టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇందులో మాస్ యాంగిల్ కనిపించాడు మహేశ్. డైలాగ్స్, లుక్స్ మాత్రమే కాదు తన చేష్టలు కూడా అలాగే ఉంటాయి. అంతేకాదు పొగ తాగడాన్ని వ్యతిరేకించే ఈ హీరో గుంటూరు కారం సినిమాలో ఎప్పుడూ బీడీ కాలుస్తూ కనిపిస్తుంటాడు. మరి బీడీ, సిగరెట్ కాల్చొద్దని నీతులు చెప్పే హీరోనే ఇలా బీడీ తాగుతుంటే అభిమానులు ఫాలో అవరా? అంటారేమో.. తను తాగింది నిజమైన బీడీ కాదట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాని వెనక అసలు సీక్రెట్ బయటపెట్టాడు మహేశ్.
బీడీ తాగడం వల్ల మైగ్రేన్
అతడు మాట్లాడుతూ.. 'నేను సిగరెట్, బీడీ తాగను. ఎవరు కూడా దాని జోలికి వెళ్లొద్దనే చెప్తాను. సినిమాలో నేను వాడింది ఆయుర్వేదిక్ బీడీ. లవంగం ఆకులతో దాన్ని తయారు చేశారు. సినిమా షూటింగ్ మొదలైన తొలినాళ్లలో నాకు నిజమైన బీడీ ఇచ్చారు. కానీ దానివల్ల మైగ్రేన్‌తో ఇబ్బందిపడ్డాను. ఈ బీడీ తాగడం నా వల్ల కావట్లేదని చెప్తే డైరెక్టర్ త్రివిక్రమ్ ఆయుర్వేదిక్ బీడీని తీసుకొచ్చారు. అందులో పొగాకును వాడలేదు. సినిమా మొత్తం ఆ ఆయుర్వేదిక్ బీడీలనే వాడాను' అని చెప్పుకొచ్చాడు.
సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం
కాగా గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.164 కోట్లు రాబట్టి రెండు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. మరోవైపు మహేశ్ సంక్రాంతి రోజే చిత్రయూనిట్‌కు సక్సెస్ పార్టీ ఇచ్చాడు. హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, దిల్ రాజు ఈ పార్టీకి హాజరయ్యారు.
చదవండి: రజనీ అభిమానులపై ముసలావిడ ఆగ్రహం.. పండగపూట ఇదేం లొల్లి అంటూ!
Comments
Please login to add a commentAdd a comment