
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) గురించి గాయని ప్రవస్తి (Pravasthi) చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత ప్రవీణ (Praveena Kadiyala) క్లారిటీ ఇచ్చారు. రెండురోజుల క్రితం ప్రవస్తి ఒక వీడియో ద్వారా కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్‌ల గురించి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆపై తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆమె ఆరోపించారు. ప్రోగ్రాం నిర్వాహకులు కూడా తమకు చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్ చేయాలి అన్నట్లుగా చెప్పేవారని ప్రవస్తి చెప్పుకొచ్చింది. అయితే, ఆ ప్రోగ్రాం నిర్మాత ప్రవీణ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
వారు ఎంచుకున్న పాటకు తగ్గట్టే కంటెస్టెంట్లకు తాను దుస్తులు డిజైన్ చేయిస్తానని జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత ప్రవీణ క్లారిటీ ఇచ్చారు. తమ షోలో ఎక్కడా కూడా బాడీ షేమింగ్‌పై వ్యాఖ్యలు చేయమని చెప్పారు. ప్రవస్తి చెబుతున్నట్లుగా ఫేవరెట్ కంటెస్టెంట్లకు సులభమైన పాటలు ఇచ్చి.. ఆమెకు మాత్రమే కష్టమైన పాటలు ఇస్తామని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పారు. పాటల ఎంపిక కోసం ప్రతి షెడ్యూల్‌లో ఓ క్రియేటివిటీ టీమ్ నాలుగు రకాల పాటలను ఎంపిక చేస్తుంటుందని నిర్మాత ప్రవీణ అన్నారు. తమ ప్రోగ్రామ్ టెలీకాస్ట్ అయ్యే ఛానల్‌కు ఏ పాటల రైట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని మాత్రం చెబుతామని తెలిపారు. అలా ప్రతి కంటెస్టెంట్ ఆరు పాటలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వాటిపై రిహార్సల్స్ పూర్తి చేసుకుని, వారు రెడీ అని చెప్పాకే తాము షూటింగ్ ప్రారంభిస్తామని ఆమె అన్నారు.

అలా అనడం తప్పే: సునీత
‘మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు’ అని కాస్ట్యూమర్ అన్నారంటూ ప్రవస్తి చేసిన ఆరపణలకు సింగర్ సునీత ఇలా సమాధానం ఇచ్చారు. 'కంటెస్టెంట్స్ ఎంపిక చేసుకున్న పాటకు తగిన విధంగానే కాస్ట్యూమ్స్‌ని నేను డిజైన్ చేయిస్తుంటా. ఇక్కడ పాటది మాత్రమే ఛాయిస్ ఉంటుంది. ప్రవస్తితో ఆ కాస్ట్యూమర్ అలా ప్రవర్తించి ఉంటే అది ముమ్మాటికే తప్పే. కానీ, జరిగిన విషయం అదే సమయంలో నాతో గానీ, డైరెక్టర్‌తో గానీ చెప్పాల్సింది. డ్రెస్సు విషయంలో అలా వేసుకో, ఇలా వేసుకో అని నేనెప్పుడూ చెప్పలేదు.' అని అన్నారు.
Gnapika entertainment producer praveena kadiyala about singer #Pravasthi issue.#ETV #paduthatheeyaga pic.twitter.com/OlhBtBiaNe
— Vamsi Kaka (@vamsikaka) April 22, 2025