సూపర్‌స్టార్ మహేశ్ బాబు దాదాపు ఏడాదిన్నర తర్వాత థియేటర్లలోకి రాబోతున్నాడు. మాస్ ఎలిమెంట్స్‌తో తీసిన 'గుంటూరు కారం'.. జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఓవైపు హంగామా నడుస్తుంటే.. మరోవైపు కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మహేశ్ ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
మహేశ్ బాబుకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల్లో అందరి దృష్టి 'గుంటూరు కారం' పైనే ఉంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో అది కూడా మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో రిలీజ్ విషయం వేరే లెవల్‌లో ప్లాన్ చేశారు.
(ఇదీ చదవండి: మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?)
అమెరికాలో 5408కి పైగా ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ విషయంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్-3800కి పైగా, సలార్-2450కి పైగా షోలు వేశారు. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే.. తెలుగు మూవీకి ఈ రేంజు ప్రీమియర్ షోలు అంటే సరికొత్త రికార్డే. దీనిబట్టి చూస్తుంటే విడుదలకు ముందే హాఫ్ మిలియన్ డాలర్స్.. ముందస్తు బుకింగ్స్ రూపంలో వచ్చేసినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో 5-6 మిలియన్ డాలర్స్ వసూళ్లు రావడం గ్యారంటీ అనిపిస్తోంది.
జనవరి 12న థియేటర్లలోకి వచ్చే 'గుంటూరు కారం'లో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని తల్లి సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసినట్లు తెలుస్తోంది. తమన్ సంగీతమందించాడు. ఇకపోతే ఈ మూవీతో పాటు 'హను-మాన్' అదే రోజు రిలీజ్ కానుండటం విశేషం.
(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment