారెంటీ. ఈ వేడుకలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి కూడా ఏపీకి భారీగా ఫ్యాన్స్ రానున్నారు. See you all tomorrow 💥#GunturKaaramPreReleaseEvent https://t.co/Jj8XsMAiET — Naga Vamsi (@vamsi84) January 8, 2024 We've been waiting for the final confirmation regarding permissions for the #GunturKaaram Pre Release Event. We request all the Superfans to wait patiently, until we make an announcement about the event officially from @haarikahassine Hope you all understand and cooperate! — Naga Vamsi (@vamsi84) January 8, 2024 -
మహేశ్ బాబు ‘గుంటూరు కారం, HD మూవీ స్టిల్స్
-
హనుమాన్, గుంటూరు కారం కాంట్రవర్సీపై చిరంజీవి కామెంట్స్
సంక్రాంతి అంటేనే సినిమాలకు చాలా మంచి సీజన్. చిన్న సినిమా అయినా సరే కథ బాగుంటే హిట్ అవుతుంది. కంటెంట్‌లో సత్తా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలతో పాటు ‘హను–మాన్’ కూడా విడుదల అవుతుంది. కానీ హనుమాన్ సినిమాను చిన్న ప్రాజెక్ట్ అని మరో తేదీలో విడుదల చేసుకోవచ్చు కదా అంటూ చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారని గతంలో నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చిరంజీవి వ్యాఖ్యానించారు. 👉: ‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్యఅతిథిగా చిరంజీవి (ఫొటోలు) జనవరి 12న గుంటూరు కారం, హను-మాన్ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. తాజాగా జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగస్టార్ చిరంజీవి గుంటూరు కారం కాంట్రవర్సీపై పరోక్షంగా కామెంట్లు చేశారు. హనుమాన్ చిత్రంలో హీరోగా నటించిన తేజ సజ్జ చాలా కష్టపడ్డాడు. ఈ సంక్రాంతి సీజన్‌కు ఎన్ని సినిమాలు వచ్చినా సరే.. కంటెంట్‌లో సత్తా ఉండి.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారని చిరంజీవి అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కరలేదని ఆయన తెలిపారు. అయితే ఇదీ కాస్త పరీక్షా కాలం అనుకోవచ్చు.. అందరూ అనుకున్నట్లుగా హనుమాన్ చిత్రానికి థియేటర్లు దొరకకపోవచ్చు.. సినిమాలో కంటెంట్ ఉంటే సెకండ్ షో చూస్తారు.. అదీ లేకపోతే మరో వారం తర్వాత అయినా చూస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలతో పాటు హను–మాన్ కూడా బాగా ఆడాలి.. ఆడుతుందని చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలని ఆయన కోరారు. '2017 సంక్రాంతి సమయంలో కూడా ఇలాంటి సందర్భమే వచ్చింది. అన్నీ పెద్ద సినిమాలు ఉన్నాయి.. అప్పుడు రేసులోకి శతమానం భవతి చిన్న సినిమాను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఆ సమయంలో నేను రిస్క్ ఎందుకని దిల్ రాజుకు చెప్పాను.. అందుకు ఆయన ఒకటే మాట అన్నాడు సినిమా బాగుంది.. అందరికీ నచ్చుతుందని విడుదల చేశాడు.. అనుకున్నట్లే ఆ సమయంలో శతమానం భవతి సూపర్ హిట్ అయింది. ఈ ఏడాది కూడా చిన్న సినిమాగా వస్తున్న హనుమాన్ కూడా సూపర్ హిట్ అవుతుంది.' అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. -
‘గుంటూరు కారం’ ట్రైలర్‌తో హార్ట్ బీట్ పెంచిన మహేశ్ బాబు
‘‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథలా వదిలేసారని అంటున్నారు.. దానికి మీరు ఏం చెబుతారు..’ (రమ్యకృష్ణకు ఎదురయ్యే ప్రశ్న)’ అనే డైలాగ్‌తో ‘గుంటూరు కారం’ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘చూడంగానే మజా వచ్చిందా’, ‘హార్ట్ బీట్ పెరిగిందా’, ‘ఈల వేయాలనిపించిందా’, ‘ఆట చూస్తావా..! అంటూ మహేశ్ బాబు చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, జయరాం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. -
గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్
-
Guntur Kaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ వచ్చేసింది
ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నా.. అందరి కన్ను గుంటూరు కారం చిత్రం మీదే ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న విడుదల కానున్న గుంటూరు కారం చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్‌తో ఆ అంచనాలను త్రివిక్రమ్ మరింతగా పెంచేశాడు. సినిమాలో మాస్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సన్నివేశాలు ఉన్నాయి. ట్రైలర్ విడదలకు ముందే గుంటూరు కారం ట్యాగ్‌ను ఆయన ఫ్యాన్స్ ట్రెండింగ్‌లో పెట్టేశారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హైదరబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఫ్యాన్స్ కొంతమేరకు నిరాశపడ్డారు. అదే వేడుకలో ట్రైలర్‌ను కూడా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ అనుమతి రాకపోవడంతో తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. సినిమా కలెక్షన్స్‌పై కూడా ఇప్పటికే నిర్మాత నాగవంశీ వైరల్ కామెంట్ చేశారు. అన్ని సెంటర్స్‌లలో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్‌కు దగ్గరగా ఉంటామని ఆయన పేర్కొన్నాడు. నైజాంలో ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికే భారీగా థియేటర్స్ దక్కాయి. రీజనల్ సినిమాతో మహేష్ బాబు వంద కోట్ల ఓపెనింగ్స్ రాబడతాడు అంటూ ఆయిన ఫ్యాన్స్ ఫుల్ క్లారటీతో ఉన్నారు .అమెరికాలో గుంటూరు కారం సినిమాకి 5408 ప్రీమియర్ షోస్ కేటాయించారు.RRR తర్వాత ఆ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేది గుంటూరు కారం సినిమానే. -
థియేటర్ వద్ద పరిస్థితి ఇదీ అంటూ వీడియో షేర్ చేసిన నమ్రత
త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన వరకు భారీగా బజ్ క్రియేట్ అయింది. రికార్డు స్థాయిలో విడుదలకు రెడీగా ఉన్న గుంటూరు కారం ట్రైలర్ మరికొంత సమయంలో విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ లక్షల వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని గంటల్లో ట్రైలర్ విడుదల కానున్నడంతో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఒక ఫ్యాన్ బేస్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో నేడు గుంటూరు కారం ట్రైలర్ విడుదల కానుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు అక్కడ ఏర్పాటు చేశారు. దారి వెంట పోస్టర్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమన్ మ్యూజిక్కు స్టెప్పులేస్తూ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సుదర్శన్ థియేటర్ వద్ద మహేశ్ బాబు భారీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ హంగామా మొదలైంది. జనవరి 12న గుంటూరు కారం సినిమా చూసేందుకు వారందరూ సుదర్శన్ థియేటర్‌కు వస్తున్నట్లు నమ్రత తెలిపారు. గుంటూరు కారం చిత్రం నుంచి ఇటీవల వచ్చిన 'కుర్చీని మడతపెట్టి' సాంగ్ విపరీతంగా పాపులర్ అయింది. ఈ పాటలో మహేష్ బాబు, శ్రీలీల ఊర నాటు స్టెప్లు అదిరిపోయాయి. థియేటర్లో ఈ పాట చూస్తే సూపర్ స్టార్ అభిమానులకు పూనకాలే.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
గుంటూరు కారం మూవీ స్పెషల్ వీడియో
-
రిలీజ్‌కి ముందే మహేశ్ 'గుంటూరు కారం' సినిమా రికార్డ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు దాదాపు ఏడాదిన్నర తర్వాత థియేటర్లలోకి రాబోతున్నాడు. మాస్ ఎలిమెంట్స్‌తో తీసిన 'గుంటూరు కారం'.. జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఓవైపు హంగామా నడుస్తుంటే.. మరోవైపు కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మహేశ్ ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. మహేశ్ బాబుకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల్లో అందరి దృష్టి 'గుంటూరు కారం' పైనే ఉంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో అది కూడా మాస్ ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో రిలీజ్ విషయం వేరే లెవల్లో ప్లాన్ చేశారు. (ఇదీ చదవండి: మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?) అమెరికాలో 5408కి పైగా ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ విషయంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్-3800కి పైగా, సలార్-2450కి పైగా షోలు వేశారు. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే.. తెలుగు మూవీకి ఈ రేంజు ప్రీమియర్ షోలు అంటే సరికొత్త రికార్డే. దీనిబట్టి చూస్తుంటే విడుదలకు ముందే హాఫ్ మిలియన్ డాలర్స్.. ముందస్తు బుకింగ్స్ రూపంలో వచ్చేసినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో 5-6 మిలియన్ డాలర్స్ వసూళ్లు రావడం గ్యారంటీ అనిపిస్తోంది. జనవరి 12న థియేటర్లలోకి వచ్చే 'గుంటూరు కారం'లో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని తల్లి సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసినట్లు తెలుస్తోంది. తమన్ సంగీతమందించాడు. ఇకపోతే ఈ మూవీతో పాటు 'హను-మాన్' అదే రోజు రిలీజ్ కానుండటం విశేషం. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) -
విశాఖ గాజువాకలోని మోహిని థియేటర్ లో భారీ చోరీ
-
రేస్ నుంచి తప్పుకున్న ఈగల్
-
మహేష్ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ బిగ్ సర్ప్రైజ్
-
మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా మరో వివాదంలో చిక్కుకునేలా కనిపిస్తుంది. అవును మీరు సరిగానే విన్నారు. ఈ మూవీ కథని ఓ నవల నుంచి కాపీ కొట్టారనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో విడుదలకు ముందే మరోసారి ఈ మూవీ చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? 'గుంటూరు కారం' రిలీజ్ సంగతేంటి? మహేశ్-త్రివిక్రమ్ అంటే బెస్ట్ కాంబో అని చెప్పొచ్చు. వీళ్లిద్దరూ కలిసి చేసిన 'అతడు', 'ఖలేజా'.. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఆ తర్వాత మాత్రం కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. అలా ఇప్పుడు 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే రెండేళ్ల క్రితమే ఈ సినిమా మొదలైనప్పటికీ.. హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్స్, పాటలపై.. ఇలా చాలా మార్పులతో ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధమైంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న 'గుంటూరు కారం' సెన్సార్.. తాజాగా పూర్తయింది. సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని అన్నారు. అదే టైంలో ఈ చిత్రానికి.. యద్దనపూడి సులోచనరాణి 'కీర్తి కిరీటాలు' అనే నవలకు దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది థియేటర్లలోకి మూవీ వస్తే గానీ తెలియదు. ఇకపోతే గతంలోనూ త్రివిక్రమ్ సినిమాలపై ఇలా కాపీ కామెంట్స్ వినిపించాయి. 'అఆ' సినిమాని కూడా యద్దనపూడి 'మీనా' నవల ఆధారంగా తీశారని అన్నారు. ఆ వివాదం ఆ తర్వాత సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మహేశ్ సినిమాకు 'కీర్తి కిరీటాలు' నవలకు సంబంధం ఉందని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం రిలీజ్ తర్వాత వివాదం లాంటిది ఏమైనా జరగొచ్చు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే 'గుంటూరు కారం' రిలీజ్ కావాల్సిందే. (ఇదీ చదవండి: గురూజీ త్రివిక్రమ్ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్ పూనమ్ కౌర్) -
గురూజీ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే బొమ్మ బ్లాక్‌బస్టరే! వీరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి ఆదరణ పొందాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో ఓ సినిమా వస్తోంది. అదే గుంటూరు కారం.. రిలీజ్‌కు ముందే మంటెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఆ విషయంలో సమర్థుడు అయితే ఈ సినిమా కథ త్రివిక్రమ్ ఒరిజినల్‌గా రాసుకోలేదని, యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను కాపీ కొట్టాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. 'ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తన తప్పుడు పనులు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవాడు. కొందరు గుడ్డిగా ఆయన్ను నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం బాగా సాయం చేసింది. అదెందుకో నాకిప్పటికీ అర్థం కాదు మరి' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చివరగా సినిమాలో కనిపించింది అప్పుడే! ఈ ట్వీట్‌కు గురూజీ థింగ్స్ అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఇకపోతే మాయాజాలం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది పూనమ్ కౌర్. ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం ఇలా అనేక చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. చదవండి: ఫుడ్ పాయిజన్ తర్వాతే ఇలా.. క్రికెట్ ఆడేటప్పుడు అలా అవడంతో -
సంక్రాంతి పోటీని తట్టుకునేందుకు 'హనుమాన్' ప్లాన్ అదుర్స్
ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. విడుదల తేదీలు దగ్గరపడుతుండటంతో ప్రీ రిలీజ్ కార్యక్రమాలకు చిత్ర యూనిట్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 'గుంటూరు కారం' ఈవెంట్ కోసం జనవరి 6వ తేదీని లాక్ చేసుకుంది. హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున ఈ వేడుక జరగనుంది. తాజాగా హనుమాన్ చిత్రం కూడా 7న ఎన్ కన్వెన్షన్ లో సెలబ్రేషన్‌కు రెడీ అవుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నారు. ఇదే విషయాన్ని హీరో తేజ సజ్జ తెలిపాడు. హనుమాన్ కోసం గాడ్‌ఫాదర్ ఉన్నాడు అంటూ ఆయన తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండటంతో సినిమాకు మరింత బజ్ క్రియేటే చేసేందుకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హనుమాన్ చిత్రంలో చిరంజీవి కూడా నటించారని వార్తలు వచ్చాయి. ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళు అచ్చం చిరుని పోలి ఉన్నాయని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం ఈవెంట్ కోసం స్వయంగా ఆయనే రావడం చూస్తే ఏదో లింక్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. మెగాస్టార్‌కు హనుమంతుడు అంటే ఎనలేని భక్తి కాబట్టి ఇలాంటి చిత్రంలో ఆయన కొంతసేపు కనిపించడమో లేదా గొంతు వినిపించడమో ఉంటుందని భావిస్తున్నారు. హనుమాన్ ప్లాన్ అదుర్స్ తేజ సజ్జ చైల్డ్ యాక్టర్ నుంచి హీరోగా ఎదిగాడు. ఇప్పటికే ఆయన పలు సినిమాలతో తనలో సత్తా ఉందని నిరూపించుకున్నాడు. అందుకు ఆయన నటన మీద నమ్మకంతో హనుమాన్ చిత్రాన్ని భారీ డడ్జెట్తో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై భారీగా బజ్ క్రియేట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇలాంటి సమయంలో సంక్రాంతి సినిమాల తాకిడిని ఈ ఫాంటసీ మూవీ ఎలా తట్టుకుంటుందాని. దాని కోసమే ఒక మంచి వ్యూహం సిద్ధం చేసినట్టు వినిపిస్తోంది. గుంటూరు కారం, హనుమాన్ రెండు చిత్రాలు జనవరి 12న విడుదల కానున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికి భారీగా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో హనుమాన్ సినిమాకు ఎర్లీ ప్రీమియర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే జనవరి 11న రాత్రే భారీగా షోలు ఉండేలా ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే యూఎస్‌లో జనవరి 11 నుంచి ప్రీమియర్స్ ఉన్నట్లు ప్రకటించింది. దీంతో కొంత వరకు కలెక్షన్స్ పెంచుకోవచ్చని హనుమాన్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమాకు హిట్ టాక్ వస్తే మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ పెంచుకోవచ్చని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. My #GodFather for our #HanuMan ❤️@PrasanthVarma @Primeshowtweets pic.twitter.com/9dyebsLNs5 — Teja Sajja (@tejasajja123) January 4, 2024 -
పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేస్తోన్న సీనియర్స్
-
గుంటూరు కారంతో పోటీ.. హనుమాన్ హీరో ట్వీట్ వైరల్
ఈ సంక్రాంతికి సినిమా అభిమానులకు పెద్ద పండుగ ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా భారీగానే సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా.. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రవిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. అదే రోజున తేజ సజ్జ నటించిన 'హనుమాన్' కూడా విడుదల కానుంది. జనవరి 12న ఏకంగా రెండు సినిమాలు ఉండటంతో ఈ పోటీ నుంచి ఎవరైనా ఒకరు తప్పుకొని మరోతేదికి వస్తారనుకుంటే ఎవరూ తగ్గలేదు. ఫైనల్‌గా గుంటూరు కారం,హనుమాన్ రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల అవుతున్నాయి. దీంతో పలు వెబ్సైట్లు మహేష్‌కు పోటీగా తేజ సజ్జ దిగుతున్నాడు అంటూ కొన్ని పోస్టులు పెట్టాయి. వాస్తవానికి మహేష్ లాంటి సూపర్ స్టార్‌కు తేజ సజ్జ ఎలా పోటీ అవుతాడు..? మహేష్‌కు మాస్,ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి ఇంత వరకు పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా రాలేదు.. అయినా పాన్ ఇండియా హీరోల్లో మహేష్ టాప్-10 లో ఉండటం విశేషం. అయితే తేజ సజ్జ ఒక ట్వీట్ చేశాడు. 'సూపర్‌స్టార్‌తో పోటీ ఏంటి సర్.. ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా' అని ఒక స్క్రీన్ షాట్‌కు రిప్లై ఇచ్చాడు. వాస్తవానికి 2000 సంవత్సరంలో మహేష్ బాబుతో 'యువరాజు' అనే సినిమాలో నటించాడు తేజ సజ్జ.. అందులో మహేష్‌కు కుమారుడిగా ఆయన నటించిన విషయం తెలిసిందే. సుమారు 24 ఏళ్ల తర్వాత ఇలా ఇద్దరీ సినిమాలు ఒకేరోజు విడుదల కావడం మరింత విశేషం. #SuperStar tho poti enti sir 🤦♂️🙏 అయన తో పోటీగ కాదు సర్ అయన తో పాటుగ https://t.co/EaSpkdjkp8 — Teja Sajja (@tejasajja123) January 2, 2024 -
స్పెషల్ ఫోటోను షేర్ చేసిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో కలర్‌ఫుల్ ఫోటోను షేర్ చేశారు. 2024 కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబంతో సహా దుబాయ్‌లో జరుపుకున్నారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ.. తాజాగా తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు పోస్టర్‌తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ) మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నమ్రతతో మహేష్ ఉన్న ఆ ఫోటో ఎంతో ఆప్యాయతతో కూడుకొని ఉంది. ఆ చిత్రంలో నమ్రత ఎంతో సంతోషంగా మహేష్ భుజంపై తన తలను ఉంచింది. ప్రేమతో నిండిన ఆ చిత్రంతో పాటుగా 2024 సంవత్సరానికి గాను మహేష్ ఆకాంక్షలను ప్రతిబింబించే శీర్షిక ఉంది. 'సహజత్వం. నవ్వు. ప్రేమ. సాహసం. ఎదుగుదల. #హ్యాపీ న్యూ ఇయర్ #2024 ❤️' అని మహేష్ ఆ ఫోటోతో పాటు షేర్ చేశారు. అందుకు నమ్రత కూడా వెంటనే తన ప్రేమను ప్రతిస్పందిస్తూ, 'లవ్ యు టు ది మూన్ అండ్ బ్యాక్ ♥️♥️♥️♥️ ఎప్పటికీ♥️♥️' అని తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ఆరాధించే జంటలలో మహేష్- నమ్రత ముందు వరుసలో ఉంటారు. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ అనంతం. దీంతో మహేష్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులు ఇన్‌స్టాలోకి చేరిపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్‌రాజ్, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
సలార్ రూట్ లోనే గుంటూరు కారం..కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ !
-
మహేష్ బాబుపై ఆశలు పెట్టుకున్న శ్రీలీల !
-
'గుంటూరు కారం' విషయంలో ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్‌గా చెప్పిన నాగవంశీ
ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. సుమారు 8 సినిమాలు రేసులో ఉన్నాయి. ఇందులో కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా.. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రవిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న గుంటూరు కారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ‘గుంటూరు కారం’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రతి ఏరియాలో రాజమోళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తామని ఆ ఇంటర్వ్యూ ద్వారా నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం సినిమా కంటెంట్ విషయంలో తాను ఎంతో నమ్మకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అంటే RRR కలెక్షన్స్‌ను బీట్ చేయలేకపోయిన వాటికి దగ్గరగా గుంటూరు కారం కలెక్షన్స్ ఉంటాయని పరోక్షంగా ఆయన ఇలా చెప్పారు. ఆ వీడియోతో పాటు ఆయన ఇలా తెలిపారు. 'డియర్ సూపర్ ఫ్యాన్స్.. మీకు మళ్లీ చెబుతున్నా.. మేము అదే మాట మీద ఉన్నాం. 'గుంటూరు కారం' చిత్రాన్ని భారీగా విడుదల చేస్తాం. అంతేకాకుండా ఎక్కువ థియేటర్స్‌లలో రికార్డ్ రేంజ్లో విడుదల ఉంటుంది. రిలీజ్ విషయం మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే' అని వంశీ తెలిపారు. తాజాగా 'కుర్చీ మడతపెట్టి' అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో ఈ పాట భారీగా వైరల్ అవుతుంది. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉన్న ఈ సాంగ్‌లో మహేశ్, శ్రీలీల డ్యాన్స్‌తో దుమ్ములేపారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పలువురు అభిమానులు వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో #WeDemandRecordReleaseForGK అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ తాజాగా ఈ ట్వీట్ చేయడం విశేషం. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. Dear superfans... Meeku Malli strong ga chebutunna, Memu adhe maata meeda unnamu.. #GunturKaaram ki record release in record number of theatres lo untundhi. Release maaku odileyandi, Celebrations ye mathram thaggakunda chuskune badhyata meedi 😎🔥 pic.twitter.com/YnATOeMZh1 — Naga Vamsi (@vamsi84) December 31, 2023 -
'గుంటూరు కారం' సాంగ్.. సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోన్న సాంగ్ ఒకటే. అదేనండి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలోని పాట. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన 'కుర్చినీ మడతబెట్టి' అనే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రిన్స్ అభిమానులతో పాటు సినీ ప్రియులను ఊపేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఆడియన్స్ నుంచి ఈ సాంగ్‌కు విశేషణమైన ఆదరణ లభిస్తోంది. ఈ పాటకు తమన్ బాణీలు అందించారు. టాలీవుడ్లో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. తాజాగా మరోసారి తమన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ పాటలోని ఓ ట్యూన్‌ను కాపీ కొట్టారంటూ తెగ వైరల్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలోని 'పేట్రాయి సామీదేవుడా' అనే సాంగ్ ట్యూన్ కాపీ చేశారంటూ పెద్దఎత్తున వైరలవుతోంది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పెళ్లిసందడి భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.మీనాక్షీ చౌదరి, ప్రకాశ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. Blockbuster re-mix 🧐pic.twitter.com/WwN97I4SDc#GunturuKaaram — BiggBossTelugu7 (@TeluguBigg) December 30, 2023 Blockbuster re-mix 🧐pic.twitter.com/WwN97I4SDc#GunturuKaaram — BiggBossTelugu7 (@TeluguBigg) December 30, 2023 -
కుర్చీని మడతపెట్టి సాంగ్ స్టిల్స్ (ఫొటోలు)
-
గుంటూరు కారం కుర్చీని మడతపెట్టి ఫుల్ సాంగ్ వచ్చేసింది
-
Guntur Kaaram Songs: ‘కుర్చీని మడతపెట్టి..’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరుకారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.మీనాక్షీ చౌదరి, ప్రకాశ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. (చదవండి: 'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?) తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘కుర్చీని మడతపెట్టి..’ అనే మాస్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ పాట ప్రోమోని నిన్న విడుదల చేయగా..ఎంత వైరల్ అయిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అయిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే పద ప్రయోగాన్ని వాడుకొని తమన్ బాణీ కట్టాడు. రామ జోగయ్యశాస్త్రి సాహిత్యం అదించారు. ప్రముఖ సింగర్స్ సాహితి చాగంటి, శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. ఈ పాటలో అదిరిపోయే బీట్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మనం వినే జానపద శైలి సాహిత్యం ఉన్నాయి. ‘రాజమండ్రి రాగ మంజరి... మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి" మరియు "తూనీగ నడుములోన తూటాలెట్టి ... తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి... మగజాతినట్టా మడతపెట్టి..’ వంటి పదాలు మరియు పదబంధాలు 80ల నాటి సూపర్‌స్టార్ కృష్ణ గారి యొక్క క్లాసిక్ మాస్ చిత్రాలను గుర్తు చేస్తున్నాయి. పాట మధ్యలో 'ఏంది అట్టా సూత్తన్నావ్. ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్. రాసుకోండి.... మడతెట్టి పడేయండి' అంటూ మహేశ్‌బాబు డైలాగ్ చెప్పడం విశేషం. మహేశ్‌బాబు, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదిరిపోయిన ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి. -
సంక్రాంతి ఫైట్.. మహేశ్ 'గుంటూరు కారం' సినిమాకు కొత్త టెన్షన్!
సాధారణంగా పెద్ద హీరో సినిమాలు వస్తున్నాయంటే హడావుడి ఉంటుంది. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా రిలీజ్ విషయంలో ముందునుంచే కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు. వేరే ఏ సినిమాలు ఆ రోజు రిలీజ్ కాకుండా చూసుకుంటారు. తద్వారా వసూళ్లు ఎక్కువ వస్తాయి. అయితే ఈసారి మహేశ్ మూవీకి ఈ విషయంలో టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి! సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త మూవీ 'గుంటూరు కారం'. దర్శకుడు త్రివిక్రమ్ కావడం, మాస్ జానర్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దీనికి తోడు సంక్రాంతి బరిలో ఉండటం.. టాక్‌తోపాటు కలెక్షన్స్‌కి చాలా ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) జనవరి 12న 'గుంటూరు కారం' రిలీజ్ కానుంది. అదే రోజు తెలుగు స్ట్రెయిట్ మూవీ 'హనుమాన్' కూడా థియేటర్లలోకి రానుంది. దైవభక్తి నేపథ్యంలో తీసిన ఈ చిత్రం.. మహేశ్ మూవీతో పోటీలో ఉంటుందా? తప్పుకొంటుందా? అనుకున్నారు. కానీ కన్ఫర్మ్గా వస్తామని పోస్టర్స్ రిలీజ్ చేయడంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఖరారైపోయింది. వీటితో పాటు అదే రోజున మరో మూడు క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో తమిళ స్టార్ హీరో ధనుష్ చేసిన యాక్షన్ మూవీ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయాలన్', విజయ్ సేతుపతి 'మేరీ క్రిస్మస్' కూడా జనవరి 12నే రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వీటిలో ఏదైనా వాయిదా పడితే చెప్పలేం కానీ ఇలా ఒకరోజు ఐదు బడా సినిమాలు రిలీజ్ కావడం వల్ల అందరికీ వసూళ్ల పరంగా దెబ్బపడే ఛాన్సుంది. మరీ ముఖ్యంగా మహేశ్ సినిమాకు అనుకున్న దానికంటే తక్కువ వసూళ్లే రావొచ్చు. అయితే ఈ ఐదింటి రిలీజ్ విషయంలో ఏవైనా తప్పుకొంటాయా? లేదా అదే రోజు రిలీజ్ అవుతాయా అనేది చూడాలి? (ఇదీ చదవండి: 'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?) -
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ రిలీఫ్..!
-
మహేష్ బాబు సినిమాలో ఈ పాటలు ఏంటి ..?
-
'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'గుంటూరు కారం' నుంచి తాజాగా ఓ మాస్ పాట ప్రోమోని రిలీజ్ చేశారు. అభిమానులకు సాంగ్ నచ్చడం సంగతి పక్కనబెడితే ఊహించని విధంగా ఈ గీతం.. కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది. అసలు ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేశ్ బాబు.. ఇలాంటి పాటని ఎలా అంగీకరించాడా అని మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో పాట ఓనర్ కుర్చీ తాత గురించి, పాట కోసం అతడికిచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. మహేశ్ బాబు కొత్త సినిమా 'గుంటూరు కారం'. దర్శకుడు త్రివిక్రమ్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు పాటలు రాగా అందులో 'దమ్ మసాలా' శ్రోతల్ని ఆకట్టుకోగా.. 'ఓ మై బేబీ' పాటపై ఓ రేంజులో ట్రోలింగ్ జరిగింది. తాజాగా మాస్ గీతం అని చెప్పి 'కుర్చీ మడతపెట్టి' అని సాగే ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్-శ్రీలీల స్టెప్పులు బాగానే వేసినప్పటికీ లిరిక్స్‌పై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?) హైదరాబాద్‌లోని కాలా పాషా అనే ఓ తాత.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెబుతూ 'కుర్చీ మడతపెట్టి..' అని బూతు పదంతో కూడిన లైన్ వాడాడు. ఇది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ఇతడు కుర్చీ తాతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడు మాటల్ని తమన్ పాటగా మార్చేశాడు. అయితే ఇందుకోసం కుర్చీతాతకు దాదాపు రూ.5 వేల ఇచ్చాడు తమన్. ఈ విషయాన్ని స్వయంగా సదరు ముసలాయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రోమోకే ఈ రేంజు ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న 'గుంటూరు కారం' టీమ్.. జనవరి 12న సినిమా రిలీజయ్యేలోపే ఇంకెన్ని విమర్శలు ఎదుర్కొంటుందో ఏంటో? మహేశ్-శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాని తల్లి-కొడుకు సెంటిమెంట్ ప్లస్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రీసెంట్‌గానే షూటింగ్ పూర్తి చేసుకుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?
'గుంటూరు కారం' పాట ఒక్కసారిగా కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది. 'కుర్చీ మడతపెట్టి' పాట ప్రోమోని రిలీజ్ చేయగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులకు ఈ పాటలోని మాస్ నచ్చేయగా.. లిరిక్స్‌పై సగటు మూవీ లవర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. మహేశ్-త్రివిక్రమ్ అసలు ఈ సాంగ్ ఎలా ఒప్పుకొన్నారా అని డౌట్ పడుతున్నారు. ఇలాంటి టైంలో మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. మహేశ్ బాబు మాస్ మూవీ అంటే చాలామందికి 'పోకిరి'నే గుర్తొస్తుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తున్నప్పటికీ.. వాటిలో మహేశ్ కూల్ అండ్ క్లాస్ లుక్‌తోనే కనిపిస్తున్నాడు. ఈ మూవీస్ హిట్ అవుతున్నాయి, డబ్బులు కూడా వస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం మాస్ మసాలా మూవీస్ మహేశ్ చేయాలని తెగ ఆరాటపడ్డారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు 'గుంటూరు కారం' చేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) ప్లస్సో మైనస్సో 'గుంటూరు కారం'పై అంచనాలు పెరుగుతున్నాయి. అభిమానులు కూడా మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు సర్ప్రైజ్ ఇచ్చేలా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మహేశ్ కొత్త మూవీకి బెన్ఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారట. 'సలార్'కి వేసినట్లు అర్థరాత్రి ఒంటి గంటకు తొలి షో పడేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే ఉదయం 4 గంటలకైనా సరే షో పడుతుందని అంటున్నారు. 'గుంటూరు కారం' బెన్ఫిట్ షో ప్లాన్ బాగుంది కానీ.. ఈ సినిమా రిలీజ్ అవుతున్న జనవరి 12నే 'హనుమాన్' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా, ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' అనే డబ్బింగ్ మూవీ కూడా థియేటర్లలోకి రానున్నాయి. విడుదల తేదీలు కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ రెండు చిత్రాల వల్ల మహేశ్ సినిమా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందా? అని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తపై దాడి చేసిన యువకుడు) -
ఆ కుర్చీని మడతపెట్టి...
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ అనే పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ పాట పూర్తి లిరికల్ వీడియో నేటి సాయంత్రం విడుదలవుతోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. -
'దయచేసి ఆ పదాన్ని తీసేయండి'.. మహేశ్‌బాబుకు విజ్ఞప్తి!
ఇప్పుడంతా ఎక్కడ చూసిన సోషల్ మీడియానే శాసిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లోనే వైరలవుతోంది. అలా కొన్నాళ్ల ముందు ఓ తాత తన మాటలతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. డైలాగ్‌లో ఓ బూతు పదం కూడా ఉన్నప్పటికీ.. చాలామందికి ఇదో ఊతపదంలా మారిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏకంగా మాస్ పాట చేసేశారు. తాజాగా మహేశ్ బాబు నటించిన గుంటూరుకారం చిత్రంలోని పాటకు ఈ పదాన్ని వాడేశారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గామారింది. అయితే ఈ చిత్రంలో కుర్చీని మడతబెట్టి పదం వినియోగించడంపై ఓ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అయ్యే మీలాంటి స్టార్ సినిమాలో ఈ బూతు పదాన్ని తొలగించాలని చిత్రబృందానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి బూతు పదాలు చూసి పిల్లలు చెడిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. -
గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్
-
'గుంటూరు కారం' కొత్త సాంగ్.. ఏకంగా ఆ తాత డైలాగ్‌నే వాడేశారుగా!
ఒకప్పుడు ఓ మాదిరిగా ఉంటే చాలు సినిమాలు జనాలకు నచ్చేసేవి. ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది. స్టోరీ ఎలా ఉన్నాసరే ట్రెండ్‌కి తగ్గట్లు పాటలు, సీన్స్ లాంటివి ఉన్నాయా లేదా అని అందరూ చూస్తున్నారు. ఒకవేళ అలా లేకపోతే మాత్రం కనెక్ట్ కావట్లేదు. ఇప్పుడు ఆ పాయింట్‌ని 'గుంటూరు కారం' టీమ్ మరింత బలంగా నమ్మినట్లు ఉంది. ఎవరో ఓ అనామకుడు చెప్పిన డైలాగ్ ఫేమస్ అయ్యేసరికి, దాంతో ఏకంగా పాట రెడీ చేసేసింది. ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో తెలీదు. అలా కొన్నాళ్ల ముందు ఓ తాత, తన మాటతీరుతో తెగ వైరల్ అయిపోయాడు. 'కుర్చీ మడతపెట్టి..' అని ఇతడు చెప్పిన ఓ డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. డైలాగ్‌లో ఓ బూతు పదం కూడా ఉన్నప్పటికీ.. చాలామందికి ఇదో ఊతపదంలా మారిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏకంగా మాస్ పాట చేసేశారు. (ఇదీ చదవండి: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి 'హాయ్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్?) మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. తాజాగా షూటింగ్ పూర్తి కాగా, ఓవైపు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అలా ఓ మాస్ గీతానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. కొన్నాళ్ల ముందు కుర్చీ తాత చెప్పిన డైలాగ్‌తోనే పాట మొత్తం కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ ప్రోమోలో మహేశ్-శ్రీలీల స్టెప్పులు కూడా ఇరగదీసినట్లు కనిపిస్తుంది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మాత్రం శనివారం(డిసెంబరు 30) వరకు వెయిట్ చేయాల్సింది. ఇకపోతే జనవరి 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) -
Guntur Kaaram Movie HD Stills: మహేష్‌బాబు మాస్ జాతర ‘గుంటూరు కారం’ మూవీ స్టిల్స్
-
ఫారిన్‌కు మహేశ్ బాబు.. 'గుంటూరు కారం' ప్రమోషన్స్ షురూ
‘గుంటూరు కారం’ సినిమాకు గుమ్మడికాయ కొట్టే సమయం ఆసన్నమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో జరుగుతోంది. మహేశ్ బాబుతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట యూనిట్. ఈ పాట పూర్తయితే షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని టాక్. చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌లు కూడా కంప్లీట్ చేసి, ఈ నెలాఖరుకు ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తి అయ్యేలా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్‌కు వెళతారట మహేశ్‌బాబు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుంటారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఫారిన్ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ తో బిజీ అవుతారు మహేశ్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. -
గుంటూరు కారం తమన్ సాంగ్స్ పై మహేష్ బాబు సీరియస్!
-
అప్పుడు మాహిష్మతి ఇప్పుడు ఖాన్ సార్ సేమ్ స్టోరీ
-
సడెన్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీలీల.. కారణం ఇదే!
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఈ ఏడాది ఇప్పటికే స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ ఏడాది ఆమె నటించిన చిత్రాల్లో ఒక్క భగవంత్ కేసరి తప్ప మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో శ్రీలలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ ‘గుంటూరు కారం ’మీదే ఉన్నాయి. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుంది. దీంతో పాటు పాటు మరో రెండు సినిమాల్లోనూ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇలా షూటింగ్, ప్రమోషన్స్‌తో బిజీగా ఉండే శ్రీలీల.. సడన్‌గా సినిమాకు బ్రేక్ ఇచ్చింది. కొద్ది రోజుల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉండనుంది. దానికి బలమైన కారణం ఉంది. శ్రీలల యాక్టర్ మాత్రమే కూడా డాక్టర్ కూడా కాబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంబీబీఎస్ చదువుతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన వైద్యవిద్యను పూర్తి చేస్తోంది. త్వరలోనే శ్రీలీలకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయబోతుంది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని కోసమే శ్రీలీల ముంబై వెళ్లారట. పరీక్షలు పూర్తయ్యే వరకు శ్రీలీల ఏ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనరట. అధికారికంగా ఎక్కడ చెప్పకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. శ్రీలీల తల్లి కూడా వైద్యురాలే. కూతురు కెరీర్ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. శ్రీలీలకు కూడా డాక్టర్‌గా కొనసాగడడమే ఇష్టం. అందుకే ఎంబీబీఎస్ తర్వాత కూడా చదువును కంటిన్యూ చేయాలనుకోంటోంది. హాయ్యర్ స్టడీస్ కోసం ప్లాన్ చేస్తోనట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఇకపై శ్రీలీల సినిమాల్లో నటించడం కష్టమే. -
హైదరాబాద్‌లో ఆటాపాట
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ‘‘గుంటూరు కారం’ సినిమాలో నాలుగుపాటలు, ఓ బిట్ సాంగ్ ఉన్నాయి. వాటిలో మూడుపాటలు, బిట్ సాంగ్ పూర్తయ్యాయి. మిగిలిన ఓపాటను ఈ నెల 21 నుంచి చిత్రీకరించేలా ప్లాన్ చేశాం’’ అని సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. -
మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా దెబ్బకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇప్పటికే తలపట్టుకుంటున్నారు. ఎందుకంటే తీస్తున్న సినిమా విషయంలో అన్నీ బాగుంటే పర్లేదు. అలా కాకుండా టీజర్, పాటల్లాంటివి ఏ మాత్రం తేడా కొట్టినా సరే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోవడం లేదు. అభిమాన హీరో మూవీ అయినా గానీ చీల్చిచెండాడేస్తున్నారు. తాజాగా 'గుంటూరు కారం'పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నిర్మాత నాగవంశీ ఎంటర్ కావడంతో ఈ గొడవ మరింత పెద్దదైపోయింది! సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న సినిమా 'గుంటూరు కారం'. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా రాబోయే జనవరి 12న థియేటర్లలోకి రానుంది. షూటింగ్ చివర దశలో ఉంది. మరోవైపు ఒక్కో అప్డేట్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్నాళ్ల ముందు 'దమ్ మసాలా' అని తొలి పాట రిలీజ్ చేయగా అభిమానుల్ని ఆకట్టుకుంది. తాజాగా 'ఓ బేబీ' పేరుతో ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ) త్రివిక్రమ్-తమన్ కాంబోకి తోడు మహేశ్ హీరో అయ్యేసరికి.. ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఊహించుకున్నారు. పాట ఆ స్థాయిని రీచ్ కాలేదు. దీంతో మహేశ్ అభిమానులే స్వయంగా ట్రోలింగ్కి దిగారు. అయితే ఈ విమర్శలు ఫరిది దాటిపోయసరికి 'గుంటూరు కారం' నిర్మాత నాగవంశీ సైలెంట్‌గా ఉండలేకపోయారు. 'యానిమల్' సినిమాలోని ఓ సీన్‌కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి ట్రోలర్స్‌ని మరింత రెచ్చగొట్టారు. ఈ ట్వీట్ దెబ్బకు గొడవ మరింత ముదిరిపోయేసరికి.. నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చుకున్నారు. పాటపై ఫీడ్ బ్యాక్ ఇస్తే పర్లేదు గానీ మరి వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్నారని అదే బాధ కలిగించిందని అర్థమొచ్చేలా వివరిస్తూ మరో ట్వీట్ చేశారు. అలానే జనవరి 12న చూసుకుందాం అన్నట్లు ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారు. మరి 'గుంటూరు కారం'పై నిర్మాత నాగవంశీది నమ్మకమా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మూవీ వస్తే తెలుస్తోంది. కానీ అప్పటివరకు ఇంకెన్ని గొడవలు అవుతాయో ఏంటో? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్) As a producer, my reply has hurt you, right. Now, understand how we feel when our teammates are targeted with personal abuses day-in and day-out for just doing their job. Feedback of any kind is welcome until there is no abuse, personal targeting and unnecessary harsh words. You… https://t.co/PR6U1Ievvu — Naga Vamsi (@vamsi84) December 15, 2023 -
మహేష్ ఫాన్స్ ను నిరాశపరిచిన తమన్
-
గుంటూరు కారం సాంగ్‌పై ట్రోలింగ్.. 'ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి'
సూపర్ స్టార్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. పోస్టర్, లుక్స్, పాటలు, డైలాగులు.. ఇలా ప్రతీది అద్భుతహ అనిపించేలా ఉండాలని ఆశిస్తుంటారు అభిమానులు. ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియాలో విమర్శలతో విరుచుకుపడుతారు. ఇప్పుడదే జరిగింది. మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా నుంచి బుధవారం ఓ మై బేబీ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఓ మై బేబీ సాంగ్‌పై ట్రోలింగ్.. 'నా కాఫీ కప్పులో షుగర్ క్యూబు నువ్వే నువ్వే.. నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే..' అంటూ ఈ పాట మొదలైంది. అయితే చాలామంది ఈ పాట ట్యూన్, లిరిక్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాట బాగోలేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హద్దులు మీరుతూ దూషిస్తూ మాట్లాడారు. దీంతో ఓపిక నశించిన గేయరచయిత రామజోగయ్య శాస్త్రి ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు. విషం చిమ్ముతున్నారు 'సోషల్ మీడియా కుక్కల చేతిలోకి వెళ్తోంది. ఒక విషయం గురించి తలాతోకా ఏదీ తెలియని వాళ్లు కూడా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇతరులను జడ్జ్ చేస్తున్నారు. కావాలని విషాన్ని చిమ్ముతున్నారు. సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నవారిని టార్గెట్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి. వీళ్లు గీతలు దాటుతున్నారు' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.. 'ప్రతివాడు మాట్లాడేవాడే.. రాయి విసిరేవాడే.. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీ కన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చేయలేం. అది తెలుసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి. సక్రమంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. పద్ధతి మీరకండి' అని మరో ట్వీట్లో హెచ్చరించాడు. ప్రతివాడు మాట్లాడేవాడే రాయి విసిరే వాడే అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే లేకపోతే..ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం ..తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి — RamajogaiahSastry (@ramjowrites) December 14, 2023 Social media is going to DOGS.. …people who do not know a thing abt the process..think that they can comment and judge…with all d ill intentions..of spreading hate..targeting the technicians…NO..NOT at all good..ఎవరో ఒకరు మాట్లాడాలి..గీతలు దాటుతున్నారు వీళ్ళు.. https://t.co/zF2xViOw0r — RamajogaiahSastry (@ramjowrites) December 14, 2023 చదవండి: ఆగిపోయిన లైవ్, రేపటితో ఓటింగ్‌కు శుభంకార్డు -
Guntur Kaaram: ఓ మై బేబీ లిరికల్ సాంగ్
-
నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే...
‘‘నా కాఫీ కప్పులో షుగరు క్యూబు నువ్వే నువ్వే.. నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే..’’ అంటూ సాగుతుంది ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘ఓ మై బేబీ’పాట. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి మరో హీరోయిన్. బుధవారం ‘‘ఓ మై బేబీ.. నీ బుగ్గలు పిండాలి.. ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి..’’ అంటూ సాగే ‘ఓ మై బేబీ..’పాట పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు తమన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటను శిల్పారావు ఆలపించారు. సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస. -
Meenakshi Chaudhary: "గుంటూరు కారం" మీనాక్షి చౌదరి కళ్ళు చెదిరే అందాలు ఆరబోసింది.
-
ఆ సమయంలో చాలా కంగారుగా అనిపించింది: గుంటూరు కారం హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల జంటగా నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఖలేజా తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో మరో నటి మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ మహేశ్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన రియల్ లైఫ్‌లోనూ సూపర్‌స్టారేనని అన్నారు. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. సెట్లో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. నేను సెట్లోకి వచ్చిన మొదటి రోజు కాస్తా టెన్షన్ పడ్డా. ఫస్ట్ షాట్‌లోనే ఆయనతో పని చేశా. అప్పుడు చాలా కంగారుగా అనిపించింది. అప్పుడు వెంటనే మహేశ్‌బాబు.. నో టెన్షన్.. కాస్త సమయం తీసుకోండి. ఏం కాదంటూ చాలా కూల్‌గా మాట్లాడారు' అని తెలిపింది. ఆయనతో కలిసి నటించడం చాలా సరదాగా అనిపించింది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు. View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
కేరళకు గుంటూరు కారం
కేరళకు ప్రయాణం కానున్నారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ ముగిసిందని తెలిసింది. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు మహేశ్‌బాబు, మీనాక్షీ చౌదరి కాంబినేషన్లో ఓ పాటను చిత్రీకరించారని సమాచారం. కాగా ‘గుంటూరు కారం’ నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ కేరళలో ఆరంభం కానుందట. కొంత టాకీ పార్టుతో పాటు మహేశ్‌బాబు, శ్రీలీల కాంబినేషన్లో ఓ సాంగ్‌ను ప్లాన్ చేసిందట యూనిట్. నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరిపి, ఈ నెలాఖరుకల్లా సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా జనవరి 12న విడుదల కానుంది.