
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన చిత్రం ది లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో లయన్ కింగ్-2 కూడా వచ్చేసింది.
అయితే గతేడాది లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాను అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ తెరకెక్కించారు. గతేడాది డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. తెలుగులో మహేశ్ బాబు.. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పగా, హిందీలో షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
అయితే ముఫాసా: ది లయన్ కింగ్ మరికొద్ది గంటల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ అర్ధరాత్రి నుంచే జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. మార్చి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
Two lions, one destiny, bound by more than blood.#Mufasa: The Lion King, coming to #JioHotstar on March 26 in English, Hindi, Tamil and Telugu.#MufasaOnJioHotstar #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/2mYE0RvhCL
— JioHotstar (@JioHotstar) March 24, 2025