అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా? | Sreeleela's Saree Cost At Guntur Kaaram Pre Release Event | Sakshi
Sakshi News home page

Sreeleela Saree: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. అలాంటి చీరలో శ్రీలీల

Published Wed, Jan 10 2024 4:12 PM | Last Updated on Wed, Jan 10 2024 4:21 PM

Sreeleela Saree Cost In Guntur Kaaram Pre Release Event - Sakshi

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. త్రివిక్రమ్ తక్కువ మాట్లాడాడు. మహేశ్ ఊహించని విధంగా ఎమోషనల్ అయ్యాడు. ఇకపై నాకు అమ్మ నాన్న మీరే అని అభిమానులని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. గుంటూరులో మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలీల కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. చాలామంది దృష్టి ఆమె కట్టుకున్న చీరపై పడిండి. మరి ఈ శారీ ఖరీదు ఎంతో తెలుసా?

సినిమా చూసేవాళ్లలో సీన్స్, సాంగ్స్ చూసి ఆనందపడే వాళ్లు కొందరు.. మరికొందరు మాత్రం హీరోహీరోయిన్ ఎలాంటి బట్టలు వేసుకున్నారు. అవి ఎక్కడ దొరుకుతాయి అని సెర్చ్ చేస్తుంటారు. అలా వీళ్లని 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల కట్టుకున్న చీర.. ఎట్రాక్ట్ చేసింది. దీంతో అసలు ఈ శారీ కాస్ట్ ఎంత? అదెక్కడ దొరుకుతుంది అని వెతకడం మొదలుపెట్టారు.

(ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

'బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ' పేరుతో ఇది అందుబాటులో ఉంది. ఈ డిజైనర్ వేర్ చీర ధర అక్షరాలా రూ.1,59,000. చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ దీని ఖరీదు ఇంతా అని తెలిసేసరికి.. నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ప్లెయిన్‌గా లేకుండా గడుల్లా ఉన్న ఈ చీర.. అమ్మాయిలు, ఆంటీలు అనే తేడా లేకుండా అందరికీ నచ్చేస్తోంది.

'గుంటూరు కారం' విషయానికొస్తే.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ రోజు అర్థరాత్రి ఒంటి గంట నుంచే బెన్‌ఫిట్ షోలు ఒక్క హైదరాబాద్‌లోనే తొలిరోజు వందలాది షోలు పడుతున్నాయి. మహేశ్ మాస్ అవతార్, త్రివిక్రమ్ దర్శకత్వం.. శ్రీలీల డ్యాన్సులు.. ఇలా చాలా అంశాలు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. మరి మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిటింగ్?

(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement