సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు.. చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇలాంటి టైంలో మూవీ టీమ్‌కి సంతోషపరిచే విషయం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చింది. టికెట్ల రేట్ల పెంపుతో పాటు బెన్‌ఫిట్ షోలకు అనుమతి లభించింది.
కొన్నిరోజుల ముందు 'గుంటూరు కారం' టీమ్.. తెలంగాణ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా పర్మిషన్ లభించింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి దక్కింది. అంటే సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.250, మల్టీప్లెక్స్‌ల్లో రూ.410 అనమాట.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)
అలానే 12న అర్థరాత్రి ఒంటి గంట నుంచి రాష్ట్రంలో దాదాపు 23 చోట్ల ప్రదర్శనకు అనుమతి ఇచ్చినట్లు రివీల్ అయింది. అలానే తొలిరోజు ఆరో షో ప్రదర్శనకు కూడా పర్మిషన్ దొరికింది. అలానే ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి లభించింది.
అయితే సాధారణ ప్రేక్షకుడికి ఈ టికెట్స్ రేట్లు అవి ఎక్కువగా అనిపించొచ్చు. కానీ డై హార్డ్ అభిమానులకు మాత్రం అర్థరాత్రి నుంచి షోలు అంటే పండగ చేసుకుంటారు. టికెట్స్ రేట్లు అనేవి పెద్దగా పట్టించుకోరు. ఇకపోతే మహేశ్ ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి)
Comments
Please login to add a commentAdd a comment