24 క్రాఫ్ట్ వస్తేనే ఇండస్ట్రీ అభివృద్ధి సాధ్యం: ఆర్‌.నారాయణమూర్తి | R Narayana Murthy Unveiled Statue Of Mukkuraju Master At TFTDDA Office | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్: ఆర్‌.నారాయణ మూర్తి

Published Thu, Apr 24 2025 7:54 AM | Last Updated on Thu, Apr 24 2025 7:54 AM

R Narayana Murthy Unveiled Statue Of Mukkuraju Master At TFTDDA Office

‘కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్. ఎంతోగొప్పతనం ఉన్న మంచి మనిషి. 24 క్రాఫ్ట్స్ ఫెరడేషన్ ఏర్పాటు కోసం 1991లో ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది డ్యాన్సర్స్ అసోసియేషన్ స్థాపించడం. ఆ తర్వాత ఒక్కో యూనియన్ వచ్చాయి. నా ప్రతి సినిమాలోనూ ముక్కురాజు మాస్టర్ పని చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కడం నా అదృష్టం’ అన్నారు ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి.  డాన్సర్స్ యూనియన్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. 

టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ..  ‘24 క్రాఫ్ట్ వస్తేనే ఇండస్ట్రీ అభివృద్ధి సాధ్యం. తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాలను తలదన్నే స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ముక్కురాజు మాస్టర్‌ లాంటి మహానుభావులే. ఈ అసోసియషన్‌లో ప్రస్తుతం 600 మంది డ్యాన్సర్స్ ఉన్నారంటే ముక్కురాజు మాస్టర్ వేసిన బలమైన పునాదే కారణం. సినీ పరిశ్రమలోని కార్మికులందరికీ చిత్రపురి కాలనీలో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవిస్తున్నా’ అన్నారు

‘ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఈరోజు ఫిల్మ్ ఫెడరేషన్ లేదు. డ్యాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్ లేకుండా ఫెడరేషన్ పూర్తి అయ్యేది కాదు. ఆ టైమ్‌లో ఏ నమ్మకంతోనో ముక్కురాజు మాస్టర్ వచ్చి డ్యాన్సర్స్ యూనియన్ స్టార్ట్ చేశారు. వీళ్ల కష్టంతోనే ఇవాళ అసోసియేషన్ ఉంది.ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఈ కమిటీకి నా అభినందనలు’ అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్ కుమార్, టీఎఫ్‌టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement