
ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. లిప్‌లాక్ ఫోటోతో కాబోయే భార్యను పరిచయం చేస్తూ.. ఎట్టకేలకు త్వరలోనే పెళ్లి అంటూ శుభవార్త చెప్పాడు. అర్జున్‌రెడ్డి స్టైల్‌లో ఢిపరెంట్‌గా పెళ్లి వార్తను అనౌన్స్ చేయడంతో క్షణాల్లోనే రాహుల్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: లిప్ లాక్ ఫోటోతో పెళ్లి అనౌన్స్ చేసిన ప్రముఖ కమెడియన్
ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయేది ఎవరు,ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరిగింది. మరికొందరేమో ఆమె పేరు బిందు అంటూ నెట్టింట ప్రచారం చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు హరిత.. బిందు కాదు' అంటూ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: అల్టీమేట్ ఫన్ ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది..
Small clarification- my fiancé’s name is Haritha, not Bindu.
— Rahul Ramakrishna (@eyrahul) May 8, 2022
☺️