
– శివ రాజ్‌కుమార్
‘‘45’ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. కీమోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్ చేశాను. మీరు అది చేయొద్దు... ఇది చేయొద్దు అని మా మూవీ టీమ్ అన్నారు. కానీ, నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా పాత్రకి సంబంధించిన అన్ని రకాల సన్నివేశాలు చేశాను’’ అని శివ రాజ్‌కుమార్ చె΄్పారు.
ఉపేంద్ర, శివ రాజ్‌కుమార్, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘45’. సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఉమా రమేశ్ రెడ్డి, ఎం. రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు మేం ముగ్గురం కాదు... కథే హీరో. అర్జున్ జన్యాకి మంచి పేరొస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్‌గారి ‘జైలర్ 2’, రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ చిత్రాల్లో నటిస్తున్నా’’ అన్నారు.
ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు అర్జున్ జన్యా. ‘కూలీ’ సినిమాలో రజనీకాంత్, నాగార్జునగార్లతో నటించడం సంతోషంగా ఉంది’’ అని చె΄్పారు. ‘‘సనాతన ధర్మం గురించి ఈ చిత్రంలో చాలా అంశాలుంటాయి. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు ఎం. రమేశ్ రెడ్డి. అర్జున్ జన్యా మాట్లాడుతూ– ‘‘ఈ మూవీకి ముందుగా సీజీ, డైలాగ్స్, బీజీఎంతో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. ఈ పద్ధతి వల్ల ఒక్క సీన్ కూడా వేస్టేజ్ ఉండదు.ప్రొడ్యూసర్స్‌కు బడ్జెట్ ఆదా అవుతుంది’’ అని తెలిపారు.