
రాజమౌళి (SS Rajamouli)తో సినిమా అంటే ఆషామాషీ కాదు. ప్రతి ఒక్కరిలోని టాలెంట్‌ను పూర్తిగా బయటకు తీస్తాడు. అలాగే ఒక్కో సినిమా ఏళ్ల తరబడి చేస్తుంటాడు. 2022లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈయన ఈ ఏడాది ఆరంభంలో మహేశ్‌బాబు (Mahesh Babu)తో సినిమా మొదలుపెట్టాడు. జనవరిలో SSMB29 సినిమాను ఘనంగా లాంచ్ చేశారు. అంతేకాదు.. ఒక సింహాన్ని లాక్ చేసి తన పాస్‌పోర్ట్ తీసుకున్నట్లుగా ఓ వీడియో రిలీజ్ చేశారు.
మహేశ్‌ను లాక్ చేసిన జక్కన్న
అంటే తను తెరకెక్కించబోయే యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు కోసం మహేశ్‌ను లాక్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. దీనిపై ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. ఇటీవలే ఒడిశాలో SSMB29 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం బ్రేక్ దొరకడంతో మహేశ్ తన కూతురు సితారతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో మహేశ్.. జక్కన్న చేతికి చిక్కిన పాస్‌పోర్ట్ తిరిగి తనదగ్గరకు వచ్చేసిందంటూ నవ్వుతూ పాస్‌పోర్ట్ చూపించాడు.
కామెడీ టైమింగ్
ఇది చూసిన అభిమానులు.. బాబు తన పాస్‌పోర్ట్ చూపించడం హైలైట్, మహేశ్ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందేగా.., బిడ్డకు విడుదల అంటూ కామెంట్లు చేస్తున్నారు. SSMB 29 విషయానికి వస్తే.. మహేశ్‌బాబు సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను 2027లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
చదవండి: పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. మోహన్‌బాబు