
ఈ మధ్య నీలెక్క తెలంగాణ మాండలికంలో చాలా తక్కువమంది మాట్లాడుతరు. నువ్వు యాస చాలా స్పష్టంగా మాట్లాడుతవు. దానికి ఏమన్నా హోంవర్క్ చేస్తవ భయ్ లేదా సహజంగానే అంతేనా? అని అడగ్గా..
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో ఆకట్టుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత జాతిరత్నాలు, కల్కి, స్కైలాబ్ సినిమాలతో అలరించాడు. ఇటీవలే హ్యాపీ బర్త్‌డే మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా ఈ కమెడియన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. బోర్ కొడుతోంది.. సినిమా, సాహిత్యం, సంగీతం.. వీటి గురించి ఏదైనా అడగండి.. ఆసక్తిగా ఉన్న ప్రశ్నలకు ఆన్సరిస్తానని ట్వీట్ చేశాడు. ఇంకేముంది.. నెటిజన్లు దొరికిందే ఛాన్సని వరుస ప్రశ్నలు కురిపించారు.
మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటి? అన్న ప్రశ్నకు బెటర్ కాల్ సాల్ అని బదులిచ్చాడు. ఈ మధ్య నీలెక్క తెలంగాణ మాండలికంలో చాలా తక్కువమంది మాట్లాడుతరు. నువ్వు యాస చాలా స్పష్టంగా మాట్లాడుతవు. దానికి ఏమన్నా హోంవర్క్ చేస్తవ భయ్ లేదా సహజంగానే అంతేనా? అని అడగ్గా.. మాతృభాషకు హోం వర్క్ అక్కర్లేదని నా ఫీలింగ్ అని రిప్లై ఇచ్చాడు. తాగేసి ట్వీట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయా గురూ అని అడగ్గా.. చాలా సార్లు అని బదులిచ్చాడు రాహుల్ రామకృష్ణ.
Chaala saarlu
— Rahul Ramakrishna (@eyrahul) August 5, 2022
మాతృ భాషకి హోమ్ వర్క్ అక్కర్లేదు అని నా ఫీలింగ్
— Rahul Ramakrishna (@eyrahul) August 5, 2022
చదవండి: నా మాజీ భార్యకు అతడితో వివాహేతర సంబంధం, ఇద్దరూ నా ఇంట్లోనే తిష్ట వేశారు
వాచిపోయిన కాళ్లు... సోషల్ మీడియాలో కష్టాలు చెప్పుకున్న సోనమ్ కపూర్