
ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాబోయే భార్యకు ముద్దు ఇస్తున్న ఫోటోను షేర్‌చేస్తూ.. త్వరలోనే పెళ్లి అంటూ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. అసలైన జాతిరత్నానివి నువ్వు.. అర్జున్ రెడ్డి స్టైల్‌లో చెప్పినవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటివరకూ డజనుకు పైగా చిత్రాల్లో నటించిన రాహుల్ రామకృష్ణకు అర్జున్ రెడ్డితో పాటు గీత గోవిందం, హుషారు,ఆర్‌ఆర్‌ఆర్ తదితర చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రాహుల్ నటించిన 'కృష్ణ వ్రింద విహారి', 'విరాటపర్వం' సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6
— Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022