
టాలీవుడ్‌లో అందగాడు అని పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే ఒకే ఒక పేరు మహేశ్ బాబు. ఆయనకు పెళ్లి అయి..ఇద్దరు పిల్లలు ఉన్నా..ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలకు మహేశ్ డ్రీమ్ బాయ్‌గానే ఉంటాడు. యాభైకి చేరువవుతున్నా 25 ఏళ్ల యువకుడిగానే కనిపిస్తాడు. అంతటి అందగాడిని తెరపై రఫ్‌గా చూపించే పనిలో పడ్డాడు రాజమౌళి.
(చదవండి: నెలలోనే ఇ'స్మార్ట్'గా తయారయ్యాడు.. కాకపోతే!)
ప్రస్తుతం మహేశ్.. రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు కానీ..మహేశ్ మాత్రం చాలా కాలంగా తన ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టాడు. ఈ మూవీ కోసం మహేశ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తన జట్టును, గడ్డాన్ని పెంచుకున్నాడు.
(చదవండి: ఓటీటీల్లోనే 12 బెస్ట్ హారర్ మూవీస్.. మీరు చూశారా?)
ఇటీవల జరిగిన ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకలో లైట్ గడ్డంతో కనిపించి షాకిచ్చాడు మహేశ్. మహేశ్ లుక్ చూసి అంతా ఫిదా అయ్యారు. ఇక తాజాగా మహేశ్ సంబంధించిన న్యూ లుక్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో మహేశ్ టీషర్ట్ ధరించి, ఫుల్ గడ్డం, పిలకతో మరింత హ్యాండమ్‌గా ఉన్నాడు. ఎప్పుడు క్లీన్ షేవ్‌తో కనిపించే మహేశ్..ఇలా ఫుల్ గడ్డంతో దర్శనం ఇవ్వడం ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.
Beard + pony tail looks 👌💥😎 Superstar #MaheshBabu Papped at Jaipur @urstrulyMahesh#ssmb29 pic.twitter.com/38lSomVjbV
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) August 11, 2024