Naga Babu Interesting Comments In Sridevi Shoban Babu Pre Release Event Goes Viral - Sakshi
Sakshi News home page

Naga Babu: మా ఇంట్లో హీరోలు ఏనాడూ నాకు ఛాన్సివ్వలేదు, సుస్మిత మాత్రం..

Published Thu, Feb 16 2023 3:20 PM | Last Updated on Thu, Feb 16 2023 7:00 PM

Naga Babu Interesting Comments In Sridevi Shoban Babu Pre Release Event - Sakshi

మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు కానీ నాకెవరూ ఛాన్సివ్వలేదు. మా హనీ(సుస్మిత) మాత్రం నాకు రెండోసారి అవకాశమిచ్చింది. హనీ గురించి ఓ మాట చెప్పాలి. తను తల్చుకుంటే తనకు సపోర్ట్‌గా ఏ హీరో అయినా ముందుకు వచ్చేస్తాడు. కానీ ఎవరి సపోర్ట్‌ లేకుండా ఇండిపెండెంట్‌ నిర్మాతగా అన్ని కష్టాలు పడుతూ మీ ముందుకు ఈ సినిమా తీసుకొచ్చింది. తను

మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు. కానీ ఎవరూ ఏనాడూ పిలిచి క్యారెక్టర్‌ ఇవ్వలేదు అన్నాడు నటుడు నాగబాబు. సుస్మిత కొణిదెల మాత్రం తనకు రెండోసారి అవకాశం ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. శ్రీదేవి శోభన్‌బాబు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. సంతోష్‌ శోభన్‌, గౌరి.జి.కిషన్‌ జంటగా నటించిన చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. నూతన దర్శకుడు ప్రశాంత్‌కుమార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని విష్ణుప్రసాద్‌తో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించారు. ఈ నెల 18న సినిమా రిలీజ్‌ కానున్న క్రమంలో హైదరాబాద్‌లో బుధవారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. 'మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు కానీ నాకెవరూ ఛాన్సివ్వలేదు. మా హనీ(సుస్మిత) మాత్రం నాకు రెండోసారి అవకాశమిచ్చింది. హనీ గురించి ఓ మాట చెప్పాలి. తను తల్చుకుంటే తనకు సపోర్ట్‌గా ఏ హీరో అయినా ముందుకు వచ్చేస్తాడు. కానీ ఎవరి సపోర్ట్‌ లేకుండా ఇండిపెండెంట్‌ నిర్మాతగా అన్ని కష్టాలు పడుతూ మీ ముందుకు ఈ సినిమా తీసుకొచ్చింది. తను త్వరలోనే మెగా ప్రొడ్యూసర్‌ అవుతుంది.

ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ట్రైలర్‌ చూస్తుంటే ప్రశాంత్‌ ఏం చెప్పాడో అదే తీశాడనిపించింది. డైరెక్టర్‌గా అతడికి మంచి భవిష్యత్తు ఉంది. సినీ ఇండస్ట్రీలో మెన్‌ డామినేషన్‌ ఉంటే టీవీ ఇండస్ట్రీలో వుమెన్‌ డామినేషన్‌ ఉంది. ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి పంపించకూడదు అన్న భ్రమలు ఇంకా ఉన్నాయి. అవకాశం వస్తే ఆడపిల్లలు మగవాళ్ల కన్నా బెస్ట్‌గా నటిస్తారు, బెస్ట్‌గా డైరెక్ట్‌ చేస్తారు, నిర్మిస్తారు' అని చెప్పుకొచ్చాడు నాగబాబు.

చదవండి: అత్యంత చవక రేటుకు పఠాన్‌ టికెట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement