సంక్రాంతి రేసులోకి పందెం కోళ్లు దిగాయి. ఈరోజు (జనవరి 12న) మహేశ్‌బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి మాస్ మసాలా సినిమా అయితే మరొకటి సూపర్ హీరో చిత్రం! ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉంది. ఇక ఈ సినిమాకు మొదట్లో రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువే అయినట్లు తెలుస్తోంది.
ఓటీటీ రైట్స్..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.40 కోట్లు పెట్టి మరీ గుంటూరు కారం సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. రెండు నెలల తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా రిజల్ట్‌ను బట్టి సినిమా కాస్త ముందుగా లేదా ఆలస్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు కనిపిస్తోంది.
చదవండి: హను-మాన్ రిలీజ్.. ఆదిపురుష్ డైరెక్టర్‌పై మళ్లీ ట్రోలింగ్!
‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment