‘‘నా కాఫీ కప్పులో షుగరు క్యూబు నువ్వే నువ్వే.. నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే..’’ అంటూ సాగుతుంది ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘ఓ మై బేబీ’పాట. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇది. శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి మరో హీరోయిన్.
బుధవారం ‘‘ఓ మై బేబీ.. నీ బుగ్గలు పిండాలి.. ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి..’’ అంటూ సాగే ‘ఓ మై బేబీ..’పాట పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు తమన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటను శిల్పారావు ఆలపించారు. సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస.
Comments
Please login to add a commentAdd a comment