
నాని(Nani) హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హిట్ 3(HIT 3 Movie). మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ముంబయి, కేరళ అంటూ నాని తెగ తిరిగేస్తున్నాడు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా నుంచి ఇప్పుడో పాట రిలీజ్ చేశారు. దీన్ని అనిరుధ్ పాడటం విశేషం.
హిట్ 3 మూవీ నుంచి ఇదివరకే ప్రేమ వెల్లువ, అభీ బార్ అర్జున్ సర్కార్ అనే పాటలు రిలీజయ్యాయి. ఇప్పుడు 'తను..' అంటే సాగే గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ స్టేషన్ లో ఉన్న నాని.. హీరోయిన్ కోసం పాడే సాంగ్ ఇదని అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)
దీన్ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పాడాడు. స్వతహాగా సినిమాలకు కంపోజ్ చేసే అనిరుధ్.. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కానీ పాడటానికి మాత్రం రూపాయి కూడా తీసుకోడు. గతంలో అతడే ఈ విషయం చెప్పాడు.
ఇప్పుడు కూడా నాని కోసమే అనిరుధ్ ఈ పాట పాడినట్లు అనిపిస్తుంది. గతంలో నాని 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. నెక్స్ట్ రాబోయే 'ప్యారడైజ్' కూడా ఇతడే సంగీతమందించబోతున్నాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ దృష్ట్యా హిట్ 3లో అనిరుధ్ పాట పాడినట్లున్నాడు.
(ఇదీ చదవండి: పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్)