
రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara Movie). శ్రీలీల హీరోయిన్. కొత్త దర్శకుడు భాను భోగవరపు తీస్తున్నాడు. లెక్క ప్రకారం మేలో రిలీజ్ అనుకున్నారు కానీ ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తొలి పాట రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)
'తూ మేరా లవర్' అంటూ సాగే ఈ పాటని దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాయిస్ తో కంపోజ్ చేయడం విశేషం. 'ఇడియట్'లోని ఫేమస్ స్టెప్పులు మళ్లీ రవితేజనే వేసి ఆకట్టుకున్నాడు. శ్రీలీల(Sreeleela) కూడా గత చిత్రాలతో పోలిస్తే హాట్ గా ఉంది. భీమ్స్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)