
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని (36) పెళ్లి గురించి ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చాయి. తెలుగు పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉండటం వల్లే ఆయనపై ఇలాంటి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ హీరోయిన్‌తో రామ్ ప్రేమలో పడిపోయాడని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా వారు షేర్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరూ బాగా దగ్గరయిపోయారని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashri Borse)తో రామ్ పోతినేని ప్రేమలో పడిపోయాడని తెలుస్తోంది. సుమారు రెండు నెలల క్రితం కూడా వారు ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఇండస్ట్రీలో వైరల్ అయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్ వచ్చింది. తాజాగా ఓ హోటల్ గది నుంచి రామ్, భాగ్యశ్రీ వేర్వేరుగా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే, అవి ఒకే గది నుంచి తీసినవని కొందరు గుర్తించారు. ఒకేచోట ఇద్దరూ కలిసే ఉన్నారని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ఇప్పటికే ఇదీ రూట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక ఎలాగూ ఉన్నారని, ఇప్పుడు మరో కొత్త జంట వచ్చేసిందని అంటున్నారు. అయితే, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. వారిద్దరిలో ఎవరైనా రియాక్ట్ అయ్యే వరకు ఈ ప్రచారాన్ని ఆపడం కాస్త కష్టమే అని చెప్పవచ్చు.

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ 25 ఏళ్ల బ్యూటీ ఇప్పుడు రామ్ పోతినేనితో ఒక సినిమా(RAPO22) చేస్తుంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని సమాచారం. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ చిత్రంలోనూ భాగ్యశ్రీ నటిస్తుంది.