
‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా'.. బి హైండ్స్ ది సీన్స్ ఇదిగో..
Samantha Pushpa Oo Antava Oo Oo Antava Song Behind The Scenes Video: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ మూవీలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అంటూ సామ్ చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్ మోస్ట్ వీడియోల్లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. సమంత ఐటెం సాంగ్ చేస్తుందనే ప్రచారంతోనే ఈ సాంగ్‌కు మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సాంగ్ రిలీజ్‌కు ముందే భారీ రెస్పాన్స్ వచ్చింది. సమంత స్టెప్పులకు తోడు, గాయని ఇంద్రావతి చౌహన్ పాడిన మత్తు వాయిస్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తాజాగా ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ముందు సమంత ఏ విధంగా కష్టపడిందో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బి హైండ్ ది సీన్స్ అంటూ వీడియోను విడుదల చేసింది. ఇది చూశాక సమంత పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.